ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
*పిజిఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మకు
సీఎం ఘన నివాళులు*
పాల్గొన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని బుధవారం పరామర్శించారు. దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఇటీవల మరణించగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పిజిఆర్ గార్డెన్ లో బుధవారం మాతృయజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,
ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, ప్రజా ప్రతినిధులు ఇతర ప్రముఖులు హాజరు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తదితరులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
హెలికాప్టర్ లో హైదరాబాద్ నుండి..
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ని పరామర్శించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా హనుమకొండ సుబేదారి లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద దిగారు. దొంతి మాధవ రెడ్డి ని పరమార్శించేందుకు హెలికాప్టర్ ద్వారా ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కే ఆర్.
నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పుష్ప గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు.ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి రోడ్డు మార్గం లో పీజీఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృ మూర్తి దొంతి కాంతమ్మ మాతృయజ్ఞం కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు దొంతి కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ట్స్ కళాశాల మైదానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే లు చేరుకున్నారు.
తిరిగి హైదరాబాద్ కు హెలికాప్టర్ లో బయలుదేరిన సీఎం
వరంగల్ పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించిన అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుండి హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి బయలుదేరారు. హెలిపాడ్ వద్ద మంత్రులు అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్. నాగరాజు,యశశ్విని రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, ఎన్పీడీసీఎల్ వరుణ్ రెడ్డి, తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..
నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల మరణించిన నేపద్యంలో బుధవారం హన్మకొండ లోని పిజీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన మాతృ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొననుటకు గాను హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు.