మహబూబాబాద్‌లో పోలీస్ అధికారుల పదవీ విరమణ ఘనంగా

సుదీర్ఘకాలంగా విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారుల పదవీ విరమణ

మహబూబాబాద్/ నేటి ధాత్రి

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులు
యాకూబ్ అలీ, ఎస్.ఐ (డీ.సీ.ఆర్.బీ)
1984 సంవత్సరంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి 43 సంవత్సరాల ఘనమైన పోలీస్ సేవలు అందించారని కొనియాడారు..

బోడ తులసయ్య 1990లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి
2023లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది మొత్తం 36 సంవత్సరాల సేవలు అందించారని.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందుతున్న అధికారులకు తమ తరపున మరియు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
యాకూబ్ అలీ1984 బ్యాచ్‌కు చెందినవారై, సుమారు 43 సంవత్సరాల పాటు శాంతి భద్రతల పరిరక్షణలో, నేర నియంత్రణలో, ప్రజా సేవలో విశేష సేవలు అందించారని ప్రశంసించారు. అదేవిధంగా బోడ తులసయ్య 36 సంవత్సరాల పాటు శాఖకు అంకితభావంతో సేవలందించి విధి నిర్వహణలో ఆదర్శంగా నిలిచారని అభినందించారు.
పదవీ విరమణ అనేది జీవితంలో కొత్త అధ్యాయమని, మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని సూచించారు. నిత్యం ఏదో ఒక వ్యాపకంతో చురుకుగా ఉండాలని కోరారు.
రిటైర్మెంట్ అనంతరం లభించే బెనిఫిట్స్‌ను ప్రభుత్వ బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో భద్రపరుచుకోవాలని, అధిక లాభాల ఆశ చూపే మోసగాళ్ల పట్ల మరియు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పదవీ విరమణ పొందిన వారిని కుటుంబ సభ్యులు గౌరవప్రదంగా చూసుకోవాలని, వారి మానసిక ప్రశాంతతకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐ నాగేశ్వర్ రావు, ఆర్. ఐ సోములు, డీ.సీ.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఉపేంద్ర రావు సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version