తల్లీ? రాక్షసి? – 7 నెలల పాపను రూ.35 వేలకే అమ్మాలని ప్రయత్నం చేసిన మహిళ అరెస్టు!
అమెరికాలో ఒక తల్లి చేసిన పశువులాంటి చర్య ప్రపంచాన్ని షాక్‌కు గురిచేస్తోంది. ఇండియానా రాష్ట్రానికి చెందిన మహిళ తన 7 నెలల పసిపాపను లైంగిక దాడికి విక్రయించేందుకు ప్రయత్నించిన ఘటన తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.
32 ఏళ్ల మోర్గన్ స్టాప్ అనే మహిళ… ఒక గుర్తు తెలియని వ్యక్తికి తన పాపను లైంగికదాడికి అనుమతిస్తూ రూ.35,000 (అమెరికాలో కరెన్సీలో సుమారు 400 డాలర్లు)కి Snapchat ద్వారా ఒప్పందం చేయాలని ప్రయత్నించింది. ఆమె మేసేజ్‌లో: “ఇప్పుడే అరటి పోతు చెల్లించండి, మిగతా మొత్తం తర్వాత ఇవ్వండి” అనే డీల్ పెట్టినట్లు తెలిసింది.
Snapchat ద్వారా కుట్ర బహిర్గతం ఈ డీల్‌ను Snapchatలోని యాంటీ అబ్యూస్ సిస్టమ్ గుర్తించి వెంటనే అధికారులకు సమాచారం అందించింది. సమాచారం అందుకున్న FBI అధికారులు 10 రోజుల్లోనే ఆమె ఇంటిపై దాడి చేసి విచారణ చేపట్టారు.
తప్పించుకునే ప్రయత్నం విఫలం మోర్గన్ స్టాప్ విచారణ సమయంలో తనకు Snapchat ఖాతా లేదని బుకాయించినప్పటికీ, సాంకేతిక ఆధారాలు స్పష్టంగా చూపించడంతో ఆమెపై Attempted Child Sex Trafficking అనే Level 2 Felony కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఆమె జైలులో కదలలేని పరిస్థితిలో ఉంది. కేసు విచారణ కొనసాగుతోంది.
సమాజంలో అలజడి ఒక తల్లి తన సొంత బిడ్డను ఇలాంటి ఘాతుకానికి అమ్మేంత నిష్ఠురంగా మారడం పై మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ముగింపు: ఇలాంటి దారుణాలకు సమాజంలో స్థానం ఉండకూడదు. చట్టం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన పట్ల మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి నిజ జీవిత వార్తల కోసం మా చానెల్‌ను ఫాలో అవ్వండి.
ఉద్దేశపూర్వకంగా వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితున్ని అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని మహేంద్ర కాలనీకి చెందిన కొత్తగోళ్ల హర్షవర్ధన్ తండ్రి శివకుమార్ శాంతినగర్ కు చెందిన పాలింకర్ కమల్ కుమార్ పై పాత కక్షలు మనసులో పెట్టుకొని బుధవారం రాత్రి బీరు సీసా తో కమల్ మెడపై, నడుంపై పొడిచి పారిపోయాడన్నారు.
మండల కేంద్రంలోని తిరుమల వైన్ షాప్ లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాలుపడ్డారని షాప్ యజమాని ఫిర్యాదు చేయగా ఎస్ఐ వి గోవర్ధన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో నల్లబెల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా వారిని పట్టుకుని విచారించగా బొడిగే ప్రశాంత్ (21), ఎల్ల బోయిన సాయి కుమార్ (20) లను మండల కేంద్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించడం జరిగిందని అనంతరం సదరు వ్యక్తులను ఎక్కడికి వెళ్తున్నారని విచారించగా వరంగల్ కు వెళ్తున్నామని అనుమానంగా సమాధానం చెప్పడంతో. పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా సోమవారం అర్ధరాత్రి సమయంలో తిరుమల వైన్స్ షాప్ లో వెనుక భాగాన వెంటిలేటర్ ను పగలగొట్టి షాపులోకి దూరి క్యాష్ కౌంటర్ లో ఉన్న డబ్బులు దొంగలించి వరంగల్ కు వెళ్తున్నామని నిందితులు అంగీకరించగా. నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 19800 రూపాయలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించి నైనది అని ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఆయన వెంట సిబ్బంది సాయిలు, వేణు తదితరులు ఉన్నారు.
