ప్రజలకు ఇచ్చే బాకీల పట్ల నిలదీయాలి…

ప్రజలకు ఇచ్చే బాకీల పట్ల నిలదీయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల పట్ల ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన బాకీల కోసం నిలదీయాలని బిఆర్ఎస్ పార్టీ మండల ఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ అన్నారు.
నర్సంపేట మండంలోని చిన్న గురిజాల గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ పార్టి సమావేశం గ్రామ అధ్యక్షుడు నాగిషెట్టి కొమురయ్య అద్యక్షతన జరిగింది. నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.మండల ఎన్నికల కన్వీనర్ కొమల్ల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ ప్రజలకు బాకి పడ్డ హామీలను బాకి కార్డుల ద్వారా ప్రచారం చేసి బిఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించడం కోసం ప్రతీ కార్యకర్త కృషీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కమిటీ సభ్యులు కడారీ రవి,మోటూరి రవి,బండారి రమేష్,భూక్యా వీరన్న,గురిజాల గ్రామ పార్టి అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్షింగం,మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య,మాజీ సర్పంచ్ గడ్డం రాజు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,పుప్పాల బిమయ్య,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిక హరీష్,పోతు శంకర్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,బొల్లం భక్కయ్య,మాజీ ఉప సర్పంచ్ కంకణాల రాజు,మండల యూత్ సహాయ కార్యదర్శి పుట్ట అఖిల్,సొసైటి డైరెక్టర్ ఎడ్ల రవీందర్,గ్రామ పార్టి కన్వీనర్ చిప్ప ప్రశాంత్, కొమ్ము రవి,మినుముల దేవేందర్,దూడల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

మొదలైన కంఠమహేశ్వర స్వామి ఉత్సవ వేడుకలు…

మొదలైన కంఠమహేశ్వర స్వామి ఉత్సవ వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ గౌడ గీతా పారిశ్రామిక సహకారం సంఘం ఆధ్వర్యంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వర స్వామి,రేణుక ఎల్లమ్మతల్లి బోనాల ఉత్సవాలు ఈ నెల 7 వరకు జరుగనుండగా పట్టణ గౌడ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన శనివారం వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.ముందుగా పట్టణ గౌడ కులస్తులు ఆ దేవాలయంలో దొర్నపాక అలంకరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో మొదలుపెట్టి
కంఠమహేశ్వర స్వామి -సూరమాంబదేవి, రేణుక ఎల్లమ్మతల్లి – జమదగ్ని మహారాజ్ ,వనమైసమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం పట్టణంలోని గ్రామ దేవతల వద్ద పూజలు నిర్వహించారు.
అలాగే దేవాలయంలో నిర్వహించిన సూరమాంభదేవి నాటకంలో గౌడ కులస్తులు మహిళలు ఆయా కుటుంబాలు మంగళ నీరాజనాలతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గాదగొని సాంబయ్య గౌడ్, ఆర్ధిక కార్యదర్శులు నాతి సధానందం గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ తాళ్ళపెళ్లి శ్రీనివాస్ గౌడ్, మొగలగాని సురేష్ గౌడ్, వేముల కృష్ట గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేళ్లి ప్రమోద్ గౌడ్, చుక్క రవి గౌడ్, బొట్టు పెద్దమనిషి కొయ్యడి కొమురయ్య గౌడ్, సారుకోల పెద్దమనిషి గిరగాని చంద్రమౌళి గౌడ్,మున్సిపల్ మాజీ చైర్మన్ నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మాజీ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, పుల్లూరి స్వామి కపిల్ గౌడ్,సోల్తి సారయ్య గౌడ్,గౌడ వెల్పేర్ అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, వరుస మాజీ అధ్యక్షులు ఐలు సమ్మయ్య గౌడ్, చుక్క కనుకయ్య గౌడ్, పుల్లూరి చిన్న రవి గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్, గౌడ వెల్పేర్ సభ్యులు బూర వేణు గౌడ్, గండి రాము గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్,డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్,కొయ్యడి సంపత్ గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గిరగాని శ్రీనివాస్ గౌడ్,పంజాల రాజు గౌడ్, సీనియర్ రిపోర్టర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,బుర్ర వేణు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

కంఠమహేశ్వరస్వామి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో వచ్చే అక్టోబర్ 4, 5, 6,7 తేదీలలో నిర్వహించనున్న శ్రీ కంఠమహేశ్వర స్వామి, సురమాంబ దేవి,శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని మహారాజ్ బోనాల పండుగ,కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు గాని గౌడ సంఘం కమిటీ బాధ్యులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,సంఘం పెద్దలు సారయ్య గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్ ,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్, తాళ్లపల్లి శ్రీను గౌడ్, గాధగోని సాంబయ్య గౌడ్, బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్,గండు లింగయ్య గౌడ్ ,గౌడ పెద్దలు పాల్గొన్నారు.

