మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం…

మంత్రి పొంగులేటి ఫై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం

వ్యక్తిగత విమర్శలు కాదు ప్రజాస్వామాలపై మాట్లాడండి

దళిత నాయకుడు కడియం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు అసహ్యం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరపగూడెం మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ప్రజానాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సమావేశం నిర్వహించిన కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవకు అంకితమైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ దౌర్భాగ్యం అన్నారు ప్రజా ప్రతినిధులను రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం నీచ రాజకీయాలను నిదర్శనం అని మండిపడ్డారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాల్సిన ప్రతిక్షణం చట్టసభల్లో విమర్శలకు దిగడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు అదేవిధంగా దళిత సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు వెంకటపురం సర్పంచ్ కేశవరావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల నాయకులు, ఏరా సురేష్, గోగ్గలి రవి, భూక్యరాందాస్, షేక్ రఫీ, కొమరం వెంకటేశ్వర్లు, వార్డు మెంబర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల గౌరవ, మర్యాదలతో మెలగాలి: సీఎం చంద్రబాబు..

ఏ ప్రభుత్వమైనా రాష్ట్రపతి పట్ల గౌరవ, మర్యాదలతో మెలగాలి: సీఎం చంద్రబాబు

పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ కల్పించనలేదని ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్‌‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandra babu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా సీఎం ట్వీట్‌ పెట్టారు. ఇంటర్ నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు ప్రోటోకాల్ కల్పించనలేదని ప్రశ్నించారు.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు దుర్మార్గం…

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు దుర్మార్గం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ వ్యతిరేకించారు. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాలపై నిరంతర దాడులను, ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఏకగ్రీవంగా ఖండించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇతర దేశాలపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఆయన ఖండించారు. ఐక్యరాజ్యసమితి వెంటనే అమెరికా మరియు ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకొని ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆయన పేర్కొన్నారు.

పసిపాప హత్య కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి..

పసిపాప హత్య కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ హెచ్చరిక

నెక్కొండ, నేటి ధాత్రి

బీసీ నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండటం, బీసీ మంత్రులు ప్రభుత్వంలో ఉన్నా బీసీ బిడ్డలకు న్యాయం జరగకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు అధికార పార్టీ మౌన సమ్మతి ఇస్తోందని మండిపడ్డారు.నాగర్‌కర్నూల్ మండలం చాకలి ఐలమ్మ గారి సెంటర్ పరిధిలోని కుమ్మెర గ్రామంలో కుమ్మరి మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన కుల అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. దైవ దర్శనానికి వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని తక్కువ కులం వారు అంటూ గుడిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, నోటికొచ్చినట్లు దుర్భాషలాడటం దొరల పాలన కొనసాగుతుందనే దానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రకళ జగ్గయ్య దంపతులపై కుల ఉన్మాదంతో దాడి చేసి, వెంట్రుకలు పట్టుకుని ఈడ్చి, జాతరకు వచ్చిన జనాలపైకి విసిరి కొట్టడం అత్యంత అమానుషమని తెలిపారు. విషయం ఏమిటని అడిగిన వారి చిన్న కుమారుడు గణేష్‌పై కూడా అధికార పార్టీ నాయకులు, గ్రామ సర్పంచ్ సహా నలుగురు కలిసి పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు.
పసిపాపను చూసైనా వదిలేయాలని తల్లిదండ్రులు కాళ్ల మీద పడి వేడుకున్నా, కనికరం లేకుండా రెండు నెలల చిన్నారిని కాలితో తన్ని చంపడం కుల రాక్షసత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ పసిపాప మృతికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా బాధ్యత వహించాలని, ఇది ప్రభుత్వ హత్యతో సమానమని గటిక అజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.నిందితులను గుర్తించినప్పటికీ ఇప్పటికీ అరెస్టులు జరగకపోవడం వెనుక రాజకీయ అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. దోషులను కాపాడే ప్రయత్నం కొనసాగితే బీసీ, బహుజన సమాజం మౌనంగా ఉండదని హెచ్చరించారు. ఎంతటి వారైనా సరే దోషులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బహుజనులపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

మందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్..

  న్యూయామందానీ దెబ్బకు రగిలిపోతోన్న ట్రంప్..ర్కర్లు పారిపోక తప్పదంటూ కామెంట్

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోపంతో రగిలిపోతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి, భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ విజయం సాధించడంపై ట్రంప్ తీవ్ర అసహనం

Trump-New Yorkers: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోపంతో రగిలిపోతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో డెమోక్రాటిక్ సోషలిస్ట్ అభ్యర్థి, భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ విజయం సాధించడంపై ట్రంప్ తీవ్ర అసహనం వెళ్లగక్కుతున్నారు. మందానీ పాలనలో న్యూయార్క్ నగరం కమ్యూనిస్ట్ క్యూబా లేదా సోషలిస్ట్ వెనిజులాగా మారుతుందని ట్రంప్ అంటున్నారు.

చిత్తూరులో అంబేద్కర్ విగ్రహ దహనంపై వైసిపి నిరసన…

*చిత్తూరు జిల్లా దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహ దహనంపై భూమన ఆధ్వర్యంలో వైసిపి నిరసన..

*ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి..

తిరుపతి(నేటిధాత్రి) అక్టోబర్04:

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ దహన ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహ దహనం వంటి దారుణ సంఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ పచ్చ పత్రికల మద్దతుతో తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఫైబర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని ఆయన మండిపడ్డారు.
అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం దళితుల ఆత్మగౌరవంపై దాడి అని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలు సమాజంలో అలజడులు సృష్టించే ప్రయత్నమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ ఘటనపై ఎంపీ మద్దిల గురుమూర్తి జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, కమిషన్ వేగంగా స్పందించి చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేసి విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇది దళితుల ఆత్మగౌరవ రక్షణకు సానుకూల పరిణామమని ఎంపీ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ ఘటనను నిర్లక్ష్యంగా తీసుకోవడం దురదృష్టకరమని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ దహనం జరిగిన మూడు రోజులు గడిచినా నిందితులను పోలీసులు గుర్తించకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనం కలిగిస్తోందని పేర్కొన్నారు. దళితుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి ఘటనలను సహించబోమని ఆయన హెచ్చరించారుఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, గంగాధర నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version