రైతులకు తప్పని యూరియా కష్టాలు
రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గోలి చంద్రారెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
చిగురుమామిడి మండలంలోని రైతులకు యూరియా బస్తాలు సకాలంలో అందించడంలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దీనిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం చిగురుమామిడి మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈసందర్భంగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా మండలంలో యూరియా బస్తాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో యూరియా కష్టాలు ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో యూరియా కష్టాలు తీవ్రం అయ్యాయని దీనిని పరిష్కరించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఘెరంగా విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం ప్రతిరోజు ప్రాథమిక సహకార కేంద్రం వద్ద బారులు తీరుతూ చెప్పులు పెట్టి గంటల తరబడి లైన్లో నిల్చున్న పొన్నం ప్రభాకర్ కు కనీస కనికరం లేకుండా పోయిందని రైతులను గోస పెట్టిన ఏప్రభుత్వం కూడా నిలవదని ఆయన అన్నారు. పట్టాదారు పాసు బుక్కు ఆధార్ కార్డు ఉంటేనే యూరియా ఇస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాతోపాటు నాన్ లిక్విడ్ కొంటేనే యూరియా బస్తా ఇస్తున్నారని రైతుకు ఇష్టం లేకున్నా అంటగడుతున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించి బయట విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని వెంటనే రైతులకు చిగురుమామిడి మండలంలో సరిపడ యూరియాని తెప్పించాలని లేనిపక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ముద్రకోల రాజయ్య, మనోజ్, మహేందర్, రెడ్డి, ఐలయ్య, గంగారెడ్డి, మల్లారెడ్డి, రామస్వామి, పోచయ్య, స్వామి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.