150 వసంతాల వందేమాతరం దేశ ఐక్యత గేయం -పార్లమెంట్లో చర్చ

150 వసంతాల వందేమాతరం దేశ ఐక్యత గేయం -పార్లమెంట్లో చర్చ

భారతదేశాన్ని విభజించడానికి, విచ్ఛిన్నం చేయడానికి బ్రిటిషు వారు విభజించు పాలించు సూత్రాన్ని అమలుపరిచే సమయంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతవనినీ ఏకం చేసిన ఉద్యమ ఘాట్టాలలో బెంగాల్ నుండి బంకించంద్ర చటర్జీ రచించిన గేయం ఆనాడు భారతీయులను ఉర్రు తలూగించి ఏకం చేసి యువతి, యువకులను ఏకతాటిపై తీసుకువచ్చి దేశ పై విదేశీ దురాక్రమణ, దోపిడీకి వ్యతిరేకంగా యూరోపియన్స్ అలాగే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చైతన్యపరిచిన చైతన్య గేయం “వందేమాతరం”. పార్లమెంటు శీతాకాల సమావేశంలో వందేమాతర గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని లోకసభలో 10 గంటల సమయం పాటు చర్చించడం మరోసారి భారత స్వతంత్ర ఉద్యమ ఘట్టాలలో వందేమాతరం, జనగణమన గేయం, గీతాల పాత్ర గురించి భారత యువత మరో సారి నెమరు వేసుకునే అవకాశరావడం సంతోషకరం.

2012లో వందేమాతర గేయం పై పార్లమెంట్లో జరిగిన చర్చలో తీసుకున్న నిర్ణయం చాలా ఆశ్చర్యకరమైనది. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో అభ్యంతర వాక్యాల జాబితాలో వందేమాతరం గేయాన్ని చేర్చి రాజ్యసభలో వందేమాతరం ఆలపించడానికి వీలు లేకుండా పోయినది.

బంకించంద్ర చటోపాధ్యాయ తన రచనలతో కేవలం బెంగాలి సమాజాన్ని కాదు మొత్తం భారతవనినే ప్రభావితం చేశారు. తన మొదటి నవల ఆంగ్లములో “రాజ్ మోహన్స్ వైఫ్” తరువాత బెంగాలీలో “దుర్గేష్ నందిని” 1865 సంవత్సరంలో ప్రచురీతమైనది. 1866 “కపాల కుండల” నవల చాలా పేరు తెచ్చుకుంది. అనంతరం “బంగ దర్శన్” పేరుతో పత్రికను కూడా ప్రారంభించి విమర్శనాత్మకమైన సాహిత్య, సాంఘిక, సంస్కృతిక అంశాలను ప్రచురించారు. “ఆనంద్ మఠ్” నవల రచించారు. అందులో వందేమాతర గీతాన్ని జత చేశారు. అనంతరం జాతీయ వాదానికి దేశ స్వతంత్ర ఉద్యమములో కీలకముగా మారిపోయినది. బిపిన్ చంద్రపాల్ తన పత్రికకు అలాగే, లాలా లజపతిరాయ్ కూడా తన జాతీయ వాద పత్రికకు “వందేమాతరం” అని నామకరణం చేశారు. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 24న వందేమాతరం గీతానికి జాతీయ గేయం హోదాను ప్రకటించారు. ఈ విషయంలో తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వందేమాతరం గీతాన్ని స్వతంత్ర భారతదేశ జాతీయ గేయంగా స్వీకరించడానికి వెనుకాడారు. ఈ విషయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా నెహ్రూను కలిసి వందేమాతరం గీతాన్ని స్వాసంత్రోద్యమం మంత్రంగా చేయడానికి అభిప్రాయం కోరినారు.

వందేమాతరం తొలి చరణం అర్థం: భారతమాతకు వందనం, తీయ్యని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరుతో విలసిల్లే భారతమాతకు వందనం, రాత్రులు తెల్లని వెన్నెలలతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారతమాతకు వందనం. ప్రకృతిని అంతటితో భారత మాతకు నమస్కరించి భావం కలదు.

1938వ సంవత్సరములో హైదరాబాదు రాజ్యంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా వందేమాతరం విద్యార్థి ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ లో మొదలవడంతో నిజాంను వ్యతిరేకించడంతో విద్యార్థులను బహిష్కరించడంలో ఆనాడు పీ.వీ నరసింహారావు, హయగ్రీవచారి, నూకల రామచంద్రారెడ్డి, అచ్యుతారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, డి.వెంకటేశ్వరరావు, బొమ్మగాని ధర్మబిక్షం వంటి వారితో పాటు 1200 మంది విద్యార్థులను ఈ వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నాందు యూనివర్సిటీ నుంచి తొలగించ బడ్డారు.

