ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు.

జాతీయ స్థాయి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జాతీయ స్థాయి న్యూఢిల్లీలో 15 రోజుల పాటు జరిగే సి.సి.ఆర్.టి. కార్యక్రమానికి ఎంపికైన ప్రాథమిక పాఠశాల రెజింతల్ ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా
బెస్ట్ ప్రాక్టీసెస్‌లో భాగంగా, జూన్ నెలలో జరిగిన రాష్ట్ర స్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో అన్ని జిల్లాల నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసిన 110 మంది ఉపాధ్యాయులు తమ వినూత్న విద్యా విధానాలను ప్రదర్శించారు. ఈ సమావేశం ఎస్ సి ఈ ఆర్ టి ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్ ఆర్ డి, హైదరాబాద్ లో నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల ప్రదర్శనలను గమనించి జాతీయ స్థాయిలో 15 రోజుల సీసీ ఆర్ టి (Centre for Cultural Resources and Training) శిక్షణకు ఎంపిక చేశారు.
దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుండి రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా ఎంపిక అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాథమిక పాఠశాలలకి చెందిన 10 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు.

ఇతర జిల్లాల ఎంపికల వివరాలు ఇలా ఉన్నాయి:

జగిత్యాల జిల్లా – 2

ములుగు జిల్లా – 2

మెదక్ జిల్లా – 1

వికారాబాద్ జిల్లా – 1

మంచిర్యాల జిల్లా – 1

యాదాద్రి జిల్లా – 1

నిర్మల్ జిల్లా – 1

సంగారెడ్డి జిల్లా – 1 ( సఫియా సుల్తానా )
ఈ ఎంపికకు సంబంధించి ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు
సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గారి నుండి సఫియా సుల్తానా దానికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న అందుకున్నారు.
ఈ సందర్భంగా డీఈవో సంగారెడ్డి సఫియా సుల్తానా గారిని ప్రత్యేకంగా అభినందించారు.

కల్వల ప్రాథమిక పాఠశాల లో బడిబాట.

కల్వల ప్రాథమిక పాఠశాల లో బడిబాట

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కల్వల బడి బాట కార్యక్రమం ను మంగళవారం కల్వల సమీపంలో గల బావోజీ తండ లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. బడి బాట కార్యక్రమం లో భాగంగా రోడ్ ప్రక్కన వ్యవసాయ పని చేస్తున్న గ్రామ ప్రజలను కలిసి, ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి ప్రభుత్వ పాఠశాల పై ప్రభుత్వ తీసుకుంటున్న కార్యక్రమాల గురించి వివరిస్తూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు తో పాటు, ఉద్యోగ,ఉపాధి అవకాశాల ల్లో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అని నొక్కి వక్కానించారు. అవసరమయితే సుదూర ప్రాంత తండా పిల్లలకు పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నందున వారికి రవాణా నిమిత్తము ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ,స్వరూప ,క్రిష్ణ, శ్రీదేవి, మోహనకృష్ణ ,తండ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల

◆ శిథిలావస్థలో మరుగుదొడ్లు,
◆ మూత్రశాలలు నిరుపయోగంగా వాటర్ ట్యాంక్ పాఠశాలలో లోపించిన పారిశుధ్యం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఝరా సంగం మండలంలోని సంగం (కె) గ్రామంలో గల ప్రాథ మిక పాఠశాల అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపడుతున్నప్పటికీ ఈ పాఠశాల రూప రేఖలు మార్చలేకపోయాయి. ఈ పాఠశాల ఆవరణలో ఉన్న మరు గుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థలో ఉండటంతో విద్యా ర్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ శిథిలాలతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్న వాటిని తొలగించడం లేదు. అలాగే నీటి సరఫరా కోసం ఏర్పాటు
చేసిన వాటర్ ట్యాంక్ రంధ్రాలు పడి నిరుపయోగంగా మారింది. ఈ పాఠశాల చుట్టూ పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాల్ లేనందున పశువులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. పాఠశాల భవనానికి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి. రంగులు వెలిసిపోయి భవనం కళ హీనంగా కనిపిస్తుంది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నెలకొని పారి శుద్ధ్యం లోపించింది. ఈ పాఠశాలలో ఇంకా పలు సమ స్యలు నెలకొనడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాభివృద్ధికై పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version