ఖమ్మం జిల్లాలో తాటిచెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలి
మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి:
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మాదారం గ్రామంలో తాటిచెట్లు నరికినవారిపై కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో సంఘం సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ
మాదారం గ్రామంలో గత 40 సంవత్సరాల నుండి కల్లు వృత్తిపై జీవనాధారం కొనసాగించే వందల కుటుంబాలు ఆ గ్రామంలో గీత కార్మికులు ఉన్నారన్నారు.మాదారం గ్రామంలో ఒక పెద్ద మనిషి పంట పొలాన్ని కొనుగోలుచేసి గత సంవత్సరం కొన్ని తాటిచెట్లను తీసివేయగా గీత కార్మికులు వెళ్లి నిరసన వ్యక్తంచేయగా ఆరోజు ఆపేశారన్నారు. ఈ నెల 8న మరలా వందల తాటిచెట్లను జె.సి.బిలతో కూల్చివేయడం
మొదలుపెట్టారన్నారు.గీత కార్మికులకు విషయం తెలిసి అడ్డుకోగా చెట్లను
కూల్చడానికి సిద్ధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.చెట్లను నరికి గీత కార్మికులు పొట్టకొట్టొద్దని వేడుకున్నా ఆపలేదని అవేదన వ్యక్తం చేశారు.
జీవనాధారం మొత్తం కల్లువృత్తిపై ఆధారపడి ఉంటున్న గీత కార్మికులు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా ఆబకారిశాఖ అధికారులు స్పందించి గీత కార్మికులకు తగిన న్యాయం చేయాలని, లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్,జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం వీరన్న గౌడ్,సలహాదారులు రామగోని సుధాకర్ గౌడ్, గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్,కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, తాళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగానిసురేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్, జునూరి నరేష్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,రమేష్ గౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.