అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ.
తాండూరు,మంచిర్యాల: నేటి ధాత్రి :
బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు మంచిర్యాల జోన్ తాండూర్ రేపల్లెవాడ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి వాహనాల తనిఖీలను పర్యవేక్షించారు. చెక్‌పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించిన డీసీపీ, విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు,ఆదేశాలు జారీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు.ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అక్రమ పశువుల రవాణాపై పటిష్ట నిఘా కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా గమనించినట్లయితే స్థానిక పోలీసులకు లేదా 100 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని,భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. డీసీపీ వెంట తాండూర్ సీఐ దేవయ్య,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు, తాండూర్ ఎస్‌ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పదిలో ఫెయిలైన విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు ప్రారంభం
నరేంద్రనగర్‌లో క్యాంపును ప్రారంభించిన కలెక్టర్ సత్య శారద
జూన్ 3 వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ప్రత్యేక బోధన
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జిల్లాలో ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. సోమవారం వరంగల్ జీహెచ్‌ఎస్ నరేంద్రనగర్ పాఠశాలలో క్యాంపును ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదిలో ఫెయిల్ అవడం జీవితంలో ఓటమి కాదని, మరింత బలంగా ముందుకు సాగేందుకు ఒక అవకాశమని పేర్కొన్నారు. విద్యార్థులు నిరుత్సాహానికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో తిరిగి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదువులోని లోపాలను సరిదిద్దుకోవాలని, మానసిక స్థైర్యం పెంపొందించేందుకు కౌన్సెలింగ్, సబ్జెక్టు వారీగా రెమిడీయల్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు.అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భయాలను తొలగించి చదువుపై ఆసక్తి పెంచేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తామన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండా క్యాంపులకు పంపించాలని కోరారు.డీఈఓ రంగయ్యనాయుడు మాట్లాడుతూ.. మోడల్ పరీక్షలు, డౌట్ క్లారిఫికేషన్ సెషన్లు నిర్వహిస్తామని, విద్యార్థులందరూ పాస్ అయ్యేలా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.జీహెచ్‌ఎస్ నరేంద్రనగర్‌తో పాటు జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు) నర్సంపేటలో క్యాంపులు ఏర్పాటు చేశారు. తొలిరోజు గీసుగొండ, రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, వరంగల్, ఖిలా వరంగల్ మండలాల నుంచి 70 మంది విద్యార్థులు నరేంద్రనగర్ క్యాంపునకు హాజరయ్యారు. ఈ క్యాంపులు మే 12 నుంచి జూన్ 3 వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఈకార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ, డీడబ్ల్యూఓ రాజమణి, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
*భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు*
*పరకాల,నేటిధాత్రి*
మండలంలోని మల్లక్కపేట గ్రామ శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.దేవాలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించగా భజనలు, నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.
మధ్యాహ్నం 1 గంట నుండి మాల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి 108 తమలపాకులతో,108 వడపేర్లతో ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాథ చార్యులు వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామం నుండి పరకాల కలిపే రహదారి నిర్మాణానికి మాత్రం మోక్షం లభించడం లేదు గత ఏండ్లు గా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టా లని స్థానిక ప్రజాప్రతినిధులకు కోరిన ఈ రహదారి మాత్రం మోక్షం కలుగడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం శిలాఫలకం వేసి రోడ్డుకు కంకర పోసి విడిచిపెట్టడం ద్వారా గ్రామ రైతులు పంట పొలాలకు వెళ్లే సమయంలో రోడ్డు గుంతలు గుంతలుగా మారి కంకర తేలి అటువైపు వాహనాలు వెళ్లా లంటే ప్రజలు భయ పడుతు న్నారు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ద్వారా వాహన దారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేస్తే పరకాల దారి ప్రజలకు దూరభారం తగ్గు తుంది కాబట్టి గ్రామంలో ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం ఈ రహదారిపై దృష్టిపెట్టి రోడ్డు నిర్మాణం జరిగేలా చూడాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.
శాయంపేట మండల కేంద్రం లోని ఆరేపల్లి, వసంతాపూర్ గ్రామాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల భాగంగా రైతు ముంగుట్లోకి శాస్త్రవేత్తలు సాగుచేసే పద్ధ తులపై,, ఎఫ్ పిఓ ల ప్రాము ఖ్యత అవగాహన కల్పిం చారు. రానున్న వానకాలం సాగుకై మెరుగైన సాగు పద్ధ తులపై అవగాహన కల్పిం చేందుకు ఆరేపల్లి గ్రామంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ డా.టి.శ్రీజయ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గిం చమని చెబుతూ పంట వ్యర్థా లను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని వివరిం చారు పొలంలో గుంతలు చేసి పంటవ్యర్థాలను గుంతలో వేసి ఎరువు తయారు చేసు కొని దాన్ని పొలంలో జల్లుకో వాలని చెప్పారు.
