ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి
ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్
కొత్తగూడ, నేటిధాత్రి :
కొత్తగూడ మండల కేంద్రo జీఎల్ నగర్ ( గోగ్గల లక్ష్మయ్య నగర్ ) ఆదివాసీ మహిళా పై గిరిజనేతరుడు అయిన ఎండీ పాషా మొబైల్ షాప్ నిర్వాహకుడు దాడి చేయడాన్ని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా కండించడం జరిగింది.
దాడిలో గాయపడిన ధనసరి అనసూర్య నీ ఆదివాసీ సంఘాల నాయకులు ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం జరిగింది…అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం గుర్తించిన 5 వ షెడ్యూల్ ప్రాంతం అయిన ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక ఏజెన్సీ చట్టాలు ఉన్నపటికీ చట్టలకు విరుద్ధం గా బ్రతుకు దెరువు కోసం ఏజెన్సీ లోకి వలసలు వచ్చిన గిరిజనేతరులు తిరిగి ఆదివాసీల పైనే దాడులు చేస్తున్నారు. 1/59,1/70, LTR( భూ బదలాయింపు నిషేధ చట్టం) పేసా-1996, ROFR-2006, ఏజెన్సీ లో వడ్డీ వ్యాపార నిషేధ చట్టం-1960 చట్టాలు అమలు చేయక పోవడం వల్లనే గిరిజనేతరులు దాడులకు దిగుతున్నారు.
ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలనీ లేని యెడల ఆదివాసి లు “నాన్ ట్రైబ్ గో బ్యాక్ నినాదం”తో దశాల వారి ఉద్యమనికి తిరుగు బాటు చేయక తప్పదాని హెచ్చరించారు.
ఏజెన్సీ గూడ లలో ఉన్న ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంత చట్టలు హక్కుల పై అవగాహనా తో ఉండాలని ఆదివాసీ యువత గిరిజనేతరుల అక్రమాలను తిప్పి కొట్టాలని భారత రాజ్యాంగం ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ ల కోసం గుర్తించిన చట్టాలు హక్కులు అమలు కావాలంటే తిరుగు బాటు తప్పదాని యువత అప్రమత్తం గా ఉండాలి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమం లో ఆదివాసీ సంఘాల నాయకులు పూనేం సందీప్ దొర,ధనసరి రాజేష్,కుంజ నర్సింహా రావు, కల్తీ నరేష్, పెండకట్ల లక్ష్మీ నర్సు, ఈసం రామస్వామి,బీజ్జ సందీప్, ఈసం వెంకన్న, పెనక విజయ్ తదితరులు పాల్గొన్నారు.