8న జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి.
చిట్యాల, నేటిధాత్రి ;
వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ 4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు దొడ్డే శంకర్ మాదిగ అన్నారు. శుక్రవారం ఆయన చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు పెంచి ఇస్తున్నాడు కానీ తెలంగాణలో రూ 6 వేలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాకు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులు మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.
పెంచిన పింఛన్లు అమలు చేసేంతవరకు ఎంతటి పోరాటానికైనా ఎమ్మార్పీఎస్ వెనుకాడదని తెలియజేశారు.