రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని CPM ధర్నా

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని సిపిఎం ధర్నా

పరకాల నేటిధాత్రి

రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని,షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడుతామని హెచ్చరించారు.పట్టణంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దాన్ని ధిక్కరిస్తున్నారని,సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని,ప్రభుత్వము అధికారులు స్పందించి రైతులను మోసం చేస్తున్న పార్టీలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిపిఎం నేతలు వ్యవసాయ అధికారికి ఫోన్ లో సమాచారం అందించిన వెంటనే స్పందించి నిల్వ ఉన్న యూరియా బస్తాలను రైతులకు ఇవ్వాలని చారని,రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమాన్యాలను హెచ్చరించారని కళ్యాణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్ రైతులు పాల్గొన్నారు.

ఎరువుల దుకాణాల తనిఖీ చేసిన కలెక్టర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-52-4.wav?_=1

రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలి…

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

కేసముద్రం/ నేటి ధాత్రి

గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కేసముద్రం మండలంలో ఫర్టిలైజర్ దుకాణాలను, పాలిటెక్నిక్, జిల్లా పరిషత్ ఉన్నత పతశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ స్టాక్ నిలవలను రైతు వారీగా యూరియా కొనుగోలు వివరాలను పరిశీలించారు. యూరియా పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని యూరియా గురించి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. క్కువ రద్దీ కాకుండా.. ఉదయాన్నే షాప్ లను తెరవాలని…రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా అమ్మకం జరగాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో సరిపడా యూరియా ఎప్పటికప్పుడు సరఫర అవుతోందని.. రైతులు ఆందోళన చెందాలిసిన అవసరం లేదన్నారు. ఎవరైన కృత్రిమ కొరత సృష్టించాలని చేసిన, అధిక ధరలకు విక్రయించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఒక్కో రైతు వారీగా కొనుగోలు చేసిన వివరాలు రిజిస్టర్లు అప్డేట్ గా ఉండాలని అన్నారు.

అనంతరం కేసముద్రం మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలను తనిఖీ చేసి కిచెన్ షెడ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన పరిశుభ్రమమైన వేడి వేడి ఆహార పదార్థాలను వడ్డించాలని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అన్నారు. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు టీచర్లు సులభమైన, అర్థవంతమైన పద్దతిలో పాటాలు నేర్పాలని అన్నారు.

డోర్నకల్ మండలం లోని శ్రీ బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణాన్ని రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ తనిఖీ చేసి షాపులోని నిల్వలను, రైతులు కొన్న రశీదులను పరిశీలించారు.

ఈ తనిఖీ లో సంబందిత వ్యవసాయ అధికారులు, తహసిల్దార్ లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు…

నేటి ధాత్రి -గార్ల :-

ఎరువులు అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకొంటామని ఎంతటి వారైనా ఉపేక్షించ బోమని మహబూబాబాద్ జిల్లా ఇంచార్జ్ వ్యవసాయ అధికారి అజ్మీరా శ్రీనివాస్ రావు ఎరువుల డీలర్లను ను హెచ్చరించారు.శుక్రవారం గార్ల మండల పరిధిలోని పుల్లూరు మరియు గార్ల లో పలు ఎరువుల దుకాణం లను మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు తో కలిసి తనిఖీ చేపట్టారు.స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్,ఇన్వాయిస్ లు, ఈపాస్ మెషిన్స్ క్షుణ్ణంగా పరిశీలించినారు.రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎరువులను సాఫీగా పంపిణీ చేయాలని డీలర్స్ ను కోరారు.ఎరువులు జిల్లా లో సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మోతదు కు మించి రసాయన ఎరువులు వాడవద్దని రైతులకు సూచించారు.ఎరువులు అమ్మకం లో అక్రమాలకు పాల్పడితే సంబందించిన ఎరువుల లైసెన్స్ రద్దు చేస్తామని హేచ్చరించినారు.

ఇంగ్లీష్ టీచర్ చర్యలు తీసుకోవాలి..

