12న తహసిల్దార్ ఆఫీస్ ముట్టడి

12న తహసిల్దార్ ఆఫీస్ ముట్టడి *
వికలాంగులకు వృద్ధులకు పింఛన్ వెంటనే పెంచాలి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ
మహాదేవపూర్ సెప్టెంబర్ 9 నేటి ధాత్రి *

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆవరణంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ 12 నతహసిల్దార్ కార్యాలయాల ముట్టడికి వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పింఛన్ పెంచాలని లేకపోతే స్థానిక ఎలక్షన్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య మాట్లాడుతూ. వికలాంగులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని మా బాధను ప్రభుత్వం పట్టించుకోవాలని జాప్యం చేయకుండా తక్షణమే పింఛన్లు పెంచాలని అదేవిధంగా కొత్త ఫించనులను కూడా మంజూరు చేయాలని వికలాంగులకు న్యాయం చేసే వరకు నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య .అంబటిపల్లి విహెచ్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తిరుమల చారి. మహాదేవపూర్ ఎమ్మార్పీఎస్ గ్రామ కార్యదర్శి లింగాల. సుశాంత్ తోపాటు తదితరులు పాల్గొన్నారు

హత్యాచారం యత్నానికి ఒడిగట్టిన దీపిక ఆసుపత్రి యాజమాన్యమైన డాక్టర్

హత్యాచారం యత్నానికి ఒడిగట్టిన దీపిక ఆసుపత్రి యాజమాన్యమైన డాక్టర్ వేంకటేశ్వర్లు, టేక్నీషియన్ దక్షిణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలి-ఏఐవైఎఫ్
రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్లపల్లి యుగేందర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

అనారోగ్యంతో ఉన్న యువతిచికిత్స కోసం ఆసుపత్రికి వస్తే యువతిపై ఆసుపత్రి యాజమాన్యం, టేక్నిషియన్ దక్షిణ్ అత్యాచారయత్నానికి ఒడిగట్టడం అత్యంత బాధాకరమైన సంఘటని, జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓయువతి అనారోగ్యంతో కరీంనగర్ నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. చికిత్సను అందిస్తున్న వైద్యులు ఆమెను ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని అదే అర్దరాత్రి ఆసుపత్రిలో పనిచేసే దక్షిణ్ అనే టేక్నీషియన్ సదరు యువతికి మత్తుమందు ఇచ్చి అదే అదునుగా భావించి అత్యాచారానికి ఒడిగట్టరాని అఘాయిత్యానికి పాల్పడిన టేక్నిషియన్ దక్షిణ్ పై సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం అయిన డాక్టర్ వేంకటేశ్వర్లు పైన క్రిమినేల్ కేసులు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యేడల ఆసుపత్రి ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని యుగంధర్ హేచ్చారించారు.

8న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి..

8న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి.

చిట్యాల, నేటిధాత్రి ;

 

వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ 4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు దొడ్డే శంకర్ మాదిగ అన్నారు. శుక్రవారం ఆయన చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు పెంచి ఇస్తున్నాడు కానీ తెలంగాణలో రూ 6 వేలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాకు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులు మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
పెంచిన పింఛన్లు అమలు చేసేంతవరకు ఎంతటి పోరాటానికైనా ఎమ్మార్పీఎస్ వెనుకాడదని తెలియజేశారు.

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T145638.080.wav?_=1

 

రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.

కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం,రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తన మార్క్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా దొరకక షాప్ ల వద్ద చెప్పులను లైన్లో పెట్టుకొని ఎదురుచూస్తున్నారు కానీ రైతుల బాధలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను అరిగోస పాలు చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఆకునూరు తిరుపతి మల్లారెడ్డి ఉద్దమరి మహేష్ ఆది రఘు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు టాక్సులపై యువకుడి నిరసన..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-1.wav?_=2

ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి….

