పత్తి రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T155913.136.wav?_=1

 

పత్తి రైతుల సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం

 

మందమర్రి మండలంలోని రైతులు ఐక్యంగా రైతు వేదికను సందర్శించి, కౌలు రైతుల సంక్షేమం కోసం అధికారులతో విస్తృతంగా సమావేశమయ్యారు.
రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కాపస్ కిసాన్ యాప్ కారణంగా రైతులు అనేక సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, పత్తి కొనుగోలు ప్రక్రియలో ఆలస్యాలు అవరోధాలు ఏర్పడుతున్నాయని రైతులు వివరించారు.

ప్రస్తుతం యాప్ ఆధారంగా కేవలం 7 క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తిని కొనుగోలు చేయడం రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తోందని, రైతుల వాస్తవ ఉత్పత్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరిమితిని 12 క్వింటాళ్ల వరకు పెంచాలని రైతులు అధికారులు ముందు వినతిపత్రం ద్వారా అధికారికంగా కోరారు. చిన్న, మధ్య తరహా కౌలు రైతులు యాప్ లోపాల వల్ల ఆర్థికంగా ఇబ్బందులలో పడుతున్నారనీ, ప్రభుత్వం రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వారు అభ్యర్థించారు.

ఈ సమావేశంలో రైతులు తమ సమస్యలను స్పష్టంగా వివరించడమే కాకుండా, పత్తి కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలను మెరుగుపరచడం, తూకం చర్యల్లో పారదర్శకత, చెల్లింపుల్లో వేగం వంటి అంశాలను కూడా ఉటంకించారు. రైతుల ఏకగ్రీవ అభిప్రాయం ఏమిటంటే కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలి.

ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు రైతు నాయకులు, సంఘ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ఐక్యంగా తమ మద్దతు తెలిపారు. రైతుల ఆశాభావం ఏమిటంటే, ఈ వినతి పత్రం ద్వారా వచ్చిన అంశాలను అధికారులు ప్రాధాన్యంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని రైతుల ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T121732.421.wav?_=2

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రైతుల కోసం చేసిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు. అన్నదాతలు వైసీపీ హయాంలో చాలా నష్టపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రెండు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
రైతులకు ఇప్పటికే రూ.14,000 ఇచ్చామని చెప్పుకొచ్చారు. త్వరలో మూడో విడతగా రూ.6,000 విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సంవత్సరానికి రూ.20,000 అన్నదాతలకు సహాయం చేశామని తెలిపారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫీల్డ్‌లోకి వచ్చి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రైతాంగం ఎన్డీఏ నాయకత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడాన్ని కూడా పూర్తిగా రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శలు చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. ఇదంతా చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమవుతోందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్‌లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లో మమేకమై వారి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.

ఆర్టీసీ జహీరాబాద్ డిపోలో  ప్రగతి చక్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T165507.537.wav?_=3

 

ఆర్టీసీ జహీరాబాద్ డిపోలో  ప్రగతి చక్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ జహీరాబాద్ డిపోలో ఈరోజు( శుక్రవారం) ప్రగతి చక్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక  డి.ఎస్.పి సైదా హాజరై విజేతలకు అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్ లకు మరియు ఇతర సిబ్బందిని ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాలు పంపిణీ చేయడం జరిగింది.ముఖ్యఅతిథిగా విచ్చేసిన డీఎస్పీ సైదా  మాట్లాడుతూ ప్రజా సేవలో భాగంగా ఆర్టిసి ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు వారి సేవలను గుర్తించి గౌరవించడం ఎంతో సంతోషకరం డ్యూటీలో  అందరూ  ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రశాంతమైన వాతావరణంలో ఓపికతోని విధులు నిర్వహించాలని అందరికీ సూచించడం జరిగింది.మరియు స్థానిక డిపో మేనేజర్ టి. స్వామి మాట్లాడుతూ ఈ అవార్డుల ఉద్యోగుల ప్రతిభను వెలికితీయడమే కాకుండా మరికొంత ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. డీఎస్పీ గారి చేతుల మీదుగా అందరికీ ప్రశంసా పత్రాలు మరియు నగదు పురస్కారాలతో అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ మరియు గ్యారేజ్  సూపర్వైజర్ బంగి నాయక్ మరియు డిపో సూపర్వైజర్లు. డిపో సిబ్బంది అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమం ముగింపు సందర్భంగా డిపో మేనేజర్ ముఖ్య అతిథి డిఎస్పి  గారి చేతుల మీదుగా శబరిమల అయ్యప్ప స్వాముల ప్రత్యేక బస్సుల యొక్క చార్జీల వివరాలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేయడం జరిగింది చివరిగా డి.ఎస్.పి గారిని శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T165046.346.wav?_=4

 

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు.

