రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక..

రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పట్టణ కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్” విద్యార్థుల ఎంపిక

పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ చేతుల మీదుగా ఘన సన్మానం

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన కృష్ణవేణి టాలెంట్ పాఠశాల విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయి కి ఎంపికయ్యారు. ఈనెల 28 జూలై సోమవారం రోజున జిల్లాలోని లక్షక్ పేట్ పట్టణంలోని మాత్మ గాంధీ జ్యోతిబాపూలే పాఠశాల మైదాన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నుండి దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొనగా హోరవోరిగా సాగిన
ఈ పోటీలలో మందమర్రి పట్టణానికి చెందిన హైదరాబాద్ కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్ విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. అండర్ -16 జావెల్లింగ్ త్రో.. లో దురిశెట్టి నిశాంత్ అదేవిధంగా ..అండర్ –
14 లో ..షహబాజ్ లు అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలను సాధించి జిల్లాకు అదేవిధంగా తమ పాఠశాలకు వన్నె తెచ్చారు. ఈ సందర్భం గా.. ఈ ఇరువురి విద్యార్థులను మందమరి పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ,ఎస్సై రాజశేఖర్లు సన్మానించారు.
ఈ సందర్భంగా ..వారు మాట్లాడుతూ.. ఆటలలో ఎప్పుడూ. . ముందుండాలని ,ఆటలతో గొప్ప – గొప్ప ఉద్యోగాలు సాధించవచ్చని,ఆటలతో సంఘంలో విలువలు పెరుగుతాయని, ఆగస్టు మాసంలో హనుమకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి, పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి మందమర్రి పట్టణానికి గొప్ప పేరు తీసుకురావడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ..కోచ్ రాం వేణును అభినందించారు. ఈ విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ రాం వేణు ప్రధానోపాధ్యాయులు గుణవతి సీనియర్ ఉపాధ్యాయులు మోకనపల్లి బద్రి శ్రీజ షరీనా శివాని సదానంద కృష్ణ మోహన్ వెంకటస్వామి పలువురు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.

అరుణోదయ రాష్ట్రస్థాయి సదస్సు జయప్రదం చేయాలి.

*అరుణోదయ రాష్ట్రస్థాయి సదస్సు
జయప్రదం చేయాలి*

నర్సంపేట,నేటిధాత్రి:

ఈనెల 19 న ఇల్లందులో జరుగు అరుణోదయ రాష్ట్రస్థాయి సదస్సు
జయప్రదం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకులు ఇట్టబోయిన రవి, గుర్రం అజయ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పట్టణంలోని సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో సదస్సు కరపత్రాల ఆవిష్కణ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పక్కనపెట్టి కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రజా సంపాదన దోచిపెడుతూ ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకచ్చి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అడవి ప్రాంతంలో పోలీసు మిలిటరీ బలగాలతో అడవిలో నివసిస్తున్న ఆదివాసులను హింసించి చంపుతున్నారని ప్రశ్నించే మేధావులను జైల్లో నిర్బంధిస్తున్నారని, కళాకారులుగా వ్యతిరేకించవలసిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగంలోనే హక్కుల కోసం నిర్వహించే ఉద్యమానికి ప్రజలంతా ఆసరాగా నిలవాలని జులై 19 న ఇల్లందులో జరుగు రాష్ట్రస్థాయి అరుణోదయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రవితేజ,ఉషాకిరణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు.

రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ లో జిల్లాకు రెండు బంగారు పథకాలు

కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

జూన్ 28, 29 తేదీలలో మహబూబ్ నగర్ లో నిర్వహించిన తెలంగాణ కిక్ బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులు పాల్గొని పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు సీనియర్ మాస్టర్, కిక్ బాక్సింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి శ్రీనివాస్ ( కరాటే ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మ్యూజికల్ క్రియేటివ్ ఫామ్ విభాగంలో టి హరిణి బంగారు పతకం, బి మగ్న నిర్వాన వెండి, టి దృతిపర్ణిక, ఎం విధ్విన్, బి లవణ్ కుమార్, బి ఆరాధ్య లు రజిత పతకాలు సాధించారని తెలిపారు. క్రియేటివ్ వెపన్ విభాగంలో పి అవిక వెండి పతకం, టి హరిణి, కె కౌశిక్ మగ్న నిర్వాన రజిత పతకాలు, చిల్డ్రన్, ఎంగెస్ట్ కేటగిరి పాయింట్ ఫైటింగ్ విభాగంలో బి ఆరాధ్య వెండి పతకం, టి హరిణి రజిత పతకం, బి మాగ్న నిర్వాన, కె హరిణి, టి దృతిపర్ణిక లు వెండి పతకాలు, ఎం విధ్విన్ బంగారు , కె కౌశిక్, ఎం విధిష దేవి రజిత పతకాలు, ఎస్ సంజన బంగారు పతకం సాధించారన్నారు. అదేవిధంగా లైట్ కాంటాక్ట్ ఫైటింగ్ విభాగంలో ఎం విధిష దేవి, ఎస్ సంజన, బి లవణ్ కుమార్ లు బంగారు పతకాలు, కె హరిణి రజిత పతకాలు, సీనియర్ మాస్టర్స్ విభాగంలో క్రియేటివ్ ఫామ్, క్రియేటివ్ వెపన్ విభాగాలలో జి అశోక్ వెండి, రజిత పతకాలు సాధించినట్లు తెలిపారు. పతకాలు సాధించిన తమ విద్యార్థులను తెలంగాణ కిక్ బాక్సింగ్ అధ్యక్షులు రామాంజనేయులు, కార్యదర్శి మహిపాల్ లు ప్రత్యేకంగా అభినందించినట్లు ఈ సందర్భముగా మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు.

