ఉప సర్పంచ్ ఉప్పలయ్య కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేత…

ఉప సర్పంచ్ ఉప్పలయ్య కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేత

అప్పయ్యపల్లి ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్

గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో ఇటీవలే స్వర్గస్తులైన దొంతుల ఉప్పలయ్య కుమారుడు కోడలు ఆయన దొంతుల రవి సమ్మక్క లకు అప్పయ్యపల్లి గ్రామ ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమార్ 50 కిలోల బియ్యం అందించి వారి కుటుంబాన్ని ఓదార్చి వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బోలెడ్ల ప్రభాకర్ రెడ్డి యాదవ సంఘం మండల అధ్యక్షులు దోమల రాజయ్య, కందికొండ అనిల్ ,నేతగాని రాజేష్ గ్రామ నాయకులు పాల్గొన్నారు

మిత్రబృందం చేయూతగా నిలిచిన స్నేహితులు

ఆపదలో ఉన్న స్నేహితుని కుటుంబానికి చేయూతగా నిలిచిన మిత్రబృందం

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా ముల్కల గ్రామంలో అక్టోబర్ 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంతెన శ్రీనివాస్ మరణించడంతో వారి బాల్య మిత్రులు 1991 టు 1992 బాయ్స్ హై స్కూల్ మిత్రులందరు శ్రీనివాస్ కు ప్రగాఢ సంతాపం తెలిపారు. మిత్రులు అందరూ కలిసి శ్రీనివాస్ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయలు శ్రీనివాస్ కుటుంబానికి శుక్రవారం అందజేశారు.కష్ట కాలంలో ఉన్న మిత్రుని కుటుంబాన్ని వారి వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసి కష్టాల్లో ఉన్న మిత్రుని కుటుంబాన్ని ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మిత్రులందరికీ తెలియజేశారు ఇకముందు కూడా శ్రీనివాస్ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్న మిత్రుల సహాయంతో సహాయ సహకారాలు అందిస్తామని వారి కుటుంబానికి భరోసా కల్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version