అరుణ ఫర్టిలైజర్స్ ను సందర్శించిన ఎన్ ఎఫ్ ఎల్ ప్రతినిధులు

అరుణ ఫర్టిలైజర్ ను సందర్శించిన నేషనల్ ఫర్టిలైజర్స్ కంపెనీ ప్రతినిదులు

పరకాల,నేటిధాత్రి

పట్టణానికి చెందిన ప్రముఖ ఎరువుల దుకాణం అరుణ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్,షాపును ఎన్ఎఫ్ఎల్ నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఎరువుల కంపెనీ ప్రతినిధులు ఆర్ఎం వంశీకృష్ణ మరియు సేల్స్ ఆఫీసర్ శ్రీధర్ శుక్రవారం రోజున అరుణ ఫర్టిలైజర్ ను సందర్శించిన నేపథ్యంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి యూరియాని సమృద్ధిగా సప్లై చేస్తున్న దయచేసి కంపెనీ ఎన్ ఎఫ్ ఎల్ గా భావించి పరకాల నియోజకవర్గ రైతులు నేషనల్ ఫర్టిలైజర్స్ ప్రతినిదులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ తమకు యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు.

సంఘటన్ శ్రీ జన్ అభియాన్ సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు…

సంఘటన్ శ్రీ జన్ అభియాన్ సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని ఎస్ వి ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ నియోజకవర్గ సంఘటన్ శ్రీ జన్ అభియాన్ సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సెక్రటరీ జరిత మాజీ మంత్రివర్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ చంద్రశేఖర్ సెట్విన్ ఛైర్మెన్ గ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచులు జి ఎంపిటిసిలు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్త…!

మోసపోకుండా జాగ్రత్త…!
అవగాహనే రక్షణ…!

జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్

మహబూబాబాద్/ నేటి దాత్రి

దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటిపి లు, యూపీఐ పిన్‌లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని అన్నారు.

హెచ్చరిక: అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగిందని తెలిపారు.

సైబర్ మోసగాళ్ల విధానం:

నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించడం.

వాట్సాప్, ఎస్ ఎం ఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.

యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం.

గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చూపించడం జరుగుతుందని గుర్తు చేశారు.

జిల్లా ప్రజలకు సూచనలు:

ధృవీకరించిన వెబ్‌సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

టెలిగ్రామ్ లేదా ఇతర లింక్‌ల ద్వారా ఏపీకె ఫైల్స్ డౌన్‌లోడ్ చేయ వద్దని తెలిపారు.

ఎవరికీ బ్యాంక్ వివరాలు, ఓటిపి లు యూపీఐ పిన్‌లు పంచుకోవద్దని తెలిపారు.

ముందుగానే చెల్లింపులు చేయకుండా, “ క్యాష్ ఆన్ డెలివరీ” సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు..

ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండని సూచించారు.
మోసపోకుండా జాగ్రత్త అవగాహనే రక్షణ.”

నూతన ఎంపీడీవోను శాలువాతో సన్మానించిన సిబ్బంది…

నూతన ఎంపీడీవోను శాలువాతో సన్మానించిన సిబ్బంది

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన రామ.రామకృష్ణ ని శాలువాతో స్వాగతం పలికి అంబేద్కర్ చిత్ర పటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన కార్యాలయ సిబ్బంది.
ఈ కార్యక్రమంలో ఏఈ ఉదయ్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ సరోజన ఈసి రజినీకాంత్,పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, నర్సింగం,టిఎ లు కుసుమ, స్వప్న,రాధిక ఫీల్డ్ అసిస్టెంట్ నీరటి రాములు,మరియు కార్యాలయ సహాయకులు గోవింద్ నవీన్ కుమార్, దొంతుల రాజేందర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రకాష్, సాగర్,అభిరామ్,సాయి కృష్ణ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మిత్రబృందం చేయూతగా నిలిచిన స్నేహితులు

ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబానికి చేయూతగా నిలిచిన మిత్రబృందం

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో అక్టోబర్ 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంతెన శ్రీనివాస్ మరణించడంతో వారి బాల్య మిత్రులు 1991 టు 1992 బాయ్స్ హై స్కూల్ మిత్రులందరు శ్రీనివాస్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. మిత్రులు అందరూ కలిసి శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు శ్రీనివాస్ కుటుంబానికి శుక్రవారం అందజేశారు.కష్ట కాలంలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని వారి వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి కష్టాల్లో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మిత్రులందరికీ తెలియజేశారు ఇకముందు కూడా శ్రీనివాస్ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్న మిత్రుల సహాయంతో సహాయ సహకారాలు అందిస్తామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన – మాజీ జెడ్పిటిసి

