తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు మేరకు బందునువిజయవంతం చేద్దాం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల. కేంద్రంలో ఈరోజు మార్కండేయ భవన్లో. వివిధ రాజకీయ పార్టీల కుల సంఘాల బీసీ సంఘాల ప్రతినిధులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు రేపు జరిగే బందును అన్ని వర్గాల ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాలు బీసీ సంఘాలు కార్మిక సంఘాలు నేతలు సహకరించాలని బీసీ నేతలను కోరారు దేశంలో రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే మరి ఉన్నత వర్గాల్లో కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టులో పిటిషన్ వేసి నిలుపుదల చేశారని వారికి తగిన గుణపాఠం చెబుతామని నేతలంతా. ముక్తకంఠంతో. హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాజ్యాంగంలో ని. 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తర్వాత ఎన్నికలకు పోవాలని నాయకులను కోరారు ఈ సందర్భంగా. బీసీ సంఘాల నేతలు ఎగుర్ల కర్ణాకర్. కందుకూరి రామ గౌడ్. బి ఆర్ ఎస్. పార్టీ మండల అధ్యక్షులు రాజన్న. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. బిజెపి నాయకులు గుగ్గిల ఆంజనేయులు . ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొని ప్రసంగించారు ఇట్టి బందుకు వారి పార్టీల పక్షాన జేఏసీ. పిలుపుమేరకు బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కట్ట రవి. శాలి అధ్యక్షులు రాపల్లి ఆనందం. ఎగుర్ల ప్రశాంత్. నేరెళ్ల అనిల్. రంగు ప్రసాదు. గుర్రం తిరుపతి. గాద సత్తయ్య. వెంగళ రమేష్ పలువురు. జేఏసీ నాయకులు తదితరులు బందుకు మద్దతు ప్రకటించారు
బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్..
నర్సంపేట,నేటిధాత్రి:
బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బంద్ విజయవంతం చేద్దామని బిఆర్ఎస్వి నర్సంపేట పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్ కోరారు.గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలను విద్య, రాజకీయపరంగా అణిచివేస్తూ రాజకీయంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుకుంటూ వచ్చిందని ఎద్దేవా చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ వచ్చేవరకు బీసీ విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు..నాడు మాజీ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ ఉద్యమం మాదిరిగానే.. బీసీ రిజర్వేషన్ బిల్లును ఢిల్లీ దాకా తీసుకెళ్లి రిజర్వేషన్ బిల్లును సాధించుకోవాలని పిలుపునిచ్చారు.బిసి విద్యార్థులతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాటకాలు ఇక బీసీల ముందు చెల్లవని..బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బంద్ కు మద్దతుగా పాల్గొంటున్న నేపథ్యంలో నర్సంపేట పట్టణలోని ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలలు, విద్యాసంస్థలు బీసీ బందుకు సంపూర్ణ మద్దతు తెలపాలని హేమంత్ కోరారు.
పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
*పిజిఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మకు సీఎం ఘన నివాళులు*
పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బుధవారం పరామర్శించారు. దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పిజిఆర్ గార్డెన్ లో బుధవారం మాతృయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,
ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, ప్రజా ప్రతినిధులు ఇతర ప్రముఖులు హాజరు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తదితరులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి..
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు. దొంతి మాధవ రెడ్డి ని పరమార్శించేందుకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్.
నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి రోడ్డు మార్గం లో పీజీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి దొంతి కాంతమ్మ మాతృయజ్ఞం కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు దొంతి కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ట్స్ కళాశాల మైదానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు చేరుకున్నారు.
తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం
వరంగల్ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి బయలుదేరారు. హెలిపాడ్ వద్ద మంత్రులు అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్. నాగరాజు,యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, ఎన్పీడీసీఎల్ వరుణ్ రెడ్డి, తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..
నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మరణించిన నేపద్యంలో బుధవారం హన్మకొండ లోని పిజీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొననుటకు గాను హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.