ఘనంగా చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి కార్యక్రమం…

ఘనంగా చిట్యాల ఐలమ్మ 130 వ జయంతి కార్యక్రమం.

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రంలో చిట్యాల ఐలమ్మ 130వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి కేక్ కట్ చేసుకుని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది, ఇట్టి కార్యక్రమం చందుర్తి మండల రజక సంఘం అధ్యక్షులు సుద్దాల నరసయ్య, వనపర్తి సతీష్ (ప్రధాన కార్యదర్శి), కొడగంటి గంగాధర్ (కోశాధికారి) ఆధ్వర్యంలో చందుర్తి రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి మల్లయ్య మరియు చందుర్తి రజక సంఘం సభ్యులు, మండలంలోని వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రజక సంఘం సభ్యులు అలాగే చందుర్తి మండల నాయకులు పాక్స చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు పులి సత్యం, గొట్టె ప్రభాకర్, బైరబోని రమేష్, బత్తుల కమలాకర్, చిలుక పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తొలి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలని. పెత్తందారులతో, రజాకార్లతో, దొరలతో, భూస్వాములతో కొట్లాడి ఎన్నోవేల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ధీర వనిత అని కొనియాడారు. ఇప్పటి యువత ఆమె స్ఫూర్తితో ఆమె ఆశయాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం…

చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఘన నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగంలో నిలిచిన ధైర్యవంతురాలు చాకలి ఐలమ్మ అని ఆమె జీవితం నేటితరానికి స్ఫూర్తిదాయకం నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మగారి పోరాటం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకమని, ఆమె సామాన్య వర్గానికి చెందినప్పటికీ సామాజిక అసమానతలకు, భూ దోపిడీకి, జమీందారీ శాసనానికి వ్యతిరేకంగా పోరాడారు అని, ఆమె ధైర్యం పట్టుదల అందరికీ ఆదర్శం కావాలని తెలిపారు

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్…

ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సులో ప్రయాణించి..బహుమతులు పొందండి

నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. బహుమతి గెలుపొందండి అంటూ ప్రచారం మొదలుపెట్టారు. కాగా నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఇందుకుగాను ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల కోసం ప్రత్యేక బంపర్ లక్కీడ్రా స్కీం నిర్వహిస్తోందని చెప్పారు.ఈనెల 27 నుంచి అక్టోబర్ 6 వరకు ఆర్టీసీ సెమీడీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, అన్ని ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణి కులు తమ టికెట్ పైన పేరు,ఫోన్ నెంబర్, చిరునామా రాసి నర్సంపేట బస్టాండ్ లో ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాలన్నారు.అక్టోబర్ 8వ తేదిన ప్రాంతీయ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ముగ్గురు విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతి రూ.25వేలు, రెండో బహుమతి రూ. 15వేలు, మూడో బహుమతి రూ.10 వేలు నగదు రూపంలో అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణి కులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ సూచించారు.

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం…

కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదాం

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/aDumjuwXe-4?si=rooj0J56msbeCnMA

 

సత్య శోధక్ సమాజ్ 152 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నర్సంపేట సబ్ డివిజన్ కార్యదర్శి మొగలి ప్రతాపరెడ్డి ప్రజా సంఘాలకు పిలుపునిచ్చాయి.ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సాంఘిక సంస్కరణ,అణగారిన వర్గాలకు, శూద్రులకు అలాగే మహిళలకు విద్య సాంఘిక హక్కులు కల్పించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్. స్థాపించారని తెలిపారు.కాగా 24 నుండి 30 వరకు వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆబర్ల రాజన్న, షేర్ మధు, పెద్దపోయిన అశోక్ రవి తదితరులు పాల్గొన్నారు.

మానసిక క్షోభతో పంచాయతీ కార్యదర్శులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T145225.445.wav?_=1

మానసిక క్షోభతో పంచాయతీ కార్యదర్శులు.

కలతప్పిన గ్రామాలు.. నిధుల్లేక లోపించిన పారిశుధ్యం.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కలతప్పుతున్న బతుకమ్మ వేడుకలు..

