మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ సర్పంచ్
#నెక్కొండ, నేటి ధాత్రి:
నెక్కొండ మండలం అలంఖానిపేట గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన కొమ్ము ఉపేందర్ ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాంపెల్లి నిరోషా శ్రావణ్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పదవ రోజు కార్యక్రమానికి తమ వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇడంపాక ప్రకాశం, బీసీ సెల్ అధ్యక్షులు కోలా నరేష్, రామాలయ కమిటీ వైస్ చైర్మన్ చీకటి సుమన్, వార్డు సభ్యులు చీకటి వెంకన్నతో పాటు సీనియర్ నాయకులు ఎడ్ల సురేందర్, చిదరాల నరేష్, రామస్వామి, బిక్షపతి, వేణు, హనుమంతు, అశోక్, యాకయ్య, శ్రీను తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు.
గ్రామ పాలకులు ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటిందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