విద్యార్థుల ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ చెక్ చేయాలి
నర్సంపేట బిసి బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శన
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ వసతి గృహాలో చదువుకునే విద్యార్థులకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాని నర్సంపేట బిసి బాలుర వసతి గృహం అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. నర్సంపేట పట్టణంలోని బిసి బాలుర వసతి గృహాన్ని మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు.వసతి గృహానికి సంబంధించిన విద్యార్థులు, స్టాఫ్ వివరాలను పలు రికార్డులు, వంటగది, మరుగుదొడ్లను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలని, విద్యార్థులకు మెనూపకారంగా రుచికరమైన నాణ్యమైన వేడి భోజనం అందించాలని అన్నారు. భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు.విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఏర్పాటుచేసిన కంప్లైంట్ బాక్స్ లో రాసి వేయాలని అన్నారు. విద్యార్థులు హాస్టల్ కు వచ్చి వెళ్ళేటప్పుడు బాధ్యత గా కేర్ టేకర్ వెంట ఉండాలని తెలిపారు.చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై వసతి గృహ సంక్షేమ అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సంవత్సరం ప్రభుత్వ బిసి వసతి గృహంలో మెరుగైన ఫలితాలు రావాలని అందుకు విద్యార్థులు కూడా కృషి పట్టుదలతో చదివి జిల్లాలోనే వసతి గృహా విద్యార్థులు ముందంజలో ఉంచి 100 శాతం మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.చదువులో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేసిన కలెక్టర్ పలు సమాధానాలు రాబట్టారు.పదవ తరగతి విద్యార్థులను సబ్జెక్టు వారిగా ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంలో ముందుండాలని సూచించారు. చదువులో వెనుకబడ్డ ప్రతి విద్యార్థిపై వసతి గృహ సంక్షేమ అధికారులు తన సొంత బిడ్డల వల్లే భావించి ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. వసతి గృహ ఆవరణ పరిసరాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి పుష్పలత, వసతి గృహ సంక్షేమ అధికారి, నాలుగో తరగతి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2.2 తులాల బంగారం, 38 తులాల వెండి, ఐదు సెల్ ఫోన్లు, ఒక ఆటో, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.ఐదుగురి పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపారు.నర్సంపేట డివిజన్ సహా పలు ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి రవీందర్ రెడ్డి తెలిపారు. గత ఆగస్టు నెల నుండి నర్సంపేట సబ్ డివిజన్ పల్లెతోపాటు మహబూబాబాద్ ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను నర్సంపేట పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఏసీపీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎండీ. ఇమ్రాన్ అనే వ్యక్తి అతని స్నేహితుడు అదే జిల్లాకు ఆర్టీసీ కాలనికి చెందిన మాదాసు నవీన్ తో దొంగతనాలకు ప్లాన్ చేశారు.ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు గాను నవీన్ భార్య మాదాసు భార్గవితో పాటు ఆమె బందువులైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి,అదే జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కొండై గూడెం గ్రామానికి చెందిన కుంజా విజయ ఇద్దరు అక్కలతో ఒక గ్రూప్ గా ఏర్పడిన ఈ ఐదుగురు నిందితులు తాళంవేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఏసీపీ రవీందర్ తెలిపారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఎండీ. ఇమ్రాన్ సూత్రధారి కాగా, అదే జిల్లాకు ఆర్టీసీ కాలానికి చెందిన మాదాసు భార్గవి, నవీన్ లు అతనితో చేతులు కలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి, కుంజా విజయతో కలిసి రాత్రిళ్ళు దొంగతనాలకు పాల్పడ్డారు.