అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి…

అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులంతా సిద్దామవ్వాలి

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్

పరకాల,నేటిధాత్రి

 

30న తెలంగాణ అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పరకాల నియోజకవర్గ అధ్యక్షులు రావుల రంజిత్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.గత8సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల హక్కులపై పోరాటం చేస్తున్నామని,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టినటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు,కమిటీ వేస్తానని చెప్పి సంవత్సరాలు కావస్తున్న కూడా కమిటీ వేయడం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు స్వచ్ఛందంగా అసెంబ్లీని ముట్టడికి సిద్ధమాయ్యమన్నారు.తెలంగాణలోని ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా కచ్చితంగా సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు.

మెట్‌పల్లిలో అంబేద్కర్ ఆశయ సాధనకు పిలుపు…

 

అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కును నిజాయితీగా ఉపయోగించడమే ఆయనకు నిజమైన నివాళి

ములుగు టౌన్ నేటి ధాత్రి

ములుగు జిల్లాలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరికీ ఎలాంటి విభేదాలు ధనికా, పేద, కులం, మతం, భాష, ప్రాంతం, స్త్రీ, పురుష, అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన ఓటు హక్కు కల్పించారని ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా సమాజ కోసం ఉపయోగించుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ తెలియజేశారు

ములుగు జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ మాట్లాడుతూ ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగం నుండి ప్రతి ఒక్క సాధారణ పౌరుడికి ఏదైనా హక్కు లభించింది అంటే అది ఓటు హక్కు మాత్రమేనని ఆ హక్కును ఉపయోగించడం వల్లనే ఈ దేశంలో ఎంతో కొంత ప్రజాస్వామ్యం ముందుకు పోతుందని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కును ఈ దేశంలో మెజారిటీ ప్రజలు దుర్వినియోగం చేస్తూ డబ్బులకు మద్యానికి కానుకలకు అమ్ముకొని ఓటు ను నిర్వీర్యం చేస్తున్నారని అలా చేయడం వల్లనే ఇంకా ఈ దేశం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతుందని అన్నారు మొదట ప్రజలు వారి ఓటు హక్కును ఎలాంటి కానుకలకు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేసినప్పుడే రాజకీయాలలో రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుందని అన్నారు నోటుకు ఓటు వేయడం ద్వారా ఆ నోట్లతో కొన్న ఓట్లతో గెలిచి నోట్లు సంపాదించుకుంటున్నారు తప్ప దేశ ప్రజల జీవితాలను మాత్రం మార్చలేకపోతున్నారని అన్నారు ఓటు హక్కు అనేది ప్రతి ఒక్క పౌరుడికి ఉంటేనే ఈ దేశ ప్రజలందరిలో పేదరికం సాంఘిక అసమానతలు ఆర్థిక అసమానతలు లేకుండా పోవాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు అంత గొప్ప అవకాశాన్ని ఆయుధాన్ని దేశ ప్రజలకు ఇచ్చినప్పటికీ ప్రజలు మాత్రం ఆ అవకాశాన్ని ఆయుధాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించడంలో నేటికీ విఫలం అవుతూనే ఉన్నారని అన్నారు ఇప్పటికైనా దేశంలో ఉన్న ప్రజలు యువత నోటుకు ఓటు కాకుండా నిజాయితీ ఓట్లతో నాయకులను ఎన్నుకుంటే ఆయా నాయకులు కూడా నిజాయితీగా పనిచేసి గ్రామం మండలం జిల్లా రాష్ట్రం దేశం అభివృద్ధిలో ముందుకు పోవడానికి కృషి చేస్తారని అన్నారు కానీ ఈ రోజుల్లో ప్రజలు ఓట్లు వేస్తే నాకేం వస్తుంది నాకు ఎంత ఇస్తారు ఓట్లు వేస్తాం అని అడుక్కునే దుస్థితి ఏర్పడిందని అన్నారు ఓటు హక్కు ఉన్నది అడుక్కోవడానికి కాదు నిజాయితీగా ఓటేసి గెలిచిన వాడిని గల్లాపాటి అభివృద్ధి ఏది అని అడగడానికి ఉందన్న విషయం మర్చిపోతున్నారు కాబట్టి ప్రజలందరూ యువకులందరూ ఓటు అనే హక్కును నీతి నిజాయితీగా ఉపయోగించుకోవాలని ఈ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి అదే నిజమైన నివాళి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు కోటపాక చంటి రాజ్యాంగ పరిరక్షణ సమితి నాయకులు జన్ను రవి రమేష్ సాంబయ్య రాములు కాకి అశోక్ తదితరులు పాల్గొన్నారు

మెట్‌పల్లిలో అంబేద్కర్ ఆశయ సాధనకు పిలుపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-06T145917.009.wav?_=1

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలీ
మెట్ పల్లి నేటి ధాత్రి

 

 

 

మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా
భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మహమ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. శనివారం మెట్ పల్లి పట్టణంలో మండల పరిషత్ కార్యాలయ సమీపంలో గల అంబేద్కర్ పార్కులో అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరంమెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబొద్దిన్ పాషా మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం అమలు అవుతుందని అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించ దగ్గ విషయమని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి దేశ పాలన సుభిక్షంగా జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన హక్కులు కల్పించబడ్డాయి అన్నారు. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ రాజ్యాంగం సక్రమంగా అమలు అయ్యే విధంగా సహకరించాలని కోరారు.

