పత్తి కొనుగోళ్లపై సీసీఐ షరతులు ఉపసంహరించుకోవాలి…

పత్తి కొనుగోళ్లపై సీసీఐ షరతులు ఉపసంహరించుకోవాలి
రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ డిమాండ్
నవంబర్ 26 కలెక్టర్ కార్యాలయం ముందు జరగనున్న ధర్నాను జయప్రదం చేయండి
— ఎం. చుక్కయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి

నేటిధాత్రి అయినవోలు:

 

జిల్లా రైతులు పండించిన పత్తి పంట కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన పరిమితులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. చుక్కయ్య డిమాండ్ చేశారు.
అయినవోలు మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ఆయన, ఒక ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ నిర్ణయం రైతులను తీవ్రంగా నష్టపరిచేలా ఉందని విమర్శించారు.రైతులు మిగతా పత్తిని మధ్యదళారీలకు పావుదరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది మధ్యదళారీలకు లాభం చేకూర్చే విధంగా, రైతులను నష్టపరచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
“ప్రభుత్వం రైతుల పక్షమా? వ్యాపారుల పక్షమా?” అంటూ ప్రశ్నించిన చుక్కయ్య, సీసీఐ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన భూభారతి, పంట రుణాల మాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
నవంబర్ 26న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.సమావేశంలో మండల అధ్యక్ష కార్యదర్శులు మడిగ నాగరాజు, కొంకాల నారాయణరెడ్డి, కొంకటి శంకర్ రెడ్డి, గుండెకారు రాజేశ్వరరావు, వరికల గోపాలరావు, ఏసీ రెడ్డి, రాజిరెడ్డి, మహేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతులు పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకో వాలి

ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని మోసపోవద్దు

సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన, గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని గండ్ర సత్యనారా యణరావు సూచించారు. పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పత్తి కొనుగో లు కేంద్రాన్ని ఎమ్మెల్యే లిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వేరు వేరుగా మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు.

8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నా రని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాల న్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయా లనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొను గోలు చేసేలా రైతులకు సహక రించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపో యిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుం దని, అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివే దిక అందించేలా సహకరిం చాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించా రు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి….

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి

సిపిఐఎం మండల కార్యదర్శి గుండ గాని మధుసూదన్

మరిపెడ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో స్థానిక ప్రజా సంఘాల భవనంలో కామ్రేడ్ బోడపట్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మధు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని, పత్తికి కనీస మద్దతు ధర 10075 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరుకాలం కష్టపడి పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు, ప్రభుత్వాలు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం అది మాటల్లోనే ఉందని, ప్రతి సంవత్సరానికి పెట్టు పడే రెండింతలు అవుతుందని దానికి తగిన ప్రతిఫలం లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు, పత్తి దిగుమతి పై ఉన్న 11% సుంకాన్ని కొనసాగించాలి, సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి, పత్తి కొనుగోలు కేంద్రాల బాధ్యతనుండి తట్టుకోవాలనుకుంటున్న ప్రభుత్వ విధానాన్ని ఉపసంహరించుకోవాలి, అనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ విధమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే,పక్షంలో రైతుల్ని అందర్నీ కలుపుకొని ఉద్యమం చేపట్టి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఆర్గనైజర్ బాణాల రాజన్న, దొంతు మమత, కందాల రమేష్, కొండ ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version