నర్సంపేట డివిజన్ లో ఆగస్టు నెలలో ఖానాపురం మండలం బుధారావుపేటలో, సెప్టెంబర్ నెలలో నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డులో గల ఓ నగల షాపులో దొంగతననానికి పాల్పడినట్లు గుర్తించారు.మరో రెండు దొంగతనాలు మహబూబాబాద్ పట్టణంలో చేసినట్లు గుర్తించారు. దొంగతనాల్లో దోచుకున్న సొమ్ములో కొంత మేరకు అవసరానికి వాడుకున్నట్లు, మరికొంత ఆటో, ద్విచక్ర వాహనం కొనడానికి వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన వాటిలో 2 తులాల 2 గ్రాముల బంగారం, 38 తులాల వెండి వీటి విలువ రూ.4 లక్షల 30వేలుగా పోలీసులు నిర్ధారించారు. వీటిలో 2 లక్షల 70 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. రూ . లక్షా ముప్పై వేలు రికవరీ చేసినట్లు స్పష్టం చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు.ఐతే ఈ ముఠా దొంగతనాలకు పాల్పడేముందు మొదటి ముద్దాయి మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇమాం తన ద్విచక్ర వాహనంపై పగలు పూట రెక్కి నిర్వహిస్తాడు.రాత్రి ఐదుగురు ముఠా సభ్యులు తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసే ముందు సెకండ్ షో సినిమా చూస్తారు.అనంతరం ఇండ్లల్లో చొరబడి దొంగతనాలకు పల్గడుతున్నట్లు తెలిపారు.పలు ఫిర్యాదుల మేరకు సీసీ కెమెరాలు సహకారంతో నిదితులను అరెస్టు చేసి విచారించగా వరుస దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపారు.బంగారం, వెండి ఆభరణాలతో తో ఐదు సెల్ ఫోన్లు,ఒక ఆటో,ఒక ద్విచక్ర వాహనం స్వాదీనం చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఏసిపి రవీందర్ రెడ్డి వివరించారు.ఈ మీడియా సమావేశంలో నర్సంపేట టౌన్ ఎస్సై రవికుమార్,రూరల్ ఎస్సై అరుణ్ కుమార్,నర్సంపేట షీ టీమ్ ఎస్సై స్వాతి,హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ ఖాజం అలీ,నాగరాజు,కృష్ణవేణి,తదితరులు పాల్గొన్నారు. *వరుస దొంగతనాల పట్ల దర్యాప్తు చేస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నాగరాజు చొరువ చాకచక్యంగా వ్యవహరిండం పట్ల ఎసిపి రవీందర్ రెడ్డి కానిస్టేబుల్ నాగరాజు అభినందించారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల్ గ్రామపంచాయతీ పరిధిలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రెండవ రోజున పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా, సోమవారం నాడు కోహిర్ మండలంలోని పైడిగుమ్మల్ అంగన్వాడీ కేంద్రం, బస్టాండ్ సమీప ప్రాంతంలో వద్ద పోలియో చుక్కలు వేయించుకో లేనటువంటి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఏఎన్ఎం శాంతమ్మ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,ఆశ వర్కర్ లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామసాగర్ రెండోదశ ప్రాజెక్టుకు బి.ఎన్ పేరు పెట్టాలి
ఎం సిపిఐ (యు) పార్టీ నేతల డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి:
శ్రీరామ్ సాగర్ రెండవ దశ ప్రాజెక్టుకు నల్లగొండ జిల్లా మాజీ ఎంపీ , తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలని ఎంసిపిఐ (యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు.ఈ క్రమంలో నర్సంపేట ఆర్డిఓ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఎన్ రెడ్డి తన జీవితమంతా ప్రజల కోసమే త్యాగం చేశారని నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టు సాధన కోసం అలుపెరుగని పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు.అలాంటి వారి త్యాగాన్ని గుర్తించకుండా ఆ ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించటం సరికాదన్నారు. పీడిత ప్రజల అభ్యున్నతి కోసం త్యాగంచేసిన బిఎన్ పేరు నామకరణం చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండేలా , ముఖ్యమంత్రి పునః పరిశీలన చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల ప్రజలను సమీకరించి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు భైరబోయిన నర్సయ్య,గనిపాక బిందు,కళ్లెపెల్లి రాకేష్ పాల్గొన్నారు.