మరిపెడ ఏపియం అలివేలి మంగమ్మ

మరిపెడ నేటిధాత్రి:

 

 

ప్రభుత్వం ఆమోదితం చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని ఏపియం అలువెలి మంగమ్మ అన్నారు. శుక్రవారం మరిపేడ మండల కేంద్రంలోని తాళ్ల ఊకల్ గ్రామం లో చామంతి గ్రామీక్య సంఘo ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని, గుండేపూడి గ్రామం లో స్వయం కృషి గ్రామీక్య సంఘo, తండా ధర్మారం గ్రామం లో షిరిడీ సాయి బాబా కొనుగోలు కేంద్రాo సెంటర్ల ను ప్రారంభించారు. ఈ మేరకు ఎపియం మాట్లాడుతూ దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం నుంచి ప్రకటించిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. వరి కి మద్దతు ధర రూ.2,389 రూ/- లు సాధారణ రకం 2369 రూ/- లకు కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రంలోనే విక్రయించుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన సన్న వడ్లకు ప్రభుత్వం ₹500 అదనంగా బోనస్ అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈఓ సైదమ్మ, సిసి శ్రీనివాస్ , చందు లాల్ , శ్రీరాములు, కేసముద్రం మార్కెట్ డైరెక్టర్ గడ్డం వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సూరబోయిన ఉప్పలయ్య, పులుసు మల్లేశం, పెద్దపులి శ్రీనివాస్, గుండ గాని మధుసూదన్, కందల రమేష్, గుండెపుడి గ్రామ స్వయంకృషి గ్రూప్ సభ్యులు సైదమ్మ, మంజుల, ఉమా, తాళ్ల ఉక్కల్ చామంతి గ్రూప్ సభ్యులు, మామిళ్ళ ఉమారాణి, జ్యోతి, సుభద్ర, తండ ధర్మారం శిరిడి సాయిబాబా గ్రూప్ సభ్యులు బుజ్జమ్మ,నాగమణి,రైతులు లింగన్న, గణేష్,పెద్ద వెంకన్న,రాజు,బోడ పట్ల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

రైతు సమస్యలతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ…

రైతు సమస్యలతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ

రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం-వెలిచాల తిర్మల్ రావు

గంగాధర, నేటిధాత్రి:

 

తమ రాజకీయ లబ్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు పేర్కోన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలిచాల తిరుమలరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను బిఆర్ఎస్ నాయకులు భూతద్దంలో పెట్టి చూపిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని దుయ్యబెట్టారు. నాటి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోసపడ్డ పట్టించుకున్న నాధుడే లేడని, క్వింటాలకు ఆరు కిలోల వరకు కట్ చేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని మర్చిపోలేదని గుర్తు చేశారు. కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని, ఇరవై ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నారాయణపూర్ నిర్వాసితుల ఎదురుచూపుకు తెరదించుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇరవై మూడున్నర కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ పై పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం మంజూరు చేశారని గుర్తు చేశారు. అబద్దాలతో కాలం గడుపుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, మాజీ ఎంపిపి రాజగోపాల్ రెడ్డి, పడితపల్లి కిషన్, మాజీ వైస్ ఎంపిపి కర్ర బాపురెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాగి అజయ్ రావు, బూరుగు గంగన్న, రేండ్ల రాజిరెడ్డి, రోమాల రమేష్, వంగల శ్రీనివాస్, ముద్దం నగేష్, కనకట్ల తిరుపతి, దోమకొండ మహేష్, జితేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలో పంటల కొనుగోళ్లపై విస్తృత సమీక్ష…

సంగారెడ్డి జిల్లాలో పంటల కొనుగోళ్లపై విస్తృత సమీక్ష – కలెక్టర్ ప్రావీణ్య సూచనలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