నేలల్లోనీ సారం పెంచుకోవడానికి సేంద్రియ ఎరువులు పచ్చిరొట్ట ఎరువులు వాడకం ద్వారా చేయవచ్చని అవగాహన కల్పించారు. రైతాంగాన్ని ప్రధాన పంట వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలతో పంట మార్పిడి చేయవలసిం దిగా కోరారు ప్రతీ రైతు కచ్చి తంగా భూసార పరీక్షలు చే యించుకొని దానికి అను గుణంగా ఎరువులు వేసుకో వాలని సూచించారు. అనం తరం వ్యవసాయ కళాశాల ఉద్యాన శాస్త్ర సహా ఉపాధ్యా యులు డా. ఎస్. వంశీ కృష్ణ పలు ఉద్యాన పంటల సాగు విధానం మరియు ఆయిల్ పామ్ పంట ప్రాముఖ్యతను మరియు సస్యరక్షణ పద్ధ తులు గురించి వివరించారు. తరువాత గ్రామ సర్పంచ్ రమ మాట్లాడుతూ ఈ కార్యక్రమా న్ని మా గ్రామంలో నిర్వహించి నందుకు అధికారులకు కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని, వ్యవసాయ విస్తరణ అధికారి జోష్ణ, ప్రజ్వ ల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఎన్జీవో రాంబాబు, వ్యవసా య కళాశాల విద్యార్థులు దేవేందు, శివాజీ , వసంత పూర్ సర్పంచ్ భాస్కర్, రైతులు, ఆరేపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మంగళవారం నర్సింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి ఆసుపత్రి సూపరిండెంట్ గౌతమ్ చౌహన్,వైద్యులు,నర్సింగ్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సూపరిండెంట్ గౌతమ్ చౌహన్ మాట్లాడుతూ రోగుల సేవలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని,వారి సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నర్సులు అందించే సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు బాలకృష్ణ,మహేష్,హారిక, సంగీత,నర్సింగ్ సూపరిండెంట్ రమాదేవి,హెడ్ నర్సులు నాగమణి,ప్రసన్న, శారద,జ్యోతి,రజని,స్టాఫ్ నర్సులు భాగ్యలక్ష్మి,స్వాతి, సుప్రజ,సునీత,సుమలత,సుధా,రాణి తదితరులు పాల్గొన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా నిరుత్సాహపర్చింది. నీతి సూత్రాలు వల్లించి ఊకదంపుడుగా ఉపన్యాసం చేశారు. అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నాడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? రాష్ట్రానికి ఆర్థికంగా రావాల్సిన నిధులు ఎందుకు తగ్గుతున్నాయి? అనే విషయాలకు సమాధానం చెప్పలేదు.
రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మాతో జట్టుకట్టండని, తమకు అనుకూలంగా వ్యవహరించాలని, ముఖ్యమంత్రికి పరోక్షంగా మోడీ సంకేతమివ్వడం రాజ్యాంగ విరుద్ధం. పెట్రోల్ వాడకాన్ని నియంత్రించాలని, ప్రజారవాణాలోను, మెట్రోరైల్‌లో వెళ్ళాలని, బంగారం కొనొద్దని, విదేశీ పర్యటనలు చేయొద్దని, నిత్యావసర సరుకుల ధరలు పెరగబోతున్నాయని సంకేతాన్ని ఇచ్చారు. కానీ ధరలు పెరగడానికి ప్రధానకారణమైన యుద్ధాన్ని ఆపకుండా, అమెరికా అధ్యక్షుడి ముందు మోకరిల్లే వైఖరిని ప్రభుత్వం అనుసరిస్తోంది. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లు తెచ్చి విద్యుత్తును ప్రైవేటుపరం చేసే విధానాలు అమలు చేస్తున్నది.