గత కేసీఆర్ ప్రభుత్వంలో బతుకమ్మకు ప్రత్యేక శ్రద్ధ

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి గ్రామ పంచాయితీల కార్యదర్శులు,అధికారులు మానసిక క్షోభకు గురైతున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు,రాష్ట్ర మాజీ సివిల్ సప్లైస్ చైర్మన్,నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.అసమర్థత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడం వలన నిధులు లేని గ్రామాలు కలతప్పాయన్నారు.పారిశుధ్యం లోపించిన పల్లెలు అధోగతి పాలవుతునాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.సద్దుల బతుకమ్మ,సదరా పండుగల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో వేడుకల నిర్వహణ సజావుగా జరిగేందుకు తమ వంతు సహాయంగా సహకరించాలని బిఆర్ఎస్ శ్రేణులకు,మాజీ ప్రజా ప్రతినిధులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు సరిపడ నిధులు గ్రామపంచాయతీలకు కేటాయించలేదని ఆరోపించారు.గ్రామాలలో బతుకమ్మ దసరా ఉత్సవాల ఏర్పాట్లకు నిధులు లేక పంచాయతీ కార్యదర్శులు,అధికారులు మానసిక క్షోభకు గురైతున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో పంచాయితీ అధికారులు గ్రామాల్లోని ప్రజలతో చందాలు తీసుకొని పండగా ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలన వలన గ్రామపంచాయతీల అధికారులు అప్పులు తెచ్చి గ్రామాలలో పారిశుధ్య పనులు చేస్తున్నారని మరికొన్ని గ్రామాల్లో డీజిల్ కు డబ్బులు లేక పారిశుధ్య ట్రాక్టర్లను నడపడంలేదు.బ్లీచింగ్ పౌడర్,ఫాగింగ్ వీధిలైట్ల మరమ్మత్తులు పట్ల పట్టించుకునే వారేలేరని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.గ్రామ పంచాయితీలలో నిధులు లేక పారిశుధ్యం లోపించి కళతప్పడం ఒకవైపు ఐతే మరోవైపు బతుకమ్మ దసరా ఉత్సవాలకు చిల్లిగవ్వ లేకపోవడం సందండిత అధికారులు ఆందోళనకు గురవుతున్నారని పెద్ది పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో బతుకమ్మ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపి బతుకమ్మ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా నిర్వహించినారని మాజీ ఎమ్మెల్యే పెద్ది
తెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో కళతప్పుతున్న పల్లెల్లో,గ్రామాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,మాజీ ప్రజా ప్రతినిధులు,జెడ్పిటిసిలు, సర్పంచ్లు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు పార్టీ నాయకత్వం.. బతుకమ్మ ఉత్సవాలలో తమవంతు సహాయంగా చురుగ్గా పాల్గొని ఏర్పాట్లు చేసి ఆడపడుచుల ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T143941.329.wav?_=2

 

మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలి

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు మరోసారి వినతిపత్రం

జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్

నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.అందుకు గాను బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్,కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఓబిసి చైర్మన్ ఓర్సు తిరుపతిల ఆధ్వర్యంలో సంఘం నాయకులతో కలిసి నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ కు మరోసారి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని నెహ్రూ పార్కు దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఎదురుగా జ్యోతిరావు పూలే జంక్షన్ వద్ద గత కొన్ని సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలే దంపతుల జయంతి, వర్ధంతులతో పాటు పలు సామాజిక ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాని ఆ ప్రాంగణాన్ని జ్యోతిరావు పూలే జంక్షన్ గా నామకరణం చేయడం జరిగిందన్నారు. పూలే దంపతుల విగ్రహా ఏర్పాటు కోసం గత 2024 అక్టోబర్ 26 న మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చాన్నారు.కాగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే మహానీయులైన జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ స్ధాపన ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కురిమిల్ల రమేష్,జిల్లా యువజన సంఘం అధ్యక్షులు కడారి సురేష్ యాదవ్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్, పట్టణ యూత్ అధ్యక్షుడు గోపగాని నాగరాజు గౌడ్, మంగిశెట్టి సారంగం, శీరంశెట్టి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ రద్దుపట్ల ఎల్ఐసిఏఓఐ సంబరాలు…

జీఎస్టీ రద్దుపట్ల ఎల్ఐసిఏఓఐ సంబరాలు.

