రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ నేతలు.
కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం,రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తన మార్క్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర అన్నారు అనంతరం టేకుమట్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా దొరకక షాప్ ల వద్ద చెప్పులను లైన్లో పెట్టుకొని ఎదురుచూస్తున్నారు కానీ రైతుల బాధలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను అరిగోస పాలు చేస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఆకునూరు తిరుపతి మల్లారెడ్డి ఉద్దమరి మహేష్ ఆది రఘు మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.