గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకే ఆటల పోటీలు..

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకే ఆటల పోటీలు..

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయి….

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి మెమోరియల్ టి20 లీగ్ మ్యాచ్ ఖమ్మం,హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను చెన్నూర్ ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి మెమోరియల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని ఈనెల 17న ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతుందని తెలిపారు.క్రీడలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీలు నిర్వహిస్తున్నామని అన్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ టోర్నమెంట్ లు నిర్వహిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మహిళల క్రికెట్ మ్యాచ్ లు సైతం నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిపి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి రఘునాథరెడ్డి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, క్రీడాకారులు,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి…

రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలంలో గల టోల్ ప్లాజా వద్ద 37వ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు – 2026 పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో బెల్లంపల్లి ఎ.సి.పి. రవికుమార్,జాతీయ రహదారుల సంస్థ జి.ఎం.(టి) & పి.డి. కె.ఎన్. అజయ్ మణికుమార్ లతో కలిసి వాహనదారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని తెలిపారు.రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా యువత మరణానికి గురవుతున్నారని,ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తుందని తెలిపారు.వాహనాన్ని వేగంగా నడపడం,పరిమితికి మించి లోడ్ తో ప్రయాణించడం కారణంగా వాహనాలు అదుపు తప్పుతాయని, అందువలన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం,జాతీయ రహదారిపై వాహనాలను నిలుపుదల చేయడం, పశువులను రహదారిపైకి వదలడం చేయవద్దని,ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, తద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చని తెలిపారు. జాతీయ రహదారుల సిబ్బంది రహదారి నియమ, నిబంధనలను పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలని,రహదారులపై పని చేసే సిబ్బంది సైతం పని చేసే సమయంలో సేఫ్టీ కిట్స్ ధరించాలని తెలిపారు.ప్రతి ఒక్కరూ సరైన కండిషన్ లో ఉన్న వాహనాన్ని మాత్రమే ఉపయోగించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని,డ్రైవింగ్ చేస్తూ 5మొబైల్ లో మాట్లాడవద్దని, ట్రాఫిక్ భద్రత నియమాలను పాటించాలని తెలిపారు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నామని, రహదారులపై వేగ నియంత్రణ కొరకు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాహనదారులకు తెలిసే విధంగా సూచికలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి…

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాలనేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థినీ, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూ అమలు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.విద్య అజ్ఞానాన్ని దూరం చేస్తుందని తెలియజేస్తూ బాలిక విద్యను ప్రోత్సహించారని,మహిళల హక్కుల కోసం తన వంతు కృషి చేశారని తెలిపారు.మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలిజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల నేటి ధాత్రి:

 

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని చెన్నూర్ మండలం కిష్టంపేట లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలను విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో డిగ్రీ కళాశాలలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.చెన్నూర్ మండల కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆసుపత్రుల నిర్మాణం చేపట్టి వైద్య సేవలను అందుబాటులో ఉంచుతుందని తెలిపారు.ఈ క్రమంలో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి సందర్శించారు.వివిధ భూ సమస్యలపై భూ భారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులతో సరి చూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి త్వరగా జారీ చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి,షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. కాంసాని లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,బేస్ మెంట్,లెంటల్,స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని వేలాల గ్రామంలో గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని,ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి….

నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించడం కోసం వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ  వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 216 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని,నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించారు.భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జాతీయ రహదారి 63 నిర్మాణంలో భాగంగా భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.వివిధ రకాల ధ్రువపత్రాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ డి.ఈ.సజ్జత్ భాషా, ఈ.ఈ.లక్ష్మీనారాయణ, ఎ.ఈ.ఈ.అనూష,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు మూడు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజా రక్షణ చర్యలలో అప్రమత్తంగా ఉండాలని,జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలు,వాగులు, లోతట్టు ప్రాంతాలలో అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నివాసాలలో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. జిల్లాలోని ప్రాజెక్టులు, ఉదృతంగా ప్రవహించే నదులు,వాగుల వద్దకు ఎవరు వెళ్లకూడదని,పోలీసు శాఖ అధికారులు బందోబస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల సమీపానికి వెళ్ళకూడదని,రైతులు పొలాలలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, చేపల వేటకు ఎవరు వెళ్లకూడదని,అత్యవసర సమయాలలో మాత్రమే ప్రజలు బయటకు రావాలని తెలిపారు.తక్షణ సహాయం, పునరావాస కేంద్రాల సమాచారం ఇతర వివరాల కొరకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ 08736-250501 నంబర్ ఏర్పాటు చేసి, 24 గంటలు తక్షణ సహాయం సేవలు అందుబాటులో ఉంచడం జరిగిందని,జిల్లాలో వరద,ఘటనల సమాచారం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు అందించాలని తెలిపారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటుందని,ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.

రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

రెవెన్యూ సదస్సును సందర్శించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్, నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల్ జిల్లా జైపూర్ మండల్ నర్సింగాపూర్, మిట్టపల్లి గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో రెవెన్యూ అధికారులు ప్రజల భూ సమస్యలను పరిష్కరించడానికి రంగంలోకి దిగినట్లు తెలిపారు.రెవెన్యూ అధికారులు ప్రజల వద్దకి వెళ్లి వారి సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు చేపట్టి వారి సమస్యలు పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,తహసిల్దార్ వనజా రెడ్డి, వివిధ శాఖల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version