నర్సంపేట,నేటిధాత్రి:

ఎల్ఐసి ప్రీమియం లో కేంద్ర ప్రభుత్వం గతంలో విధించిన జీఎస్టీని గత 8 సంవత్సరాలుగా ఎల్ఐసిఏఓఐ పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని రద్దు చేసిన నేపథ్యంలో నర్సంపేట పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసిఏఓఐ ఆర్గనైజేషన్ బ్రాంచ్ అధ్యక్షుడు పోనుగొటి సుధాకర్ రావు అధ్యక్షతన ఏజెంట్లు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్ఐసిఏఓఐ వరంగల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పడిదం కట్టస్వామి మాట్లాడుతూ 2017 నుండి జిఎస్టి పట్ల కేంద్ర ప్రభుత్వంపై
ఎల్ఐసిఏఓఐ వివిధ రకాల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని రద్దు చేసిందని పేర్కొన్నారు. పాలసీదారుల లబ్దికోసం అలాగే ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమం కోసం ఎల్ఐసి ఏఓఐ ఆర్గనైజేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.రాష్ట్ర నాయకులు మొద్దు రమేష్,వైనాల శంకరయ్య ,సాంబరాతి శ్రీనివాస్, బ్రాంచ్ గౌరవ అధ్యక్షులు పెండ్లి రవి, బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మర్థ గణేష్ ,కార్యదర్శి సుభానుద్దిన్, కోశాధికారి కందికొండ రవికుమార్, చంద్రమౌళి ,డివిజన్ నాయకులు బూర రమేష్ ,శ్రీధర్ రాజు ,అనంత గిరి స్వామి,ప్రచార కార్యదర్శి కుసుంబ రఘుపతి,ముఖ్య సలహాదారు కొమురయ్య ,పురాణి రాంబాబు,సార సాంబశివుడు,కొనకటి స్వామి,అల్లె రాజు,నాంపెల్లి.రాంబాబు,టెంకురాల రాజేశ్వర్ రావు, బాబురావు,వీరస్వామి,భానోతు చందు తదితరులు పాల్గొన్నారు.

బాలాజీ విద్యాసంస్థల్లో– బతుకమ్మ సంబరాలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T140551.291.wav?_=3

 

బాలాజీ విద్యాసంస్థల్లో– బతుకమ్మ సంబరాలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

బాలాజీ విద్యాసంస్థల్లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకున్నారు.నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్ లో బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథులుగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి,ట్రెజరర్ డాక్టర్ ఎ .వనజ ప్రిన్సిపల్ పి. రాజేంద్ర ప్రసాద్ హాజరైనారు. డాక్టర్ ఎ. వనజ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో పాలుపంచుకొని బతకమ్మ పండుగ నేపథ్యాన్ని వివరించారు.తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదని బతుకమ్మ పండుగ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ…ఈ పండుగ భాద్రపద మాసంలో పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు తీరొక్కపూలతో బతకమ్మను అలంకరించి ఆటపాటలతో ఆడుకుంటారని తెలిపారు.చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు పూల బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారని చెప్పారు. నేడు బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. స్త్రీల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని పంటలు బాగా పండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తెలుగువారు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ప్రవాసభారతీయులు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఎల్ఐసి ఏజెంట్లహక్కులు,పాలసీదారుల సంరక్షణ ఏఓఐతోనే..

ఎల్ఐసి ఏజెంట్లహక్కులు,పాలసీదారుల సంరక్షణ ఏఓఐతోనే..

ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య

ఎల్ఐసి ఏఓఐ నర్సంపేట బ్రాంచ్ నూతన కమిటీ సమావేశం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)లో జరుగుతున్న వివిధ మార్పుల నేపథ్యంలో ఏజెంట్ల హక్కులు,పాలసీదారుల సంరక్షణ ఎల్ఐసి ఏఓఐ ఆర్గనైజేషన్ తోటే సాదించుకుంటున్నామని ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య తెలిపారు.నర్సంపేట ఎల్ఐసి బ్రాంచ్ ఎల్ఐసి ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఏఓఐ) అధ్యక్షుడు పొనుగోటి సుధాకర్ రావు అధ్యక్షతన నర్సంపేట బ్రాంచ్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట రామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగింది.ముఖ్య అతిధులుగా
ఎల్ఐసి ఏఓఐ రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య,వరంగల్ డివిజన్ అధ్యక్షుడు కమటం స్వామి,డివిజన్ కార్యదర్శి పడిదం కట్టస్వామి హాజరైయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి కొత్తపెల్లి రాంనర్సయ్య మాట్లాడుతూ ఇన్సూరెన్స్ రంగంలో పోర్టబుల్ విధానం (క్లా బ్యాక్) ను ముందుకు తెచ్చే యోచనలో ఐఆర్డిఏ ఉన్నది. దీనివలన ఏజెంట్ల ప్రయోజనాలకు తీవ్రమైన ముప్పురానున్నదని తెలియజేశారు.ఈ నేపథ్యంలో అవసరమైతే బ్రాంచీలలో
నిరవధిక నిరాహార దీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.రాబోయే శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో 100 శాతం ఎఫ్డీఐ బిల్లును ఆమోదం చేస్తామని ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.దీంతో ఎల్ఐసి సంస్థ పై ఇతర ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం జరగనున్నదని రాంనర్సయ్య పేర్కొన్నారు.ఎల్ఐసి ఏఓఐతోనే హక్కులు సాదించుకుంటున్న నేపథ్యంలో ఎల్ఐసి ఏఓఐ సభ్యత్వం పెంచుకొని ఎల్ఐసి కార్పొరేషన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఎల్ఐసి ఏఓఐ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా వివిధ రకాలుగా పోరాటాలు చేసిన ఫలితంగా ఎల్ఐసి ప్రీమియంలో జీఎస్టీని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 22 న అధికారకంగా సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సుభానుద్ధిన్,కోశాధికారి రవికుమార్,డివిజన్ మాజీ కోశాధికారి, రాష్ట్ర ఈసీ మెంబర్ మొద్దు రమేష్,నర్సంపేట మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు పెండ్లి రవి, క్లియా అధ్యక్షుడు రాజబోయిన చంద్రమౌళి రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్,శంకరయ్య ,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు,ఎల్ఐసి ఏఓఐ సభ్యులు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ కు కంఠమహేశ్వరుని వేడుక ఆహ్వానం…

