న్యాల్కల్ మండల నీటివనరుల గణన పూర్తిచేయాలని ఆదేశం…

న్యాల్కల్ మండల నీటివనరుల గణన పూర్తిచేయాలని ఆదేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల పరిధిలోని అన్ని నీటివనరుల గణనను ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తిచేయాలని తహసీల్దార్ ప్రభులు అధికారులను ఆదేశించారు. న్యాల్కల్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, నీటివనరుల గణన ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వానికి ఖచ్చితమైన వివరాలు అందజేయాలని ఆయన సూచించారు. గణనలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నివేదికలను సమయానికి పంపాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి అభినాష్ వర్మ, మండల గణాంక అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓలు, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

నూతన న్యాల్కల్ ఎంపిడిఓ సన్మానం చేసిన సిబ్బంది….

నూతన న్యాల్కల్ ఎంపిడిఓ సన్మానం చేసిన సిబ్బంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల్ నూతన ఎంపిడిఓ షగుఫ్తా ఇఫ్తాత్ బాధ్యతలు సోమవారం స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్యాలయం సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

నూతన ఎంపీడీవోను శాలువాతో సన్మానించిన సిబ్బంది…

నూతన ఎంపీడీవోను శాలువాతో సన్మానించిన సిబ్బంది

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన రామ.రామకృష్ణ ని శాలువాతో స్వాగతం పలికి అంబేద్కర్ చిత్ర పటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలిపిన కార్యాలయ సిబ్బంది.
ఈ కార్యక్రమంలో ఏఈ ఉదయ్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ సరోజన ఈసి రజినీకాంత్,పంచాయతీ కార్యదర్శులు నాగరాజు, నర్సింగం,టిఎ లు కుసుమ, స్వప్న,రాధిక ఫీల్డ్ అసిస్టెంట్ నీరటి రాములు,మరియు కార్యాలయ సహాయకులు గోవింద్ నవీన్ కుమార్, దొంతుల రాజేందర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రకాష్, సాగర్,అభిరామ్,సాయి కృష్ణ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లంచం..అడిగిన కఠిన చర్యలు…

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లంచం..అడిగిన కఠిన చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/tXgBWROWbyE?si=Zv7FQIG0lsYw3Vf

 

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లంచాలు అడుగుతున్న పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. లబ్ధిదారుల నుంచి బిల్లుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులపై కాల్ సెంటర్ ద్వారా విచారణ జరిపి, ఇప్పటివరకు 10 మందిని సస్పెండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. లంచం అడిగితే 1800 599 5991 నెంబర్ కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు అందిన 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వందశాతం పన్నులు వసూలు చేయాలి

వందశాతం పన్నులు వసూలు చేయాలి

పంచాయితీ కార్యదర్శులకు డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

గ్రామ పంచాయితీల పరిధిలోని వివిధ రకాల పన్నులు వంద శాతం వసూల్ చేయాలని నర్సంపేట డివిజనల్ పంచాయితీ అధికారి రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.గురువారం దుగ్గొండి మండల కేంద్రంలో గల
మండల పరిషత్ కార్యాలయంలో డివిజనల్ పంచాయతీ అధికారి కే రాజీవ్ కుమార్ పంచాయతీ కార్యదర్శులతో ఎంపీఓ శ్రీధర్ గౌడ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎల్ పీఓ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ
ట్రేడ్ లైసెన్సులు, సెల్ టవర్లు, ఇంటి పన్నులు, నల్ల పన్నులు వంద శాతం వసూలు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ రికార్డులన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు .!

పంచాయతీ కార్యదర్శుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఎంపీడీవో కి వినతిపత్రం అందజేసిన పంచాయతీ కార్యదర్శులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు పంచాయతీ కార్యదర్శుల యొక్క దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జైపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతి కార్యదర్శులు సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపిడిఓ ఇట్టి లేఖను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎంపిఓ శ్రీపతి బాపు రావు,పంచాయతి కార్యదర్శులు సుమన్,సురేష్, సత్యనారాయణ,ఉదయ్ కుమార్,శ్రీనివాస్,ప్రశాంత్,సాయి కిరణ్,రమాదేవి,తిరుమల,సుప్రియ మరియు జూనియర్ అసిస్టెంట్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version