మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులను స్థానికులకే కేటాయించాలి.
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ చౌరస్తాలో మార్బుల్ గ్రానైట్ టైల్స్ పనులు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల వలన స్థానికులకు చాలా పెద్దగా భారం పడుతున్నది కావున
కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వము తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలువురి కార్మికులు మాట్లాడుతూ, వలస వచ్చినా కార్మికులు మేము మాట్లాడిన పనికి వాళ్ళు చానా తక్కువ ధరకు మాట్లాడి మాకు పనులు లేకుండా చేస్తున్నారు ఎందుకో మరి వాళ్లకు మా మీద కోపం మేము కలిసికట్టుగా పని చేసుకోవాలి అన్నదే మా ఉద్దేశం వాళ్లు కూడా మాతో కలిసి పని చేస్తే వాళ్లకు మంచి జీవనోపాధి ఉంటది మాకు స్థానిక యూనియన్ నిర్ణయించిన ఉపాధి ఉంటది. వాళ్లు రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిండ్రు అని, మా స్థానిక యూనియన్ నిర్ణయించిన నిర్ణయాల ప్రకారం నడవాలని కోరారు. కావున కార్మికులు తమ సమస్యలను పరిష్కారం చేయాలని, మా జీవనోపాధి పూర్తిగా ఈ రంగంపైనే ఆధారపడి ఉందనీ అన్నారు. అయితే, సరైన రీతిలో పనులు లేకపోవడం, తగిన అవకాశాలు కల్పించకపోవడం వలన మా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లాల నుండి వందలాది మంది కార్మికులు ఈ ధర్నాలో పాల్గొని ఐక్యంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం మా సమస్యలను గమనించి తక్షణమే పరిష్కారం చూపకపోతే, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల అసోసియేషన్ నేతలు అధ్యక్షులు సమీర్, జన్ను సునీల్, ఉపాధ్యక్షులు ఫిరోజ్, ఫయాజ్, తాజ్ ఫిరోజ్, అయూబ్, జలీల్, చెన్నూరి కిషోర్, రాజేందర్, నాసం హరీష్, సాదిక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.