పసిపాప హత్య కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి..

పసిపాప హత్య కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ హెచ్చరిక

నెక్కొండ, నేటి ధాత్రి

బీసీ నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండటం, బీసీ మంత్రులు ప్రభుత్వంలో ఉన్నా బీసీ బిడ్డలకు న్యాయం జరగకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు అధికార పార్టీ మౌన సమ్మతి ఇస్తోందని మండిపడ్డారు.నాగర్‌కర్నూల్ మండలం చాకలి ఐలమ్మ గారి సెంటర్ పరిధిలోని కుమ్మెర గ్రామంలో కుమ్మరి మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన కుల అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. దైవ దర్శనానికి వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని తక్కువ కులం వారు అంటూ గుడిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, నోటికొచ్చినట్లు దుర్భాషలాడటం దొరల పాలన కొనసాగుతుందనే దానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రకళ జగ్గయ్య దంపతులపై కుల ఉన్మాదంతో దాడి చేసి, వెంట్రుకలు పట్టుకుని ఈడ్చి, జాతరకు వచ్చిన జనాలపైకి విసిరి కొట్టడం అత్యంత అమానుషమని తెలిపారు. విషయం ఏమిటని అడిగిన వారి చిన్న కుమారుడు గణేష్‌పై కూడా అధికార పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ సహా నలుగురు కలిసి పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు.
పసిపాపను చూసైనా వదిలేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడి వేడుకున్నా, కనికరం లేకుండా రెండు నెలల చిన్నారిని కాలితో తన్ని చంపడం కుల రాక్షసత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ పసిపాప మృతికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలని, ఇది ప్రభుత్వ హత్యతో సమానమని గటిక అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.నిందితులను గుర్తించినప్పటికీ ఇప్పటికీ అరెస్టులు జరగకపోవడం వెనుక రాజకీయ అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. దోషులను కాపాడే ప్రయత్నం కొనసాగితే బీసీ, బహుజన సమాజం మౌనంగా ఉండదని హెచ్చరించారు. ఎంతటి వారైనా సరే దోషులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బహుజనులపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు…

కాంగ్రెస్ పాలనలో దళితులపై దాడులు

◆-: బీఆర్ఎస్ నేత బండి మోహన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరా బాద్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధి కారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు బండి మోహన్ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో పలు గ్రామాలలో ఎస్సీలు తమకు ఓటు వేయలేదని అగ్రవర్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేయడం, దూషిం చడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. అగ్రవర్ణాలు దాడి చేస్తే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, పోలీ సులు బాధితులపైనే కేసులు చేస్తామంటూ బెదిరించడం హేయమైన చర్యగా చెప్పారు. గ్రామస్తుడి ఇల్లు కూల్చేసిన సర్పంచ్ ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన ఆధారాలు బాధితులు చూపించినప్పటికీ పోలీసులు పట్టించు కోకపోవడం దారుణం అన్నారు. జహీరాబాద్ పరిధిలోని సజ్జాపూర్, కప్పాడ్ గ్రామాలలో జరిగిన ఘటనలు పునరావృతమైతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version