నాన్ మెడికల్ అధికారుల నియామకం వైద్యరంగానికి ముప్పు
ఏఐఎఫ్డీడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ ఆసుపత్రుల పరిపాలన కోసం నాన్ మెడికల్ అధికారుల నియామకం చేయడం వైద్య రంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆసుపత్రుల పరిపాలన బాధ్యతలను నాన్ మెడికల్ అధికారులకు అప్పగించాలని చేసిన ప్రతిపాదనలపై వైద్య వర్గాల్లో తీవ్రమైన అసహనం నెలకొందని, ఈ నిర్ణయం ఆరోగ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని,రోగి సేవల నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏఐఎఫ్డీడబ్ల్యు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఆసుపత్రుల పరిపాలన,వైద్య నిర్ణయాలు,చికిత్స విధానాలు అన్ని వైద్య పరిజ్ఞానంతో ముడిపడి ఉంటాయని అలాంటి వ్యవహారాలను నాన్ మెడికల్ అధికారుల చేతుల్లో పెట్టడం అనేది రోగి సేవలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయమని, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఈ నిర్ణయం పట్ల పునరాలోచించాలని అన్నారు. నాన్ మెడికల్ అధికారుల చేతుల్లో ఆసుపత్రుల నిర్వహణ ఉంటే వైద్యులు పరిపాలన అధికారాలు కోల్పోతారని,రోగుల సేవలు క్షీణిస్తాయని, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో వైద్యుల పాత్రను బలహీనపరిచే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే రద్దుచేసి రోగి సేవలు మెరుగుదలకు వైద్యులే ప్రధాన కేంద్రంగా ఉండే విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో పరిపాలన ప్రజా ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా ఆరోగ్యం రాజకీయ నిర్ణయాలకు బలి కాకూడదని అన్నారు.ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలంటే, వైద్యులే పరిపాలన బాధ్యత వహించాలని, నాన్ మెడికల్ అధికారులకు అప్పగించే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో వైద్య వర్గాలను, రోగులను, ప్రజాస్వామ్య వర్గాలను సమీకరించి ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని రాగసుధ హెచ్చరించారు.
అగ్రవర్ణాల కుట్రతోనే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు స్టే
42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి
బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద నిరసన
ధర్నా రాస్తారోకో, స్తంభించిన ట్రాఫిక్, పోలీసుల చొరవతో నిరసన విరమణ
నర్సంపేట నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్రలో భాగంగానే హైకోర్టు స్టే విధించిందని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు,నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ డ్యాగల శ్రీనివాస్ ఆరోపించారు. రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ బిల్లుపై హైకోర్టులో వేసిన దాఖలు పట్ల గురువారం హైకోర్టు మద్యంతర స్టే విధించింది. దీంతో త్వరలో జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పాటు బీసీ కులాల విద్య ఉద్యోగ ఉపాధిలో రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జీజుల శ్రీనివాస్ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు డ్యాగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డు అమరవీరుల స్థూపం వద్ద రాస్తారోకో ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 25 నిమిషాల పాటు జరిగిన ధర్నా రాస్తారోకో పట్ల సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఎక్కడెక్కడ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అరుణ్ కుమార్ బీసీ సంక్షేమ సంఘం నాయకులతో మాట్లాడి నిరసన విరమింప చేశారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల హక్కులు రిజర్వేషన్ల కోసం కొన్ని ఏండ్లుగా చేస్తున్న పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అగ్రవర్ణ కులాల కుట్రలో భాగంగా హైకోర్టులో ఫిర్యాదు మేరకు హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. దీంతో బీసీలకు ఉద్యోగ,ఉపాధితో పాటు అన్ని విధాల అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి కోర్టులకు వెళ్లలేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు ఇచ్చిన స్టేను వెంటనే ఎత్తివేసి 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు