నాగారంలో పరుపుతాళ్లకు బలే గిరాకి

నాగారంలో పరుపుతాళ్లకు బలే గిరాకి

పరకాల,నేటిధాత్రి

పరకాల మండలపరిధిలోని నాగారం గ్రామంలో పరుపుతాడు కల్లు(తాటికల్లు)కు గణనీయమైన డిమాండ్ నెలకొంది.వేసవి కాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ సహజ పానీయానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ పరిసరాల నుంచి కూడా వినియోగదారులు పెద్ద సంఖ్యలో పరుపుతాళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు.ప్రత్యేకించి ఉదయం,సాయంత్రం వేళల్లో పరుపుతాళ్ల వద్ద సందడినెలకొంటోంది.రైతులు,కూలీలు,యువతతో పాటు వృద్ధులు కూడా ఈ పానీయాన్ని ఆస్వాదించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.శరీరానికి చల్లదనం అందించడం,అలసటను తగ్గించడం వంటి లక్షణాల వల్ల ఇది వేసవిలో సహజ శీతల పానీయంగా మంచి గుర్తింపు పొందింది.తాటి చెట్ల నుంచి తాజాగా సేకరించే కల్లు ప్రత్యేక రుచి, సహజత్వం కారణంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

మార్కెట్‌లో లభించే ఇతర పానీయాలతో పోలిస్తే ఇది సహజమైనదిగా భావించడంతో డిమాండ్ మరింత పెరుగుతోంది.దీంతో పరుపుతాళ్ల వద్ద విక్రయాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.ఈ డిమాండ్ పెరుగుదలతో తాటి తాపీలకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కల్లు సేకరణ,విక్రయాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజువారీగా పెద్ద ఎత్తున విక్రయాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.మొత్తంగా,పరకాల పరిధిలో పరుపుతాళ్లకు పెరుగుతున్న గిరాకి గ్రామీణ జీవనశైలిలో భాగమైన ఈ సంప్రదాయ పానీయానికి తిరిగి ప్రాధాన్యం తీసుకువస్తూ,స్థానికులకు ఆదాయం అందించే ముఖ్య వనరుగా మారుతోంది.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతు బీర్,బ్రాందీ లకంటే స్వచ్ఛమైన తాటికల్లే ఆరోగ్యకరమని తెలిపారు.

నాగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి…

నాగారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

జయంతి సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

పరకాల,నేటిధాత్రి

మండలంలోని నాగారం గ్రామంలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నాగారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ గ్రామంలో ఉదయం నుంచే ప్రత్యేక వాతావరణం నెలకొంది.అనంతరం గ్రామ పెద్దలు,యువత,నాయకులు కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పరకాల మండల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు,బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.సుమారు 30 మంది రోగులకు ఈ సహాయం అందించబడగా రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం ద్వారా అంబేద్కర్ చూపిన మానవతా దృక్పథాన్ని ఆచరణలో పెట్టాలనే సంకల్పం స్పష్టంగా కనిపించింది.

ఈ సందర్భంగా ఆర్మీ కానిస్టేబుల్ కిషోర్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.సమాజంలో సమానత్వం,న్యాయం,విద్య ప్రాధాన్యతపై ఆయన చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని కొనియాడారు.యువతకు సందేశంగా అంబేద్కర్ ఆశయాలను జీవితంలో ఆచరణలో పెట్టాలని,ముఖ్యంగా విద్య ద్వారా వ్యక్తిగత మరియు సామాజిక పురోగతిని సాధించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమం సందర్భంగా గ్రామంలో ఐక్యత,సేవా భావం ప్రతిబింబించిందని పలువురు అభిప్రాయపడ్డారు.అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్మీ కానిస్టేబుల్ రామంచ కిషోర్, పాలకుర్తి దిలీప్,జూపాక కార్తీక్,రామంచ కృష్ణ,ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్.బాలకృష్ణ,స్టాఫ్ నర్స్ లు తదితరులు పాల్గొన్నారు.

12క్వింటల్ల బియ్యం పట్టివేత…

12క్వింటల్ల బియ్యం పట్టివేత

 

పరకాల,నేటిధాత్రి

మండలం నాగారంలో రేషన్ బియ్యం దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో సోదాలు చేసి రూ.42 వేల విలువైన 12 క్వింటాళ్ల (26 బస్తాల) పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. జాలిగపు మహేందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని,స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పరకాల పోలీసులకు అప్పగించారు.

శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ పనులు…

శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా పారిశుద్ధ పనులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో గ్రామ సర్పంచ్ సుశీల కార్యదర్శి హరిఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ శానిటేషన్ పారిశుద్ధ పనులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని మురికి కాలువలను క్లీన్ చేయడం, రోడ్లను ఊడ్చడం, డ్రైడే ఫ్రైడే లో భాగంగా ఇంటింటికి వెళ్లి నీటి ట్యాంకులు, నీటి తొట్టిలను అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వప్న ,ఆశా వర్కర్ స్వప్న గ్రామ సిబ్బంది పాల్గొన్నారు

వడ్ల కనుగోలు కేంద్రం ప్రారంభం…

వడ్ల కనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ , రామాయంపేట ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకము క్వింటాలుకు 2389 గాను, గ్రేడ్ బి రకానికి క్వింటాలుకు 2369 gaa అలాగే సన్న రకానికి బోనస్ గా 500 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుందని సెంటర్ నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్ ,వడ్ల కనుగోలు కేంద్రం నిర్వాహకులు కేతావత్ సురేష్ , పాత్లోత్ శంకర్, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగ్లోత్ దేవేందర్, గ్రామస్థులు ఉప్పలయ్య, మోహన్, నాజాం , అనిల్ కుమార్, మరియు రైతులు పాల్గొన్నారు.

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం…

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

పలు గ్రామాలలోని కాలనీలలో చేరిన వరద నీరు

వేల ఎకరాలలో మునిగిన వరి పంట

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాలలో భారీ ఎత్తున పంట నష్టం తో పాటు పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు, పాలకులు, అప్రమత్తమై పలు గ్రామాలను సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంట , పత్తి పంటలు తుఫాన్ దాటికి నేలకొరకగా, కొన్ని ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయి.

ముఖ్యంగా నెక్కొండ మండలం నుండి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం లో లెవెల్ కొట్టుకుపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు అదేవిధంగా నెక్కొండ నుండి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై వట్టే వాగు ప్రభావంతో భారీగా నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో ఎస్సై మహేందర్ రెడ్డి, తాసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో లావణ్య వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు గ్రామాలలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నాగారం గ్రామంలో నీట మునిగిన ఎస్సీ కాలనీ

నాగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో తుఫాన్ దాటికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీవాసులను స్థానిక తహసిల్దార్ వేముల రాజకుమార్, నాగారం పలు పార్టీలకు చెందిన నాయకులు కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అందించారు. అంతేకాక నాగారంలోని తుఫాన్ దాటికి ఓ భారీ వృక్షం కింద పెట్టిన పల్సర్ బైక్ పై వృక్షం కూలడంతో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది.

ఎవరు కూడా బయటికి రావద్దు

భారీ తుఫాన్ ప్రభావంతో నెక్కొండం మండలంలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని రాబోయే 48 గంటల వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా బయటికి రావద్దని స్థానిక తాసిల్దార్ రాజకుమార్ ఎంపీడీవో లావణ్య, ఎస్సై మహేందర్ రెడ్డిలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version