ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు.

ప్రజావాణి అర్జీలు పెండింగ్లో పెట్టవద్దు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్( నేటి ధాత్రి ):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలు పెండింగ్లో పెట్టవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.మొత్తం 182 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 75, హౌసింగ్ శాఖకు 36, ఎస్డీసీకి 12, డీఆర్డీఓ, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు తొమ్మిది చొప్పున, ఎస్పీ కార్యాలయానికి 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి, నీటి పారుదల శాఖ కు 5 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారికి 4, వ్యవసాయ శాఖ,  జిల్లా విద్యాశాఖ అధికారి, ఏడీ టెక్స్టైల్స్, సబ్ రిజిస్టర్, ఏడీ ఎస్ఎల్ఏ కు రెండు చొప్పున తదితర శాఖలకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే వైద్యానికిి రూ. రెండు లక్షల ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన బొల్లె శ్రీనివాస్ పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నాడు. సాయం అందించాలని శ్రీనివాస్ భార్య శంకరవ్వ కలెక్టర్ కు విన్నవించారు. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి, శ్రీనివాస్ వైద్యానికి రూ. రెండు లక్షల చెక్కును అందజేశారు. వైద్యానికి సహాయం అందించిన కలెక్టర్ కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు..

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి)మే12:

 

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా ఐదు మంది తమ సమస్యలు తెలుపగా, 23 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మునిసిపల్ పార్క్ వెనుక ప్రాంతంలో చెత్త వాహనం సక్రమంగా వచ్చేలా చూడాలని, పూల మార్కెట్, సున్నపు వీధిలో ఆక్రమణలు తొలగించాలని, రాజీవ్ నగర్ లోని మసీదు వద్ద నీటి వసతి కల్పించి, మొక్కలు నాటించాలని, చేపల మార్కెట్ వద్ద శుభ్రంగా ఉంచాలని, కొంకచెన్నాయ గుంటలో అక్రమంగా వేసిన యు డి ఎస్ తొలగించాలని, వరదరాజ నగర్ పాచిగుంట వద్ద సక్రమంగా నీరు రావడం లేదని, గతంలో ఇంటికోసం డబ్బులు కట్టామని ఇళ్ళైనా, డబ్బులు ఇప్పించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.

పెండింగ్ బిల్లుల విడుదలకు కార్యదర్శుల విజ్ఞప్తి

కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి:

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో గ్రామ పంచాయతీ కార్యకలాపాల నిర్వాహణ కోసం పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కార్యదర్శులు కోరుతున్నారు. మార్చి నుండి నిర్వహణ సాధ్యం కాదని వారు పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం మండలంలో ఎంపీడీవో కమలాకర్ కు, ఎంపీవో రాములుకు వినతిపత్రాలు అందజేశారు. గతేడాది ఆగస్ట్ నుండి పెండింగ్లో ఉన్న చెక్కుల చెల్లింపులు మరియు జీపీ నిర్వహణ నిధులు విడుదల చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల కార్యదర్శులు వినోద్, రాము, లక్ష్మణ్ బాలరాజ్, కృష్ణ, సునీల్, సాయిబాబా, గులాబ్, హుస్సేన్, భాస్కర్, రవి, అంబయ్య, శేఖర్, వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version