పూలే ఆశయాలకు ఘన నివాళులు

జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

సామాజిక న్యాయదిక్సూచి మహాత్మా
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దామని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు కోరబోయిన కుమారస్వామి హన్మకొండ శ్రీధర్ అన్నారు. సిపిఎం నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అయన 135వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే ఎన్నో త్యాగాలుచేసి సాధించిన ఎన్నో హక్కులను నేటి పాలకులు మెజార్టీ ప్రజలకు దక్కకుండా చేస్తున్నారు. ప్రైవేటికరణ, ప్రపంచీకరణ, పట్టనీకరణకు పాలకుల దోపిడితోడై ప్రజల మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, కలకోట అనిల్, బిట్ర స్వప్న ,ఉదయగిరి నాగమణి, సరిత, యాక లక్ష్మి, సంతోష్, రవి, ఎడ్ల శివకుమార్, ఐటిపాముల వెంకన్న, వీరన్న, ప్రశాంత్, నర్సింహా రాములు తదితరులు పాల్గొన్నారు.

బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలు…

బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు వ్యతిరేకంగా అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా
రవి పటేల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరఫున 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న మొదటి నుండి బీసీలను కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని చెబుతున్నాడు ఇప్పుడు అదే జరుగుతుంది
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరగబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంతో మాట్లాడి షెడ్యూల్ 9 లో చేర్చడం కోసం కృషి చేయాలి
దానికి మద్దతుగా అన్ని పార్టీలు కూడా ద్వంద వైఖరి వీడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి
బీసీలకు జరుగుతున్న అన్యాయం విద్య ఉద్యోగ వ్యాపార అన్ని రంగాలలో దామాషా ప్రకారం దక్కవలసిన వాటి కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేము మా కార్యాచరణ మా చిత్తశుద్ధి తో పనిచేస్తున్నాను ప్రజలు అందరు కూడా గమనించి ఈ రెడ్డి వెలమల పార్టీలను బొంద పెట్టవలసినటువంటి అవసరం ఉంది
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్ గండు కరుణాకర్ తీన్మార్ జై అశోక్ శ్రీకాంత్ కిరణ్ పాల్గొన్నారు

“బీసీరిజర్వేషన్”..”బిచ్చం కాదు”.. “బీసీల హక్కు”…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T115054.857.wav?_=2

 

“బీసీరిజర్వేషన్”..”బిచ్చం కాదు”.. “బీసీల హక్కు”.

సగర సంగం రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి “కానిగంటి శ్రీనివాస్”.

“నేటిధాత్రి”, హుజూరాబాద్.

 

ఈరోజు రాష్ట్రవ్యాప్త “బీసీ బంద్” లో భాగంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల్ సగర ఉప్పర సంఘం ఆధ్వర్యంలో హుజరాబాద్ లో “బీసీ బంద్” లో తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కాని గంటి శ్రీనివాస్.

 

హుజురాబాద్ అధ్యక్షులు యంజాల వాసు. చింత చంద్రయ్య. రాచమల్ల రఘు. దొరికిన చంద్రమౌళి. కొల్లూరి మధు. భాస్కర్. అనిశెట్టి శివ. సతీష్. కొల్లూరి అనిల్. అనిశెట్టి పరమేశ్వర్ సదరు బంధువులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ హుజురాబాద్ లో ర్యాలీ లో పాల్గొనడం జరిగింది.

బీసీ బందుకు మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి

బీసీ బందును విజయవంతం చేయాలి రవి పటేల్

భూపాలపల్లి నేటిధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

టి ఆర్పి పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లాలో టి ఆర్పి పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ
తెలంగాణలో ఉన్న 65% మంది బీసీ ప్రజలకు 42 శాతం రిజర్వేషన్ కొరకు ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యాంగబద్ధంగా మనం హక్కులు సాధించుకోవాలంటే ప్రజా పోరాటాలే ప్రామాణికంగా ఉంటాయి కనుక స్వాతంత్రోద్యమం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు బీసీ ఉద్యమం ఇందులో భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు విద్యాసంస్థలు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అందరు కూడా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని రవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గండు కర్ణాకర్ సామర చంద్రశేఖర్ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి….

బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డా.సిరికొండ శ్రీనివాసాచారి

పరకాల నేటిధాత్రి

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ల కోసం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు,విద్యావేత్త ఎస్వీ విద్యాసంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ ఓ 9 కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ,రిజర్వేషన్ ల బిల్లును షెడ్యూల్ 9 లో చేర్చాలని ఇందు కోసం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.30 బీసీ సంఘాల వాదనలు వినకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన తరువాత హైకోర్ట్ స్టే ఇవ్వడం బీసీ లను మోసం చేయడమేనని అన్నారు.ఇట్టి రిజర్వేషన్ సాధించేవరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొసం చేసిన తరహ ఉదృతమైన ఉద్యమాలు,పోరాటాలు సాగిస్తామని తెలిపారు.
ఇందుకోసం ఈ నెల 18 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బీసీ ల బంద్ ను అన్నివర్గాల ప్రజలు,కులాలు,మతాలకు అతితంగా స్వచ్చందంగా బంద్ పాటించి,సహకరించి బంద్ ను విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమము లో బీసీ రాష్ట్ర నాయకులు ఎడ్ల సుధాకర్,బసాని సోమరాజుపటేల్,డా.శివదేవ్,సూత్రపు శివాజీగణేష్ నాయి,సూర సతీష్ పటేల్,అల్లం మధుసూదన్ ముదిరాజ్,మహిళా నాయకులు దుంపేటి యశోద,మౌనిక,తూముల అనిత,లక్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి…

* బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి

చేవెళ్ల,నేటిధాత్రి:

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

బీసీలకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు,స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు ఆర్థికంగా ఆడుకోవాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చేవెళ్ల నియోజకవర్గం కె.రామస్వామి, నియోజకవర్గ బీసీ కన్వీనర్ పాడాటి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల న్యాయమైన హక్కులు కల్పించి వారి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ,జెడ్పిటిసి సర్పంచు, ఎన్నికల్లో ప్రతి గ్రామంలో 42 శాతం రిజర్వేషన్ కోటా ప్రకారం స్థానాలు కల్పించాలని అన్నారు. రాష్టంలో అత్యధికంగా బీసీలు ఉన్నారని వారి అభివృద్ధికి బీసీ బందును ప్రవేశపెట్టి బడ్జెట్లో అధికనిధులు కేటాయించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కేంద్రం బీసీలకు ఇతర వర్గాలకు ఇండ్లు మంజూరులో ఇంటికి 10 లక్షలు రూపాయలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వాలు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని అన్నారు. నామినేటెడ్ పదవులలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.రైతులు యూరియా కోసం గత 20 రోజులగా అనేక ఇబ్బందులు పడుతున్నారని వారికి సకాలంలో ఎరువులను అందించి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి బీసీ సంఘాల నాయకులు ఎం. సుధాకర్ గౌడ్,
మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల, నియోజకవర్గం బీసీ కన్వీనర్ పాడాటి వెంకటయ్య, కో కన్వీనర్ జీ నరసింహులు, మొయినాబాద్ మండల సిపిఐ కార్యదర్శి కే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలా నిజమైన పక్షపాతి మందకృష్ణ మాదిగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T105618.755.wav?_=3

 

ముస్లింలా నిజమైన పక్షపాతి మందకృష్ణ మాదిగ.

◆:- అబ్రహం మాదిగ………

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ముస్లింలా హక్కుల కోసం పోరాడింది.
దాడులు జరిగితే ఉద్యమించింది..
సచార్ నివేదిక అమలుకు నినదించింది.
రిజర్వేషన్ల వాటా కోసం స్పందించింది..
బట్టలు కాదు.. బ్రతుకు కావాలంటూ
రాజకీయ ప్రాతినిధ్యంకై రణం చేసింది..
ఉగ్రవాదుల పేరుతో ఎన్కౌంటర్ చేస్తే
ముక్తకంఠంతో నిరసిస్తూ ఖండించింది.
సినిమాలలో మీడియాలో సామాజిక మాధ్యమాల్లో
ముస్లింలు అంటేనే టెర్రరిస్టులుగా, సంఘవిద్రోహ శక్తులుగా చూపిస్తుంటే ఆ సమాజ పోకడను
తప్పుబట్టి సమానత్వపు సందేశాన్ని ఇచ్చింది దండోరా.

 

 

హిందూ దేవాలయాలకు కెసిఆర్ వందల కోట్లు ప్రకటిస్తుంటే, హిందూ దేవాలయాలే కాదు
ఘన చరిత్ర కల్గిన పవిత్ర మక్కా మసీదుకు కూడా వందకోట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది.

