మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి

ఒకే సమస్య ఒకే సర్వీస్ రూల్ అమలు చేయాలి.

ఆర్టిజన్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

జేఏసీ ఆధ్వర్యంలో వంట వార్పు ,కళ్లకు గంతలు కట్టి నిరసన

నేటి ధాత్రి, పాటన్ చేరు :

విద్యుత్ ఆర్టిజన్, మీటర్ రీడర్లను, పీస్ రేట్ కార్మికులను, ప్రభుత్వఉద్యోగులుగా గుర్తించాలని మూడవరోజు నిరవధిక సమ్మెలో భాగంగా పటాన్చెరు డివిజన్ కార్యాలయం ఎదుట వంటావార్పు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టారు. అనంతరం రాష్ట్ర డివిజన్ జేఏసీ నాయకులు భూపాల్ రెడ్డి ,పర్వయ్య ,రఘు మాట్లాడుతూ ఒకే సమత్సలో రెండు రూల్స్ అమలు చేయడం కరెక్ట్ కాదని, చేస్తున్న పని ఒకటే అయినప్పుడు రెండు రూల్స్ అమలు చేయడాన్ని తప్పు పట్టారు ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్నప్పుడు రెండు రూల్స్ అమలు చేసి బ్రిటిష్ కాలం నాటి రూల్స్ ను అమలు చేసి కార్మికుల జీవితాలతో శ్రమ దోపిడీకి గురిచేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం దిగి వచ్చేవరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తెలిపారు అప్పటి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆర్టిజన్ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారు పాదయాత్రలో హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తమ హక్కులను నెరవేర్చేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు ఈరోజు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న భట్టి విక్రమార్క గారు మాట మార్చడం బాగోలేదని విద్యుత్ కార్మికులను పట్టించుకోవడంలేదని తెలిపారు విద్యుత్ సమస్యలు ఏదైనా తలెత్తే మాత్రం యాజమాన్యం ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా జేఏసీ నాయకులు పలు యూనియన్ల సంఘాల అధ్యక్షులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయక్, ఉపేందర్, నరసింహ, అక్షయ్, ముజీబ్, మురళి, సుధాకర్ ఎల్లేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి…

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

కల్వకుర్తి మంగళవారం కార్మికులంతా ఏకమై దేశ వ్యాప్త సమ్మెను తెలంగాణ కేంద్ర.రాష్ట్ర కార్మిక సంఘాల ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కల్వకుర్తి T U C I శాఖ
1.నాలుగు లేబర్ కోడ్ ల రద్దు క్తె పోరాడుదాం.
2.పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం.
3. ఫిబ్రవరి 12వ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె.
4. కనీస వేతనం 26 వేల ఉండాలి.
5. విద్యుత్ సవరణ చట్టం 2025 విబిజి రామ్ జీ చట్టం రద్దు చేయాలి దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది ఆయన మాట్లాడుతూ చట్టాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు తాలూకా అధ్యక్షుడు సాయిబాబు, ఉపాధ్యక్షులు మౌలాలి, కోశాధికారి మల్లేష్,కార్యవర్గ సభ్యులు వెంకటయ్య,వెంకటేష్,శీను, బాల్ చంద్రి తదితరులు పాల్గొన్నారు.

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మేడ్చల్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. అలియాబాద్, ముడుచుతులపల్లి ఎల్లంపేట, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్లు చంద్రశేఖర్, పవన్ కుమార్, స్వామి నాయక్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ తో పాటు అధికారులు, మేడ్చల్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, డిసిసి అధ్యక్షుడు తోటకూర వజ్రష్యా యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి లతోపాటు వివిధ కార్మిక సంఘాలు ఆటో యూనియన్ ప్రైవేట్ సంస్థల వద్ద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అలియాబాద్ శ్రీరామ ఆటో యూనియన్ వద్ద అధ్యక్షుడు పులి జగదీష్ జెండాను ఎగరవేశారు.

ఈ నెల 7 న జరిగే సీఐటీయూ మహాసభలను జయప్రదం చెయ్యండి..

