ఎన్ఎస్ఎస్ జయశంకర్ జిల్లా కన్వీనర్ గా ముక్క యుగేందర్ నియామకం.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ముక్క యుగంధర్ ను ను ఎన్ఎస్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా నియమించినట్లు ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ తెలిపారు. శుక్రవారం రోజున యుగేందర్ పూర్వపు కన్వీనర్ ప్రసన్నకుమార్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని, ఉత్సాహంగా రానున్న రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా కన్వీనర్ రాంబాబు, జనగాం జిల్లా కన్వీనర్ జంబు, ములుగు జిల్లా కన్వీనర్ ప్రసన్నకుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
