హోటళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం
జిల్లాకు రెగ్యులర్ ఆహార భద్రత అధికారిని నియమించాలి
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్
జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భూక్య నవీన్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అనుమతులు నుండి నిబంధనలు పాటించకుండా నడుస్తున్న హోటల్ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రజా రవాణా వలన ప్రజలు భోజన వస్తు కోసమని హోటల్లోకి వెళ్తుంటారు కానీ కొన్ని హోటల్స్ ధనార్జిని ధ్యేయంగా ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిబంధనలను ఉల్లంఘించి విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నాయి దీనివలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వలన ఇదంతా జరుగుతుందని జిల్లాకి ఆహార భద్రత అధికారి రెగ్యులర్ పోస్ట్ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు నాణ్యమైనటువంటి భోజనం అందించకుండా కనీస మౌలిక వసతులు కల్పించకుండా కనీస ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నటువంటి హోటళ్లపైన తమరు ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి ఆ హోటల్లో పై చర్యలు తీసుకోవాలని వెంటనే ఆహార భద్రత రెగ్యులర్ రధికారిని నియమించి హోటల్లు ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చేయాలి అన్నారు
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్స్ జిల్లా కన్వీనర్ బందు సుజాత కో కన్వీనర్ బుర్ర స్వాతి లతోపాటు తదితరులు పాల్గొన్నారు