ఈ నెల 7 న జరిగే సీఐటీయూ మహాసభలను జయప్రదం చెయ్యండి

◆:- మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేసిన కార్మిక నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్. సెంటర్ ఆఫ్ ఇండియాన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలపై భవిష్యత్తు ప్రణాళిక రూపొందించేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయనీ మహాసభల బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక వర్గం జయప్రదం చేయాలని సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం నాడు శ్రామిక భవన్లో జరిగిన సీఐటీయూ పారిశ్రామి క్లస్టర్ కమిటీ సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ కార్మిక ప్రజా పోరాటాల సారధి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సిఐటియు) తెలంగాణ రాష్ట్ర ఐదో మహాసభలు ఈనెల 7 నుంచి 9 వరకు మెదక్ లో జరగనున్నాయని గత కార్యక్రమాలు చర్చించి భవిష్యత్తు ఉద్యమాలు పోరాటాలను రూపొందించేందుకు ఈ మహాసభలు జరుగుతున్నాయనీ, భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు పోరాటాలు కార్మికుల హక్కుల పరిరక్షణకు జరుగుతాయని అందుకోసం నిర్వహించే ఈ మహాసభల బహిరంగ సభలో కార్మిక వర్గం ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల సీఐటీయూ యూనియన్ల నాయకులు రాజిరెడ్డి నరేష్ మహేశ్వర్ గణేష్ నారాయణ సందీప్ రెడ్డి కిరణ్ పాషా శివరామరావు బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐఎన్టియుసి, ఏఐటియుసి, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో ఉద్యోగులకు గ్రాడ్యు టీ ప్రయోజనాలు తగ్గించడం, ట్రేడ్ యూనియన్ హక్కులు కాలరాయడం, సమ్మెలపై ఆంక్షలు విధించడం, 12 గంటల పని విధానాన్ని పెంచడం, భద్రత ప్రమాదాలు పెరగడం, సరైన ప్రక్రియ లేకుండా తొలగింపునకు శ్రీకారం చుట్టడం వంటి పలు అంశాలపై సింగరేణి ముందడుగు వేస్తున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జేఏసి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్ , ఉపాధ్యక్షులు వెంకటస్వామి, రఘు, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి బీసీ బంద్ మద్దతు

తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు మేరకు బందునువిజయవంతం చేద్దాం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల. కేంద్రంలో ఈరోజు మార్కండేయ భవన్లో. వివిధ రాజకీయ పార్టీల కుల సంఘాల బీసీ సంఘాల ప్రతినిధులతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు రేపు జరిగే బందును అన్ని వర్గాల ప్రజలు వివిధ రాజకీయ పార్టీలు కుల సంఘాలు బీసీ సంఘాలు కార్మిక సంఘాలు నేతలు సహకరించాలని బీసీ నేతలను కోరారు దేశంలో రాష్ట్రంలో సగానికి పైగా ఉన్న బీసీలకు 42 శాతం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో తెస్తే మరి ఉన్నత వర్గాల్లో కొందరు బీసీ వ్యతిరేకులు కోర్టులో పిటిషన్ వేసి నిలుపుదల చేశారని వారికి తగిన గుణపాఠం చెబుతామని నేతలంతా. ముక్తకంఠంతో. హెచ్చరించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాజ్యాంగంలో ని. 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తర్వాత ఎన్నికలకు పోవాలని నాయకులను కోరారు ఈ సందర్భంగా. బీసీ సంఘాల నేతలు ఎగుర్ల కర్ణాకర్. కందుకూరి రామ గౌడ్. బి ఆర్ ఎస్. పార్టీ మండల అధ్యక్షులు రాజన్న. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మచ్చ శ్రీనివాస్. బిజెపి నాయకులు గుగ్గిల ఆంజనేయులు . ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొని ప్రసంగించారు ఇట్టి బందుకు వారి పార్టీల పక్షాన జేఏసీ. పిలుపుమేరకు బందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇట్టి కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కట్ట రవి. శాలి అధ్యక్షులు రాపల్లి ఆనందం. ఎగుర్ల ప్రశాంత్. నేరెళ్ల అనిల్. రంగు ప్రసాదు. గుర్రం తిరుపతి. గాద సత్తయ్య. వెంగళ రమేష్ పలువురు. జేఏసీ నాయకులు తదితరులు బందుకు మద్దతు ప్రకటించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version