ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న..!

ఐదో రోజు శ్రీధర్‌ను విచారిస్తున్న ఏసీబీ

 

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన ఈఈ శ్రీధర్‌ను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఐదో రోజు మంగళవారం విచారిస్తున్నారు. ఈ రోజు మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజుతో ఆయన విచారణ ముగియనుంది.

 

 

 

Hyderabad: అక్రమాస్తుల కేసు (Illegal Assets Case)లో ఐదో రోజు (5th Day) మంగళవారం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ (EE Sridhar)ను కస్టడీ (custody)లోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు (ACB investigation). ఈ రోజుతో ఆయన కస్టడీ ముగియనుంది. కోర్టు అనుమతితో మరోసారి శ్రీధర్‌ను కస్టడీకి తీసుకునే ఆలోచనలో ఏసీబీ అధికారులు అన్నారు. ఇంత వరకు జరిగిన విచారణలో శ్రీధర్ అక్రమంగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్ బ్యాంకు లాకర్లలో భారీగా ఆస్తి పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు విలువ సుమారు రూ. 5 కోట్లు పైనే ఉంటుందని అంచనా వేశారు.

లాకర్‌లో రూ. 5 కోట్లు స్వాధీనం..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 పనులు పర్యవేక్షించిన నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్‌ అక్రమాస్తుల చిట్టా అంతకంతకు పెరుగుతోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే రూ. వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు.. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని ఆస్తుల్ని కనుగొన్నారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న శ్రీధర్‌ను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. సోమవారం అతని బ్యాంకు లాకర్లను తెరిచారు. వాటిలో దొరికిన స్థిరాస్తుల పత్రాలు, బంగారం విలువ రూ.5 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతికి సంబంధించి అరెస్టయిన మిగతా వారు కూడా అక్రమంగా సంపాదించిన సొమ్మును రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులుగా పెట్టినట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. శ్రీధర్‌ కస్టడీ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో అతన్ని మరోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

మరిన్ని లాకర్లు తెరిచే అవకాశం..

అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈగా పనిచేసిన శ్రీధర్‌పై ఏసీబీ అధికారులు ఈ నెల 11న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అధికారుల సోదాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించారు. వాటి విలువ మార్కెట్‌ లెక్కల ప్రకారం రూ. 150 కోట్ల మేర ఉంటుందని అంచనా. శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించిన అధికారులు తదుపరి దర్యాప్తులో భాగంగా న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని ఈనెల 20వ తేదీ నుంచి విచారిస్తున్నారు. దీనిలో భాగంగా ఎస్‌బీఐలో శ్రీధర్‌ పేరు మీద ఉన్న లాకర్‌ను ఆయన సమక్షంలోనే అధికారులు తెరిచారు. ఇందులో పెద్దఎత్తున ఆస్తిపత్రాలు, బంగారు ఆభరణాలు గుర్తించారు. వాటికి పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చివరి రోజైన మంగళవారం మరికొన్ని లాకర్లు కూడా తెరిచే అవకాశం ఉంది.

ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.

75 వేల రూపాయలు ఎల్ ఓ సి మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారాం మండలంలోనీ ఓడేడు గ్రామానికి చెందిన కట్కూరి సుజాత నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి తెలుపగా వెంటనే స్పందించి సి ఎమ్ ఆర్ ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo ఐ టి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వీరికి డెబ్బది ఐదు వేల ఎల్ ఓ సి మంజూరు చేయించి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది
డెబ్బది ఐదు వేల రూపాయలు మంజూరు చేపించి అండగా నిలిచినా మంత్రి శ్రీధర్ బాబు కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు.

ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి:

టేకుమట్ల మండల కేంద్రంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్,కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ,మృదుస్వభావి, తన తండ్రి ఆశయ సాధన కోసం పరితపించే నాయకుడు,కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా,ప్రజాసేవ లక్ష్యoగా కొన్ని దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న దుదిల్ల కుటుంబం.మంత్రి శ్రీధర్ బాబు భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తరింప చేస్తూ రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మనస్పూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో.జిల్లా మండల నాయకులు యువజన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు.గ్రామ శాఖ అధ్యక్షులు.సోషల్ మీడియా కోఆర్డినేటర్.కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version