జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ప్రచారం
◆:- జహీరాబాద్ శాసనసభ్యులు కొనిటి మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ జహీరాబాద్ ఎమ్మెల్యే కే మాణిక్ రావు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ, మునీర్, మైనారిటీ స్టేట్ ప్రెసిడెంట్ ముజీబుద్దీన్ మరియు తదితరులులతో కలిసి శ్రీరామ్ నగర్ బస్తీలోని మైనారిటీ సోదరులను విజ్ఞప్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,నాయకులు కృష్ణ ,బాబు ,నర్సింలు ,యువ నాయకులు మిథున్ రాజ్,ఫిర్దోస్ ,ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు..