జహీరాబాద్ నేటి ధాత్రి:

ట్రాఫిక్ చలాన్లు కాదు.. ముందు మీరు టాక్స్ కట్టండి..’ ఓ యువకుడి వింత నిరసన!
బైక్పై వెళ్తే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు. అన్ని రకాల టాక్సులు వసూలు చేస్తున్నారు.
కానీ.. రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఏకంగా నడిరోడ్డుపై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు.అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకో లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు తక్షణమే యూరియా అందించాలి: బీఆర్ఎస్ ధర్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T131112.007.wav?_=3

రైతులకు యూరియా తక్షణమే అందించాలి

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో ధర్నా, రాస్తారోకో

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని మాందారిపేటకూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులుగండ్ర వెంకట రమణారెడ్డి నాయ కత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయ త్నంలో భాగంగానే ఇది జరుగు తున్నది.సిబిఐకి కాలే శ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.

BRS Holds Protest

నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతి రేకంగా మాట్లాడిన రేవం త్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తె లంగా ణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజె క్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవా లి. లేదంటే మున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని, బెదిరింపులు కేసు లు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువ య్యారని అన్నారు. రోడ్డుపై బఠాయించి ధర్నాచేసి నిరసన తెలిపారు ఎరువుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మే కారణం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంవచ్చి న తర్వాత రైతులు ఆరిగోస పడుతు న్నారన్నారు సకాలం లో రైతు బంధు అందక ఎరు వులు లేక అష్ట కష్టాలు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్దాల మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నా రని మండి పడ్డారు రైతులకు యూరియా కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్ర మంలో మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అధిక మొత్తంలో పాల్గొన్నారు.

BRS Holds Protest

అల్లాడుతున్న అన్నదా తలు గంటల తరబడి నిరీక్షణ

వేసినపంట అదను దాటి పోవడంతో యూరియా రైతులు అల్లాడిపోతున్న పనులన్నీ మానుకొని ఎరువుల దుకాణం వద్ద పడికా పులు కాస్తున్నాం అన్నదాతలు ఎరువుల కేంద్రం వద్ద క్యూ కట్టారు యూరియా బస్తాలు తక్కువ రావడంతో ఉన్నవారికి ఒక్కొక్కడిగా ఇవ్వడం జరుగుతుంది. మండల కేంద్రంలో పంపిణీ చేస్తున్న యూరియా బస్తాలను రైతులను అడిగి తెలుసుకు న్నారు. మండల వ్యవసాయ అధికారికి రైతుల గురించి చెప్పడం జరిగింది. ప్రతి రైతుకు సంపూర్ణంగా అందే టట్లు చూడాలని మాట్లాడడం జరిగింది.రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుం దని మాజీ ఎమ్మెల్యే అన్నారు

భూపాలపల్లిలో రైతులకు యూరియా సరఫరా సమస్య..

రైతులకు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం.

రైతుల గోస పట్టించుకోని ప్రభుత్వం

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల.. మండల కేంద్రంలో రైతులు యూరియాకోసం గంటల తరబడి లైన్లో నిలబడిన పూర్తిస్థాయిలో రైతులకు సరిపడా యూరియా దొరకలేదు అని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక లారీ లోడ్ రావడానికి వారం పట్టింది వచ్చిన లారీ యూరియా రైతులకు ఏమాత్రం సరిపోలేదు ఒకటి రెండు బస్తాలతో సరిపెట్టుకున్న దొరకని రైతులు నిరాశతో వెనుతిరిగి పోతున్నారు మళ్లీ లారీ వస్తదని చిట్టీలు ఇచ్చిన ఈ లారీ రావడానికి వారం పడతదో పది రోజులు పడుతదో అని రైతుల నిరాశ చెందుతున్నారు రైతులకు సరిపడా యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాకాల సీజన్లో రైతుల పంటలు ఎర్రబడి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ సరిపడా యూరియా అందించడంలో జిల్లా ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణమే ఈ ప్రాంత రైతులకు సకాలంలో లారీ వచ్చే విధంగా చర్యలు తీసుకొని మిగిలిన రైతులకు రేపే యూరియా పంపిణీ చేయాలని అన్నారు చిట్టీలు తీసుకున్న రైతులందరికీ యూరియాసరఫరా చేయాలని రైతులను ఈ విధంగా ఇబ్బంది చేస్తే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తావున్నాం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రామ్ రామచంద్ర మాదిగ ఆకునూరి జగన్ పాల్గొన్నారు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై బిఆర్ఎస్ పార్టీ ధర్నా, రస్తారోకో..