పార్లమెంటు చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోకసభలో మన అసంఖ్యాక స్వతంత్ర సమరయోధులు వందేమాతరం అని నినాదించి ఉరిశిక్షను స్వీకరించారు. అలాగే అందరి నోట ఒకటే మాట వందేమాతరం. రాజ్యసభలో యం.పీ సుధా మూర్తి ప్రసంగిస్తూ ప్రాథమిక ఉన్నత, పాఠశాలల పాఠ్యాంశాలలో వందేమాతరం తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే దేశభక్తిని పెంపొందించడానికి, సాంస్కృతిక స్ఫూర్తిని కాపాడడానికి ఇది అవసరమైన నొక్కి చెప్పారు “భారతదేశ విభిన్న రంగులతో కూడిన దుప్పటి వంటిది దాన్ని కలిపి ఉంచే దారం, సూది వందేమాతరం” అని అభివర్ణించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ మోడీపై ఎదురు దాడిలో మహాత్మా గాంధీ 1937లో నిర్ణయం విభజన చర్య కాదని నెహ్రూ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, రాజేంద్రప్రసాద్, అబ్దుల్ కలాం ఆజాద్, సరోజినీ నాయుడు మొదలైన నాయకులతో కూడిన వర్కింగ్ కమిటీ సిఫార్సు చేసిన సున్నితమైన సర్దుబాటు అని పార్టీ వాదించింది. అలాగే ఎం.ఐ.ఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ కనీసం డిగ్రీ చేయలేదు అని చదువుకోలేదని చెప్పడం విడ్డూరంగా అనిపించింది తాను డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి బంకించంద్ర అలా అయితే తెలంగాణ వ్యక్తి అందేశ్రీ నిరక్షరాస్యుడు మరియు తెలంగాణ రాష్ట్ర గీతం రచించిన వ్యక్తి కాదా సాహిత్యానికి చదువుకు సంబందం లేదు.

వందేమాతరం భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంలో ఈ నినాదం ఒక ఆయుధం స్వతంత్ర ఉద్యమకారులను ఏకం చేసిన పదం. నేడు పాఠశాలలలో ప్రార్థన సమయాల్లో ఆలపించడం, సైనికులకు ఈ నినాదం ఒక ప్రేరణ, వివిధ సమావేశాలు సభలలో నేటికీ ఆలపించడం గొప్ప విషయం. వివిధ తెలుగు సినిమాలు వందేమాతరం పేర్లతో తీయడం జరిగినది వాటిలో వందేమాతరం-1939, వందేమాతరం-1982, వందేమాతరం-1985 సంవత్సరంలో ఈ సినిమాలో టైటిల్ సాంగ్ పాడినందుకు శ్రీనివాస్ ‘వందేమాతరం శ్రీనివాస్’ గా మారిపోయినారు.

ఇంతటి చారిత్రాత్మకమైన వందేమాతరం గేయం, జనగణమన గీతాల గొప్పతనం భావితరాలకు తెలియజేయవలెనంటే పుస్తకాలలో ఏ సబ్జెక్టులో చదువుకోవలెను! అది ఒక్క చరిత్రలో మాత్రమే అదే కాకుండా స్వతంత్ర ఉద్యమ చరిత్ర, ఉద్యమ ఘట్టాలు, స్వాతంత్ర సమరయోధుల చరిత్ర వంటివి చరిత్రలోనే చదవాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్ర సబ్జెక్టును ప్రతి ప్రొఫెషనల్ కోర్సులలో ఒక కామన్ సబ్జెక్టుగా చేర్చితే భావితరాలకు చరిత్ర సంపూర్ణ సమాచారం అందుతుంది.

వ్యాస రచయిత:
డా.తూము విజయ్ కుమార్, చరవాణి-9492700653

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది…

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

జాతీయ గేయం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు,(1875 నవంబర్ 7 న వందేమాతరం గేయం, రచించిన బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉరకలేసింది. మార్కెట్ ఆవరణలో, పాఠశాలల్లో, కాలనీల్లో, ప్రజా వేదికలపై వందేమాతరం గీతాలాపన ప్రతిధ్వనించింది.
పల్లె నుంచి పట్టణం దాకా “వందేమాతరం” నినాదాలు మారుమ్రోగాయి.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తల్లి భారతమాతకు వందనములు అర్పించారు.
నెక్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గేయాన్ని ఆలపించారు.
తమ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల వేదికపై నిలిచి గీతం పాడిన పూర్వ విద్యార్థులు మాణిక్యం తొ పాటు సీఐ సన్నాయిల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
“వందేమాతరం 150వ వసంతం మనందరికీ గౌరవ దినం” అంటూ వారు గర్వంగా తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈడునూరి సాయికృష్ణ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ
వందేమాతరం కేవలం గేయం కాదు, ఇది దేశాత్మక గౌరవానికి ప్రతీక. తల్లి భారతమాతకు మన అర్చన.”
అని అన్నారు.
పిల్లలు జాతీయ పతాకాలతో ఊరంతా దేశభక్తి నినాదాలు చేశారు.
సంస్కృతి, భక్తి, ఐక్యత సమన్వయమై నెక్కొండ మొత్తం “వందేమాతరం” స్వరంతో మార్మోగింది.