ఇంగ్లీష్ టీచర్ చర్యలు తీసుకోవాలి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్
మహాదేవపూర్
జులై 23 నేటి ధాత్రి
గత కొంతకాలంగా ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ డుమ్మా కొడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు ప్రైవేట్ పాఠశాలల నుండి అనేకమంది విద్యార్థులు మహాదేవపూర్ లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యను అభ్యసించడానికి చేరుతున్నారన్నారు. ఓవైపు ప్రభుత్వ పాఠశాల టీచర్ల పనితీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనంద వ్యక్తం చేసినప్పటికీ ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ లేక విద్యార్థులకు సబ్జెక్టులో వెనుకబడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మంగళవారం పాఠశాలను తనిఖీ చేయగా ఇంగ్లీష్ సార్ నెల రోజులు దాటిందని హెచ్ఎం చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు ఇంగ్లీష్ టీచర్ స్థానంలో మరో ఉపాధ్యాయుని నియమించి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు సంపూర్ణంగా విద్యను అందించేలా కృషి చేయాలని అధికారులను కోరారు అదేవిధంగా విధులకు డుమ్మా కొడుతున్న టీచర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-57.wav?_=2

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలో
అనుమతు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని న్యాల్కల్ ఎంపీడీవో గూడెం శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల కోసం పంచాయతీ కార్యదర్శుల వద్ద అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అన్ని గ్రామాల్లో పారిశుధ్య వ్యవస్థ మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్న నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు

చెన్నూరు రూలర్ సిఐ బన్సీలాల్

జైపూర్,నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-41.wav?_=3

మంచిర్యాల జిల్లా కోటపల్లి, నీల్వాయి మండలాలలో ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన,ఉద్దేశ్య పూర్వకంగా శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్ అన్నారు.అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా,పిడిఎస్ బియ్యం రవాణా,గుడుంబా రవాణా చేయడం,గంజాయి అమ్మకం సేవించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు చేపట్టి వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.చట్టాన్ని అతిక్రమించి గొడవలకు పాల్పడడం,ఉదేశ్య పూర్వకంగా దాడులకు పాల్పడుతూ,శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై కఠిన చర్యలు చేపట్టి అటువంటి ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తామన్నారు.కాబట్టి ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి వుంటూ పోలీస్ వారికి సహకరించాల్సిందిగా చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి,నీల్వాయి ఎస్సై లు రాజేందర్,శ్యామ్ పటేల్ తెలిపారు.

విక్ర‌మ్, 96 ప్రేమ్ కుమార్‌ వ‌య‌లెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌..

విక్ర‌మ్, 96 ప్రేమ్ కుమార్‌.. వ‌య‌లెంట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

త‌మిళ‌నాట ఓ అస‌క్తిక‌ర కాంబినేష‌న్ సెట్ అయింది.

ఏడేండ్ల క్రితం 96 అనే చిత్రంతో సెన్షేష‌న్ అయిన ప్రేమ్ కుమార్ (Prem Kumar) ఆపై అచి తూచీ మాత్ర‌మే సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓప్ర‌త్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. గ‌త సంవ‌త్స‌రం కార్తి, అర‌వింద్ స్వామిల‌తో ‘మెయ్యళగన్‌’ (Meiyazhagan) అనే సినిమాతో ఇంటిల్లిపాదితో ఎమోష‌న‌ల్జ‌ర్నీ చేయించి త‌న ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకున్నారు. ఆయ‌న త‌మిళంలో చేసిన 96 చిత్రం తెలుగులో జానుగా రీమేక్ కాగా, ‘మెయ్యళగన్‌’ స‌త్యం సుంద‌రంగా విడుద‌లై భారీ విజ‌యాల‌నే సొంతం చేసుకున్నాయి. అయితే ఈ చిత్రం త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్రేమ్ చేయ‌బోయే సినిమా ఏంటి, ఎలా ఉండ‌బోతుందో అనేది చాలామందికి ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న చేయ‌బోయే సినిమా గురించి నెట్టింట అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. అందుతున్న తాజా సమాచారం ప్రకారం ప్రేం కుమార్ తన కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోండ‌గా అందులో చియాన్ విక్రమ్ (ChiyaanVikram) హీరో అని సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది, సినిమా వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న‌ట్లు వినికిడి. అయితే.. ఇప్ప‌టికే.. విక్రమ్ త‌న‌ కెరీర్‌లో ఎన్నో విభిన్న కాన్సెప్ట్ సినిమాలు చేసినప్పటికీ, 64వ చిత్రంగా వ‌స్తున్న ఈ మూవీ మాత్రం ఫ్యాన్స్‌కి మరో లెవల్ ట్రీట్ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలాఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని. అన్నీ అనుకున్న‌ట్లుగా జరిగితే, వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. విక్రమ్ ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన సినిమాల‌తో బిజీగా ఉన్నప్పటికీ, ప్రేమ్ కుమార్ చెప్పిన క‌థ బాగా ఆక‌ట్టుకుంద‌ని అందుకే వెంట‌నే డేట్స్ కూడా అడ్జ‌స్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ముఖ త‌మిళ నిర్మాణ సంస్థ వేల్స్ పిల్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ (Vels Film International) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుండ‌గా ప్రేమ్ కుమార్ శైలికి పూర్తి భిన్నంగా వ‌య‌లెంట్‌, యాక్ష‌న్‌గా ఈ సినిమా ఉండ‌నుంది. కాగా ఈ చిత్రంపై ఈ రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన రానుంది.

కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి.

కల్లు కాంపౌండ్లపై చర్యలు తీసుకోవాలి

కల్తీ కల్లు బాధితులు పెరగడం ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే

ఎన్ హెచ్ ఆర్ సి. గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్వి సురేష్ రెడ్డి

“నేటిధాత్రి”,

సెక్రటేరియట్ (హైదరాబాద్): నగరంలో పలుచోట్ల ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో కల్లు తయారుచేసి విక్రయిస్తున్నట్లు తెలిసినా కూడా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే యదేచ్చగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి ఎస్ వి సురేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల నగరంలో కల్తీ కల్లు బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నగరంలో పలుచోట్ల జరిపిన కెమికల్ ఎగ్జామినేషన్ లో ప్రమాదకరమైన ఆల్ఫ్రాజోలం పదార్థం ఉన్నట్లు తేలిందని అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కల్తీ కల్లు విక్రయం నిరాటకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్, ఆబ్కారీ శాఖ అధికారులు అందుకు విరుద్ధంగా చట్టంలోని లొసుగులను విక్రయదారులకు చెప్పి మరీ అమ్మకాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. హైదరాబాదులో తయారవుతున్న కల్లు 90 శాతం కల్తీయేనని అధికారులు ఇప్పటికే గుర్తించారని అయినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత అధికారుల పాత్రపై విచారణ చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు నగరానికి కనుచూపుమేరలో తాడిచెట్లు లేని విషయం అందరికీ తెలుసని అయినప్పటికీ నగరంలో 97 కల్లు దుకాణాలు ఉన్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నప్పటికీ అంతకుమించి అనధికారికంగా ఇష్టానుసారం కల్లు దుకాణాలు నడుపుతున్నట్లు సమాచారం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కల్లు దుకాణాల అనుమతులను రద్దు చేయాలని, వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఎలా వచ్చాయో సమగ్ర విచారణ చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రెటరీ తిరునగరి లావణ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్లాట్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రాంతాలను శుభ్రంగా.!

ప్లాట్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఆవాస ప్రాంతాలలో గృహాల మధ్య నిర్మాణాలు లేని ఖాలి ప్లాట్లు ఉండడం వలన పిచ్చి మొక్కలు ఏపుగా పెరగండం,ప్లాట్లలో మొరం నింపకుండా నిక్ష్యంగా వదిలేయడం వలన దోమలు ఎక్కువవుతున్నాయని ఆయా ఫ్లాట్ల యజమానులు గమనించి పిచ్చిమొక్కలను తొలగించాలని దోమల వ్యాప్తి,చెందకుండా తమ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిరక్ష్యం వహిస్తే మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ తెలిపారు.

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

 

పేలుడు ఘటనపై పూర్తి విచారణ చేయాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

పాశమైలారం సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం చాలా దురదృష్టకరం

మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి

ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ

“నేటిధాత్రి”,పటాన్ చెరు / సంగారెడ్డి జిల్లా:

పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రాయకోటి నరసింహ అన్నారు. మృతుల సంఖ్య పై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, క్షతగాత్రులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏమిటనే అంశంపై పూర్తి విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు 36 మృతదేహాలు లభ్యమయ్యాయని, ఇంకా 13 మంది మృతదేహాల అచూకీ వెంటనే కనుగొనడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రతి ఇండస్ట్రియల్స్ ను రద్దు చేయాలని, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం మరియు సిగాచి రసాయనిక పరిశ్రమ యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు..