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

జహీరాబాద్ నేటి ధాత్రి:

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు జహీరాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రస్తా రోకో కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ఇది కెసిఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి,కాలేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతున్నది.
సిబిఐకి కాలేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమే.నిన్నటిదాకా సిబిఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు.తెలంగాణా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ కి అప్పజెప్పడం వెంటనే ఉపసంహరించుకోవాలి.లేదంటేమున్ముందు ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉదృతం చేస్తామని.బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదని అన్నారు.ఒక వైపు రైతులు పంటలకు యూరియా లేక అల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకునే వారే కరువయ్యారని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి , కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,మాజి ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్,మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ , వివిధ గ్రామాల తాజా మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ వార్డ్ సభ్యులు ముఖ్య నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి…

ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్

కొత్తగూడ, నేటిధాత్రి :

 

కొత్తగూడ మండల కేంద్రo జీఎల్ నగర్ ( గోగ్గల లక్ష్మయ్య నగర్ ) ఆదివాసీ మహిళా పై గిరిజనేతరుడు అయిన ఎండీ పాషా మొబైల్ షాప్ నిర్వాహకుడు దాడి చేయడాన్ని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా కండించడం జరిగింది.
దాడిలో గాయపడిన ధనసరి అనసూర్య నీ ఆదివాసీ సంఘాల నాయకులు ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం జరిగింది…అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం గుర్తించిన 5 వ షెడ్యూల్ ప్రాంతం అయిన ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక ఏజెన్సీ చట్టాలు ఉన్నపటికీ చట్టలకు విరుద్ధం గా బ్రతుకు దెరువు కోసం ఏజెన్సీ లోకి వలసలు వచ్చిన గిరిజనేతరులు తిరిగి ఆదివాసీల పైనే దాడులు చేస్తున్నారు. 1/59,1/70, LTR( భూ బదలాయింపు నిషేధ చట్టం) పేసా-1996, ROFR-2006, ఏజెన్సీ లో వడ్డీ వ్యాపార నిషేధ చట్టం-1960 చట్టాలు అమలు చేయక పోవడం వల్లనే గిరిజనేతరులు దాడులకు దిగుతున్నారు.
ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలనీ లేని యెడల ఆదివాసి లు “నాన్ ట్రైబ్ గో బ్యాక్ నినాదం”తో దశాల వారి ఉద్యమనికి తిరుగు బాటు చేయక తప్పదాని హెచ్చరించారు.
ఏజెన్సీ గూడ లలో ఉన్న ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంత చట్టలు హక్కుల పై అవగాహనా తో ఉండాలని ఆదివాసీ యువత గిరిజనేతరుల అక్రమాలను తిప్పి కొట్టాలని భారత రాజ్యాంగం ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ ల కోసం గుర్తించిన చట్టాలు హక్కులు అమలు కావాలంటే తిరుగు బాటు తప్పదాని యువత అప్రమత్తం గా ఉండాలి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమం లో ఆదివాసీ సంఘాల నాయకులు పూనేం సందీప్ దొర,ధనసరి రాజేష్,కుంజ నర్సింహా రావు, కల్తీ నరేష్, పెండకట్ల లక్ష్మీ నర్సు, ఈసం రామస్వామి,బీజ్జ సందీప్, ఈసం వెంకన్న, పెనక విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T153405.039.wav?_=4

 

ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని అందుకోసం నర్సంపేట డివిజన్ లో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటారని ఎంసిపిఐ (యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ వెల్లడించారు.పార్టీ నర్సంపేట మండల కమిటీ సమావేశం భైరబోయిన నరసయ్య అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. తొలుత వామపక్ష నేతలు సురవరం సుధాకర్ రెడ్డి , ఎంసిపిఐ యు కేరళ నాయకులు నారాయణన్ మృతిపట్ల శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం హాజరైన రమేష్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ , మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు బాటకు శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు.భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా కార్పొరేట్ బడాబాబులకు ధారాదత్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.మతం పేరుతో భారత పౌరుల పట్ల చిచ్చు పెడుతున్న బిజెపి సర్కార్,విదేశీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నదని ఆరోపించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు,వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి,కేశెట్టి సదానందం,కర్నే సాంబయ్య,గుర్రం రవి గణిపాక బిందు,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఘనంగా వి హెచ్ పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మడి పెళ్లి శ్యాంబాబు మాదిగ జిల్లా ఇన్చార్జి

అంబాల చంద్రమౌళి మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచాలి లేకుంటే ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాలని ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీ ఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో విహెచ్పిఎస్ 18వ ఆవిర్భావ దినోత్సవం వంశీకృష్ణ గౌడ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ మడిపల్లి శ్యాంబాబు మాదిగ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ లు జెండా ఆవిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులు చేయూత పెన్షన్ దారులతో మాట్లాడుతూ ఈ నెల పెన్షన్ తీసుకుంటే మీకు వికలాంగులకు 4016 లు చేయూత పెన్షన్ దారులకు 2016 లు వస్తున్నాయి కానీ నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మాకు అధికారం ఇస్తే వచ్చే నెల నుంచి వికలాంగులకు 4016 లు ఉన్న పెన్షన్ 6000 చేయూత పెన్షన్ దారులకు 4000 ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి నేటికీ 20 నెలలు గడుస్తున్న కానీ పెన్షన్ పెంచకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి కూటమి ప్రభుత్వం వికలాంగులకు 6000 భరోసా పెన్షన్ దారులకు 4000 ఇస్తుందని మరియు మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి మేరకు కండరాల క్షీణత ఉన్న వికలాంగులకు 15000 రూపాయలు ఇస్తుందని తెలిపారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్ పెంచి ఇస్తుంటే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పెన్షన్ పెంచకుండా ఎమ్మెల్యేల జీతాలు మాత్రమే పెంచుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ దారులను మోసం చేస్తోందని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న వికలాంగులు చేయూత పెన్షన్ దారులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పెన్షన్ పెంచడం కోసం జరుగుతున్న పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరియు సెప్టెంబర్ 9న పరేడ్ గ్రౌండ్ హైదరాబాదులో జరుగు వికలాంగుల చేయుట పెన్షన్ దారుల మహా గర్జనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో
ఎమ్మెస్పీ సీనియర్ నాయకులు
నోముల శ్రీనివాస్ మాదిగ
ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ అంతడుపుల సురేష్ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మిరపట్టి అశోక్ మాదిగ జిల్లా నాయకులు మంద కిరణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ ప్రధాన కార్యదర్శి ఒంటెరి రాజేష్ మాదిగ ఎంఎస్పి టౌన్ ప్రధాన కార్యదర్శి మంచినీళ్ల వైకుంఠం మాదిగ ఒంటెరి సమ్మయ్య మాదిగ దోర్నాల నరేష్ మాదిగ ఒంటేరు నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదిపై దాడిని ఖండించిన వరంగల్ బార్.