మున్సిపల్ కమిషనర్ కు కంఠమహేశ్వరుని వేడుక ఆహ్వానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ గౌడ గీతా పారిశ్రామిక సహకారం సంఘం ఆధ్వర్యంలో కంఠమహేశ్వర స్వామి,రేణుల ఏళ్ళమ్మతల్లి బోనాల ఉత్సవాలు వచ్చే అక్టోబర్ 4 నుంచి 7 వరకు నిర్వహిస్తున్నామని దీనికి ప్రతి ఒక్క గౌడ కుటుంబం నుంచి బోనాలు తరలిరావాలని పట్టణ గౌడ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ నేపథ్యంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ భాస్కర్ ను గౌడ సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానం పలికారు.అలాగే బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ దాత సోల్తి సారయ్య గౌడ్ కు, నర్సంపేట డివిజన్ గౌడ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ కు ఆహ్వాన పత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇదేండ్లకోసారి కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు నర్సంపేట పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.దీనిలో భాగంగా పట్టణంలోని ప్రతి గౌడ కుటుంబం నుంచి బోనాలు తరలి రావాలని కోరారు. దీనికోసం ప్రజలందరినీ సమాయత్తం కోసం సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని కమిషనర్ భాస్కర్ ను కోరారు. అనంతరం కమిషనర్ భాస్కర్ కంఠమహేశ్వర స్వామి ఆలయానికి వచ్చి సౌకర్యాల ఏర్పాటుపై పరిశీలన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షులు బొమ్మగాని కుమారస్వామి గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, నాతి సదానందం గౌడ్, తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్, వేముల కృష్ణ గౌడ్ సురేష్ గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్, మండ వీరన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

కంఠమహేశ్వర స్వామి కళ్యాణానికి ఆహ్వానం…

కంఠమహేశ్వర స్వామి కళ్యాణానికి ఆహ్వానం

ఎమ్మెల్యే దొంతికి కలిసిన పట్టణ గౌడ సంఘం.*

నర్సంపేట,నేటిధాత్రి:*

 

 

నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కంఠమహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఆ సంఘ నాయకులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఆహ్వానం పలికారు.
నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌడ
సంఘ నాయకులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సంపేట గౌడ పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ నుండి 7 వరకు నిర్వహించే శ్రీ కంఠమహేశ్వరస్వామి, సూరమాంబ, రేణుకఎల్లమ్మ తల్లి, వనంమైసమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే సీసీ రోడ్డు నిర్మాణం పనులను
చేయించాలని కోరడంతో తక్షణమే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ ,మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,ఉపాధ్యక్షులు గాధగోని సాంబయ్య గౌడ్,ఆర్ధిక కార్యదర్శలు నాతి సదానందం గౌడ్, గిరగాని కిరణ్ గౌడ్ డైరెక్టర్లు. తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మొదలుగాని సురేష్ గౌడ్, వేముల క్రీష్ణ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగేల్లి ప్రసాద్ గౌడ్, చుక్క రవి గౌడ్,గౌడ గీత కార్మికులు తాళ్ల చంద్రమౌళి గౌడ్, పుల్లూరు రవి గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గిరిగాని మొగిలి,కోయ్యడి కిరణ్ కుమార్ గౌడ్, వేముల సారంగం గౌడ్,కుల పెద్దలు
చుక్క కనకయ్య గౌడ్,వేముల ఐలుసమ్మయ్య గౌడ్,గండు స్వామి, దొమ్మటి కుమారస్వామి గౌడ్,
తదితరు పాల్గొన్నారు.

గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు…

గౌడ పట్టణ కమిటీని సన్మానించిన గౌడ జర్నలిస్టులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ గౌడ సంఘం నూతన కమిటీని నర్సంపేట గౌడ జర్నలిస్టులు సన్మానించారు.గౌడ పట్టణ కమిటీని ఇటీవల ఎన్నుకోగా పట్టణ గౌడ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ ,ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీనివాస్ గౌడ్ తో పాటు కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు,సంఘం అభివృద్ధి కోసం ప్రతీ ఒక్క గౌడబిడ్డ పాటుపడాలని కోరారు.నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4 నుండి 7 వరకు కంఠమహేశ్వర స్వామి సూరమాంబదేవి,రేణుక ఎల్లమ్మతల్లి జమదగ్ని బోనాల మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ఉత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు.

గౌడ జర్నలిస్టులకు సన్మానం..

నర్సంపేట పట్టణ జర్నలిస్టులను నూతనంగా ఎన్నికైన నర్సంపేట పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పట్టణ గౌడ సంఘం ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్య గౌడ్,ఆర్థిక కార్యదర్శులు నాతి సదానందం గౌడ్,గిరగాని కిరణ్ గౌడ్,డైరెక్టర్లు తాళ్ళపెల్లి శ్రీనివాస్ గౌడ్,మొగలగాని సురేష్ గౌడ్,వేముల కృష్ణ గౌడ్, గిరగాని రమేష్ గౌడ్, నాగెళ్లి ప్రమోద్ గౌడ్,చుక్క రవి గౌడ్,సంఘ సభ్యులు తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, తాబేటి లక్ష్మణ్ గౌడ్,కోల చరణ్ గౌడ్,జర్నలిస్టులు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,రడం శ్రీనివాస్ గౌడ్,బుర్ర వేణు గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్,జూలూరి హరిప్రసాద్ గౌడ్,తడుక రమేష్ గౌడ్,వద్లకొండ పవిత్రన్ గౌడ్,వడ్లకొండ రాజ్ కుమార్ గౌడ్, కొయ్యడి సనత్ గౌడ్,గోపగాని శోభన్ గౌడ్,బండారి సుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

బాలాజీలో ఘనంగా- హిందీ భాషా దినోత్సవం…

బాలాజీలో ఘనంగా- హిందీ భాషా దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో భాగమైన
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఘనంగా హిందీ భాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.అలాగే పట్టణంలోని అక్షర ద స్కూల్, ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షర ద స్కూల్ లో బాలాజీ వివిధ సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు.గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణ ఎనిమిదవ షెడ్యూల్లో హిందిభాషను కేంద్రప్రభుత్వం అధికార భాషగా గుర్తించిందని తెలియజేశారు.బాలాజీ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ హిందీ భాషా దినోత్సవ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.భారత జాతీయ ఉద్యమంలో అప్పటినుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.అనంతరం హిందీ భాషో పాధ్యాయుడు ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీ, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఆయా పాఠశాలల్లో విద్యార్థులందరూ హిందీ భాషలో కవితలు ,గేయాలను చార్ట్ పై రాసి ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో విష్ణులత, నరసింహస్వామి, లలిత, ఎస్ .రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Hindi Language Day

బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్,అక్షర ద స్కూల్ లో…

బాలాజీ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఒక్కటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్,అక్షర స్కూల్ లలో హిందీ భాషా దినోత్సవం ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ,
అక్షర స్కూల్ ప్రిన్సిపల్ భవాని, ఏ.ఓ సురేష్ విద్యార్థులు పాల్గొన్నారు.

ధర్మస్థల కేసుపట్ల వేగవంతంతో దర్యాప్తును నిర్ధారించాలి….