నసీమా అనే చిన్నారి గుండె కోసం తల్లడిల్లింది
ఆసమస్య పరిష్కారానికి ఓ నూతన పోరాటానికి శ్రీకారం చుట్టి వేలాది గుండెలను ఒకటి చేసి పోరాటం చేసింది. “ఆరోగ్యశ్రీ పథకమై” ఆయుస్సు పోసింది.

ఆడ బిడ్డల మాన-ప్రాణాలను కాపాడే కర్తవ్యాన్ని
భుజాన మోసింది..అసిఫా, తార బేగం లాంటి ఎందరో ముస్లిం బిడ్డలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే వాటిని నిరసిస్తూ ముస్లింల గొంతై గర్జన చేసింది.

తెలంగాణ పోరులో ముందున్నా దగా పడ్డ
రహిమున్నిసా త్యాగాన్ని తట్టిలేపింది.

మదార్ సాహెబ్ అన్నను మా సంఘానికి
జిల్లా అధ్యక్షుల్ని చేసి అనేక సామాజిక పోరాటాల్ని ముందుకు నడిపింది..మాదిగ హక్కులే మానవ హక్కులంటూ సమరం సాగించింది.

తాను పెట్టిన మహాజన సోషలిస్టు పార్టీలో
ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించింది.
పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షులుగా నియమించింది.
రజి హైదర్, ఇస్లాముద్దీన్ గార్లను లీడర్లుగా నిలబెట్టింది.
సెల్లులో బందీలు కాదు ముస్లింలు “బాద్ షా” లవ్వాలన్నది.. షేక్ బందగీల్లా తెగువ చూపాలన్నది ముస్లింల అభ్యున్నతి కోసం నిబద్ధతతో కొట్లాట కొనసాగించింది మాన్యులు మందకృష్ణ మాదిగ గారే.!

జస్టిస్ మురళీధరన్ కమిషన్, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్, జస్టిస్ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఇలా అనేక కమిటీలు వేసినా సిఫారిసులు చేసిన వాటిని అమలు చేయకుండా ప్రభుత్వాలు దగా చేస్తుంటే, ఆమోసాన్ని ఎండగడుతూ ఉద్యమించింది.

ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతుంటే వారిపక్షాన మాట్లాడితే మా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని పార్టీలు వివిధ నాయకులే మౌనం వహిస్తుంటే, ముస్లింలకు మద్దతుగా నిలబడి, మేము అండగా ఉన్నామని ప్రకటించి వారి పక్షాన నిలిచింది.

ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, వేసిన కమిటీల సిఫారసులను అమలు చేస్తే చాలు ముస్లింల జీవన విధానంలో మార్పులు, పురోగతి వస్తుందని వాటి అమలుకు డిమాండ్ చేసింది, వక్ఫ్ భూముల పరిరక్షణకు తన వానిని వినిపించింది. వారి అభివృద్ధి,అభ్యున్నతికి తనదైన శైలిలో శ్రమించింది ఎమ్మార్పీఎస్ ఉద్యమమే.

దళిత్-ముస్లిం భాయ్ భాయ్”
“దళిత-ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి” అనే
నినాదం ఇచ్చింది.. ఆ నినాదానికి బలమైన
పునాది వేసింది, ఆత్మీయతను పంచి అనురాగాన్ని పెంచింది. ఏజాతి అయినా స్వయంగా తన గుణగణాలను మార్చుకోనంత వరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు: దివ్య ఖురాన్ 13:11 సూక్తిని సందేశంగా ఇచ్చి ఐక్య పోరాటాలకు మన జాతుల విముక్తికి ఉద్యమించాలని పిలుపునిచ్చి మహోన్నతమైన సామాజిక, సంస్కృతిక, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ సంఘం ఎమ్మార్పీఎస్.

ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో, ఇంకెన్నో ఉన్నాయి అందుకే

ముస్లింలా పక్షాన నిజాయితీగా నిలబడి నిరంతరం పోరు చేసింది ముస్లింల పక్షపాతిగా నిలిచింది మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారే.

అతడే నిఖార్సయిన నాయకుడు,
నిజమైన సమాజ సేవకుడు
అన్నివర్గాలకు ఆప్తుడు,
ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నిలబడి
అక్కున చేర్చుకునే ఆత్మీయుడు
అపదోస్తే అండగా నిలిచే మహోన్నతుడు
మానవత్వపు పోరాటాలకు, మనిషి తత్వపు ఉద్యమాలకు కేంద్ర బిందువు అతడు.

అతడే..

సామాజిక న్యాయ స్వప్నం అతడే
మానవ హక్కుల రూపం అతడే.

కాబట్టి ముస్లింలు ఇప్పటికైనా ఒక సరికొత్త స్వతంత్ర ఉద్యమ, రాజకీయ ప్రణాళికలతో ముందుకు నడవాలి.. ముస్లింల కోసం మాదిగలు చేసిన త్యాగాన్ని,పోరాటాన్ని మరవకుండా మదిన పెట్టుకోవాలి.