డ్రగ్స్ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్)ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో…
డ్రగ్స్ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్)ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో ‘సైకోట్రాఫిక్’ రకం డ్రగ్‌ను తీసుకున్నట్టు తేలింది. ‘తీంగిరై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో డ్రగ్స్ కావాలని నటుడు శ్రీరామ్ కోరగా, కెనడా దేశానికి చెందిన డ్రగ్ ఫెడ్లర్ జాన్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఇచ్చినట్లు ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి పోలీసుల వద్ద అంగీకరించాడు. దీంతో జాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి 11 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం ఉదయం నుంగంబాక్కంలోని శ్రీరాం నివాసానికి వెళ్ళి విచారించగా, డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించడంతో స్టేషన్‌కు తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ జరిపారు. ఆ తర్వాత కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళి రక్తం శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసులు శ్రీరాంను అరెస్టు చేశారు. డ్రగ్స్ కొనుగోలు కోసం శ్రీరామ్ రూ.72 వేల వరకు డ్రగ్ ఫెడ్లర్‌కు చెల్లించినట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు డిఎస్పి సైదా నాయక్ మరియు ఇన్స్పెక్టర్ శివ లింగం ఆదేశాల మేరకు నేషనల్ హైవే-65 మీద ప్రిన్స్ ధాబ ముందర వాహనాలు తనికి చేస్తుండగా ఒక బ్లూ కలర్ ఆక్టివా మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు బీదర్ వైపు నుండి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయి ని తరలిస్తుండగా పట్టుకున్నాము ఆ ఇద్దరు వ్యక్తులు పేర్లు తెలుసుకొనగా1) షైక్ సల్మాన్ తండ్రి జబ్బార్ హైదరాబాద్ 2) మహమ్మద్ మొయిజుద్దీన్ తండ్రి సమీఉద్దీన్ హైదరాబాద్ ని తెలిపినారు వీరు ఇద్దరు బీదర్ లో ఇరానీ గల్లీలో గంజాయిని తక్కువ రేట్ కి కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువరేట్ కు అమ్ముకొనుటకు తీసుకుని వెళ్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తరువాత మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరిస్తామన్నారు.
మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి అక్రమంగా ముందస్తు అరెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శివరాజ్ శ్రీకాంత్ రెడ్డిలను శుక్రవారం పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని అక్రమ నిర్బంధాలతో, అక్రమంగా హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీస్ సిబ్బంది ముందస్తు అరెస్టు చేసినారు.
ప్రపంచ సుందరి అందాల పోటీలను రద్దు చేయాలని అడిగినందుకు మహిళా సంఘాల నాయకుల హౌస్ అరెస్టులతో నిర్బంధించడం అప్రజాస్వామికమని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై గీత పేర్కొన్నారు.మహిళా నేతల హౌస్ అరెస్టుల పట్ల వై గీత ఖండించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల యొక్క అంగంగా ప్రదర్శన ప్రపంచస్థాయి పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రపంచ సుందరి అందాల పోటీలు ఉంటాయని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే ఈ పోటీలను ఇక్కడ నిర్వహించకూడదని కోరారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికంగా దివాల తీస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికే ఇబ్బందిగా ఉందని చెప్తూ ప్రపంచ సుందరి అందాల పోటీలకు 300 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం సరైనది కాదని ఆరోపించారు. ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు సంధ్యతోపాటు ఐద్వా నాయకురాలు మల్లు లక్ష్మి,ఇతర జిల్లాలలో నాయకులను ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టులు చేయడం అప్రాజస్వామిక చర్యగా భావిస్తున్నట్లు పేర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గీత ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.