మోడీ ఉపన్యాసంలో తెలంగాణ రాష్ట్ర సమస్యల ప్రస్తావన లేకుండా రాష్ట్రంలో అధికారంలోకి ఎలా రావాలనే అంశం మీదనే కేంద్రీకరణ కనిపిస్తున్నది. మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ తెలంగాణ గడ్డ, అదే పోరాట స్ఫూర్తితోనే బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజానీకానికి సిపీఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నది. అని వారు అన్నారు
*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా, మెడిటేషన్ కార్యక్రమం*
*పరకాల,నేటిధాత్రి*
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో యోగా మరియు మెడిటేషన్‌పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఆయుష్ మిషన్‌కు చెందిన యోగ గురువు బోగా రఘుపతి హాజరై విద్యార్థులు,అధ్యాపకులతో కలిసి యోగాసనాలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బోగా రఘుపతి మాట్లాడుతూ నిత్యజీవితంలో యోగా ప్రతి ఒక్కరికీ అవసరమని,ఆరోగ్యవంతమైన జీవితానికి యోగాసనాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక,మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని విద్యార్థులకు సూచించారు.కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ సంకల్పంతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ ఉండదని అన్నారు.యోగా,ధ్యానం ద్వారా మానసిక ఉల్లాసం,ఏకాగ్రత,స్థైర్యం పెరుగుతాయని తెలిపారు.విద్యతో పాటు వారంలో రెండు రోజులు కళాశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.మల్లయ్య,ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ.శ్రీనివాస్ రెడ్డి,స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎలిషాల అశోక్,డాక్టర్ జి.పావని, కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ జి.రాజేశ్వర్ కుమార్,అధ్యాపకులు డాక్టర్ భీమ్ రావు,బి.మహేంద్రరావు,డాక్టర్ ఆడెపు రమేష్,డాక్టర్ కే. జగదీష్ బాబు,ఏం.సమ్మయ్య,ఆర్.ఈశ్వరయ్య,ఎస్.రాజశ్రీ,డాక్టర్ డి. సంజయ్ కుమార్,పవన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆఫీస్ సిబ్బంది వంశీ, కృష్ణ కూడా హాజరయ్యారు.
అక్రమ రవాణా నిర్మూలన కోసం చెక్ పోస్ట్ లు .. క్షుణ్ణంగా తనిఖీలు.
సూర్యాపేట జిల్లా ఎస్పి కె. నరసింహ ఐపీఎస్
సూర్యాపేట, నేటి ధాత్రి:
పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి నరసింహ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో 24 గంటలు విసృతంగా తనిఖీలు నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనికిచేస్తునట్లు తెలిపారు.మంగళవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65 పై టేకుమట్ల వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్ జిల్లా ఎస్పీ నరసింహ సందర్శించి వాహనాల తనిఖీలను,చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల సమయంలో చెక్ పోస్ట్ సిబ్బంది స్వీయ రక్షణ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. అక్రమ రవాణా నిర్మూలన లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ చెక్ పోస్ట్ ల ద్వారా అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానత వ్యక్తులకు కదలికలపై పూర్తిస్థాయి నిఘా ఉంచామన్నారు. వరి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా, పీడీఎస్ బియ్యం, ఇసుక, పశువుల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన నిఘా ఉంచి రాత్రిం బవళ్ళు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినట్లైతే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం సంతలో కొనుగోలు చేసిన పశువుల రవాణా చేస్తే సంత అధికారులు, పశువుల వైద్యుల అనుమతి పత్రాలు వెంట తీసుకువెళ్ళాలి అన్నారు.ఎస్పీ వెంట సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్, చెక్ పోస్ట్ విధులు నిర్వహణ సిబ్బంది, జాతీయ రహదారుల సిబ్బంది ఉన్నారు.
*ఆంజనేయస్వామి దేవాలయంలో మాజీ ఎంపీడీఓ ప్రత్యేక పూజలు*
*పరకాల,నేటిధాత్రి*
హనుమత్ జయంతి సందర్భంగా పరకాల మాజీ ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు కుటుంబ సమేతంగా మండలంలోని మల్లక్కపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ ఎంపీడీఓ ప్రత్యేకంగా పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అనంతరం ఆలయ ఈఓ వెంకటయ్య మరియు ప్రధాన అర్చకులు కాటూరి జగన్నాధ చార్యులు వేదమంత్రాల నడుమ మహదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట సర్పంచ్ దొమ్మటి కవిత మధు,పంచాయతీ కార్యదర్శి సుమలత,కారోబార్ అనందరావు తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ బొడ్రాయి సమీపంలో ఇటీవల వీచిన ఈదురుగాలులు మరియు భారీ వర్షాల కారణంగా షేక్ హైమద్ ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమై తీవ్ర నష్టం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కరకగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రదేశానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించే అనంతరం వారికి 25 కేజీల బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బాధ్యత కుటుంబానికి ధైర్యం చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తరఫున అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
*ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో నిర్వ హించిన కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు 11,26,000/- రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్య నారాయణరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద,మధ్యత రగతి కుటుంబాలకు ఆప ద్బాంధవంగా నిలుస్తోంద న్నారు.అనారోగ్య సమస్య లతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుం బాలకు ప్రభుత్వం అండగా నిలిచి సహాయం అందించడం జరుగుతుంది.