స్టే విధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు చొరవ తీసుకొని బీసీలకు న్యాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కొట్లాడుతున్న మపై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన రమేష్ ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి మట్ట రమేష్ యాదవ్, నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ కార్యదర్శిలు గాండ్ల శ్రీనివాస్, భేతి భాస్కర్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, బీసీ జిల్లా నాయకులు డ్యాగం శివాజీ, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, ఉపాధ్యక్షుడు చొప్పరి భాస్కర్ ముదిరాజ్, యూత్ అధ్యక్షుడు బండారి ఉదయ్ కిరణ్, మండల నాయకులు బండారి ప్రకాష్ ముదిరాజ్, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య, మహిళా అధ్యక్షురాలు బండి విజయ, కార్యదర్శి చామంతుల రమేష్, చెన్నారావుపేట టౌన్ మహిళా అధ్యక్షురాలు ముంజ లక్ష్మి, మహిళా ప్రధాన కార్యదర్శి కారుపోతుల శ్రీదేవి, మహిళా నాయకురాలు వైనాల రజిత, గొర్రె వినయ్, శ్రీకాంత్, ల్యాగల ప్రవీణ్ కుమార్, సింగనబోయిన నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లాలో తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి:
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామంలో తాటిచెట్లు నరికినవారిపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మాదారం గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి కల్లు వృత్తిపై జీవనాధారం కొనసాగించే వందల కుటుంబాలు ఆ గ్రామంలో గీత కార్మికులు ఉన్నారన్నారు.మాదారం గ్రామంలో ఒక పెద్ద మనిషి పంట పొలాన్ని కొనుగోలుచేసి గత సంవత్సరం కొన్ని తాటిచెట్లను తీసివేయగా గీత కార్మికులు వెళ్లి నిరసన వ్యక్తంచేయగా ఆరోజు ఆపేశారన్నారు. ఈ నెల 8న మరలా వందల తాటిచెట్లను జె.సి.బిలతో కూల్చివేయడం మొదలుపెట్టారన్నారు.గీత కార్మికులకు విషయం తెలిసి అడ్డుకోగా చెట్లను కూల్చడానికి సిద్ధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.చెట్లను నరికి గీత కార్మికులు పొట్టకొట్టొద్దని వేడుకున్నా ఆపలేదని అవేదన వ్యక్తం చేశారు. జీవనాధారం మొత్తం కల్లువృత్తిపై ఆధారపడి ఉంటున్న గీత కార్మికులు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా ఆబకారిశాఖ అధికారులు స్పందించి గీత కార్మికులకు తగిన న్యాయం చేయాలని, లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్,జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్, గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్,కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, తాళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగానిసురేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్, జునూరి నరేష్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,రమేష్ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట శాసన సభ్యులు మాతృమూర్తి దొంతి కాంతమ్మ గత కొన్ని రోజుల క్రితం మరణించగా గురువారం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలసి విమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల కార్యదర్శి అయిత యాకుబ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు పాలక కవిత, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారధి, మాదన్నపేట రోడ్ సిపిఐ శాఖ కార్యదర్శి పిట్టల సతీష్, సహాయ కార్యదర్శి బాధరబోయిన యాదగిరి, గడ్డం నాగరాజు, మాతంగి సురేష్,కమ్మాల అరుణ, గౌరబోయిన పద్మ,కోలుగురి రాధిక తదితరులు పాల్గొన్నారు.
షేక్ జావిద్ ఆధ్వర్యంలో పరామర్శ..
తెలంగాణ జన సమితి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పంది మాధవరెడ్డి హనుమకొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. షేక్ జావిద్ తో విద్యావంతుల వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎండి మహబూబాబాద్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మీర్జా మసూద్ అలీ మహమ్మద్ నుమాన్ మహమ్మద్ యూసుఫ్ ఆఫీస్ ఇర్ఫాన్ సాబ్ మహమ్మద్ హర్షద్ శ్రవణ్ లు ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
స్వచ్చంధ సంస్థల ప్రతినిధుల పరామర్శ..