ధర్మస్థల కేసుపట్ల వేగవంతంతో దర్యాప్తును నిర్ధారించాలి.*

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

కర్ణాటక ప్రభుత్వం ధర్మస్థల కేసులో శాస్త్రీయ,నిష్పాక్షిక వేగవంతమైన దర్యాప్తును నిర్ధారించాలని పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క డిమాండ్ చేశారు.నర్సంపేటలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పిఓడబ్ల్యు సదస్సు జక్కుల విజయ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి పూలక్క మాట్లాడుతూ
కర్ణాటకలోని ధర్మస్థల ఆలయంతో పాటు చుట్టుపక్కల 400 మంది నివేదికల ప్రకారం బాలికలు,మహిళల సామూహిక అత్యాచారాలు,లైంగిక దాడులు,సామూహిక హత్యలు,సామూహిక ఖననంపై అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌పై కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్యాప్తులో కొన్ని సమస్యల తర్వాత భట్ తల్లి తనకు ఎప్పుడైనా కూతురు ఉందా లేదా అనే దానిపై తిరగబడటం, విజిల్‌బ్లోయర్ అరెస్టు నివేదికలు వంటి సమస్యలను మళ్లించడానికి అలాగే సమస్యను మతంచేయడం ద్వారా, న్యాయవాదులు,కార్యకర్తలను కించపరచడం, ఆలయ స్థాపనకు నైతిక మద్దతు కవాతులను ప్రకటించడం ద్వారా ఒత్తిడిని పెంచడానికి ప్రచారం జరుగుతోందని తెలిపారు.ధర్మస్థల కేసులో ఆధారాలు, సాక్షులు, న్యాయవాదుల రక్షణ కొనసాగించి ప్రజల పోరాటం నిఘా మాత్రమే పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
అనంతరం పిఓడబ్ల్యు నూతన డివిజన్ కమిటీని ఏర్పాటు చేయగా నూతన అధ్యక్ష కార్యదర్శులు జక్కుల విజయ,ఆకుల శైలజ, డివిజన్ నాయకులు సంధ్య, వీరలక్ష్మి, సుక్కక్కలను ఎన్నుకున్నారు.

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం…

బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడా,సాంస్కృతిక రంగాలలోనూ రాణించాలని సూచించారు. ఈ లక్ష్య సాధనకు ఎన్ఎస్ఎస్ ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. దేశాభివృద్ధికి ఆటంకాలైన మూఢనమ్మకాలు,నిరక్షరాస్యత,డ్రగ్స్ వంటి దుష్ప్రవర్తనలను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ మోర్తాల రామరాజు మాట్లాడుతూ నూతన విద్యార్థులు తప్పనిసరిగా ఎన్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకుని యూనివర్సిటీ నిర్వహించే వివిధ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్,అధ్యాపకులు రవీందర్, బిక్షపతి,రాజ్‌కుమార్,మధు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహణ.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రోబోటిక్స్ వర్క్‌షాప్ నిర్వహణ.

ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ మల్లం నవీన్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)భౌతిక శాస్త్ర విభాగం, హైదరాబాదుకు చెందిన సోహం అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ భాగస్వామ్యంతో ఈ నెల 10 న
ఒక రోజు రోబోటిక్స్ వర్క్‌షాప్‌ను (కార్యశాల) నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి నమోదు చేసుకున్న విద్యార్థుల నుండి ఎంపిక చేసిన 40 మంది విద్యార్థులకు 21 ప్రాక్టికల్ రోబోటిక్ ప్రయోగాల ద్వారా ప్రత్యక్ష శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. సాంప్రదాయ విద్యావిధానానికి, ఆధునిక సాంకేతిక ప్రపంచ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ వర్క్‌షాప్ యొక్క లక్ష్యం అని పేర్కొన్నారు.దీనికి సంబంధించిన కరపత్రాన్ని,డిటైల్డ్ బ్రోచర్ ను కళాశాల ప్రిన్సిపాల్ ,వర్క్ షాప్ చైర్పర్సన్ ప్రొఫెసర్ మల్లం నవీన్, వర్క్ షాప్ కన్వీనర్,భౌతిక శాస్త్ర అధ్యాపకులు భైరి సత్యనారాయణ లు, వర్క్ షాప్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కందాల సత్యనారాయణ,ఆర్.రుద్రాణి,డాక్టర్ పూర్ణచందర్ ,అడ్విసోరీ కమిటీ సభ్యులు ఎం.ఎం.కె. రహీముద్దీన్,డాక్టర్ .ఎం.సోమయ్య, ఎస్. కమలాకర్, డాక్టర్.రాంబాబు లతో కలసి ఆవిష్కరించారు.

వర్క్‌షాప్ ఉద్దేశ్యాలు..:

రోబోటిక్, కంప్యూటర్ సైన్సెస్‌పై విద్యార్థుల ఆసక్తిని ప్రేరేపించడం
స్వచ్ఛమైన శాస్త్రాలలో రోబోటిక్స్‌ను వర్తింపజేయడానికి విద్యార్థులను మార్గనిర్దేశం చేయడం,
నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి రోబోటిక్స్‌ను వర్తింపజేయడానికి విద్యార్థులను రూపొందించడం.తాజా మరియు అధునాతన సాంకేతికతలతో విద్యార్థులను పరిచయం చేయడం.
విద్యార్థులకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో నైపుణ్యాలను అందించడం.
విద్యార్థులకు తోటి సమూహాలతో కలిసి పనిచేయడం, పని చేయడం నేర్పడం.కంప్యూటింగ్ మరియు ఏ.ఐ సంబంధిత రంగాలలో విద్యార్థులలో ఆసక్తిని కలిగించడం.
బాధ్యతాయుతమైన పౌరులుగా పరిణామం చెందడానికి విద్యార్థులకు చేయూత నివ్వడం

