ఎన్ హెచ్ ఆర్ సి నల్లబెల్లి మండల కమిటీ ప్రకటితం….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T151315.045.wav?_=1

ఎన్ హెచ్ ఆర్ సి. నల్లబెల్లి మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శిగా నాగపురి రమేష్, ఉపాధ్యక్షులుగా ఇంతల అనంతరెడ్డి, అధికార ప్రతినిధిగా రమేష్

నియామక పత్రాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

వరంగల్ జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఆవునూరి కిషోర్

“నేటిధాత్రి”,నల్లబెల్లి (వరంగల్ జిల్లా):

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నల్లబెల్లి మండల కమిటీని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు ప్రకటించారని జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అవునూరి కిషోర్ తెలిపారు. మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నాగపురి రమేష్, మండల ఉపాధ్యక్షులుగా ఇంతల అనంతరెడ్డి, అధికార ప్రతినిధిగా ఆవునూరి రమేష్ లను నియమించినట్లు తెలిపారు. పేద ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నల్లబెల్లి మండల అధ్యక్షులుగా ఎన్నికైన యార మధుకర్ రెడ్డి మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్, నెహ్రూ నాయక్, వరంగల్ జిల్లా అధ్యక్షులు మేరుగు రాంబాబుకు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కిషోర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తమకిచ్చిన ఈ పదవిని నీతి నిజాయితీతో నిర్వహిస్తామని మండలంలో సంస్థ బలోపేతం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. మండల అధ్యక్షులుగా యార మధుకర్ రెడ్డి నియామకంతో నల్లబెల్లి మండల ప్రజలు, విద్యావంతులు, మేధావులు అభినందించి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భూపాలపల్లి 24వ వార్డులో గణపతి మహా అన్న ప్రసాదం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T150800.078.wav?_=2

24 వార్డులో మహా అన్న ప్రసాదం కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24 అవార్డు కారల్ మార్క్స్ కాలనీలో బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మహా అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించిన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నవరాత్రి ఉత్సవాలలో ఆది దేవుడైన గణపతి దేవునికి ప్రతిరోజు పూజలు చేస్తూ,నైవేద్యం సమర్పిస్తూ ఆనందోత్సవాలతో ఈ పండుగను జరుపుకుంటామని, ఈ పండుగ సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందని, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు నేర్పించడం కోసం ఉపయోగపడుతూ, మనలో ఏకత్వాన్ని భక్తి భావాన్ని ,ఆధ్యాత్మిక శక్తిని పెంచుతూ ఈ పండగ మన సంస్కృతి సంప్రదాయాల కాపాడుకోవడం కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని విఘ్నేశ్వరుని కోరుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఓదెల గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ నిషేధం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T150249.550.wav?_=3

గణేష్ నిమజ్జనం కు డిజె సౌండ్స్ నిషేధం ఎస్సై దీకొండ రమేష్..

18 డిజె సిస్టం అపరెటర్ల బైండోవర్…

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల పరిధిలోని గ్రామాలలో గణేష్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్ల వాడకంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని పొత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. మంగళవారం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 మంది డీజే ఆపరేటర్లను పోలీస్ స్టేషన్కు పిలిపించి, తహసీల్దార్ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారందరినీ బైండోవర్ చేసి, చట్టాన్ని అతిక్రమించే యత్నం చేసినా సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ఊరేగింపు లో మండల పరిధిలో ఎవరైనా డీజే యజమానులు సౌండ్ సిస్టంను అద్దెకివ్వడం గాని, వినియోగించడం గాని చేస్తే వారిపై చట్టప్రకారం కఠిన
చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వెనుకాడకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆపదలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలే తీసుకుంటున్నామని అదేవిధంగా గణపతి ఉత్సవాలను సాంప్రదా యబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై రమేష్ ప్రజలను
కోరారు.

భూపాలపల్లి గిరిజన బాలికల ఆశ్రమలో ఎమ్మెల్యే తనిఖీ….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T145502.392.wav?_=4

ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

విద్యార్థుల సమస్యలను ఐటీడీఏ పీవో కు ఫోన్ లైన్లో వివరించిన ఎమ్మెల్యే

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతీ తరగతి గదిని ఎమ్మెల్యే తిరుగుతూ విద్యార్థుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ సమస్యలను చెప్పుకున్నారు.