గంజాయి సప్లై లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందితుడు అరెస్ట్
జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన,రవాణా చేసినవారి సమాచారం అందించండి.
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )
ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గంజాయి సప్లై చేసే నిందితుడను అరెస్టు చేసిన పోలీసులు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ మాట్లాడుతూ.గంజాయి అక్రమ రవాణా కేసులో MD. హమ్మద్ S/0 రఫిక్ age23,r/o సిరిసిల్ల అనే వ్యక్తిపై జిల్లాలోని సిరిసిల్ల,ఎల్లారెడ్డిపేట, తంగళ్ళపల్లి ,బోయినపల్లి,చందుర్తి పోలీస్ స్టేషన్ లలో 15 కేసులు నమోదు కాగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో 04 కేసులలో,చందుర్తి పోలీస్ స్టేషన్లో 01కేసులో పరారీలో ఉండగా సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్లకి వస్తున్నాడన్న సమాచారం మేరకు MD. హమ్మద్ పట్టణంలోని ఎల్లమ్మ చౌరస్తా వద్ద అరెస్ట్ చేసి విచారణ అనంతరం రిమాండ్ కి తరలించడం జరుగుతుందన్నారు.జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు.గంజాయి రహిత జిల్లాగా మార్చడాని జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని,గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం RS-NAB 8712656392 నంబర్ కి అందించలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుదని జిల్లా ఎస్పీ ఈసందర్భంగా తెలిపారు. ఎస్పీ వెంట సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ, క్రైమ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, కానిస్టేబుల్ ఇంతియాజ్ ఉన్నారు.
మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్
సీఐ లోడిగా రవీందర్,ఎస్సై సైదా రహూఫ్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
గుండాల ఎస్సై రహుఫ్ తమ సిబ్బందితో కలిసి సోమవారం పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు పాయం రాజేందర్ నడిమిగూడెం,ఆళ్లపల్లి మండలం కల్తీ పాపయ్య (అలియాస్ సర్పంచ్) ఘణపురం గ్రామం,గుండాల మండలం అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారు. కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చాడు.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయాడు వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల,ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.సోమవారం వీరిద్దరిని గుండాల పోలీస్లు అరెస్ట్ చేశారు.వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డిఎస్పి చంద్రభాను తెలిపారు.ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు.వీరిని పట్టుకోవటం లో కృషి చేసిన గుండాల సిఐ లోడిగ రవీందర్,ఎస్ఐ సైదా రహుఫ్, పిసి వెంకటేశ్వర్లు ను డిఎస్పి అభినందించారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆన్లైన్ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందుతుడు దాసరి మురళి వ్యక్తిని జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడం జరిగినది.
ఈ ప్రకటనలో జిల్లా ఎస్పీ మహేష్. బి. గితే మాట్లాడుతూ గత కొద్దికాలం నుండి మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి దేశవ్యాప్తంగా NCRP లో నమోదు అయిన 38 పిటిషన్లలో సుమారుగా 45,00,000/- లక్షల మోసాలు పాల్పడుతూ భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడి మురళి అనే వ్యక్తి ఆన్లైన్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకొని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజు వారిగా నాకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి.
అని నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ ల అకౌంట్ లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకొని వారి అకౌంట్ లోకి వచ్చిన నగదు ను ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడటం జరుగుతుంది అని తెలిపారు .
అందులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను మరియు సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి అనే నిందుతుడు వారిని మోసం చేయగా అట్టి యజమానులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వేములవాడ పట్టణ పోలీస్ వారు కేసు నమోదు చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నాలుగురు వ్యక్తులువిలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని,పరారీలో ఉన్న దాసరి మురళి అనే వ్యక్తి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రమేష్ సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్,కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరూట్ల వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
ఈ సమావేశంలో వేములవాడ టౌన్ ఎస్.ఐ రమేష్, సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్,షమీ పాల్గొన్నారు.
అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్..
వ్యవసాయ మోటార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు
39 వ్యవసాయ మోటార్స్ మరియు 750 మీటర్స్ సర్వీస్ వైర్ స్వాధీనం.
