భారీ వర్షాలతో జహీరాబాద్లో పంట నష్టం, ప్రజల ఆవేదన
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన నేపథ్యంలో, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో జహీరాబాద్లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలు జనాలను విసుగు చెందిస్తున్నాయి. గురువారం ఝరాసంగం మండలంలో ఉదయం 8 గంటల నుంచే వర్షం కురుస్తుండటంతో, కోతకు వచ్చిన పంటలను ధాన్యంగా మార్చే ప్రక్రియకు అంతరాయం కలిగి, చేతికొచ్చిన పంట కళ్ళముందే నాశనం అవుతుంటే చూసి భరించలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.