MLA Inspects Tribal Girls Hostel in Bhoopalapalli

గత పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ పని చేయడం లేదని కొత్త ఆర్వో ప్లాంట్ కావాలని, వేడి నీటి కొరకు గ్లీజర్, మూడు నెలల నుండి కాస్మోటిక్ సామాగ్రి ఇవ్వడం లేదని, డిజిటల్ క్లాస్ రూమ్స్ కావాలని, క్రీడా సామాగ్రి, దోమలు రాకుండా కిటికీలకు మెష్ డోర్లు ఏర్పాటు చేయాలని, ఫ్యాన్లు కూడా సరిగా తిరగడం లేదని తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. సమస్యలను విన్న ఎమ్మెల్యే వెంటనే ఏటూరునాగారం ఐటిడిఏ పీఓకు ఫోన్ చేసి సమస్యలను వివరించారు. సమస్యలను వీలైనంత త్వరగా ఎస్టిమేట్స్ వేసి పనులను ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలని కోరారు. విద్యార్థుల వసతి గృహాన్ని పక్కనున్న భవనంలోకి మార్చాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కోనాపూర్‌లో దివంగత కుటుంబానికి లీలా గ్రూప్ చైర్మన్ సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T144903.648-1.wav?_=5

కోనాపూర్ గ్రామంలో దివంగత కుటుంబానికి లీలా గ్రూప్ చైర్మన్ మోహన్ నాయక్ పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారు దివంగత కరికి బాబు కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. ఇటీవల మరణించిన కరికి బాబు కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం అందజేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు చింతాల స్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విద్యాసాగర్, మండల నాయకులు మామిడి సిద్ధిరాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుల అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం సురేష్, యూత్ అధ్యక్షులు మామిడి సతీష్, ప్రధాన కార్యదర్శి కరికి రాజు, చాకలి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

జీ.పీ.ఓలకు నియామకపత్రాలు జారీ చేయండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T144528.564.wav?_=6

జీ.పీ.ఓలకు నియామకపత్రాలు జారీ చేయండి

సీసీఎల్ఏ లోకేష్ కుమార్

మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలి

అభ్యర్థుల తరలింపునకు తగిన ఏర్పాట్లు చేయాలి

హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

జీ.పీ.ఓ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సీసీఎల్ఏ లోకేష్ కుమార్ వెల్లడించారు. జీ.పీ.ఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ లో అందజేయనున్న సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్ మాట్లాడారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పరీక్ష నిర్వహించిందని తెలిపారు. ఇందులో భాగంగా ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సమాచారం అందించాలని సూచించారు. వారిని హైదరాబాద్ తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్ లలో వారిని నిర్ణీత సమయానికి తరలించాలని సూచించారు.వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
తగిన అన్ని ఏర్పాట్లు చేయాలి జిల్లా నుంచి జీ.పీ.ఓ పరీక్ష రాసి 66 మంది ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. అభ్యర్థులను ఈ నెల 5 వ తేదీన జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి తరలించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ను నోడల్ ఆఫీసర్ గా నియమించామని తెలిపారు. హైదరాబాద్ తరలివెళ్లే అభ్యర్థులకు కావల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏ.ఓ. రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వర్షకొండలో గణపతి నవరాత్రుల మహా అన్న ప్రసాదం..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T134700.644.wav?_=7

గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మహా అన్న ప్రసాదం

ఇబ్రహీంపట్నం. నేటి ధాత్రి

మండలంలోని వర్షకొండ గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా గాంధీనగర్ గరుడ సేన యూత్ ఆధ్వర్యంలో గణపతి కి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ప్రారంభించారు మరియు మహిళలు పెద్ద ఎత్తున కుంకుమ పూజలో పాల్గొంటారు విగ్రహ దాత యాస రాకేష్ మరియు అన్న ప్రసాదం దాత సల్వాల లవ కుమార్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీల పోరం ఫోనుకంటి వెంకట్ మరియు దంతుల శివారెడ్డి. గుజ్జరి గణేష్. పి రాజ్ కుమార్. మరియు గాంధీనగర్ గరుడ సేన యూత్ సభ్యులు.ఎం మురళి. మహేష్. లోకేష్. రాజ్ కుమార్. రాకేష్. లవ కుమార్.వర్షిత్. నాగేష్.చారి. నారాయణ. గంగాధర్. రజనీకాంత్. మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

కుప్పా నగర్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T133400.768.wav?_=8

కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన హనుమంతరావు పటేల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కుప్పా నగర్ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణిలో రాష్ట్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ అన్నారు. గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు కొత్త రేషన్  పంపిణి  చేసిన సందర్భంగా మాట్లాడారు.
గత పాలకులు 10సంవత్సరాల పాటు రేషన్ కార్డు లు ఇవ్వక పోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం  మంచి పరిణామం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హాయంలో కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు.కార్డుల పంపిణి ప్రక్రియ నిరంతరాయంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి రాజ్ కుమార్ స్వామి రాఘవేంద్ర కృష్ణ ప్రకాష్ రవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు,

