నేటి నుండి నాగులమ్మ మహా జాతర…

నేటి నుండి నాగులమ్మ మహా జాతర

ఆదివాసీ పూజారులు ,వడ్డే లతో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు

నాగులమ్మ ను తర తరాలుగా ప్రకృతి దేవత గా ఆరాధిస్తున్న ఆదివాసీ పూజారులు

మార్చ్ 5 న నిండు జాతర,నాగులమ్మ-పగిడిద్ద రాజు ల కళ్యాణం,అగ్నిగుండాలు

అలరించనున్న ఆదివాసీ దింసా,గుస్సాడి నృత్యాలు

కార్య క్రమాలను వెల్లడించిన బాడిశ రామకృష్ణ స్వామి

మంగపేట:నేటిధాత్రి

 

మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధి లో గల లక్ష్మీ నర్సా పూర్ గ్రామం లో శ్రీ నాగులమ్మ మహా జాతర ఐదు రోజుల పాటు గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధం గా ఘనం గా నిర్వహించ నున్నారు .ప్రతి రెండేళ్ల కోసారి పాల్గుణ శుద్ధ పౌర్ణమి ఉన్న వారం లో జాతర నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీ గా వస్తుంది.పూజ కార్య క్రమ వివరాలను బాడిశ.రామకృష్ణ స్వామీజీ తెలియ జేసారు.మార్చ్ 03 న మండె మెలుగుట కార్యక్రమం తో జాతర ప్రారంభ

మవుతుందని,మార్చ్ 4న బుధవారం శ్రీ నాగులమ్మ అమ్మవారిని గండోర్రె గుట్ట వద్ద ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు,అదేసమయంలో యెర్రెట్టల గుట్ట వద్ద సడాలమ్మకు పూజలు చేసి నాగులమ్మ సడాలమ్మ అమ్మవార్లను రమణక్క పేట దగ్గర వున్న గోదావరి నది వద్ద పుణ్య స్నానాలు చేసి నాగులమ్మ ఆలయం వద్ద కు తీసుకు వొచ్చి ప్రతిష్టిస్తారు.మార్చి 5 న నిండు జాతర.అందులో భాగంగా సాయంత్రం 3 గంటలకు రాజుపేట సెంటర్ నందు పాలమాకు వొర్రె నుండి తీసుకువచ్చిన కంక వనం(వనదేవత) కు శ్రీ నాగులమ్మ అమ్మవారికి ఎదురుకోలు కార్య క్రమాన్ని నిర్వహిస్తారు.

రాత్రి 12:05 నిమిషాలకు శ్రీ నాగులమ్మ అమ్మవారికి పగిడిద్ద రాజులకు కళ్యాణాన్ని యాశాస్త్రోక్తం గా గిరిజన ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు.జాతర లో ముఖ్య ఘట్టం అగ్నిగుండాల కార్యక్రమం.తెల్ల వారు జామున 3 గంటల సమయం లో నాగులమ్మ తల్లి ఉపాసకులు బాడిశ రామకృష్ణ స్వామి లోక కళ్యాణం

కోసం అగ్ని గుండాలలో నడవడం జరుగుతుంది.మార్చి 6 న అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుట జరుగుతుందని,మార్చి 7 న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జాతర ముగుస్తుందని తెలిపారు.

మినీ మేడారం ఉత్సవాల విజయానికి అధికారుల సేవలు ప్రశంసనీయం

ఉత్సవాల విజయంలో అధికారుల సేవలు మరువలేనివి

ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నా రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మండలంలోని ముల్కలపల్లి – మొగుళ్ళపల్లి రెండు గ్రామాల పరిధిలో శ్రీ సమ్మక్క సారక్క ఉత్సవాల విజయంలో అధికారుల సేవలు మరువలేనివని మినీ మేడారం సమ్మక్క సారాలమ్మ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి చదువు అన్నారెడ్డి, అన్నారు. శనివారం సాయంత్రం కోయ పూజారులు అమ్మవార్లను ఆదివాసుల సంస్కృతి సంప్రదాయం ప్రకారం వన ప్రవేశ కార్యక్రమం పూర్తి చేశారు. అనంతరం, మొగుళ్ళపల్లి ములకలపల్లి సర్పంచులు చాట్ల విజయ రవీందర్ నాంపల్లి శ్రీవాణి రమేష్ లు మాట్లాడుతూ.