న్యాయవాది పై దాడిని తీవ్రంగా ఖండించిన వరంగల్ బార్ అసోసియేషన్:-

వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు అడ్వకేట్ తన్నేరు శ్రీకాంత్ కోర్టు వారంట్ అమలు చేస్తూ ఉండగా జరిగిన క్రూర దాడిని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇట్టి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్ మాట్లాడుతూ ఒక న్యాయవాదిపై దాడి జరగడం అనేది న్యాయవ్యవస్థ గౌరవాన్ని, కోర్టుల అధికారం పట్ల చేసిన దారుణమైన సవాలుగా మేము భావిస్తున్నాము. నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి. రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, జాయింట్ సెక్రటరీ ముసిపట్ల శ్రీధర్ గౌడ్, లేడీ జాయింట్ సెక్రటరీ రేవూరి శశిరేఖ, లైబ్రరీ సెక్రటరీ గుండా కిశోర్ కుమార్,20 ఇయర్స్ సీనియర్ ఈసీ ఇజ్జగిరి సురేష్, 10 ఇయర్స్ సీనియర్ ఈసీ కలకోట్ల నిర్మలా జ్యోతి, ఈసీ మెంబర్లు మర్రి రాజు, జాటోత్ రవి, మడిపెల్లి మహేందర్, తోట అరుణ మరియు న్యాయవాదులు కోటేశ్వర్, దయాన్ శ్రీనివాస్, శివ, సదానందం, శ్రీనివాస్, భిక్షపతి, ప్రదీప్ , అనీల్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొని ఖండించడం జరిగింది.

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని CPM ధర్నా

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని సిపిఎం ధర్నా

పరకాల నేటిధాత్రి

రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని,షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడుతామని హెచ్చరించారు.పట్టణంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దాన్ని ధిక్కరిస్తున్నారని,సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని,ప్రభుత్వము అధికారులు స్పందించి రైతులను మోసం చేస్తున్న పార్టీలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిపిఎం నేతలు వ్యవసాయ అధికారికి ఫోన్ లో సమాచారం అందించిన వెంటనే స్పందించి నిల్వ ఉన్న యూరియా బస్తాలను రైతులకు ఇవ్వాలని చారని,రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమాన్యాలను హెచ్చరించారని కళ్యాణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్ రైతులు పాల్గొన్నారు.

మైలారం గుట్ట స్థలాన్ని అభివృద్ధి పేరుతో దగా

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-83-2.wav?_=5

మైలారం గుట్ట స్థలాన్ని అభివృద్ధి పేరుతో దగా

డి.ఎస్.పి భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం మైలారం గుట్టపై ఎడ్యుకేషన్ ,ఇండస్ట్రియల్ హబ్ కు 204/1, 205/1 సర్వే నెంబర్ల లో మొత్తం భూమి 187 ఎకరాలు ఉందని దాన్ని మొత్తం కేటాయిస్తున్నట్లు ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పారు .మేము అభివృద్ధిని స్వాగతిస్తాం. కానీ ఇంకా మొత్తం ఉన్న భూమి ఎంత పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయవలసి ఉంది .ఎందుకంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కుంటలు ,చెరువులు తెగిపోతే మొరంచే పల్లెకు, ధర్మరావుపేటకు, గణపురం కట్టకు ,గణపురం బతుకమ్మ స్థలానికి .ప్రతి చోటుకు వందల లారీల మట్టి తరలించారు. ఇది ఎమ్మెల్యేకు ప్రజలందరికీ తెలుసు కానీ ఈరోజు ప్రభుత్వ భూమి లేకుండా అభివృద్ధి ముసుగులో భూమి అన్యక్రాంతం చేస్తే ముందు తరాల వారికి మట్టి కూడా దొరకదు. ఇల్లు కట్టుకుంటే ఇటుక ,సిమెంటు కొన్నట్టుగా మట్టి కూడా కొనవలసి వస్తుంది. గండ్ర వెంకటరమణ రెడ్డి తీసుకున్న ఆయిల్ మిల్లు పర్మిషన్ రద్దుచేసి నేడు జి ఎస్ ఆర్ అధికారంలోకి రాగానే ఈ భూమిని కాపాడి మైలారం ప్రజలకు, విలేకర్లకు ఇంటిస్థలాలు, కుల సంఘలా గుల్లకి , నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు. మొత్తం గుట్ట చుట్టూ బాటలు తీసి మైలారం ,గాంధీనగర్ ప్రజల నోట్లో మట్టి కొట్టారు ప్రభుత్వ స్థలం అంటే ప్రజలందరి ది .ఏకపక్ష నిర్ణయాలు మంచివి కావు .50 ఎకరాల భూమిని తరతరాలకు శాశ్వతంగా కేటాయించాలి .భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని మీరు యాత్ర చేయడం జరిగింది .మీరు చేసిన యాత్ర నిజమే అయితే భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం కట్టుకోవడానికి ఒక ఎకరం స్థలాన్ని కేటాయించండి. భూమి దుర్వినియోగం కాకుండా కాపాడుతామని చెప్పడం ఈ భూమిని శాశ్వతంగా మనకు దూరం చేయడమే అని ప్రజలు గమనించాలి. విలేకర్లకు ఇంటిస్తాలాలు, కుల సంఘాలకు గుడి స్థలాలు, పేదవారికి ఇంటి స్థలాలు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకోలు చేసి ఈ భూమిని కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నాం.