నాటి స్వాతంత్ర్య ఉద్యమ అనంతరం అంబేద్కర్ గారిని విశ్వసించక గాంధీ గారిని నమ్మి, వారు చేసిన కుట్రలకు బలై నష్టపోయినట్టుగా మరొకమారు మోసపోకండి..
కృష్ణ మాదిగ గారి సారధ్యంలో సమరం సాగించండి
అలయ్.. బలయ్ తోనే లాడాయికి సిద్ధమవ్వండి.

పవిత్రంగా కొలిచే ఈరంజాన్ పర్వదినమే ముస్లిం వర్గాల ప్రజల్లో నూతన మార్పుకు నాంది కావాలని.. పార్టీల జెండాలు కాదు.. మన ప్రజల ఎజెండాలకు అనుగుణంగా ముందుకు నడవాలి.. జరుగుతున్న నష్టాన్ని గ్రహించి, పార్టీల, నాయకుల అణిచివేత దోపిడిలను మదిన తలిచి, పీడిత వర్గాలతో కలిసి సంఘటిత శక్తిగా నిలిచి, మనకోసం కొట్లాడే గొంతులకు ముస్లింలు అండగా నిలవాలి.. ఓటు చైతన్యంతో కూడిన రాజకీయ, ప్రజా చైతన్య పోరాటాలకు, దళిత ముస్లింల శాశ్వత ఐక్యతకు, పీడిత వర్గాల రాజ్యాధికార సాధనకు కేంద్రమవ్వాలని, దానికి సామాజిక న్యాయమే, సమానత్వపు సూత్రమే పునాదిగా రాజ్యాంగ ప్రవేశిక లక్ష్యాలే మేనిఫెస్టోగా మహనీయుల మార్గంలో మందకృష్ణన్న ఆశయానికి బలమై ముందుకు సాగాలని ఆదిశగా ఇప్పటినుండే అడుగులు పడాలని ఆశిస్తున్నామన్నారు,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నాం..

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నాం..

*ఏ.పీ. సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్న తీరు అభినందనీయం..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

చిత్తూరు (ఢిల్లీ)
నేటి ధాత్రి) ఆగస్ట్ 01:

ఆంధ్రప్రదేశ్ హక్కులు, ప్రయోజనాల సాధనే లక్ష్యంగా
ఏపీ కూటమి ఎంపీల బృందం పనిచేస్తుందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలియజేశారురాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఢిల్లీ పార్లమెంటు సమావేశాలు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ…, ఏ.పీ. సర్వతో ముఖాభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం.., శాఖల వారీగా.., అందిస్తున్న తోడ్పాటు అభినందినీయమని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఇదే మోడీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు.., ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో చిత్తూరు పార్లమెంట్ ను ప్రగతి పథం వైపు అడుగులేయించాలన్నదే తన సంకల్పమన్నారు.ఈ నేపథ్యంలోనే లోకసభలో ఏపీ కూటమి ఎంపీల బృందం తమ వాణిని వినిపిస్తోందన్నారు.
ఏరోస్పేస్ ఇండస్ట్రీ,స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవాకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తి. కార్యరూపం దాల్చేవ్విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అదేవిధంగా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు వంటి విషయాలను ఎన్డీఏ సర్కార్ ముందుంచి, ఫలితాలను రాబట్టే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు.
అమరావతి అభివృద్ధికి సహకారం. మామిడిరైతుల సమస్యకు పరిష్కారమైన మార్గమైన మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మామిడి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు,వారి కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నట్లు చిత్తూరు ఎంపీ వివరించారు.

మున్నూరు కాపులు పోరాడి తమ హక్కులను..!

మున్నూరు కాపులు పోరాడి తమ హక్కులను సాధించుకోవాలి
……సన్మిత్ర ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు మర్రి అవినాష్

మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పో నగంటి మల్లయ్య ,పట్టణ అధ్యక్షులు ఏ బూషి శ్రీనివాస్ లకు ఘన సన్మానం
జమ్మికుంట (నేటిధాత్రి)
మున్నూరు కాపులు ఐకమత్యంతో పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని మున్నూరు కాపు సన్మిత్ర ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు మర్రి అవినాష్ అన్నారు. మంగళవారం మున్నూరు కాపు సంక్షేమ సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నగంటి మల్లయ్య, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు ఏ బూసి శ్రీనివాస్ ల ను మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామ మున్నూరు కాపు సన్మిత్ర ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.రానున్న కాలంలో మున్నూరు కాపులు అందరు ఐక్యం కావాల్సిన అవసరమెంతైన ఉన్నదని రాజకీయంగా,ఆర్థికంగా,అందరం ఎదుగాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పొనగంటి మల్లయ్య, ఏ బూసి శ్రీనివాస్ లు మాట్లాడారు. మున్నూరు కాపుల ఐక్యత కొరకు పాటు పడతామన్నారు . మున్నూరు కాపుల ను ఏకతాటి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామన్నారు . మున్నూరు కాపులను చైతన్యపరిచి ,రాబోయే ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా కుల బాంధవులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మున్నూరు కాపులు రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్నారు. కుల ప్రాతిపదికను సంఖ్యాపరంగా మున్నూరు కాపులకు అన్ని రాజకీయ పార్టీలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని వారన్నారు. తప్పకుండా మున్నూరుకాపు సోదరులు పేరు చివరన పటేల్ అని పెట్టుకోవాలన్నారు. సన్మానం చేసిన ఉద్యోగ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో సన్మిత్ర సంక్షేమ సంఘము సభ్యులు మర్రి అవినాష్, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్, పొనగంటి సంపత్, ఏ బూసి శ్రీనివాస్ (విద్యోదయ), వేల్పుల రాజేందర్, ఏబూసి సతీష్, ఉడుగుల సంపత్, బోనగిరి సారయ్య తదితరులు పాల్గొన్నారు.

నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే

*నర్సింగ్ కళాశాల విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోమనడం విద్యార్థుల హక్కులను కాల రాయడమే*

*బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం కార్యదర్శి సబ్బని హరీష్*

*సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు ప్రెస్ క్లబ్ లో బి.ఆర్.ఎస్ విద్యార్థి విభాగం సబ్బని హరీష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో నర్సింగ్ కాలేజీలో చాలా రోజులుగా ప్రభుత్వం స్టైఫండ్ రిలీజ్ చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలాదన్నట్టు కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులందరూ మెస్ బిల్లు కడితేనే హాస్టల్ లో ఉండండి లేకపోతే బయటకు వెళ్లిపోండి అని బెదిరించడం జరుగుతుంది తెలంగాణ నలుమూలల నుండి పేద బలహీన దళిత వర్గాల చెందినటువంటి అమ్మాయిలు ఈ నర్సింగ్ కోర్సులు చేస్తుంటే ప్రభుత్వం స్టైఫండ్ కూడా రిలీజ్ చేయకుండా వాళ్లను చదువుకు దూరం చేసే కార్యక్రమాలు చేస్తుంది. దీనివల్ల వాళ్లు ఇంట్లో చెప్పుకోలేక కాలేజీలో ఉండలేక తీవ్రమైన నరకయాతన అనుభవిస్తున్నారు

బి.ఆర్.ఎస్ ప్రభుత్వం హయాంలో కెసిఆర్ పేద విద్యార్థులకు వైద్య విద్య చేరువలో ఉండాలని జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ మంజూరు చేసి పక్కా భవనాలు నిర్మించి సిబ్బందిని రిక్రూట్ చేసి అప్పటివరకు ఉన్న స్టైఫండ్ ను రెట్టింపు చేసి విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తిండి పెట్టలేని పరిస్థితికి తీసుకొచ్చాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి విద్యా వ్యవస్థ పై సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది.
ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్రకు తెర తీశారు.స్వయానా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యార్థులను గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గురుకులాల్లో విషాహారం, పాము కాట్లు విద్యార్థుల ఆత్మహత్యలు, ఇప్పుడు నర్సింగ్ కళాశాల విద్యార్థుల ను హాస్టల్ నుండి గెంటి వేతలు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది
ఈ నర్సింగ్ కళాశాల విద్యార్థుల హాస్టల్లోనే ఉండి చదువుకునే వాళ్ళ హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తుంటే మేము చూస్తూ ఊరుకోం వెంటనే వాళ్ళ స్టైఫండ్ విడుదల చేయాలి.
లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాల విద్యార్థులు అందరితో కలిసి ఆయా కాలేజీల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తామని
బిఆర్ఎస్వి పక్షాన హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో మెట్టల సాయి దీపక్ రాచమల్ల మోహన్ కనుకుంట్ల వెంకటరమణ రాచమల్లు రామ్, భరత్,రాము,చిరంజీవి, నరేష్, సోఫీయాన్, మణి దిప్ సాయి తదితరులు పాల్గొన్నారు

వార్‌ 2 హక్కులు ఆ సంస్థకే.