పార్టీలకతీతం గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను అందజేశారు.గత బిఆర్.ఎస్ ప్రభుత్వం కేవలం బిఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలకే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ప్రజల కష్టసు ఖాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుం దని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నా మని,ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్ర తినిధులు, మండల అధికా రులు కాంగ్రెస్ పార్టీ నాయ కులు,కార్యకర్తలు లబ్ధిదా రులు పాల్గొన్నారు.
ఘనంగా ఎస్టిపిపి డిస్పెన్సిరిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
జైపూర్,నేటి ధాత్రి:
ఎస్టిపిపి లోని డిస్పెన్సరీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టిపిపి ఈడి సిహెచ్.చిరంజీవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగలే (లేడీ విత్ ది లాంప్ ) జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు.ఇది వైద్య రంగంలో ప్రాణాలను రక్షించే “దేవదూతలను” గౌరవించుకునే ప్రత్యేక రోజు అని కొనియాడారు.రోగులకు కేవలం మందులు ఇవ్వడమే కాకుండా ప్రేమతో,ఓర్పుతో,నిస్వార్థ సేవను అందిస్తూ వారికి ధైర్యాన్ని నూరిపోసేది నర్సులు మాత్రమే అని తెలిపారు.ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలను వదిలి,రోగుల కోలుకోవడం కోసం నిరంతరం శ్రమించిన నర్సుల సేవలు అపారమైనవని పేర్కొన్నారు.వారు వైద్యులకు కుడిభుజంగా ఉంటూ ఆరోగ్య వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నారని తెలిపారు.అనంతరం అధికారులు ఫ్లోరెన్స్ నైటింగలే చిత్రపటానికి పూలమాలలు వేసి,కాండిల్స్ వెలిగించి,కేక్ కట్ చేశారు.అలాగే నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు రాజమణి, సీనియర్ స్టాఫ్ నర్సును ఉత్తమ స్టాఫ్ నర్సుగా ఎంపిక చేసి,ఈడి చిరంజీవి ప్రశంసా పత్రాన్ని అందించి శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి జీఎం ఎం. నరసింహరావు,జీఎం (పీసీఎస్ & ఓ అండ్ ఎం)ఎం.మదన్మోహన్, ఏజీఎం (పీసీఎస్)కే. సూర్యనారాయణ రాజు, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సత్యనారాయణ,సీఎంఓఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ డి.పంతుల, మెడికల్ సూపరింటెండెంట్ బి. జానకి,ఎస్వో టు ఈడి వెంకటయ్య,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్, రిటైర్డ్ డా.ప్రభాకర్ తదితర అధికారులు,మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేటి నుంచి 12 జూన్ 2026 వరకు జరిగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్-14,16,19,23 బాలురు, బాలికల ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని క్రికెట్ అసోసియేషన్ ఇంచార్జ్ వంకాయల కార్తీక్ పేర్కొన్నారు. సిరిసిల్లలో మంగళవారం విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలోనే బాల బాలికల ప్రతిభను గుర్తించి క్రికెట్ నైపుణ్యం సాధించే విధంగా ప్రత్యేక ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సిరిసిల్ల గోదావరిఖని కరీంనగర్ లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు వైట్ డ్రెస్ తో తమ పేర్లను నమోదు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
జైపూర్,నేటి ధాత్రి:
మహిళా సంఘాల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో చెన్నూరు నియోజకవర్గంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామపంచాయతీలో ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ కామేర మనోహర్,ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్,వార్డు సభ్యులు,మహిళా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కామేర మనోహర్ మాట్లాడుతూ రైతులందరూ తమ పంటను ఐకెపి కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు.దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని,ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని తెలిపారు.ఉప సర్పంచ్ కుమ్మరి రాజశేఖర్ మాట్లాడుతూ రైతులు తమ పంటను వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందు తాలు,తేమ శాతం లేకుండా శుభ్రంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాలు,ఇతర సంక్షేమ కార్యక్రమాలలో పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.మహిళా సంఘాల సీసీ రాజన్న మాట్లాడుతూ ఐకెపి కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి,కేటాయించిన రైస్ మిల్లర్లకు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సీసీ రాజన్న,అశ్విని వివో సభ్యురాలు స్వరూప,సర్పంచ్, ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
ఆస్పత్రికి వచ్చే పేషెంట్స్ కు కనీసం తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారు కావున వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్ కు తాళాలు వేసి ఉన్నాయి.