వీటి విలువ మొత్తం కలిపి 10,67,500/- రూపాయలు
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
వ్యవసాయ మోటార్ల దొంగలను పోత్కపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈరోజు పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో పెద్దపల్లి డిసిపి కరుణాకర్ నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డిసిపి కరుణాకర్ మాట్లాడుతూ ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ఇద్దరు నిందితులు గత రెండు నెలలుగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో లో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, మోటార్ సర్వీస్ లను నిందితులు దొంగలించారు. ఈ దొంగతనాలకు సంబంధించి సర్కిల్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసుల దర్యాప్తు చేస్తున్న పోత్కపల్లి పోలీసులు ఈ రోజు పోత్కపల్లి మండల పరిధిలో శానగొండ గ్రామ శివారు జమ్మికుంట వెళ్లే రహదారిలో పోత్కపల్లి ఎస్సై ఉదయం10:00 గంటల ప్రాంతం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ట్రాలీ లో ఇద్దరు వ్యక్తులు సిరిగిరి ప్రసాద్ మరియు అంగిడి సాయికుమార్ అనే వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిద్దరినీ పోలీసులు అదుపులకి తీసుకోని ట్రాలీ ని ఆపి తనిఖీ చేయగా అనుమనస్పదంగా వ్యవసాయ మోటర్స్, కరెంట్ సర్వీస్ వైర్ కనిపించగా దీని మీద పోలీసులు ఆరా తీయగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వీరి దగ్గర నుంచి 39 మోటార్స్,750 మీటర్స్ సర్వీస్ వైర్, ట్రాలీ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే….
Police
సిరిగిరి ప్రసాద్, తారకరామ కాలనీ, ఓదెల, పాత ఇనుపసామను వ్యాపారం చేస్తూ జీవిస్తాడు. సరియైన గిరాకీ లేక ఇబ్బందులు పడుతూ, అతిగా మద్యానికి, జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దుద్దేశ్యం తో ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక లో డబ్బులు పెట్టి పేకాట ఆడి డబ్బులు పోగొట్టుకొన్నాడు. ఎలాగైనా డబ్బులు సంపదిన్చాలనే చెడు ఉద్దేశ్యంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, గత 2 నెలల నుంచి ఓదెల గ్రామస్థుడు ఐన అంగిడి సాయికుమార్ s/o సమ్మయ్య తో పరిచయం ఏర్పడి, ఇద్దరం కలిసి మధ్యం సేవిస్తూ రాత్రి సమయలలలో ఇద్దరం కలిసి చిన్న చిన్న పాత ఇనుప సామాను దొంగాలించి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకొనేవారు. వీరి జల్సాలకు డబ్బులు సరిపోక, చుట్టుపక్కల రైతుల కరెంటు మోటర్లు దొంగతనం చేసి అమ్ముకొని నిర్ణయించుకొన్నాని పోత్కపల్లి, కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ల పరిధిలో 39 వ్యవసాయ కరెంట్ మోటార్ లు, 750 మీటర్స్ కరెంట్ సర్వీస్ వైర్ ( కాచాపూర్ శివార్ లోని 6 మోటార్లు, కొనరాపేట్ శివారు లోని 1 మోటార్, మల్యాల శివారు లోని 100 మీటర్ల వైరు, మడిపల్లి కెనాల్ దగ్గర 01 మోటార్, శివపల్లి శివారు లోని బావి వద్ద 1 మోటార్, కొమిరె SRSP కెనాల్ దగ్గర్ 6 మోటార్ లు, కొలనూర్ శివారులోని 5 మోటర్లు మరియు పోత్కాపల్లి, శానగొండ శివారులోని 4 మోటర్లు, 17 బావుల వైర్లు 170 మీటర్లు, రూప్ నారాయణ పేట మానేరు లోని 23 బోరు మోటార్ ల వైర్లు 270 మీటర్లు, ఓదెల శివారులోని 6 మోటార్లు మరియు రూపనారాయణపేట శివారులోని 200 మీటర్ల వైరు ) ఆటో ట్రాలీలో తిరుగుతూ మోటార్లను ఎత్తుకెళ్ళడం వీరి అలవాటు. బోర్ ల మోటార్ లు, సర్వీస్ వైర్ లు దొంగలించి రైతులకు తీవ్ర నష్టం చేసి రైతులను భయాందోళనలకు గురి చేసారు. ఈ దొంగలను పట్టుకోవడం లో ప్రతిభ కనబరిచిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తో పాటు 13 మంది సిబ్బందిని అభినందించి డీసీపీ రివార్డులు అందజేశారు.ఈ కార్యక్రమం లో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పేకాట స్థావరంపై దాడులు ఐదుగురి అరెస్ట్, రూ. 25వేలు స్వాధీనం