 

రోడ్డు నిబంధనలు పాటించని వారిపై చర్యలు”

● – ఎస్సై వినయ్ కుమార్….

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేనిపక్షంలో నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని జహీరాబాద్ పట్టణ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. గురువారం జహీరాబాద్ పట్టణ పరిధిలోని భవాని మందిర్ చౌరస్తా, బీదర్ చౌరస్తా లలో పోలీస్ సిబ్బంది తో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేస్తూ, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించి డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబందిత పత్రాలు కల్గి ఉండి మంచి కండిషన్ గల వాహనల్ని నడపాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మానవ ప్రాణం అత్యంత విలువైనదాని అన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ వైలేషన్, ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ సరిగా లేని, పత్రాలు లేని, సెల్ ఫోన్ డ్రైవింగ్ తదితర నిబంధనలు ఉల్లంగించిన వాహనాలకు రూపాయలు 17100 జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.

అక్రమంగా భూములను అమ్ముతున్న వారిపై కఠిన.

అక్రమంగా భూములను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.

తాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన వి సి కె పార్టీ నాయకులు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

 

చిట్యాల మండలం కేంద్రంలో మంగళవారం రోజున వీసీకే పార్టీ నాయకులు తాసిల్దారును మర్యాదపూర్వకంగా కలసి చల్లగరిగ గ్రామానికి 308 గల సర్వే నెంబర్ కు సంబంధించిన ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మార్వో దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది, అన్నారు ప్రభుత్వం అణగారిన వర్గాల ప్రజలకు పేదలకు ఇచ్చిన భూములను చల్లగరిగ గ్రామానికి సంబంధించిన కొంతమంది దళారులు ఆ భూములపై ఎలాంటి హక్కు లేకుంన్నా వారు ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులను సాగు చేసుకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు పి ఓ టి 1977 చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను అమ్మకూడదు కొనకూడదు అని తెలిసినా కూడా ప్రభుత్వం మీద గౌరవం లేకుండా ప్రభుత్వ అధికారులకు తెలియకుండా గ్రామంలో ఉన్న కొంతమంది అక్రమ దారుల అండదండలతో ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన భూములను అన్యాయంగా అమ్ముకోవడం చట్ట విరుద్ధం నేటి వరకు ఎన్ని భూములు అమ్ముకున్నారో ఇంకా మిగులు భూమి ఎంత ఉన్నది అనే విషయాలపై తక్షణమే విచారణ జరిపించి అక్రమ దారులపై తగిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు పెట్టాలని గౌరవనీయులు అయినా చిట్యాల మండలం ఎమ్మార్వో కి వివరించడం జరిగింది పలు ప్రభుత్వ భూముల విషయం విన్న ఎమ్మార్వో వెంటనే స్పందించారు తక్షణమే విచారణ జరిపించి పేద ప్రజలకు న్యాయం చేస్తానని ప్రభుత్వ భూములు కాపాడుతానని ఎమ్మార్వో హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విసికే విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యాత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ విసికే పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపెల్లి రమేష్ మరియు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు కొల్లూరి అశోక్ నోముల శివశంకర్ సిరిపెల్లి తిరుపతి సిరిపెల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

శాశ్వతంగా ప్రైవేట్ విద్యాసంస్థలను మూసివేయాలి

 

మారపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి:

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ వికేసి పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బహుజన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు అన్యాయంగా వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ప్రైవేట్ విద్యాసంస్థలను శాశ్వతంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విద్యార్థి నాయకులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత విద్యాను మెరుగుపరచాలని పేద విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలలను పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థుల పక్షాన ప్రభుత్వ కళాశాల పక్షాన ప్రభుత్వ పాఠశాలల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాబోయే రోజుల్లో విద్యార్థుల సమస్యలు ప్రభుత్వ కళాశాలల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలు పరిష్కరించక పోతే విద్యార్థులను భారీ ఎత్తున ఏకం చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ధర్నాలు రాస్తరోకలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి శీలపాక నరేష్ విద్యార్థి నాయకులు అనిల్ రాజశేఖర్ నిఖిల్ జానీ అఖిల్ అభిషేక్ రాజు తదితరులు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు

కాంగ్రెస్ నాయకుడి పైనా చర్యలు తీసుకోవాలి.