వార్‌ 2 హక్కులు ఆ సంస్థకే

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్‌-2’ సినిమా తెలుగు రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దక్కించుకొంది. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానులను ఉద్దేశిస్తూ…

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్‌-2’ సినిమా తెలుగు రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ దక్కించుకొంది. ఈ మేరకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అభిమానులను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బేనర్‌పై తెలుగు రాష్ట్రాల్లో ‘వార్‌-2’ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘నాకెంతో ఇష్టమైన తారక్‌ సినిమాతో మళ్లీ మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన నటించిన రెండు సినిమాలు ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘దేవర’ మా బేనర్‌పై విడుదలయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్‌ కోసం సమయం ఆసన్నమైంది. అభిమానులంతా సిద్ధంగా ఉండండి. ‘వార్‌-2’లో మీరు ఇంతకుముందెన్నడూ చూడని కొత్త ఎన్టీఆర్‌ను చూడనున్నారు. ఆగస్టు 14న సంబరాలు చేసుకుందాం’ అంటూ నిర్మాత నాగవంశీ ఓ వీడియోను షేర్‌ చేశారు. ’వార్‌-2’ని అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది

మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం

“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నున్న అప్పారావు, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు బానోతు సంగులాల్ లు పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణకై కామ్రేడ్ ఓంకార్ పాత్రను వివరిస్తూ అధ్యక్షత వహించిన పెద్దారపు రమేష్ నోట్ ప్రవేశపెట్టారు.
అనంతరం సమావేశానికి హాజరైన వక్తులు ప్రసంగిస్తూ కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ను ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు నలిగంటి చంద్రమౌళి, ప్రజాసంఘాల నాయకులు ఓదెల రాజన్న, అనిత,ఎండి ఇస్మాయిల్, ఐతం నాగేష్, మైదం సంజీవ్, ఎండి సలీం, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పన్నపూరి నరసయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం.

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం

మే 20న సార్వత్రిక సమ్మె లో కార్మికులందరూ భాగస్వాములు కావాలి

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

 

సిరిసిల్లా పట్టణ కేంద్రంలోని ఈరోజు జరిగిన మేడే బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తమ హక్కుల సాధన కోసం తుపాకీ గుళ్ళకు ఎదురేగిన కార్మికులు, ఉరికంబాలెక్కిన నాడు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు.

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సి.ఐ.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 వ. మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలో లేబర్ అడ్డా వద్ద , రైతు బజార్ వద్ద , మున్సిపల్ ఆఫీస్ వద్ద , సివిల్ హాస్పిటల్ వద్ద , నెహ్రు నగర్ , చంద్రంపేట , గణేష్ నగర్ , బి.వై. నగర్ ఏరియాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేశారు బి.వై. నగర్ లో మేడే అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇట్టి బహిరంగ సభకు సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మేడే అమరవీరులు సాధించిన హక్కులను నేటి కేంద్ర బిజెపి సర్కార్ హరించి వేస్తుందని ఆ హక్కుల రక్షణ కోసం మే 20న జరుగు సార్వత్రిక సమ్మె లో అన్ని రంగాల కార్మికులు , కష్టజీవులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.కార్మికులు ఉదయం 10 గంటలకు పనికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తున్నారంటే కారణం నాడు మేడే కార్మికులు చిందించిన రక్తం నేనని చెప్పారు అందులో అధికారంలో ఉన్న బిజెపి కార్మికులు పోరాడి సాధించుకుంటున్న ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్ దిగ్గజాలకు కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు 29 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ సర్కారు ఒక కలం పోటుతో రద్దుచేసి నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చిందని విమర్శించారు అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం పిఎఫ్,ఈఎస్ఐ వంటి కనీస హక్కులు కూడా లేవన్నారు దుర్బర దారిద్రం అనుభవిస్తున్నారని చెప్పారు.

మేడే కార్మిక దినోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని అది ఒక వర్గ పోరాట స్ఫూర్తి దినమని పేర్కొన్నారు.

కార్మిక వర్గం ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా సమాజంలోకి అన్ని రకాల అంతరాలను నుండి విముక్తి చేయటానికి కృషి జరపాలన్నారు రోజువారీగా పెరుగుతున్న ధరలు కార్మికులకు వస్తున్న చాలీచాలని జీతాలు తో కార్మిక వర్గం దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తుందన్నారు బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి పెంచిందన్నారు మే 20 న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేస్తున్న సమ్మెతో మోడీ మెడలు వంచి కార్మిక వర్గ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

ఇట్టి కార్యక్రమాలలో CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ , మూషం రమేష్ , అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , మిట్టపల్లి రాజమల్లు , రాపెల్లి రమేష్ , నక్క దేవదాస్ , సిరిమల్ల సత్యం , కుమ్మరికుంట కిషన్ , గుండు రమేష్ , కుడిక్యాల కనకయ్య , బెజుగం సురేష్ , ఎక్కల్దేవి జగదీశ్ , ఉడుత రవి , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , సుల్తాన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

సామాన్యుడి హక్కుల పరిరక్షణకే భూభారతి.