కొన్ని టాయిలెట్స్ లో వాటర్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్స్ వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీరు సమస్యను పరిష్కరించాలి ఆసుపత్రి పేషెంట్స్ అన్నం పెట్టే వంట గదిని పరిశీలించారు నాణ్యత లోపంతో ఉన్న వస్తువులను వాడుతున్నారు క్వాలిటీ వస్తువులు వాడి పేషెంట్స్ కు మంచి భోజనాన్ని అందివ్వాలి అని వారు అన్నారు మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఆసుపత్రికి సపరేట్ లైన్ వేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ప్రిన్సిపాల్టీ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి సిద్దు తిరుపతి తదితరులు పాల్గొన్నారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌కు రాష్ట్ర ఉత్తమ అవార్డు
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.1.10 లక్షల ప్రోత్సాహకం అందుకున్న ప్రొఫెసర్ మల్లం నవీన్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్), ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్‌కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక-విద్యా వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారంతో పాటు కళాశాల అభివృద్ధికి రూ.లక్ష, రూ.10 వేల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ నవీన్ మాట్లాడుతూ ఈ పురస్కారం తన వ్యక్తిగత విజయం కాకుండా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల సమిష్టి కృషికి లభించిన గుర్తింపు అని పేర్కొన్నారు. సంకల్పం, క్రమశిక్షణ, సమిష్టి కృషి ఉంటే ప్రభుత్వ కళాశాల కూడా రాష్ట్రంలోనే ఆదర్శ విద్యాసంస్థగా నిలుస్తుందని నిరూపించామన్నారు. గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, కళాశాలను విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, సాంకేతిక వనరులు, పరిశోధనలో ఉత్తమంగా తీర్చిదిద్దుతానని ప్రిన్సిపల్ తెలిపారు.డిజిటల్ లెర్నింగ్, పోటీ పరీక్షల శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ప్రతి తరగతి గది స్ఫూర్తి కేంద్రంగా, ప్రతి విద్యార్థి నాయకుడిగా ఎదగాలన్నదే తన కల అని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వానికి, ఉన్నత విద్యాశాఖ అధికారులకు, అధ్యాపకులకు, సిబ్బందికి, తల్లిదండ్రులు, విద్యార్థులకు ప్రొఫెసర్ మల్లం నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.
11వ వార్డులో జరిగినటువంటి ముస్లిం మైనారిటీ సోదరుడు సాదియా తబుసుమ్ డాటర్ ఆఫ్ సయ్యద్ & షహీద్ పెళ్లికి హాజరై వారికి కల్యాణ కానుక కింద 5000 రూపాయలు కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కుక్కర్ల మల్లేష్ అభిమానులు నాయకులు పాల్గొన్నారు.