2025–26 సీజన్‌లో పత్తి, ధాన్యం తదితర పంటల కొనుగోళ్లను పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సంబంధిత శాఖలతో విడివిడిగా సమీక్షలు నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశాల్లో పౌరసరఫరాల శాఖ , సహకారశాఖ, వ్యవసాయ, మార్కెటింగ్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 2025–26 సీజన్ పత్తి సాగు, దిగుబడిపై సమగ్ర అంచనా ప్రకారం, పత్తి కొనుగోలు సజావుగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు మార్కెటింగ్ యార్డుల పరిధిలోని 24 జిన్నింగ్ మిల్లుల నుండి సీసీఐ ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు వేగవంతం చేయాలని అన్నారు. పత్తి అమ్మకానికి ఆధార్ ప్రామాణికత తప్పనిసరి అని, చెల్లింపులు రైతుల ఆధార్‌తో అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలలోనే జమ అవుతాయని తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి యంత్రాలు, వసతులు, భద్రత ప్రమాణాలు సరిగా ఉన్నాయో లీగల్ మెట్రాలజీ శాఖ పర్యవేక్షణలో పరిశీలించాలని ఆదేశించారు. అగ్నిమాపక శాఖ అధికారులు మిల్లులను సందర్శించి భద్రత సూచనలు ఇవ్వాలని సూచించారు.

రైతుల కోసం తాగునీరు, కనీస వసతులు కల్పించడమే కాకుండా, టోకెన్ సిస్టమ్ అమలు చేసి కొనుగోలు వ్యవస్థను క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. అంతేకాక, రైతులు కిసాన్ కంపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసి నిర్ణీత సమయానికి పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

2025–26 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను కూడా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 216 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తీ స్థాయిలో ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ప్యాడి క్లీనర్లు, తార్పాలిన్లు, మాచర్ మిషన్లు, గన్ని సంచులు, లారీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గోనెసంచులను రైతులకు నేరుగా ఇవ్వకుండా, కొలత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. పిపిసి సెంటర్ ఇన్‌చార్జీలు కొనుగోలు వివరాలు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే స్వీకరించి ఎంట్రీలు చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటాచ్మెంట్‌లో ఉన్న నిర్దిష్ట రైస్ మిల్లర్లకే PPC సెంటర్ నిర్వాహుకులు ధాన్యం పంపాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సోయా చిక్కుడు – 7, మొక్కజొన్న – 9 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పంటల కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా పంటల కొనుగోళ్లు జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు .

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి – రెవెన్యూ శాఖ పై దృష్టి

రీజినల్ రింగ్ రోడ్ ( ఆర్ ఆర్ ఆర్ ), రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు ( ఆర్ఓబి ఎస్ ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) వంటి కీలక ప్రాజెక్టుల భూసేకరణపై కూడా కలెక్టర్ సమీక్షించారు.

భూసేకరణలో ప్రజల హక్కులు కాపాడుకునేలా , రైతులకు న్యాయం జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మరోవైపు అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. విక్రయ విలువలను ఆధారంగా పరిగణించి భూసేకరణను న్యాయంగా పూర్తి చేయాల్సిందిగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ బాల సరోజ ,డి ఏం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్ ,సహకారశాఖ అధికారి కిరణ్ కుమార్ , జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ , జహీరాబాద్ ఆర్ డి ఓ దేవుజా నిమ్జ్ ప్రత్యేక అధికారిని విశాలాక్షి ,మార్కెటింగ్ శాఖ అధికారులు ,సంబంధితశాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు .

పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-13T152246.895.wav?_=5

 

పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలి.

ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని మోసపోవద్దు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు(గురువారం) భూపాలపల్లి మంజూరు నగర్ లోని యం ఎస్ ఆర్ కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు. 8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నారని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయాలనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొనుగోలు చేసేలా రైతులకు సహకరించాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించారు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య
పత్తి మిల్లు ఓనర్ లింగారెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T154510.495.wav?_=6

 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

కేంద్రాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి

భూపాలపల్లి ఎమ్మెల్యేగండ్ర సత్యనారాయణరావు

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 10 ఏండ్లుగాఎన్నడూ లేని
విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యానికి రూపాయలు 500 బోనస్ ప్రకటించారని అన్నారు రైతుల పండించిన పంటను 17% తేమ మించ కుండా ప్రభుత్వం ద్వారా కేటా యించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాల న్నారు రైతులు ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజా ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగో లు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం నిర్ణయించిన గిట్టు బాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరారు. రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఎవరూ ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని సంబంధిత శాఖల అధికారు లకు ఎమ్మెల్యే సూచించారు.

లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శాయంపేట మండల కేంద్రం లోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.62,07,192 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పేద, నిరుపే ద కుటుంబాల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభు త్వం పెద్దపీట వేస్తూ సబ్బండ వర్గాల ప్రజలకు అండగా నిలు స్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నా రు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీ పథకం ఆర్థికంగా ఎంతో తోడ్పాటును అందిస్తుం దని తెలిపారు. మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

శాయంపేటమండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 16 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ.5,70, 600 విలువైన చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఖరీదైన వైద్య చికిత్స చేసుకో లేక ఆర్ధిక ఇబ్బందులు పడు తున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని, బాధితులు అవసరమైన సమ యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అనంతరం రైతులకు మొక్కజొన్న సబ్సిడీ విత్తనా లను అందజేశారు. ఈ కార్యక్ర మాలల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా, మం డల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నెక్కొండ మార్కెట్ అభివృద్ధికి 1.83 కోట్ల రూపాయల నిధుల మంజూరు…

నెక్కొండ మార్కెట్ అభివృద్ధికి 1.83 కోట్ల రూపాయల నిధుల మంజూరు

#నెక్కొండ, నేటి ధాత్రి :

 

నెక్కొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం 1.83 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఇందులో రూ.99 లక్షలతో సీసీ రోడ్డు పనులు, రూ.84 లక్షలతో షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ నిధుల మంజూరీకి స్థానిక శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి చేసిన కృషి అమూల్యమని ఆయన ప్రశంసించారు. రైతుల సౌకర్యార్థం మార్కెట్ యార్డ్ అభివృద్ధి దిశగా తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యమైనదని తెలిపారు. మార్కెట్ అభివృద్ధి పనులు పూర్తయితే రైతులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
ఈ నిధుల మంజూరీ కోసం కృషి చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మార్కెట్ పాలకవర్గం, అధికారులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి కృష్ణ మీనన్, కార్యవర్గ సభ్యులు కందిక సుమలత, మామిండ్ల మల్లయ్య, దూదిమెట్ల కొమురయ్య, తాళ్లూరి నరసింహస్వామి, కొత్తపల్లి రత్నం, జమ్ముల సోమయ్య, బొమ్మరబోయిన రమేష్, రావుల మహిపాల్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కనుగోలు కేంద్రం ప్రారంభం…

వడ్ల కనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ , రామాయంపేట ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకము క్వింటాలుకు 2389 గాను, గ్రేడ్ బి రకానికి క్వింటాలుకు 2369 gaa అలాగే సన్న రకానికి బోనస్ గా 500 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుందని సెంటర్ నిర్వాహకులు తెలపడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్ ,వడ్ల కనుగోలు కేంద్రం నిర్వాహకులు కేతావత్ సురేష్ , పాత్లోత్ శంకర్, మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుగ్లోత్ దేవేందర్, గ్రామస్థులు ఉప్పలయ్య, మోహన్, నాజాం , అనిల్ కుమార్, మరియు రైతులు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

రైతులు పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకో వాలి

ప్రైవేటు వ్యక్తులు, దళారులకు అమ్ముకొని మోసపోవద్దు

సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన, గండ్ర సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని గండ్ర సత్యనారా యణరావు సూచించారు. పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పత్తి కొనుగో లు కేంద్రాన్ని ఎమ్మెల్యే లిద్దరు రిబ్బన్ కట్ చేసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా వేరు వేరుగా మాట్లాడుతూ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు లు సద్వినియోగం చేసుకొని, మద్దతు ధరను పొందాలని అన్నారు.

8 నుండి 12 శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నా రని 20 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాల న్నారు. ప్రతి ఎకరాకి 7 క్వింటాళ్లు కొనుగోలు చేయా లనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి, 12 క్వింటాలు కొను గోలు చేసేలా రైతులకు సహక రించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపో యిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుం దని, అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివే దిక అందించేలా సహకరిం చాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని తీసుకురావాలని సూచించా రు. అంతకుముందు వివిధ పంటలకు సంబంధించిన కనీస మద్దతు ధర పోస్టర్ ను ఎమ్మెల్యేలు, అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు

సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి మద్దతుధర.

సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి మద్దతుధర.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని బాలమురుగన్ పత్తి మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని
రైతులెవరూ ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకుని నష్టపోవద్దని, సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని అన్నారు.శ్రీ బాలమురుగన్ ఇండస్ట్రీస్ కాట‌న్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడ వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిసిఐ అధికారులు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మధు వంశీ, టౌన్ అధ్యక్షులు బుర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, చిలకల రాయకొమురు, చిలుమల రాజమౌళి, బుర్ర శ్రీనివాస్, మార్కండేయ, నరసయ్య కిషన్, సదయ, పుల్ల సమ్మయ్య,,

రాజ్‌పల్లి వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

మల్లాపూర్ నవంబర్ 3 నేటి దాత్రి

 

కొత్త ధాం రాజ్ పల్లి గ్రామంలో పాక్స్ ఆద్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పుస్పలత నర్సయ్య,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణ రావు లు కలిసి ప్రారంబించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి,పాక్స్ సీఈవో భూమేష్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దం రాధ సుధాకర్ రెడ్డి ,పాక్స్ డైరెక్టర్ నారాయణ రెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బద్దం. నర్స రెడ్డి, నిగ రవి,ఏలేటి లింగా రెడ్డి,ఉత్కం.హన్మంతు,రోండ్ల.రాజ రెడ్డి, పతకాల.కిరణ్,సురేష్,ఎల్లా రెడ్డి,నత్తి రాం తదితరులు పాల్గొన్నారు.

సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్…

సొయాబిన్ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డీసీఎంహెచ్ చైర్మన్

◆:- శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు.

◆:- డీసీఎంహెచ్ చైర్మన్. మల్కాపురం శివకుమార్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా నాఫెడ్ వారిచే మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో సోయబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు. ఏడాకులపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లో సోయబీన్ కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మాణికరావు. మరియు ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్. ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు 5328/ రూపాయలు. కావున రైతులు దళారుల వద్దకు తీసుకోనిపోయి మోసపోకుండా రైతులు సోయబీన్ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ఇట్టి అవకశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు లబ్ది పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ కాంతమ్మ , ఏడాకులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు మాజీ రైతు బంధు ఆధ్యక్షులు ప్రభు పటేల్, ఏడాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రభుపటేల్. సొసైటీ డైరెక్టర్లు అనాంత్ రామ్ గౌడ్, శ్రీనివాస్, రాంచందర్. అగ్రికల్చరల్ ఏవో వెంకటేశం ఏఈఓ వేద రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు,

పీఏసీఎస్ ఝరాసంగం సొసైటీ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం…

పీఏసీఎస్ ఝరాసంగం సొసైటీ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సోయ కోనుగోలు కేంద్రం పీఏసీఎస్ ఝరాసంగం అధ్యక్షులు మొహమ్మద్ గౌసోద్దిన్ ప్రారంభించడం జరిగింది ఆయన మాట్లాడుతూ రైతులు తమ సోయాబిన్ ను శుభ్రపరుచుకోని, నాణ్యత ప్రమాణాలు పాటించి,కావలసిన ధృవపత్రాలు ఆధార్ కార్డ్, భూమి పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, జిరాక్స్ కాపీలు తీసుకోని స్వయంగా వచ్చి ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం అమ్మినట్టు అయితే రైతులు లాభాలు పొందే అవకాశం వుందని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర కింటలుకు రూ .5328/- రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పిఎసిఎస్ సెక్రటరీ షేక్ నిస్సార్ అహ్మద్, కేతకి అలయ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటేల్, ఏఎంసీ డైరెక్టర్ అంజత్,ల్యాఖత్ అలీ అమృత్ పాటేల్, మోహన్ రెడ్డి, బశిరెడ్డి, శంకర్ గౌడ్, అష్రఫ్ అలీ, అలయ ధర్మ కర్త, శ్రీనివాస్, రవిందర్ రెడ్డి రాజేందర్ సింగ్ రైతులు మహ్మద్ కిజర్ ఖాన్ తదితరులు పాల్గన్నారు. మరియు రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరడం జరిగింది.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే….

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో పౌర సరఫరాల సంస్థ,గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(ఐకెపి)ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని,కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు.
ఏ గ్రేడ్‌కు రూ.2389, కామన్‌ రకానికి రూ.2369ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాణి,ఎంపీడీవో రామకృష్ణ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్,మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్, ఏపిఎం నాగేశ్వరరావు, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నడికూడ మండల అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు,పర్నేం తిరుపతిరెడ్డి, చాడ తిరుపతిరెడ్డి,గోల్కొండ సదానందం,రామకృష్ణ పురం మాజీ సర్పంచ్ పెండ్లి రాజు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు పెండ్లి లింగారెడ్డి,రాయిడి జీవన్ రెడ్డి,ఐకేపీ సభ్యులు గోనె చైతన్య,పెండ్లి సునీత,పద్మ,యార రజిత, ఎరుకల సుక్కపాల,బిజెపి మండల అధ్యక్షులు ఎరుక దివాకర్,తదితరులు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T132913.846.wav?_=7