ఘనంగా వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం…

ఘనంగా వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోనిబాలాజీ టెక్నోస్కూల్( సీబీఎస్ఈ)లో 150 సంవత్సరాల వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ .రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వందేమాతర గేయాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ నవలా ప్రక్రియను పరిచయం చేసిన సాహితీ సుప్రసిద్ధులు భారతమాతకు వందనం అంటూ మొదటి చరణంతో ప్రారంభమైన గేయం స్వాతంత్ర్య సమరంలో ఎందరికో ప్రేరణ ఇచ్చిందని గుర్తు చేశారు.భారత జాతీయ గేయమైన వందేమాతరంను రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిందని తెలియజేశారు.బెంగాల్ సాయిధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకు గురైన తొలి యువకుడు కుదీరామ్ బోస్, వీర సావర్కర్ వంటి ఉద్యమకారులు ఉరికంబాన్ని ఎక్కే ముందు కూడా చిరునవ్వుతో వందేమాతరం అంటూ ఉరికొయ్య వైపు నడిచారని, ఈ గేయం ఎంతటి స్ఫూర్తినిచ్చిందో తెలియజేస్తుందని తెలిపారు.ప్రిన్సిపల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బిబిసి వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోలో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాలలో వందేమాతరం రెండో స్థానం దక్కించుకుందని , ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను చాటుతోందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ఎన్.సి.సి క్యాడెట్ లు జాతీయ పతాకముతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు సామూహికంగా వందేమాతరం రాగయుక్తంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, క్రాంతి కుమార్, రవీందర్ రెడ్డి ,ప్రదీప్ ,వినోద్, స్వప్న, సంగీత, విద్యార్థులు పాల్గొన్నారు.

వందేమాతర గీతం ఒక స్పూర్తి గేయం..

వందేమాతర గీతం ఒక స్పూర్తి గేయం

మరిపెడ నేటిదాత్రి

 

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమైక్యంగా ఆలపించడం ఎంతో గర్వకారణంగా ఉందని రాంపురం ప్రాథమిక పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ అన్నారు, బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తో కలిసి వందేమాతరం గీతాన్ని పాడారు ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్ , శ్రీధర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.

వందేమాతరం గీతం దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా సమైక్యంగా ఆలాపించడం ఎంతో గర్వకారణంగా ఉందని తహసిల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. బంకిం చంద్ర చటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసిల్దార్ కార్యాలయం వద్ద పలువురు గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తినిచ్చిందని అదేవిధంగా భారత ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా వందేమాతరం గీతం నిలవడం గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

వందేమాతరం గేయం 150 సంవత్సరాలు అయినా సందర్భంగా గేయాలపన

వందేమాతరం గేయం 150 సంవత్సరాలు అయినా సందర్భంగా గేయాలపన

హాజరైన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ కవి, రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏండ్లు అయిన సందర్భంగా వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించాడం జరిగినది. వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.

 

 

, ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ సమగ్రతను, శౌర్య పరక్రమానికి సాహిత్యనికి, వందేమాతరం ఒక అద్భుత రచన గేయం అలాంటి గేయం మన దేశంలో బకించంద్ర చటర్జీ రాసి మనందరికీ అందించడం వందేమాతర గేయం ఇప్పటికీ 150 సంవత్సరాలు ఆయన సందర్భంగా మనమందరం గేయ ఆలాపన చేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇన్స్పెక్టర్ లు రవి, నాగేశ్వరరావు , మధుకర్, ఆర్.ఐ లు రమేష్, యాదగిరి, ఎస్.ఐ లు కిరణ్ కుమార్, క్రాంతి కుమార్, రాజు,సాయి కిరణ్,జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరై గేయా లాపన చేశారు..

వందేమాతర గీతం ఒక స్పూర్తి…

వందేమాతర గీతం ఒక స్పూర్తి

కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .

 

దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతర గీతాన్ని 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమైక్యంగా ఆలపించడం ఎంతో గర్వకారణంగా ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బందితో కలిసి వందేమాతరం గీతాన్ని పాడారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఉద్యమకారులకు వందేమాతర గీతం ఒక స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, జిల్లా అధికారులు, ఐ.డి. ఒ.సి సిబ్బంది గీతాలాపన చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version