ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పిఆర్టియు ఎస్ సభ్యులు….

ఎంపీడీవోను మర్యాదపూర్వకంగా కలిసిన పిఆర్టియు ఎస్ సభ్యులు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

నల్లబెల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జె శుభ నివాస్ ను మండల పిఆర్టియు టీఎస్ అధ్యక్షుడు ఉడుత రాజేందర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంపీడీవోను శాలువాతో సన్మానం చేసి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బానోతు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పురం బద్రీనాథ్, రవీందర్, జిల్లా కార్యదర్శి శనిగరం శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు కందకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి,షెట్ పల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ,గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. కాంసాని లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదలకు అందించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని,బేస్ మెంట్,లెంటల్,స్లాబ్ స్థాయిల వారీగా పూర్తి అయిన పనులకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో బిల్లులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని,ఈ అవకాశాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మండలంలోని వేలాల గ్రామంలో గల ఇసుక రీచ్ ప్రాంతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఇసుకను తీయాలని,ఇందిరమ్మ పథకంలో ఇండ్ల నిర్మాణాలకు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ముందుగా ప్రాధాన్యతనివ్వాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా ఇంజనీర్స్ డే…

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా ఇంజనీర్స్ డే

ఇంజనీర్ లను సన్మానించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

 

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని మండలంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ నోముల శ్రీలత హౌసింగ్ ఏఈ పోకల ఆకాంక్షలను మండల పరిషత్ అబివృద్ది అధికారి పెద్ది ఆంజనేయులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా యంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అంటే కేవలం చదువు మాత్రమే కాదని దేశ అభివృద్ధికి ఒక దిశ అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version