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం గుంత మర్పల్లి గ్రామంలో పేకాడుతున్న వారిని అరెస్టు చేసినట్లు ఎస్సె నరేష్ తెలిపారు. నమ్మద గిన సమాచారంతో ఆదివారం సాయంత్రం గుంత మర్పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 25,090ల నగదుతో పాటు పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
రైతు బంధు పథకం రైతుల సహాయార్థం కోసం గత ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైన పథకం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం తాము పంట వేసిన సంబంధిత మండల వ్యవసాయాదికారులు సర్వే సరిగా చేయక పోవడం మూలంగా మాకు రైతు బందు పథకం కింద పెట్టుబడి సహాయం అందలేదని ఎల్లారెడ్డిపేట లో ఒక మహిళ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకెళ్తే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన లింగాల బాలమణి అనే మహిళా రైతు కు ఎల్లారెడ్డిపేట లో ఒక ఎకరం 30 గుంటల వ్యవసాయ భూమి కలదు. ఆ వ్యవసాయ భూమి లో వరి పంట వేశారు.వరి పంట వేసిన కానీ రైతు బందు సహాయం పడలేదని మండల వ్యవసాయాధీకారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆరోపించారు. పంట వేయని రైతులకు కొంతమంది కి రైతు బందు సహాయం అందిస్తున్నారని తమకు రైతు బందు సహాయం కింద పెట్టుబడి సహాయం అందకుండా చేసిన మండల వ్యవసాయాదికారుల పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశానూసారం గుడుంబా నిర్మూలన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శనివారంరోజున పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ,మనుగొండ,ఎలుకుర్తి ల లో దాడులు నిర్వహించి గీసుకొండ కు చెందిన పోలేపాక సబిత,కోట స్రవంతి,ఎలుకుర్తి కి చెందిన బొడిగే దేవేంద్ర,బొల్లు సాంబ లక్ష్మి,మనుగొండ కు చెందిన ఎంబడి మల్లమ్మ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి (25) లీటర్ల గుడుంబా ను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడులలో ఎస్ఐ జ్యోతి,సిబ్బంది లక్ష్మణ చారి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
జహీరాబాద్ లో మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో పత్రిక ప్రకటన లో డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సత్యారం రమేశ్ అనే వ్యక్తి చిలమామిడి గ్రామానికి చెందిన మ్యాతరి లక్ష్మితో సహజీవనంచేస్తున్నాడు. అయితే, అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో లక్ష్మి అతనికి దూరమైంది. కోపోద్రిక్తుడైన రమేశ్, తొలుత ఆమెపై పెట్రోల్ పోసి దాడి చేయడానికి ప్రయత్నించగా, స్థానికుల కారణంగా అది విఫలమైంది. తర్వాత, ఆమె ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకొని, ఖాళీ గ్యాస్ సిలిండర్తో తలపై కొట్టి ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతురాలి సెల్ఫోన్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. జహీరాబాద్ బస్టాండ్ వద్ద హైదరాబాద్కు పారిపోడానికి ప్రయత్నిస్తుండగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడిని త్వరగా పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, సమర్థవంతంగా చర్యలు తీసుకుని అతడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచామని తెలిపారు. ఈ ఆపరేషన్ పాల్గొన్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శివలింగం, ఎస్పై కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ముట్టడికి బయలు దేరుతున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్
జహీరాబాద్. నేటి ధాత్రి:
తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర సర్పంచుల జెఏసి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారము ఉదయం జహీరాబాద్ నుండి హైదరాబాద్ తరలి వెళ్తున్న జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, తాజా మాజీ సర్పంచులు చిన్న రెడ్డి (శేఖపూర్) విజయ్ ( రాయిపల్లి డి) లను జహీరాబాద్ రూరల్ పోలీసులు ఇంటి వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు తమ పదవి కాలం ముగిసి పదమూడు నెలలు గడిచిపోయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఈ రోజు రాష్ట్ర