బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్…

బీసీ బందుకు సంపూర్ణ మద్దతు చంద్రగిరి శంకర్

ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక విమలక్క ,రైతు కూలీ సంఘం (ఆర్ సి ఎస్), ఏఐఎఫ్టియు లు
సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.
ఈ సందర్భంగా
ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ…
గడిచిన డెబ్బై ఎనిమిదేండ్ల భారత దేశ స్వాతంత్రంలో శోషిత జనసమూహానికి ఏమీ న్యాయం జరకపోగా ఇంకా పీడితులుగా మిగిలిపోయారనీ,కేంద్రంలోని భాజపా సర్కారు మొదటి నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటూనే వస్తుందనీ,పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉన్నారనీ,దేశంలో భాజపా సర్కారు ఇప్పటికీ కుల గణన జరపకుండా న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్లను బీసీ,ఎస్ సి,ఎస్ స్టీ, మైనార్టీలకు అందకుండా చేస్తున్నదనీ,భాజపా సర్కారు కూలాల మధ్య చిచ్చుపెట్టడానికి ఈ డబ్లూ ఎస్ రిజర్వేషన్ అమలు చేసి బీసీలకు అన్యాయం చేసిందనీ,
ఏ పార్లమెంటరీ రాజకీయ పార్టీలైన గడిచిన డెబ్బై ఏళ్లుగా ఎన్నికల తంతులో ఇచ్చిన బూటకపు హామీలు ప్రజలని మభ్యపెట్టడానికేనని,అయితే తెలంగాణ రాష్ట్రంలో 2023 లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్ లను ప్రవేశపెట్టిందనీ,దీని కోసం జీఓ 9 తీసుకొచ్చిందనీ,కేంద్రానికి ఆర్డినెన్సు కూడా పంపిందనీ,భాజపా సర్కారు ఫాసిస్టు పాలనలో బీసీలను అణచడం కోసం బీసీ ఆర్డినెన్సును అడ్డుకుందనీ,
తక్షణమే బీసీ ల 42 శాతం బిల్లును షెడ్యూల్డ్ 9 లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని, ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేస్తుందనీ,ఈ నెల 18 న జరిగే బంద్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రగిరి శంకర్ తెలిపారు.

బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి….

బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డా.సిరికొండ శ్రీనివాసాచారి

పరకాల నేటిధాత్రి

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ల కోసం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు,విద్యావేత్త ఎస్వీ విద్యాసంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ ఓ 9 కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ,రిజర్వేషన్ ల బిల్లును షెడ్యూల్ 9 లో చేర్చాలని ఇందు కోసం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.30 బీసీ సంఘాల వాదనలు వినకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన తరువాత హైకోర్ట్ స్టే ఇవ్వడం బీసీ లను మోసం చేయడమేనని అన్నారు.ఇట్టి రిజర్వేషన్ సాధించేవరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొసం చేసిన తరహ ఉదృతమైన ఉద్యమాలు,పోరాటాలు సాగిస్తామని తెలిపారు.
ఇందుకోసం ఈ నెల 18 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బీసీ ల బంద్ ను అన్నివర్గాల ప్రజలు,కులాలు,మతాలకు అతితంగా స్వచ్చందంగా బంద్ పాటించి,సహకరించి బంద్ ను విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమము లో బీసీ రాష్ట్ర నాయకులు ఎడ్ల సుధాకర్,బసాని సోమరాజుపటేల్,డా.శివదేవ్,సూత్రపు శివాజీగణేష్ నాయి,సూర సతీష్ పటేల్,అల్లం మధుసూదన్ ముదిరాజ్,మహిళా నాయకులు దుంపేటి యశోద,మౌనిక,తూముల అనిత,లక్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version