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-3.wav?_=6

 

అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలి

యూరియా కోసం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

నర్సంపేట,నేటిధాత్రి:

అధికారంలోకి వచ్చిన నుండి రైతులకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగాలని వరంగల్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,దుగ్గొండి బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతాంగానికి సకాలంలో పంటలకు యూరియా అందించని అసమర్ధ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కులేదని టిఆర్ఎస్ విమర్శించారు. సోమవారం మండలంలోని గిర్నిబావి సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు.గత బారాస ప్రభుత్వంలో రైతులకు సరిపడా ఎరువులను అందించామని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించి యూరియా కొసం రైతులు ఇబ్బందులను గురి చేస్తుందని పేర్కొన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు సరిపడా యూరి అందించే వరకు బారాస పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కట్ల కొమల భద్రయ్య, క్లస్టర్ ఇంచార్జిలు కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, శంకేసి కమలాకర్, గుండెకారి రంగారావు, కామిశెట్టి ప్రశాంత్, తోటకూరి రాజు, భూంపల్లి రజనీకర్ రెడ్డి, మాజీ సర్పంచులు అజ్మీర రవీందర్, ఒడేటి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, సంగతి రాజన్న, వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161734.060-1.wav?_=7

 

మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.

వరంగల్, నేటిధాత్రి

 

వరంగల్ చౌరస్తాలో మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వలన స్థానికులకు చాలా పెద్దగా భారం పడుతున్నది కావున
కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురి కార్మికులు మాట్లాడుతూ, వలస వచ్చినా కార్మికులు మేము మాట్లాడిన పనికి వాళ్ళు చానా తక్కువ ధరకు మాట్లాడి మాకు పనులు లేకుండా చేస్తున్నారు ఎందుకో మరి వాళ్లకు మా మీద కోపం మేము కలిసికట్టుగా పని చేసుకోవాలి అన్నదే మా ఉద్దేశం వాళ్లు కూడా మాతో కలిసి పని చేస్తే వాళ్లకు మంచి జీవనోపాధి ఉంటది మాకు స్థానిక యూనియన్ నిర్ణయించిన ఉపాధి ఉంటది. వాళ్లు రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిండ్రు అని, మా స్థానిక యూనియన్ నిర్ణయించిన నిర్ణయాల ప్రకారం నడవాలని కోరారు. కావున కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని, మా జీవనోపాధి పూర్తిగా ఈ రంగంపైనే ఆధారపడి ఉందనీ అన్నారు. అయితే, సరైన రీతిలో పనులు లేకపోవడం, తగిన అవకాశాలు కల్పించకపోవడం వలన మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాల నుండి వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని ఐక్యంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మా సమస్యలను గమనించి తక్షణమే పరిష్కారం చూపకపోతే, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల అసోసియేషన్ నేతలు అధ్యక్షులు సమీర్, జన్ను సునీల్, ఉపాధ్యక్షులు ఫిరోజ్, ఫయాజ్, తాజ్ ఫిరోజ్, అయూబ్, జలీల్, చెన్నూరి కిషోర్, రాజేందర్, నాసం హరీష్, సాదిక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161118.191-1.wav?_=8

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు
బిజెపి నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

https://youtu.be/mgl8GBmGx0A?si=5kIR7WXajNDM3xSBv

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

రేషన్ డీలర్ల బంద్ పిలుపు – వనపర్తి వినతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-78-1.wav?_=9

