ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు

*ఎమ్మెల్సీ అంజిరెడ్డికి స్వాగతం పలికిన తాండూర్ మండల బిజెపి నాయకులు*

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

గత మూడు రోజులుగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం,జీవో నంబర్ 49 శాశ్వతంగా రద్దు చేయాలని నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారికి సంఘీభావం తెలిపేందుకు విచ్చేస్తున్న గౌరవ ఎమ్మెల్సీ శ్రీ అంజి రెడ్డి గారిని ఈరోజు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని ఐబి వద్ద బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్,మండల అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ,జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి,జిల్లా కార్యదర్శి గోవర్ధన్,జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి,అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్,జిల్లా కార్యవర్గ సభ్యులు కేశెట్టి విజయ్,జిల్లా ఎస్సీ మోర్చ ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి,మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్,మండల ఉపాధ్యక్షులు రేవెల్లి శ్రీనివాస్, మండల కోశాధికారి రాచర్ల సురేష్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్,సీనియర్ నాయకులు అజ్మీర శ్రీనివాస్,దుర్గ చరణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి అరికెల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సిద్దిపేట శాసనసభ్యులు,మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు నర్సంపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాగా నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో
బారాస పార్టీ రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిపి జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి,పట్టణ కమిటీ నాయకులు, యూత్ కమిటీ సభ్యులు,మహిళా విభాగం నాయకులు,మాజీ కౌన్సిలర్స్, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version