మెట్ పల్లి అక్టోబర్ 4 నేటి దాత్రి
గాయత్రి బ్యాంకు మెట్పల్లి ఖాతాదారులు అయిన పొట్ట రాజేష్ గ్రామం మెట్పల్లి కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది .
గాయత్రి బ్యాంకు ప్రతి ఖాతాదారులకు గాయత్రి నిర్భయ సేవింగ్ ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉన్నది .
కావున అతనికి సంబంధించిన ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు
నామిని అయినా అమ్మ పొట్ట లలిత కు ఎమ్మార్వో యన్ నీతా గారిచే బ్యాంకు ఇన్సూరెన్స్ చెక్కును ఇవ్వడం జరిగింది . ఎమ్మార్వో యన్ నీతా మాట్లాడుతూ గాయత్రి బ్యాంకు నిర్భయ సేవింగ్ ఇన్సూరెన్స్ ఉండడం ప్రతీ ఖాతాదారులకు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు ఇది వర్తింపచేయడం చాలా మంచి పాలసీ కావున ఇటువంటి గాయత్రి బ్యాంకు సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన బ్యాంకు మేనేజర్ అధికారులను ఎమ్మార్వో యన్ నీతా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ కేశ శివకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మధు, రేవంత్. తదితరులు పాల్గొన్నారు.