వర్క్‌షాప్ లక్ష్యాలు..:

భవిష్యత్ శిక్షకులుగా మారడానికి ఒకే వర్క్‌షాప్‌లో 40 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం.21 సరళమైన మరియు ఎంపిక చేసిన రోబోటిక్ ప్రయోగాలను బోధించడం.
కాలేజ్ రోబోటిక్స్ క్లబ్‌ను ఏర్పాటు చేయడం.శిక్షణ పొందిన 20 మంది విద్యార్థులతో ఎవర్-రెడీ-ట్రీమర్‌ల బృందాన్ని ఏర్పాటు చేయడం.
‘7-స్థాయి సవాళ్లను’ పరిష్కరించడానికి విద్యార్థులను ప్రోత్సహించడం అలాగే
ఆర్ద్వినో బోర్డులను ప్రోగ్రామ్ చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం.

వర్క్‌షాప్ ముఖ్యాంశాలు..

ఈ వర్క్‌షాప్ లో పాల్గొనే విద్యార్థులు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందగలరు. విద్యార్థులు రోబోటిక్స్, దాని అనువర్తనాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పొందుతారు మరియు ఇ-సర్టిఫికేట్‌ను అందుకుంటారు. దీర్ఘకాలంలో, ఈ వర్క్‌షాప్ విద్యార్థులు శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటానికి మరియు వారి కెరీర్ అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ క్రింది అవకాశాలు లభిస్తాయి: (1) భవిష్యత్ వర్క్‌షాప్‌లకు శిక్షకులుగా, మెంటార్‌లుగా మారడం. (2) భవిష్యత్ రోబోటిక్స్ కార్యక్రమాలకు ఉచిత సహకారం పొందడం. (3) హైదరాబాద్ ఎగ్జిబిషన్, హైదరాబాద్ సైన్స్ డే ఫెస్టివల్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో పాల్గొనడం. (4) కళాశాల రోబోటిక్స్ క్లబ్‌లో జీవితకాల సభ్యులుగా మారడం.

అర్హతలు,ఇతర వివరాలు..:

ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్), బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్),బీఏ (కంప్యూటర్ అప్లికేషన్స్) ద్వితీయ,తృతీయ సంవత్సరం విద్యార్థులు అర్హులు. బలమైన ఆసక్తి, క్రమంతప్పని హాజరు,సకాలంలో స్పందించే తత్వాన్నిబట్టి ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎ), నర్సంపేట విద్యార్థులకు ఈ వర్క్‌షాప్ ఉచితంగా ఉంటుందని ప్రిన్సిపాల్
ప్రొఫెసర్ మల్లం నవీన్ వివరించారు.

విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు…

విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

యంసిపిఐ(యు) మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులు కామ్రేడ్ విజయ్ శంకర్ ఝా మృతి ప్రజా ఉద్యమాలకు,ఎంసిపిఐ(యు) పార్టీకి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.నర్సంపేట ఓంకార్ భవన్ లోఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాజస్థాన్ కోటా తల్వాండిలో అమరత్వం పొందిన పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విజయ్ శంకర్ ఝా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.అనంతరం పార్టీ నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన జరిగిన సంతాప కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దారపు రమేష్ మాట్లాడుతూ అమరజీవి విజయ్ శంకర్ ఝ కార్మిక ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూనే రాజస్థాన్ రాష్ట్ర పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ మోహన్ పునామియాతో కలిసి కీలకమైన బాధ్యతలు నిర్వహించిన గొప్ప మార్క్సిస్ట్ నాయకుడని ఉన్నారు. కామ్రేడ్ ఓంకార్ చూపిన బాటలో బూర్జువా భూస్వామ్య పెట్టుబడిదారీ శక్తులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఐక్యత కోసం నిరంతరం పరితపించిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోనె కుమారస్వామి, ఐక్య ప్రజానాట్యమండలి, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శులు కన్నం వెంకన్న వంగల రాగసుద, పార్టీ రాష్ట్ర నాయకులు బాబురావు,నాగెల్లి కొమురయ్య, కనకం సంధ్య, జిల్లా నాయకులు మాలోత్ సాగర్,సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి,కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం,ఐతమ్ నాగేష్, మాలోత్ మల్లికార్జున్, ప్రభాకర్,ఓదేలు దాసు కుమారస్వామి,నరసయ్యలతోపాటు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version