మహాదేవపూర్ అక్టోబర్ 16 (నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం గ్రామం బెగులూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బాధిత కుటుంబాన్ని శుక్రవారం రోజున మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్ పరామర్శించారు. మండలంలోని బెగులూర్ గ్రామానికి చెందిన శంకర్అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన అనంతరం ఆయనకు పార్టీ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి బరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి,షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. కాంసాని లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,బేస్ మెంట్,లెంటల్,స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని వేలాల గ్రామంలో గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని,ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం…

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం

జైబీసీ జైజై బీసీ

బీసీల ఐక్యత వర్ధిల్లాలి

శాయంపేట నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 18న శనివారం రోజున రాష్ట్ర (జిల్లా) బంద్ ను విజయవంతం చేయాలని బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి బందును పరిపూర్ణంగా సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ ,గ్రామ కమిటీ, మండల యువజన, సంఘం, మహిళా సంఘం అందరూ పాల్గొని విజయవంతం చేసి బీసీల లందరూ సత్తాచాటాలి.

మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి

ఘనంగా మాజీ ఎమ్మెల్యే మద్ది కాయల ఓంకార్ వర్ధంతి వేడుకలు.

#నివాళులు అర్పించిన ఎం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అసెంబ్లీ టైగర్ మాజీ శాసనసభ్యులు మద్ది కాయల ఓంకార్ 17వ పురస్కరించుకొని మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏం సిపిఐయు మండల ప్రధాన కార్యదర్శి దామ సాంబయ్య ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు సాంబయ్య మాట్లాడుతూ దొరలకు వ్యతిరేకంగా భూస్వాములపై పోరాటం చేసి పెత్తందార్ల గుండెల్లో మనకు పుట్టించి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి ఓంకార్ అలాంటి వ్యక్తి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని యువకులు ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్త నాగరాజు, సుభాష్, సుదర్శన్, వెంకటయ్య, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్…

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్

ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక విమలక్క ,రైతు కూలీ సంఘం (ఆర్ సి ఎస్), ఏఐఎఫ్టియు లు
సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ…
గడిచిన డెబ్బై ఎనిమిదేండ్ల భారత దేశ స్వాతంత్రంలో శోషిత జనసమూహానికి ఏమీ న్యాయం జరకపోగా ఇంకా పీడితులుగా మిగిలిపోయారనీ,కేంద్రంలోని భాజపా సర్కారు మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటూనే వస్తుందనీ,పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉన్నారనీ,దేశంలో భాజపా సర్కారు ఇప్పటికీ కుల గణన జరపకుండా న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లను బీసీ,ఎస్ సి,ఎస్ స్టీ, మైనార్టీలకు అందకుండా చేస్తున్నదనీ,భాజపా సర్కారు కూలాల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ డబ్లూ ఎస్ రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు అన్యాయం చేసిందనీ,
ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీలైన గడిచిన డెబ్బై ఏళ్లుగా ఎన్నికల తంతులో ఇచ్చిన బూటకపు హామీలు ప్రజలని మభ్యపెట్టడానికేనని,అయితే తెలంగాణ రాష్ట్రంలో 2023 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్ లను ప్రవేశపెట్టిందనీ,దీని కోసం జీఓ 9 తీసుకొచ్చిందనీ,కేంద్రానికి ఆర్డినెన్సు కూడా పంపిందనీ,భాజపా సర్కారు ఫాసిస్టు పాలనలో బీసీలను అణచడం కోసం బీసీ ఆర్డినెన్సును అడ్డుకుందనీ,
తక్షణమే బీసీ ల 42 శాతం బిల్లును షెడ్యూల్డ్ 9 లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని, ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేస్తుందనీ,ఈ నెల 18 న జరిగే బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రగిరి శంకర్ తెలిపారు.

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ సత్కారం

ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

చిట్యాల, నేటిదాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది…ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక సంస్థలలో పోటీ చేయరాదని ఉన్న జీవోను రద్దు చేయించి ముగ్గురు పిల్లలు ఆ పైన ఉన్న కూడా స్థానిక సంస్థల పోటీ చేయొచ్చు అనే జీవోను ఇప్పించినందుకు గాను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో *చిట్యాల మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య,మండల ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య, గుండెపరెడ్డి రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, మట్టికి రవీందర్, *సీనియర్ నాయకులు సిరిపురం కుమారస్వామి ,కొర్రి సాంబశివుడు, తదితరులు పాల్గొన్నారు.

