పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ కి సన్మానం..

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ ఉప సర్పంచ్, ఉప సర్పంచ్ కి సన్మానం

నిజాంపేట, నేటి ధాత్రి

 

నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్, ఉప సర్పంచ్ పాగాల దేవరాజు ను శాలువతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలలో అధ్యక్షులు మెట్టు రాజేందర్ , ఉపాధ్యక్షులు పోతున్న రాజు , క్యాషర్ గోశిక సతీష్, మురళి, శ్రీనివాస్, పాండురంగం, గణేష్ శంకరయ్య, బాలనర్సు , మెట్టు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు

“పద్మశాలి నేతలకు సోమేశ్వర టెక్స్టైల్స్ ఘన సన్మానం”

సోమేశ్వర టెక్స్టైల్స్ అసోసియేషన్ వారి ఘన సన్మానం

 

అధ్యక్షులు : గోరంట్ల కుమారస్వామి

ప్రధాన కార్యదర్శి : వన్నాల ప్రకాష్

పాలకుర్తి, నేటిధాత్రి :

 

అఖిల భారత పద్మశాలి యువజన సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, అఖిల భారత యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ కిషోర్ సంఘ సూరత్ కి వచ్చిన సందర్భంగా సోమేశ్వర టెక్స్టైల్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గోరంట్ల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి వన్నాల ప్రకాష్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సమాజం అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, సభ్యులు కోట సాగర్, చిల్కమారి సాయిప్రసాద్, కైరం కొండ సురేందర్, జిగిజర్ల రమేష్, కైరం కొండ సత్యనారాయణ, సామల శ్రీనివాస్, కోట అంబదాసు, కుసుమ అశోక్, వెంగల్ దాస్ రవి, పెంటి సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం…

బీసీ బంద్ ను విజయ వంతం చేద్దాం

జైబీసీ జైజై బీసీ

బీసీల ఐక్యత వర్ధిల్లాలి

శాయంపేట నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈనెల 18న శనివారం రోజున రాష్ట్ర (జిల్లా) బంద్ ను విజయవంతం చేయాలని బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి బందును పరిపూర్ణంగా సబ్బండ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ ,గ్రామ కమిటీ, మండల యువజన, సంఘం, మహిళా సంఘం అందరూ పాల్గొని విజయవంతం చేసి బీసీల లందరూ సత్తాచాటాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version