సామాన్యుడి హక్కుల పరిరక్షణకే భూభారతి.

భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలoలో గల రైతు వేదిక భూ భారతి చట్టం రైతుల చుట్టం అవగాహన సదస్సు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో ఉన్న లోపాలను సరిచేసి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేయడం జరిగిందని అన్నారు.

protecting the rights of the common man.

భూ భారతి అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరైన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ పది సంవత్సరాలు గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల నష్టపోయిన లక్షలాది మంది విజ్ఞప్తుల మేర కు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా ధరణి పోర్టర్ ను తొలగించి భూభార తి చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

protecting the rights of the common man.

మార్పులుచేర్పులకు గతంలో అవకాశం లేదని ప్రస్తుత చట్టంలో రెవెన్యూ అధికారులకు అన్ని అనుమతులు ఇవ్వడం వల్ల రైతులకు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. చట్టంలో తీసుకు వచ్చిన మార్పులను స్థాయిలో రైతులకు వివరించి రైతులను చైతన్యం చేయాలని కోరారు అధికారులు తప్పు చేస్తే సహించేది లేదన్నారు.

protecting the rights of the common man.

భూ సమస్యలపట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, మండల ఎమ్మా ర్వో సత్యనారాయణ ఎంపీడీవో ఫణి చంద్ర, ఆర్ ఐ, వ్యవసా య అధికారులు, చిoదం రవి, మార్కండేయ, బాసని శాంత- రవి , బాసని చంద్రప్రకాష్, మారపేల్లి రవీందర్, కట్టయ్య రాజేందర్, దుబాసి కృష్ణ మూర్తి, వలి ఐదర్, చింతల రవిపాల్, వైనాల కుమార స్వామి, అబ్బు ప్రకాష్ రెడ్డి, తిరుపతి, రాజిరెడ్డి, మోత్కూరి భాస్కర్, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమా నులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికా రులు పాల్గొన్నారు.

దళితుల హక్కుల కోసం పోరాడిన DR జగ్జీవన్ రామ్.

దళితుల హక్కుల కోసం పోరాడిన సంఘసంస్కర్త డాక్టర్ జగ్జీవన్ రామ్

ఆయన జీవితం యువతకు స్ఫూర్తి దాయకం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

సమాజంలో దళిత బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు గొప్ప సంఘ సంస్కర్త జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన జయంతిని పురస్క రించుకొని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహానుభా వుడు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించడమే కాకుండా స్వాతంత్ర అనంత రం చిన్న వయసులో కేంద్ర క్యాబినెట్ లొ కార్మిక కమ్యూని కేషన్ మంత్రిగా పని చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకొనిపనిచేయా లని అన్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు మారపల్లిరవీందర్ ,చిందం రవి దుబాసి కృష్ణమూర్తి, కట్టయ్య, మార్కండేయ, మస్క కుమారస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు

మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి

ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు

శ్రీరాంపూర్,(మంచిర్యాల(నేటి ధాత్రి:

 

దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి హక్కులను లేకుండా కార్పొరేట్ శక్తులు కొల్లగొడుతున్నాయని,కార్మిక చట్టాల సవరణలో భాగంగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు.గురువారం శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై, హమాలి యూనియన్ల సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి వాటి అమలును నిరసిస్తూ వెంటనే ఆపాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు,ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు,సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ,తిప్పని సత్తయ్య,పోరాండ్ల సంపత్,నరేష్,రాజన్న, మామిడి చంద్రయ్య  పాల్గొన్నారు.

సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి.

సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి

ఇర్ప రాజు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు*

నేటి ధాత్రి ; భద్రాచలం;
ఏజెన్సీ ప్రాంతంలో గల ఆదివాసీ మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ లను తక్షణమే పునః ప్రారంభించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు.ఇందులో బాగంగా మార్చి 11,2025; మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఆదివాసీ ప్రజల ఉపాధిని దెబ్బకొట్టేందుకు ఇసుక ర్యాంప్ లను నిలిపి పాలకులు రైజింగ్ కాంట్రాక్టర్లతో బేరసారాలకు తెరలేపారని ఆరోపించారు.నిజంగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచన పాలకులకు ఉంటే రైజింగ్ కాంట్రాక్టర్ విధానం లేకుండా ప్రతి మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ కు పెట్టుబడి నిమిత్తం ముందస్తు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అమ్మ పెట్టదు అడుక్కతీననివ్వదు అనే చందంగా రేవంత్ సర్కారు తయారైందని విమర్శించారు.ఇసుక అక్రమాలు కట్టడి అంటూ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొకోక పోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.ఇందకు స్థానిక సంస్థల ఎన్నికలే సమాధానం చెపుతాయని అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version