బీసీ బందుకు మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి

బీసీ బందును విజయవంతం చేయాలి రవి పటేల్

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

టి ఆర్పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో టి ఆర్పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ
తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గండు కర్ణాకర్ సామర చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

సీసీఐ పత్తి కొనుగోళ్ళలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలి

పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ కొనుగోళ్లలో వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని పత్తి రైతుల రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి ఆరోపించారు.పత్తి రైతుల సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని పండించి పత్తికి కనీసం మద్దతు ధర పలకపోవడంపోవడంతో రైతు నష్టపోతున్నారని వెంటనే సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.క్వింటాల్ 10. వేల రూచొప్పున ధర అమలు చేయాలని కోరారు.పత్తి వ్యాపారస్తులు ధరలు తగ్గించి రైతుల వద్ద నుండి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పత్తి దిగుబడులు చాలా తగ్గాయని వరంగల్ మార్కెట్లో 7000 ధర నిర్ణయించి తేమ పేరుతో పేరుతో 6000 కూడా కొనడంలేదని అవేదన వ్యక్తం చేశారు.రైతులు పత్తి విత్తనాలు ఎరువులు,పురుగు మందులు వ్యవసాయ కూలీ ధరలు అన్ని పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని తట్టుకొని మార్కెట్కు పత్తి తీసుకుంటే తీసుకుని వస్తే రైతులకు సరైన ధర లభించడం లేదని రైతులకు అండగా ఉండవలసిన కేంద్ర ప్రభుత్వం 7700 ధర ప్రకటించినప్పటికీ వ్యాపారస్తులు అమలు చేయడంలేదని ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడంలేదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొరబోయిన కుమారస్వామి, జిల్లా నాయకులు కటుకూరి శ్రీనివాసరెడ్డి,కోడం రమేష్, కొంగర నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు.

అక్షర హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటేకి ఎంపిక

ఎస్జిఎఫ్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన అక్షర విద్యార్థులు

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయస్థాయి కరాటే పోటిల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అక్షర హైస్కూల్ ఇ/మీ గుండి-గోపాలరావుపేట విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచి రాష్టస్తాయికి ఎంపిక అయ్యారు. గుంటి శ్రీనిది, తూడి అకరలు ప్రథమ బహుమతి, తూడి ప్రకాయ్, కమటం అద్వైత రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారని పాఠశాల కరస్పాండెంట్ మినుగుల మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థులను అక్షర హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మినుకుల రాధ, కరాటే మాస్టార్ సుంకెరాజు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తదితరులు అభినంధించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం…

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం

◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనిటి మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్ రావు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ, మునీర్, మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ మరియు తదితరులులతో కలిసి శ్రీరామ్ నగర్ బస్తీలోని మైనారిటీ సోదరులను విజ్ఞప్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,నాయకులు కృష్ణ ,బాబు ,నర్సింలు ,యువ నాయకులు మిథున్ రాజ్,ఫిర్దోస్ ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు..

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు…

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు

కేంద్రంపై ఒత్తిడి చేద్దాం
రిజర్వేషన్లు సాధించుకుందాం
కదలిరండి బీసీ బిడ్డలారా

కేసముద్రం/ నేటి దాత్రి

 

వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు.
శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం కావాలి

బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ జయశంకర్ కన్వీనర్‌గా ముక్క యుగంధర్ నియామకం

ఎన్ఎస్ఎస్ జయశంకర్ జిల్లా కన్వీనర్ గా ముక్క యుగేందర్ నియామకం.

చిట్యాల, నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ముక్క యుగంధర్ ను ను ఎన్ఎస్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా నియమించినట్లు ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ తెలిపారు. శుక్రవారం రోజున యుగేందర్ పూర్వపు కన్వీనర్ ప్రసన్నకుమార్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని, ఉత్సాహంగా రానున్న రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా కన్వీనర్ రాంబాబు, జనగాం జిల్లా కన్వీనర్ జంబు, ములుగు జిల్లా కన్వీనర్ ప్రసన్నకుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ బీసీ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ టీచర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ శేషు,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.

సాక్షి దినపత్రికపై ఏపీపోలీసుల కక్షసాధింపు: జర్నలిస్టుల నిరసన…

సాక్షి దినపత్రికపై ఏపీపోలీసుల కక్షసాధింపు: జర్నలిస్టుల నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్లో సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, శుక్రవారం మధ్యాహ్నం జర్నలిస్టులు ఊరేగింపు నిర్వహించి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని, అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.

error: Content is protected !!
Exit mobile version