వనపర్తి జిల్లా లోని బందుకు వచ్చే నెల 5 న పిలుపు నిచ్చిన రేషన్ డీలర్ల

వనపర్తి నేటిదాత్రి .
ఏప్రిల్ నెల నుండి 5 నెలలుగా ప్రభుత్వం రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించ నందుకు రేషన్ డీలర్లు వచ్చే నెల 5 న బంధు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నిచ్చారని వనపర్తి జిల్లా లో కూడా రేషన్ డీలర్లు బందు పాటించాలని తహశీల్దార్ కు
వినతిపత్రం అందజేశారు
ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా రేషన్ డీలర్ల సంఘము అధ్యక్షులు బచ్చు రాం డీలర్ల నరేష్ వెంకట్ రెడ్డి ప్రవీణ్ రాఘవేంద్ర నరసింహారెడ్డి సత్య రెడ్డి పాల్గొన్నారు

మా గుడి స్థలాన్ని కాపాడండి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T134439.947-1.wav?_=10

 

మా గుడి స్థలాన్ని కాపాడండి

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

 

నాగారం మున్సిపల్ లోని రామకృష్ణ నగర్ కాలనీలో గుడి స్థలం కబ్జా కావడంతో కాలనీవాసులు నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదంటూ కాలనీవాసులు మున్సిపల్ ఆఫీస్ ముందు మా గుడి స్థలం మాకు ఇప్పించాలని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కబ్జాకోరులను శిక్షించాలని అక్రమ కట్టడాలను తొలగించాలని కాలనీవాసులు ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, యువ నాయకులు కౌకుంట్ల రాహుల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.

మోసం చేసిన సర్కారు – మందకృష్ణ మాదిగ హెచ్చరిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-69-2.wav?_=11

మోసం చేసిన సర్కారు.. తాడోపేడో తెల్చుకుందాం: మందకృష్ణ మాదిగ,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: రాష్ట్రంలోని 50 లక్షల పెన్షనర్లకు 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్న ఇచ్చిన హామీ అమలు చేయకుండా పెన్షనర్లను మోసం చేస్తున్న ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ఆయన హెచ్చరించారు. సెప్టెంబర్ 9న హైదరాబాదులో నిర్వహించ పెన్షనర్ల బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల బహిరంగ నియోజకవర్గ సన్నాహక సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.20 నెలల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం పెంపు తదితర సంక్షేమ పథకాల కోసం తాను చేసిన పోరాటం, దాని నేపథ్యాలను పేపర్, ఆడియో క్లిప్పింగ్స్ లతో సభకు వివరించి తన పోరాటపటీమను వివరించారు. విపక్షాల అసమర్థత, అధికార కరపక్షం నిర్లక్ష్యంతో పేదల సమస్యలు గుర్తు రావని, హామీలను పట్టించుకోరని మండిపడ్డారు. తను ఎప్పుడూ.. అణగారిన వర్గాల పక్షంలోనే పోరాడుతానన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారికి సేవ చేసే అవకాశం తనకు కలుగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ అందరికీ భరోసానిచ్చే బ్రాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకే బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నామన్నారు.వికలాంగులకు రూ.6000తో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఇతర పెన్షన్లన్ని డబుల్ చేసేంతవరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వికలాంగులు, పెన్షనర్లందరూ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీ నేతలు, పనులు, పెన్షనర్లు మందకృష్ణ మాదిగను మాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ఎమ్మార్పీఎస్, పెన్షనర్లు సంఘం నేతలు అబ్రహం మాదిగ ఉల్లాస్ మాదిగ జయరాజ్, నర్సింలు, రామరవి కిరణ్, జ్యోతి, నారాయణ, విశ్వనాథ్ యాదవ్, జైరాజ్ మాదిగ, మైకల్ మాదిగ, రవికుమార్, నిర్మల్ మాదిగ, రాజు, మనోజ్, నగేష్, యేసప్ప, రాజేందర్, సింగితం రాజు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version