ఎరువుల కంపెనీలు అమలు చేస్తున్న లింకు విధానాలు రిటైల్ డీలర్లతో పాటు రైతులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పరకాల మండల ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ మరియు డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు ఆరోపించారు.సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రైతులకు అత్యవసరమైన యూరియా ఎరువులు ఇవ్వాలంటే డిమాండ్ లేని ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కంపెనీలు సృష్టిస్తున్నాయని విమర్శించారు.గత రెండేళ్లుగా రిటైల్ డీలర్ల మార్జిన్లు భారీగా తగ్గిపోవడంతో రవాణా,గోడౌన్,విద్యుత్ వంటి నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదన్నారు.హోల్‌సేల్ వ్యాపారులు నేరుగా ఎంఆర్పీ ధరలకే విక్రయాలు చేయడంతో చిన్న డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.దీంతో అనేక ఎరువుల దుకాణాలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.అదేవిధంగా సాగు సీజన్ ప్రారంభ సమయంలో కంపెనీలు ఉద్దేశపూర్వకంగా యూరియా,డీఏపీ ఎరువుల కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు.పాత స్టాక్‌ను వదిలించుకునేందుకు డీలర్లపై ఒత్తిడి తెస్తూ రైతులకు సకాలంలో ఎరువులు అందకుండా చేస్తున్నారని పేర్కొన్నారు.దీని ప్రభావంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు.‘లింకు’ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,రిటైల్ డీలర్లకు కనీసం 8 నుంచి 10 శాతం వరకు న్యాయమైన మార్జిన్ కల్పించాలని,జిల్లాలు మరియు మండలాల వారీగా ఎరువుల సరఫరా వివరాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఇది కేవలం డీలర్ల సమస్య మాత్రమే కాకుండా రైతు బతుకు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని గందె వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
రోగుల ప్రాణాలను కాపడుతూ సేవభావంతో ముందుకు సాగుతున్న నర్సులు
పరకాల,నేటిధాత్రి
అనారోగ్యంతో ఆసుపత్రికి చేరిన ప్రతి రోగికి ముందుగా కనిపించే ఆత్మీయ ముఖం నర్సులదే.బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం,రాత్రింబవళ్లు సేవలందించడం,అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం వంటి బాధ్యతలను నర్సులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారు.వైద్య రంగంలో డాక్టర్లతో సమానంగా నర్సుల పాత్ర కూడా అత్యంత కీలకమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ నర్సింగ్ సేవలను స్మరించుకుంటారు.ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ప్రభుత్వ,ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న నర్సులు రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వైద్యుల సూచనల మేరకు చికిత్స అందిస్తున్నారు.మందులు ఇవ్వడం,ఇంజెక్షన్లు చేయడం, పరీక్షల కోసం రోగులను సిద్ధం చేయడం,అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించడం వంటి అనేక బాధ్యతలను నిర్వహిస్తున్నారు.చిన్నారుల వార్డుల నుంచి ఐసీయూ వరకు ప్రతి విభాగంలోనూ నర్సుల సేవలు కీలకంగా మారాయి.
కరోనా మహమ్మారి సమయంలో నర్సులు చేసిన సేవలను సమాజం ఇప్పటికీ గుర్తుచేసుకుంటోంది.కుటుంబాలకు దూరంగా ఉంటూ కరోనా బాధితులకు సేవలందించిన నర్సులు నిజమైన యోధులుగా నిలిచారు.ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ విధులను వదలకుండా పని చేసి ఎన్నో కుటుంబాలకు ధైర్యం ఇచ్చారు.ఆ సమయంలో అనేక మంది నర్సులు తమ ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి సేవలందించారని వైద్యాధికారులు గుర్తు చేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలో నర్సులు కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీల సంరక్షణ,చిన్నారుల టీకాలు,ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.మహిళలు, వృద్ధులు,చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదని,అది మానవతా సేవకు ప్రతీక అని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.రోగి బాధను అర్థం చేసుకుని సేవ చేయగలిగే మనసు ఉన్నవారే మంచి నర్సులుగా నిలుస్తారని పేర్కొన్నారు.ఒత్తిడి,సమయాభావం,సిబ్బంది కొరత వంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నర్సులు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.రోగి కోలుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లడమే మాకు నిజమైన సంతోషం అని పలువురు నర్సులు పేర్కొన్నారు.సేవా భావం,సహనం,మానవత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్న నర్సులకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నర్సుల సేవలు వైద్య రంగానికి వెన్నెముక
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నర్సుల సేవలు ఎంతో కీలకమని డాక్టర్ రోహిత్ సాదు అన్నారు.అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల సంరక్షణలో నర్సులు చూపుతున్న సేవాభావం అభినందనీయమన్నారు.పగలు,రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ రోగులకు ధైర్యం చెప్పడం,చికిత్సలో భాగస్వామ్యం కావడం నర్సుల గొప్పతనమని పేర్కొన్నారు.ఆసుపత్రుల్లో వైద్యుల తర్వాత అత్యంత బాధ్యతాయుతమైన పాత్రను నర్సులే నిర్వహిస్తున్నారని తెలిపారు.కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నర్సులు సేవలందించారని గుర్తు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలోనూ నర్సుల పాత్ర కీలకమని అన్నారు.రోగి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడమే నర్సులకు నిజమైన సంతోషమని తెలిపారు.సేవాభావం,సహనం,మానవత్వంతో పనిచేస్తున్న ప్రతి నర్సుకు సమాజం రుణపడి ఉంటుందని డాక్టర్ రోహిత్ సాదు కొనియాడారు.
డాక్టర్ రోహిత్ సాదు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.