సర్పంచుల జెఎసి అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో జాహీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉదయమే హైదరాబాద్ కు తరలి వెళ్ళడానికి సిద్ధం కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తట్టు నారాయణ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమానికి సిద్ధమైనట్టు తెలిపారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పంచాయతీలో నిధులు అందుబాటులో లేకపోయినప్పటికీ సర్పంచులు అప్పు చేసి మరి అభివృద్ధి పనులు చేశారని ఆ బిల్లులు చెల్లించకపోవడం విచారకరమని ఆవేద వ్యక్తం చేశారు బిల్లులను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు గ్రామ ప్రథమ పౌరులుగా ఉండి ప్రజలకు సేవలందించిన మాజీ సర్పంచ్ లు తమ బిల్లుల కోసం అడిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అరెస్టు చేయడం తగదని వారు ఖండించారు తదనంతరం పోలీసులు సొంత పూచీకత్తు పై విడుదల చేసారు .
రూ. 35 లక్షల విలువ గల 34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
*ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు..
*రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం..
తిరుపతి నేటి ధాత్రి :
కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో మేరకు ఆర్ ఐ చిరంజీవులు కు చెందిన ఆర్ ఎస్ ఐ పి.నరేష్ టీమ్ గురువారం నుంచి బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నించి మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీటి విలువ రూ. 35లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసును ఎస్ ఐ రఫీ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నల్లబెల్లి, మండలాల్లోని పలు గ్రామాల్లో సోలార్ లైట్లు సంబంధించిన బ్యాటరీలను దొంగలిస్తున్న ముఠా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై వి గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నల్లబెల్లి క్రాస్ జాతీయ రహదారి 365 పై ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టగా మల్లంపల్లి వైపుగా వెళ్తున్న ఒక బజాజ్ ఆటోలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి ఆటోను పరిశీలించగా సదరు వ్యక్తులు ఆటో వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఆటోని పరిశీలించగా అందులో 10 సోలార్ బ్యాటరీలు లభ్యం అయ్యాయి. పట్టుబడిన నిందితులను వారితో ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు పట్టుబడిన వారిలో పర్వతగిరి మండలానికి చెందిన భూక్య నవీన్, అల్లాడి దుర్గ స్వామి, సంగెం మండలం తీగరాజు పల్లి కి చెందిన గూడూరు అరవింద్, కర్నే అఖిలాష్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుండి 10 బ్యాటరీలు సహా ఒక ఆటో స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు .
పేకాట రాయుళ్ల స్థావరంపై రామకృష్ణాపూర్ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 11 మంది నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో గల ముత్యాల ప్రదీప్ ఇంట్లో రహస్యంగా అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిందితుల నుండి 38.290 రూపాయల నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముత్యాల ప్రదీప్, మిర్యాల శ్రీనివాస్, దయాకర్, మోతే శ్రీనివాస్, ఎస్.కె చాంద్ పాషా, వెంకటేష్, గూడ సత్తయ్య, పులి శ్రీనివాస్, బండి కిషోర్, సత్యం, రామ్ మహేందర్ లను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.
ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య
భార్యే ప్రధాన నిందితురాలు, ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను లేపేసేందుకు పన్నాగం పన్నిన భార్య. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సహకారం
కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం
ఫిబ్రవరి 20న వరంగల్ భట్టుపల్లి రోడ్డులో వెళ్తున్న కారును అడ్డగించి, సుమంత్ పై ఐరన్ రాడ్లతో దాడి చేసిన దుండగులు
నేటిధాత్రి వరంగల్.