నర్సంపేట ఎంఎల్ఏ దొంతి మాధవరెడ్డిని తన నివాసంలో నర్సంపేట పట్టణ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరామర్శించారు. ఎమ్మెల్యే తల్లి దొంతి కాంతమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వచ్చంధ సంస్థల సమాఖ్య అధ్యక్షులు, కన్స్యూమర్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు గిరగాని సుదర్శన్ గౌడ్,ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ప్రతిభ సంస్థ ప్రతినిధి బోయిని వెంకటస్వామి, స్వేచ్ఛశ్రీ సంస్థ నిర్వాహకురాలు మైస వసంత, కన్స్యూమర్ ఫోరమ్ విజిలెన్స్ కమిటీ మెంబెర్ నాగేల్లి సారంగం గౌడ్,మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ ప్రతినిధి రవికాంత్, సోషల్ వాలంటీర్ కాసుల వెంకటాచారి, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
గత కొన్ని రోజుల క్రితం నర్సంపేట ఎమ్మెల్యే తల్లీ దొంతి కాంతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డిని హనుమకొండలోని తన నివాసంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,పెండెం రామానంద్ మర్యాదపూర్వంగా కలిసి పరమర్శించారు. కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, నెక్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బక్కి అశోక్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రవి, నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శులు మోటం రవికుమార్, చిప్ప నాగ, నాడేం నాగేశ్వర్లు, నాడేం ప్రదీప్ కన్నా, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావులేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా రెవిన్యూ డివిజన్లోని 6 మండలాల తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు?.ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి?. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు?. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా..? లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ.. వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షలో ఆర్డీఓ ఉమారాణి, తహశీల్దార్లు రవిచంద్ర రెడ్డి, రాజేశ్వరరావు, రాజ్ కుమార్, అబిడ్ అలీ, రమేష్, కృష్ణా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పోషణ మాసం సందర్భంగా నర్సంపేట -3 అంగన్వాడి కేంద్రంలో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు సిడిపిఓ మధురిమ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పౌరులు సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఈ చట్టం ద్వారా ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రతి తల్లి తన బిడ్డల ఆరోగ్య అవసరాలను తీర్చడంతోపాటు, సామాజిక చైతన్యం కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట సెక్టార్ సూపర్ వైజర్ రమ, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి,స్థానిక అంగన్వాడీ టీచర్ శిరీష,అనిల్ కుమార్, సారయ్య, రాజేష్, శివ, సరోజన, నవ్య, శివాణి, శ్రావణి, రవళి, సుష్మ, ఫర్జానా, రజిని, వనిత,అంగన్వాడీ టీచర్స్ రమ, పద్మ,వాణి, సరస్వతి ఆయా చంద్రకళ,గర్భిణీ, బాలింత స్త్రీలు, తల్లులు, కిషోరబాలికలు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ 10 వార్డులోని సాంబారి సత్యం బుధవారం మృతిచెందగా స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరిమర్శించి , ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం కుటుంబానికి ఆర్థికసహాయంగా రూ.5 వేలు రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎదరబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యం, డాక్టర్ హరిబాబు, మూస్కు రాజేందర్, పసునూరి రమేష్, నాగిశెట్టి ప్రవీణ్, పస్తం కృష్ణ, ఆరేపల్లి కిరణ్ , కంప సమ్మయ్య, మల్యాల శ్రీనివాస్, అడెపు రవిందర్,చిటిమల్ల బ్రహ్మచారి, గోరంట్ల మహేందర్, మేడి నరేష్, గ్యార శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.
గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.
ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి
లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్ కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన కంఠమహేశ్వర స్వామి మహోత్సవాలు నర్సంపేటలో నిర్వహిస్తున్నారు.గౌడ కుల ఆరాధ్య దైవం శ్రీ కంఠమహేశ్వర స్వామి సురామాంబ, రేణుక ఎల్లమ్మ వనం మైసమ్మ, దేవతల ఉత్సవాలు నర్సంపేట పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కంఠమహేశ్వరస్వామి రేణుక ఎల్లమ్మ లకు బోనాలతో నర్సంపేట పట్టణంలోని గౌడ కులస్తులందరూ , ఘటంకుండ పెద్దమనిషి, సారకోళ్ల పెద్దమనిషి, జయలక్ష్మి సెంటర్ నుండి పట్టణంలోని భవాని ఎలక్ట్రానిక్స్, ఫిష్ మార్కెట్ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహం నుండి రామకృష్ణ దుకాణం నుండి సర్పకాస్ జెండా గద్ద నుండి ద్వారక పేట బైపాస్ రోడ్డు కల్లుమండ్వా నుండి శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వరకు,పురవీధుల వెంట భాజా భజంత్రీలు నృత్యాలతో కదిలారు.పాకాల రోడ్డు కూడలిలో జెట్టి కళాకారులు చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జెట్టి కళాకారులు పట్టుపోసి వివిధ కళారూపాలను ప్రదర్శించారు ఎల్లమ్మ తల్లి వేషాధారణ పలువురిని ఆకట్టుకున్నది.ఎల్లమ్మ నృత్యధారణ డప్పు కళాకారుల నృత్యాలతో నర్సంపేట పట్టణం మారుమోగింది. శ్రీకంఠమహేశ్వర స్వామి దేవాలయం చేరుకొని శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురామాంబా, దేవతల కళ్యాణం పూజారులు నిర్వహించారు. అనంతరం రేణుక ఎల్లమ్మకు గావు పట్టడం కార్యక్రమాన్ని ఎల్లమ్మ తల్లి పూజారులు నిర్వహించారు. కన్నుల పండుగ బోనాల పర్వదినం ఘనంగా జరిగింది. ప్రతి ఇంటి నుంచి బోనాలు తరలివచ్చాయి. గౌడ కుటుంబాలు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం బోనాలను చేసి ఎల్లమ్మతల్లికి వందలాది బోనాలు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ధూప దీప నైవేద్యాలతో వారివారి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగలి వెంకటనారాయణ గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, కార్యదర్శి మాచర్ల అయిలు మల్లు, ఉడుగుల శ్రీనివాస్ గౌడ్, గౌడ్ మాజీ అధ్యక్షులు వరుసగా ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, డాక్టర్ పుల్లూరు శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షుడు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నేతలు సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్, గొడిశాల సదానందం గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట పట్టణంలో గల పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు రెండో రోజు ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతి ఒక్కరూ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి డప్పుచప్పుల్ల మధ్య ఇంటింటి నుంచి తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ ,జలాలతో అభిషేకాలు చేశారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని ఆ దేవున్ని ప్రార్థించారు. అంతకు ముందు పట్టణంలోని పలు వీధులలో పూజారులచే పలు విన్యాసాలు నిర్వహించారు.కొత్త వస్త్రాలను ధరించిన గౌడులు పట్టణంలోని వారి ప్రతి ఇంటి నుంచి బిందెలతో జలాలు మంగళహారతులతో తరలివచ్చి పూజలను నిర్వహించారు.పట్టణంలోని గౌడ సంఘం అధ్యక్షుడు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పూజ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు.ఆలయ కమిటీ భక్తుల సౌకర్యం కోసం పలు ఏర్పాట్లను చేసింది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళ పెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగల గాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య గౌడ్ ,మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్ గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళ పెళ్ళి చంద్రమౌళి గౌడ్, కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్, ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, పంజాల రాజు గౌడ్, గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్ గౌడ్, పుల్లూరి స్వామి గౌడ్ వల్లాల శ్రీహరి గౌడ్, వీరయ్య గౌడ్, వేముల రవి గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.