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131603.110-1.wav?_=9

స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధాన్యతియ్యాలి

నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు 20 శాతం సీట్లు కేటాయించి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపెల్లి సందీప్ కోరారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి ఆదేశాలతో బుదవారం దొంతి మాధవరెడ్డిని హన్మకొండలోని సగృహంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరవి పరమేష్ తో కలిసి తుమ్మలపెల్లి సందీప్ వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ కు ప్రాధానత్య ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.స్పందించిన ఎమ్మెల్యే దొంతి యూత్ కాంగ్రెస్ తోనే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి బంగారు భవిష్యత్ అని కొనియాడారన్నారు.యువత కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారని కష్టపడి పనిచేసే ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలోనే అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న.. తప్పక అమలు చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హమి ఇచ్చినట్లు సందీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లా గౌడ్,నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం సురేష్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంత రంజిత్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్కె షఫిక్,దుగ్గొండి మండల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నరిగె ప్రవీణ్, శ్రీకాంత్, అవినాష్, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు తక్షణమే యూరియా అందించాలి: బీఆర్ఎస్ ధర్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131112.007.wav?_=10

రైతులకు యూరియా తక్షణమే అందించాలి

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ధర్నా, రాస్తారోకో

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.

BRS Holds Protest

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

BRS Holds Protest

అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ

వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు

సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T130359.342-1.wav?_=11

జహీరాబాద్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ – మహిళల ఉత్సాహభరిత పాల్గొనిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,రబీ ఉల్ అవ్వల్ నెల సందర్బంగా జమాత్ ఇస్లామీ హింద్ సౌత్ ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో శాంతినగర్ ఇస్లామిక్ సెంటర్‌లో సీరత్‌ఉన్‌నబీ సభ జరిగింది.సభకు అధ్యక్షత వహించిన జమాత్ ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాజిదా బేగం మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ ముస్తఫా జననం మానవాళికి వరమని, అజ్ఞానాంధకారాన్ని తొలగించి కరుణ, ప్రేమ, న్యాయం ప్రసాదించారని పేర్కొన్నారు.

Seerat-un-Nabi Sabha Held in Jahirabad

ప్రత్యేక అతిథి సుమయ్య లతీఫీ అసిస్టెంట్ సెక్రటరీ, ఉమెన్స్ వింగ్, తెలంగాణ మాట్లాడుతూ సీరత్ బోధనలు కేవలం రబీ ఉల్ అవ్వల్‌లోనే కాక, జీవితాంతం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.హాజరా బేగం, సయ్యదా మేహనాజ్, ఫహ్మీదా మఖ్మూర్, హాఫిజా సఫూరా సిద్దీఖా వేర్వేరు అంశాలపై ప్రసంగించారు.

Seerat-un-Nabi Sabha Held in Jahirabad

హాఫిజా ఉమ్తుల్ ముబీన్ ఖురాన్ తిలావత్ చేశారు. జీఐఓ అధ్యక్షురాలు హుజైఫా అఫ్నాన్ నాత్ పఠించగా, సీఐఓ విద్యార్థినులు సున్నత్ పై నాటిక ప్రదర్శించారు.పిల్లల కోసం సీరత్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T124445.869-1.wav?_=12

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంశంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పూజల సందర్భంగా వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ ను ఆలయ కమిటీ నిర్వహికులు ఆహ్వానించారు ఈమేరకు సుమన్ దంపతులను సన్మానం చేశారు ఈసందర్భంగా ఆలయ కమిటీ నిర్వహికులను సుమన్ అభినందించారు ఈకార్యక్రమంలో చిట్యాల నాగరాజు దాచ లక్ష్మినారాయణ గోనూర్ రామకృష్ణ దాచశివ తదితరులు పాల్గొన్నారు

నిజాంపేటలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123957.151-1.wav?_=13

నిజాంపేటలో..
వెంటాడుతున్న యూరియా కష్టాలు..

నిజాంపేట: నేటి ధాత్రి

యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123441.263.wav?_=14

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి :

◆:- యువనేత మొహమ్మద్ ముర్తజా

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం.
ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు.
జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు.
స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.

గణనాథులను దర్శించిన వై. నరోత్తం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T122535.212-1.wav?_=15

గణనాథులను దర్శించుకున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

గణేష్ నవరాత్రి ఉత్సవాల మొగుడంపల్లి మండల కేంద్రంలో* గణనాథుని దర్శనం, పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనిలో స్త్రీ శక్తి గణేష్ ఆద్వర్యంలో ఏర్పాట్లు చేసిన వినాయకుడుని దర్శనం,పట్టణంలో ఆర్యనగర్ వీధిలో శివాజీ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడుని,సుభాష్ గంజ్ లో శ్రీ సేనా గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన గణనాథుడుని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం ఈ కార్యక్రమంలో నాయకులు జి.నర్సింలు,శికారి గోపాల్, చెంగల్ జైపాల్,వెంకట్, మంజుళ,బి.జి.సందీప్,వంశి క్రిష్ణ,సురేష్, శికారి శ్రీనివాస్, సాయి కిరణ్,మహేష్,రమేష్, సుశీల్,నవీన్,బి.దిలీప్,ఆకాశ్,మల్లికార్జున్,ప్రశాంత్,విశాల్,తదితరులు పాల్గొన్నారు,