జాతర ఉత్సవంలో ముఖ్యంగా మొగుళ్లపల్లి ఎస్సై అశోక్, పోలీస్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం విధుల్లో పాల్గొని జాతర విజయంలో కీలక పాత్ర పోషించారని సర్పంచులు తెలిపారు. అనంతరం మొగుళ్ళపల్లి ఎస్సై. బొరగల అశోక్, పోలీస్ సిబ్బంది జ్యోతి, మమత, సునిత,హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, విజయ్, విద్యుత్ శాఖ అధికారులు, వెంకటేష్, రఘు, రమేష్, కిరణ్,ప్రసాద్ లను రెండు గ్రామాల సర్పంచులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్సాని నరసింగా రావు, నీల రాజు, కొడారి ఓదెలు, బండారి రామస్వామి, కట్ల శీను బాబ్జి, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మందమర్రి, నేటిధాత్రి:

– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి……

మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి…

మేడారం జాతర జరిగే మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాలి.

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్

కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర కాబట్టి పిల్లల సెలవులకై నిరీక్షణ

ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక కూడా

విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

మేడారం జాతరకు సెలవులు మూడు రోజులు ప్రకటించాలని కోరుతూ టిపిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ నేతృత్వంలో కేసముద్రం గ్రామ ప్రాథమిక పాఠశాలలో , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు నేతృత్వంలో అర్పణపల్లి పాఠశాలలో మధ్యాహ్నం భోజన సమయంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రపంచంలో రెండవ అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించారనీ, ఈ జాతరలో గత సంవత్సరాల గణాంకాల ప్రకారం లక్షలాది మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శించుకున్నారని గుర్తు చేశారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, గిరిజన సంప్రదాయాలకు ప్రధాన ప్రతీక అని, తెలంగాణ సంస్కృతికి మూల స్తంభం అని వివరించారు.
ఈ జాతర సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో దైవ దర్శనం చేసుకుంటారని అన్నారు. ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు సమ్మక్క, సారక్క తల్లులు ఇద్దరు కొలువుదీరిన మరుసటి రోజును సెలవు దినంగా ప్రకటిస్తూ వస్తున్నాయని, దీనివల్ల ఆరోజే అందరూ
మేడారం జాతరకు వస్తూ ఉండడం వలన లక్షలాది మంది ప్రజలు పాల్గొనే కారణంగా ట్రాఫిక్ సమస్యలు, కష్టతర ప్రయాణం , వసతి సౌకర్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, దర్శన సమయంలో కిక్కిరిసిన జనాభా వల్ల పిల్లలకు దర్శన భాగ్యం కూడా కలగట్లేదు అని అన్నారు. ఇది కుటుంబ సమేతంగా వెళ్లాల్సిన జాతర అనీ, పిల్లలకు సెలవులు ఇవ్వందే వాళ్ళు జాతరకు వెళ్ళరని, వారి సెలవులకై వేచి చూసి, సెలవులు ఇచ్చాక మాత్రమే జాతరకు తరలి వెళ్తారని అన్నారు. మూడు రోజులు సెలవులు ఉంటే పబ్లిక్ ఇంత పోటెత్తరని, జాతరను కూడా ఎంజాయ్ చేస్తారని, ఇది విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు తెలంగాణ సంస్కృతిని అర్థం చేసుకునే గొప్ప అవకాశం అని అన్నారు.
ఈ నెల 28న సారక్క తల్లి,29న సమ్మక్క తల్లి గద్దెల పైకి కొలువుదీరుతారని ,30న భక్తుల మొక్కులందుకొని తిరిగి 31న వన ప్రవేశం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు
కావున ప్రభుత్వం ప్రజా ఆకాంక్షను గౌరవించి మేడారం జాతర సందర్భంలో తల్లులు కొలువుదీరే ఈ మూడు రోజులు ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యాసంస్థలకు అధికారికంగా సెలవులు ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, ఉపాధ్యాయులు అప్పాల నాగరాజు, నరసింహస్వామి, భూక్య శ్రీను, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version