కాంగ్రెస్ నాయకుడి పైనా చర్యలు తీసుకోవాలి
బిఆర్ఎస్ నాయకుల డిమాండ్

మందమర్రి నేటి ధాత్రి:

 

మందమర్రి లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినా పాత్రికేయుల సమావేశం లో ఇటీవల పాత్రికేయుని పైన అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ నాయకుడు పైడిమల్ల నర్సింగ్ బేషరతుగా క్షమాపణ లు చెప్పాలని బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జె. రవీందర్ ఆరోపించారు.ప్రజలకి రాజకీయ నాయకుల మధ్యలో వారధి గా వ్యవహరిస్తున విలేఖరులకి రక్షణ లేకుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మందమర్రి లోని జర్నలిస్ట్ లు అందరూ కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం అన్నారు . పోలీస్ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది అధికారం లో ఉన్న నాయకుల కోసం కాకుండా ప్రజల గురించి వారి సమస్యల పైన విధులు నిర్వహించాలని కోరారు . ఇప్పటికైనా చెన్నూరు ఎమ్మెల్యే కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ స్పందించి తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిబిజికెస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్ సీనియర్ నాయకులు ఓ.రాజశేఖర్,మద్ది శంకర్ ,ఎండీ అబ్బాస్, బండారి సూరిబాబు, మల్లేష్, తోట సురేందర్,కనకం రవీందర్, అందే శ్రీకాంత్,ఎం.డి ముస్తఫా ముల్కల్ల రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక.

బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కమిటీ ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

బీసీ హక్కుల సాధన సమితి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రెండో మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు టి వెంకట్ రాములు తెలిపారు అధ్యక్షులుగా భీమనాథుని సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా వేముల శ్రీకాంత్ సహాయ కార్యదర్శిగా క్యాతరాజు సతీష్ అస్లాం
జిల్లా ఉపాధ్యక్షులుగా మేరుగు రమేష్ గోలి లావణ్య.
జిల్లా కోశాధికారిగా కట్టెగొల్ల భారతి…

 

Election

 

జిల్లా కార్యవర్గ సభ్యులుగా
రమేష్ చారి,మహేష్,పుప్పాల వనిత, సుధాకర్, శేఖర్, అజయ్, భగత్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు

కోళ్ల పాము నిప్పు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవాలి.

కోళ్ల పాము నిప్పు పెట్టిన వారి పై చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ప్యాలవారం గ్రామం లో కోళ్ల పామ్ షెడ్డు కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు అని ఆ గ్రామానికి చెందిన గొల్ల శ్రీశైలం తెలిపారు. శుక్రవారం అయన మాట్లాడుతూ ఈ నెల 11 న రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా కోళ్ల పామ్ కు నిప్పు పెట్టారు అని అట్టి వ్యక్తుల ను గుర్తించి వారి పై చర్యలు తీసుకువాలి అని స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు తెలిపారు. షెడ్డు లో సుమారు 2 లక్షల వరకు సమగ్రీ ఉన్నట్లు తెలిపారు. అవి మొత్తం పాడై పోయినవి అని తెలిపారు.

మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి.

మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి

Roshan Kanakala:నేటి దాత్రి :

 

 

 

 

‘బబుల్ గమ్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ కనకాల, సుమ కొడుకు రోషన్ ఇప్పుడు యాక్షన్ మూవీ ‘మోగ్లీ 2025’ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా క్లయిమాక్స్ లోని యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు.

 

శ్రీకాంత్, ఊహ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మల కాన్వెంట్’ (Nirmala Convent) తో తెరంగేట్రమ్ చేసిన సుమ (Suma), రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కుమారుడు రోషన్ (Roshan) ‘బబుల్ గమ్’ (Babbulgum) సినిమాతో హీరోగా మారాడు.

ఇప్పుడు మరోసారి ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

‘బబుల్ గమ్’లో లవర్ బాయ్ గా నటించి ఆకట్టుకున్న రోషన్ ఇప్పుడీ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చేస్తున్నాడు.

తాజాగా 15 రోజుల పాటు ఈ సినిమా భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ ను దర్శకుడు, ‘కలర్ ఫోటో’ (Color Photo) ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) పూర్తి చేశాడు.

ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

ఈ షెడ్యూల్ విశేషాలను సందీప్ రాజ్ చెబుతూ, ‘తాజా షెడ్యూల్ ను మారేడుమిల్లిలో చేశాడు.
ఇదో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్స్.
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ ను పెర్ఫార్మ్ చేశాడు.
ఈ సీన్స్ మూవీకి హైలైట్ గా ఉండబోతున్నాయి.
మరో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది.
ఇదే నెలలో టీజర్ ను రిలీజ్ చేస్తాం.
ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.
అలానే మ్యూజిక్ కూ చాలా ప్రాధాన్యం ఉంది.
‘మోగ్లీ’ ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ ఉండబోతున్నాయి.
దీనిని కాలభైరవ అందిస్తున్నారు.
ఈ మూవీతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
అలానే బండి సరోజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ యేడాది చివరిలో మూవీని రిలీజ్ చేస్తాం” అని చెప్పారు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు.

నకిలీ విత్తనాలను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు

★ఎస్సై నరేష్

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

 

 

ఝరాసంగం మండల్ పరిధిలోని కుప్పానగర్ గ్రమంలో స్థానిక ఎస్ఐ నరేష్ స్థానిక ప్రజలకు రైతులకు నకిలీ విత్తనాలు, సైబర్, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన జరిగే ప్రమాదాలపై వారికి వివరించారు. రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు. ఒకటికి.. రెండు సార్లు సరి చూసుకుని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ ఆర్గనైజర్ వద్దే విత్తనాలు తీసుకోవాలన్నారు. వాటిని రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆర్గనైజర్ నుంచి రశీదు పొందాలన్నారు. అలాగే తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తి అయ్యేవరకు రైతులు తమ వద్దే దాచాలన్నారు. ఆయా విత్తనాలను సాగు చేయడం వల్ల రైతు నష్టాలు పొందినట్లైతే సంబంధిత ఆర్గనైజర్ ను, కంపెనీని, బాధ్యులను చేయుటకు రైతు తీసుకున్న రశీదు, ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడుతాయని, ఆ ఆర్గనైజర్, కంపెనీపై కఠిన చర్యలు తీసుకొనుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ.

సిరిసిల్ల పురపాలక సంఘం 100 రోజుల కార్యచరణ ప్రతిజ్ఞ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని పురపాలక సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ను ఈరోజు అమరవీరుల స్థూపం వద్ద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100రోజుల కార్యాచరణ ప్రతిజ్ఞ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది.అదే విధంగా అమరవీరుల స్థూపం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9 వరకు పట్టణం లోని పురపాలక సంఘం ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి సాధించుటకు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఈ యొక్క 100రోజుల కార్యాచరణ లో శానిటేషన్, ఇంజనీరింగ్, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక మరియు మెప్మా విభాగాలు ప్రణాళిక బద్ధంగా కార్యక్రమాలు ఉండడం వల్ల ప్రతి విభాగం అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది అని ప్రజలు కూడా మాకు సహకరించి సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పట్టణ ప్రజలకు తెలియజేయడం జరిగినది.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.

ప్రతి విత్తన అమ్మకంపై రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి.

అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ సహాయ సంచాలక అధికారి శ్రీనివాస్.

నల్లబెల్లి నేటి ధాత్రి:

నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సంబంధిత డీలర్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయబడుతుందని టాస్క్ ఫోర్స్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేపట్టి. పలు కంపెనీలకు చెందిన విత్తన ప్యాకెట్లను పరిశీలించి కంపెనీకి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఆమోదిత పత్రాలు పరిశీలించారు అదేవిధంగా విత్తన షాపులలో స్టాక్ రిజిస్టర్ లను, స్టాక్ బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆమోదిత పొందిన విత్తన ప్యాకెట్లను మాత్రమే రైతులకు అంది ఇవ్వాలని అందించే క్రమంలో తప్పనిసరిగా ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలని. ప్రతిరోజు విక్రయించిన విత్తనాలను ప్రత్యేకంగా రిజిస్టర్ లో రైతుల పేర్లతో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని. విడిగా విత్తనాలు అమ్మకూడదని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తన ప్యాకెట్లను రైతులకు విక్రయించాలి అధిక ధరలకు విత్తన ప్యాకెట్లను విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పలువురు విత్తన డీలర్లను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ అధికారులు రంజిత్ రెడ్డి, పి.ఎస్.ఐ జి రామ్మోహన్ , మండల వ్యవసాయ అధికారి బన్న రజిత, పోలీస్ సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు డీలర్లు తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version