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121958.700-1.wav?_=16

కొల్లూరులో బాల గణేష్ నిమజ్జనం

జహీరాబాద్ నేటి ధాత్రి:

హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సి హెచ్ సంగమేష్ సాయిగౌడ్ కాశీ రామ్ లక్ష్మణ్ డి శేఖర్ పాండు హరి శ్రీనివాస్ పాటిల్ మల్లేష్ విష్ణువర్ధన్ రెడ్డి శ్రీశైలం మరియు యుత్ సభ్యులు కొల్లూరు అధ్వర్యం లో ఏర్పటు చేసిన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాలుగొన్న గ్రామ పెద్దలు నాయకులు.ఇట్టి కార్యక్రమములో కొల్లూరు మాజీ ఎంపీటీసీ సీ హెచ్ రాజ్ కుమార్ కొల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,మాజీ వార్డు సభ్యులు వై నగేష్ ఎం విష్ణు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఝరాసంగం చింతలగట్టు శివరాజ్, సంగారెడ్డి నర్సింహారెడ్డి,దేవేందర్ దారా గోరఖ్ కాశీనాథ్ ఉమాకాంత్ సి ప్రకాష్ మరియు గ్రామ ప్రజలు పాల్గోని బాల గణేశునికి పూజలు చేసి నిమజ్జనం కార్యక్రమన్ని విజయవంతంగా పూర్తి చేసారు.

గణేష్ ను దర్శించుకున్న ఎమ్మెల్యే….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121428.352-1.wav?_=17

గణేష్ ను దర్శించుకున్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం 7 అవార్డు లోబిఆర్ ఎస్ నాయకులు మంజు లో వెంకట్ స్థాపించిన గణేష్ మహరాజ్ ను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే మాణిక్ రావు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గణేష్ మహరాజ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈ గణేష్ మహరాజ్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే మాణిక్ రావు నాయకులతో కలిసి గణేష్ మహరాజ్ ను దర్శించుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం….

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T121001.744-1.wav?_=18

ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలం

◆:- యువ నాయకులు మహ్మద్ హఫీస్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల చిల్లెపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మహ్మద్ హఫీస్ మాట్లాడుతూ
అధికారంలోకి వచ్చిన 18 నెలలోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్న లను పొందింది అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందన్నారు. గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత హామీలతో, పథకాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారన్నారు. జరగబోయే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి,రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పంచాయతీలు, వార్డులలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ ఓట్లను అడిగి ఎంపీటీసీ జెడ్పిటిసిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T120257.493-1.wav?_=19

లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ఝరాసంగం మండలంలోని బొప్పనపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. బుధవారము గ్రామ పంచాయతీలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షకీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తుందన్నారు. ఆధార్కార్డుతో పాటు రేషన్ కార్డు ముఖ్యమన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హులు కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో
పెద్ది శ్రీనివాస్ రెడ్డి అమృత్ బాలయ్య బసిరెడ్డి ప్రవీణ్ డీలర్ సత్తార్ తదితరులు లబ్ధి దారులు
పాల్గొన్నారు

భూపాలపల్లిలో రైతులకు యూరియా సరఫరా సమస్య..

రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.

రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల.. మండల కేంద్రంలో రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లో నిలబడిన పూర్తిస్థాయిలో రైతులకు సరిపడా యూరియా దొరకలేదు అని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక లారీ లోడ్ రావడానికి వారం పట్టింది వచ్చిన లారీ యూరియా రైతులకు ఏమాత్రం సరిపోలేదు ఒకటి రెండు బస్తాలతో సరిపెట్టుకున్న దొరకని రైతులు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు మళ్లీ లారీ వస్తదని చిట్టీలు ఇచ్చిన ఈ లారీ రావడానికి వారం పడతదో పది రోజులు పడుతదో అని రైతుల నిరాశ చెందుతున్నారు రైతులకు సరిపడా యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాకాల సీజన్లో రైతుల పంటలు ఎర్రబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ సరిపడా యూరియా అందించడంలో జిల్లా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఈ ప్రాంత రైతులకు సకాలంలో లారీ వచ్చే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రైతులకు రేపే యూరియా పంపిణీ చేయాలని అన్నారు చిట్టీలు తీసుకున్న రైతులందరికీ యూరియాసరఫరా చేయాలని రైతులను ఈ విధంగా ఇబ్బంది చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తావున్నాం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామచంద్ర మాదిగ ఆకునూరి జగన్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version