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన ప్రియుడి స్నేహితుడు రాజ్ కుమార్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్. భట్టుపల్లి రోడ్డులో డాక్టర్ పై దాడి సంచలనం కలిగించిన కేసులో, వారం రోజుల్లోనే చేదించిన మిల్స్ కాలనీ పోలీసులు. వరంగల్ లో యువ వైద్యుడు డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితులను అరెస్టు చేశారు వరంగల్ మిల్స్ కాలని పోలీసులు. డాక్టర్ పై దాడి ఘటనలో సెన్సేషనల్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో అక్రమ సంబంధమే డాక్టర్ ప్రాణాలను తీయాలని వేసిన పన్నాగం బయటపడింది. కట్టుకున్న భార్యే సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా తన ప్రియుడు సామ్యూల్ తో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ వేయగా, దీనికి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ ముగ్గురు నిందితులను ఆరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు మిల్స్ కాలని పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ భార్య పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు.
అసలేం జరిగింది?
crime
ఫిబ్రవరి 20న వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై దాక్టర్ సుమంత్ పై దాడి జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు గుర్తు తెలియని వ్యక్తులు కారుకు అడ్డు వచ్చి.. కారును ఆపారు. ఆయనను కారులో నుంచి కిందకు లాగి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చంపడానికి ప్రయత్నించినారని బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మిల్స్ కాలని పోలీసులు. దాడికి పాల్పడిన వారు ఎవరు.? వైద్యుడు సిద్దార్థ్ ను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్ష్యలు ఏమైనా ఉన్నాయా? లేక గంజాయి బ్యాచ్ ఏమైనా డాక్టర్ పై దాడికి పాల్పడిందా అన్న కోణంలో లోతుగా దర్యాప్తు చేశారు. అయితే.. ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన ఖిలాడి భార్య
హంటర్ రోడ్డులో నివాసం ఉంటున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కి, వరంగల్ షిరిడీ సాయి నగర్ కి చెందిన ఫ్లోరా మరియా అను ఆమెతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత 2018 సంవత్సరంలో సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్ రెడ్డి బందువుల విద్యాసంస్థలు ఉండగా, వాటిని చూసుకోవడం కోసం భార్య భర్త లు సంగారెడ్డి కి షిఫ్ట్ అయితారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి పి.ఎచ్.సి లో, కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా మరియా వారి బంధువుల స్కూల్లో టీచర్ గా పనిచేస్తుండేది.
కొంపముంచిన జిమ్ ట్రైనింగ్.., జిమ్ లో సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూల్ ల ప్రేమాయణం
ఫ్లోరా బరువు తగ్గడానికి సంగారెడ్డి లోని సిద్దు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. ఆ జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ అనే అతనితో పరిచయం ఏర్పడుతుంది. జిమ్ ట్రైనింగ్ పేరిట అయినా పరిచయం కాస్త వారిద్దరి మధ్య అక్రమ సంబంధంనకు దారితీసింది. వీరి అక్రమ సంబంధం గురించి డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలవగానే, భార్యా భర్తలకు గొడవలు జరిగాయి. ఈ గొడవల వలన డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడి నుండి తన ఫ్యామిలీని వరంగల్ కి షిఫ్ట్ చేసినారు. తరువాత 2019 సంవత్సరంలో సదరు ఫ్లోరా మరియా, ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం పొంది, జనగాం జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ వుండేవారు. తర్వాత ఆ కాలేజ్ వరంగల్ లోని రంగశాయిపేట్ కు మారడంతో, డాక్టర్ సుమంత్ రెడ్డి కూడా వరంగల్ లోని వాసవి కాలనీలో ఉంటూ, కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ, ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు. సదరు ఫ్లోరా మరియా మాత్రం సంగారెడ్డిలో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్ తో తరచుగా ఫోన్లు మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం, డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్ నీ ఇంటికి పిలిపించుకొని అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవారు. ఈ విషయంలో వారిద్దరికీ తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దానితో సదరు ఫ్లోరా మరియా, ప్రియుడు శామ్యూల్ లు కలిసి, డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. తరువాత శామ్యూల్ ఈ విషయాన్ని తన స్నేహితుడైన రాజ్ కుమార్ అనే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కి తమ మర్డర్ ప్లాన్ విషయం చెప్పి, డాక్టర్ సుమంత్ రెడ్డి హత్య కి సహకరిస్తే నీకు సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్తాడు. దానికి సదరు ఆ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు. తరువాత అందాదా 15 రోజుల క్రితం ఒక్క లక్ష రూపాయలు ఫ్లోరా మరియా, తన ప్రియుడు శామ్యూల్ కి ట్రాన్స్ఫర్ చెయ్యగా, అందులో నుండి ఖర్చులకు 50వేల రూపాయలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేల రూపాయలు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ కి ఇస్తాడు.