 

 

నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి

– వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి

– కొనుగోళ్లు, తేమ శాతం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి

– క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా చూడాలి

– రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తేమ శాతం ఆధారంగా, నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని, వ్యవసాయ విస్తరణ అధికారులు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు.
శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూర్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో సందర్శించి, కేంద్రంలో రైతుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
17 శాతం తేమ రాగానే ఆలస్యం చేయకుండా కొనుగోళ్ళు ప్రారంభించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తప్పకుండా సందర్శించి, రైతులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తూ, అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని అన్నారు. కేంద్రంలోని రిజిస్టర్ లను పరిశీలించి, వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీ లో తప్పులు దొర్లకుండా చూడాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వహిస్తే ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని పేర్కొన్నారు. గ్రేడ్ – ఏ రకానికి రూ. 2,389, కామన్ రకానికి రూ. 2,369 ధర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. సన్న రకం ధాన్యం క్వింటాలుకు అదనంగా బోనస్ రూ.500 ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఆర్డీఓ లు, తహశీల్దార్లు తప్పనిసరిగా తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు.
సందర్శనలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ అధికారి చంద్రప్రకాష్, తహశీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, మెప్మా ఏఓ మీర్జా ఫసాహత్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.

వడ్ల కొనుగోళ్లు సాఫీగా జరగాలన్న మంత్రుల ఆదేశం

రైతులకు ఇబ్బదులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలి
వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అధికారులతో కలిసి పాల్గొన్నారు
మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారిగా కలెక్టర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడినన్ని గన్ని సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టార్పలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు, త్రాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వరి ధాన్యం తరలించుటకు లారీలను సమకూర్చుకోవాలని కోరారు
రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆదేశించారు వడ్ల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున వడ్ల రైతులకు నష్టం జేరుగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు కలెక్టర్లు స్వయంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని వడ్ల కొనుగోలు ప్రక్రియ జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ వనపర్తి జిల్లా అక్టోబర్ చివరి వారం నుండి వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు
గతంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు కలిగిన కేంద్రాల్లో మళ్ళీ ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎక్కడా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా తూకము కాంటాలు తేమ యంత్రాలు సరిగ్గా చూసుకోవాలని అన్నారు. టార్పలిన్ లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని . లారీలు, కూలీల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, డి ఆర్ డి ఓ పి డి ఉమాదేవి, డి సి ఓ రాణి, డిటిఓ మానస, వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చివరి మడి వరకు సాగునీరు అందజేస్తాం

చివరి మడి వరకు సాగునీరు అందజేస్తాం

నారాయణపూర్ రిజర్వాయర్ కు ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి, చొప్పదండి నియోజకవర్గంలోని చెరువులను నింపుతాం

రైతులెవ్వరు ఆందోళనకు గురి కావద్దు

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి :

 

చొప్పదండి నియోజకవర్గం లోని చివరి మడి వరకు సాగునీరు అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో పంటలకు సాగునీరు అందుతుందో, లేదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, రైతులెవ్వరు ఆందోళనకు గురి కావద్దన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు గోదావరి జలాలను విడుదల చేసి, అక్కడి నుండి చొప్పదండి నియోజకవర్గం లోని అన్ని చెరువులను నింపి సాగునీరు అందజేయాలని సంబంధిత శాఖ సిఈని కోరినట్లు తెలిపారు. సాగునీటి విడుదలకు సీఈ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, రైతులు ఇబ్బంది పడకుండా నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T153118.778-1.wav?_=8

 

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలి

యూరియా లేక రైతుల ఇబ్బందులు

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో యూరియా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం జిల్లా యంత్రాంగం స్పందించి రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఘనపురం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి అన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం విషయంలో మాట తప్పిందని కనీసం రైతులకు యూరియా అందించలేని దుస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని లేనిపక్షంలో రైతుల కోసం రైతు సంక్షేమం కోసం ధర్నా చేస్తామని అన్నారు
కార్యక్రమంలో వారి వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచులు తోట మానస శ్రీనివాస్, పెంచల రవీందర్, నాయకులు బైరగాని కుమారస్వామి, ఉడుత సాంబయ్య, పేరాల దేవేందర్ రావు, మామిండ్ల సాంబయ్య, గాజర్ల చింటూ, వాజిద్, తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version