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ.

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ

సిరిసిల్ల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ

సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )

 

 

 

 

 

రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అకాడమీ & స్పోర్ట్స్ హాస్టల్ లో ప్రవేశమునకు ఎంపికల నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను 1 జూన్,2025 నుండి వాలీబాల్ అకాడెమి రాజన్న సిరిసిల్ల, సరూర్నగర్ ఇన్డోర్ స్టేడియం, సిద్ధిపేట,మరియు మహబూబ్ నగర్ అకాడమి, ప్రాంతీయ క్రీడా హాస్టల్ – హన్మకొండ, అథ్లెటిక్స్ అకాడెమి – ఖమ్మం, సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి – సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., హాకీ అకాడెమి – వనపర్తిలో మంజూరు చేయబడిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా, ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కొరకు ఎంపికలు/ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనుంది.

 

ఈ క్రింద తెలుపబడిన తేదీలలో, ఆయా సెంటర్లలో రాష్ట్రం లోని ప్రతి అకాడెమీకి/హాస్టల్ కు సంబంధించిన ఎంపికలు / సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించబడును.

ఎంపిక స్థలం / వేదిక క్రొత్తగా ప్రతిపాదించ బడిన తేదీలు నిర్ధారించబడిన వయసు

1 వాలీబాల్ అకాడెమి – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల, వాలీబాల్ అకాడెమి , రాజీవ్ నగర్ మినీ స్టేడియం, సిరిసిల్ల 10 జూన్ 2025 Under 14 to 16 Years
at Saroornagar & Rajanna Sircilla
(30th June 2009 to 1st July -2011)
(Under 16 to 18 years-
only at Saroor nagar)
( 1st July-2009 to 30th June 2007)

వాలీబాల్ అకాడెమి, సరూర్ నగర్
3 వాలీబాల్ అకాడెమి, (సిద్దిపేట) సిద్దిపేట, వాలీబాల్ అకాడెమి 1 జూన్ 2025 (Under 14 to 16 years) Between (30th June 2009 to 1st July -2011)
4 వాలీబాల్ అకాడెమి –మహబూబ్ నగర్ మెయిన్ స్టేడియం గ్రౌండ్ మహబూబ్ నగర్ 12, 13 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)
5 సైక్లింగ్ మరియు రెజ్లింగ్ అకాడెమి, సైక్లింగ్ వేలోడ్రోమ్,O.U., సైక్లింగ్ వేలోడ్రోమ్, O.U.,క్యాంపస్ 10 & 11 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)
6 Regional క్రీడా వసతి గృహం, హనుమకొండ
DSA, జవహర్లాల్ నెహ్రు స్టేడియం, హనుమకొండ
10 & 11 జూన్ 2025 Under10-12 Years ( for Gymnastics & Swimming ) ( 30th June 2013 to 1st July 2015) Under 14 to 16 Years ( Athletics, Handball, Wrestling) ( 30th June 2009 to 1st July 2011)
7 హాకీ అకాడెమి, వనపర్తి DSA, హాకీ అకాడెమి, వనపర్తి 12 జూన్ 2025 (Under 14 to 16years)(30th June 2009 to 1st July -2011)
8 అథ్లెటిక్స్ అకాడెమి, ఖమ్మం DSA,సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం 12 జూన్ 2025 (Under 14 to 16 years) (30th June 2009 to 1st July -2011)కావున,రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆసక్తిగల బాల బాలికలు పైన తెలిపిన స్పోర్ట్స్ అకాడెమీలలో మరియు స్పోర్ట్స్ హాస్టల్ లో అడ్మిషన్ పొందాలనుకొనే వారు పైన తెలిపిన తేదీలలో ఆయా సెంటర్లలో నిర్వహించే ఎంపికలకు/ సెలక్షన్ ట్రయల్స్ కు హాజరు కాగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన ప్రగతి విద్యార్థి.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన ప్రగతి విద్యార్థి

రాయికల్ నేటి ధాత్రి. .

మార్చి 15.జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో శుక్రవారం రోజు నిర్వహించబడిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రాయికల్ పట్టణ కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలకు చెందిన పస్తం విష్ణు 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రతిభను కనబరిచి,ఈనెల 23న హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా విష్ణును పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, కరస్పాండెంట్ జయశ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, పాఠశాల పి ఈ టి మహేష్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version