crime
భట్టుపల్లి రోడ్డులో మర్డర్ ప్లాన్
నిందితులు వారి మర్డర్ ప్లాన్ లో భాగంగా తేదీ20.02.2025 రోజున మధ్యాహ్నం సంగారెడ్డిలో ఒక సుత్తిని కొనుగోలు చేసి, హెడ్ కానిస్టేబుల్ రాజకుమార్ యొక్క రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై బయలుదేరి, కాజీపేటకు వచ్చి ముందుగా వారు అనుకున్న ప్రకారం, డాక్టర్ సుమంత్ రెడ్డిని సీసీ కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొని, రెక్కీ చేసుకుని వాళ్లు అనుకున్న పథకం ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డి రాత్రి వేళ, తన క్లినిక్ ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట కు, వెళ్తున్న క్రమంలో తన వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో ఎస్ఆర్ స్కూల్ దాటిన తరువాత ఉన్న, చిన్న బ్రిడ్జి వద్ద డాక్టర్ తన కారు వేగాన్ని తగ్గించగా, అట్టి చీకటి ప్రదేశంలో అదే అదునుగా భావించిన శామ్యూల్ తనతో తెచుకున్న సుత్తితో కారు వెనుక ఇండికేటర్ ను కొడుతాడు. ఆ శబ్దానికి డాక్టర్ సుమంత్ రెడ్డి తన కారును పక్కకు ఆపి ఇండికేటర్ వద్దకు వచ్చి చూస్తుండగా, శామ్యూల్ అతని స్నేహితడు రాజ్ కుమార్ లు, సదరు డాక్టర్ సుమంత్ రెడ్డిని విచక్షణారహితంగా కొట్టి, గాయపర్చి, అతడు చనిపోయాడు అని భావించి అక్కడి నుండి వారు పారిపోతారు.
వారం రోజుల్లో కేసును ఛేదించిన వరంగల్ పోలీసులు
బాధితుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఈ కేసును వరంగల్ ఏసిపి నంది రామ్ ఆధ్వర్యంలో, మిల్స్ కాలనీ సిఐ వెంకటరత్నం, టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్, మిల్స్ కాలనీ ఎస్సై సురేష్, కానిస్టేబుల్ లు బావ్ సింగ్, చంద్రశేఖర్, వెంకన్న, రాజు, జెలెందర్, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎండి గౌస్, సల్మాన్ ఐటీ కోర్ టీం కానిస్టేబుల్ నగేష్ లు నిందితుల కోసం ప్రత్యక బృందాలుగా ఏర్పడి, సంచలనం సృష్టించిన కేసులోని నిందితులైన సంగారెడ్డి కి చెందిన ఏర్రోల్ల శామ్యూల్ (ఏ1), డాక్టర్ భార్య గాదె ఫ్లోరా మరియా (ఏ2), వీరికి సహకరించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (ఏ3) లను పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనభరిచిన పోలీస్ అధికారులను వరంగల్ ఏసిపి నందిరామ్ నాయక్ అభినందించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.