కంట మహేశ్వర ఆలయం ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతుంది
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండల కేంద్రంలో గౌడ కులస్తులు నిర్మించనున్న కంట మహేశ్వర స్వామి దేవాలయ భూమి పూజా కార్యక్రమంలో శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, సమాజ అభ్యున్నతి కోసం దేవాలయాలు కేవలం ఆరాధనా స్థలాలు మాత్రమే కాదు, ఐక్యతను పెంపొందించే ఆధ్యాత్మిక కేంద్రాలని అన్నారు.
“గౌడ కులస్తుల శ్రద్ధ, శక్తి, సంకల్పంతో రూపుదిద్దుకునే ఈ ఆలయం నెక్కొండకు మరో ఆధ్యాత్మిక చిరునామా కానుందని. ఈ దేవాలయం ద్వారా యువతలో ఆచార సంస్కృతులు మరింత పటిష్టం అవుతాయని, ప్రభుత్వంగా మత సంస్థల అభివృద్ధికి కావలసిన సహాయాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం” అని ఎమ్మెల్యే మాధవరెడ్డి పేర్కొన్నారు.
కంట మహేశ్వర స్వామి ఆలయం నిర్మాణం గౌడ సమాజ ఏకగ్రీవ ఆశయమని, వారి దీక్ష, భక్తి ఈ నిర్మాణానికి బలమని ఆయన అభినందించారు.
కార్యక్రమంలో సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు, డిసిసి ప్రధాన కార్యదర్శి పెండ్యాల హరిప్రసాద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి సాయికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కుసుమ చెన్నకేశవులు, మాదటి శ్రీనివాస్, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రావుల మైపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌడ సంఘ నాయకులు, కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
