ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి…

ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి

ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్

కొత్తగూడ, నేటిధాత్రి :

 

కొత్తగూడ మండల కేంద్రo జీఎల్ నగర్ ( గోగ్గల లక్ష్మయ్య నగర్ ) ఆదివాసీ మహిళా పై గిరిజనేతరుడు అయిన ఎండీ పాషా మొబైల్ షాప్ నిర్వాహకుడు దాడి చేయడాన్ని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా కండించడం జరిగింది.
దాడిలో గాయపడిన ధనసరి అనసూర్య నీ ఆదివాసీ సంఘాల నాయకులు ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకోవడం జరిగింది…అనంతరం ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం గుర్తించిన 5 వ షెడ్యూల్ ప్రాంతం అయిన ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక ఏజెన్సీ చట్టాలు ఉన్నపటికీ చట్టలకు విరుద్ధం గా బ్రతుకు దెరువు కోసం ఏజెన్సీ లోకి వలసలు వచ్చిన గిరిజనేతరులు తిరిగి ఆదివాసీల పైనే దాడులు చేస్తున్నారు. 1/59,1/70, LTR( భూ బదలాయింపు నిషేధ చట్టం) పేసా-1996, ROFR-2006, ఏజెన్సీ లో వడ్డీ వ్యాపార నిషేధ చట్టం-1960 చట్టాలు అమలు చేయక పోవడం వల్లనే గిరిజనేతరులు దాడులకు దిగుతున్నారు.
ప్రభుత్వం ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలనీ లేని యెడల ఆదివాసి లు “నాన్ ట్రైబ్ గో బ్యాక్ నినాదం”తో దశాల వారి ఉద్యమనికి తిరుగు బాటు చేయక తప్పదాని హెచ్చరించారు.
ఏజెన్సీ గూడ లలో ఉన్న ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంత చట్టలు హక్కుల పై అవగాహనా తో ఉండాలని ఆదివాసీ యువత గిరిజనేతరుల అక్రమాలను తిప్పి కొట్టాలని భారత రాజ్యాంగం ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ ల కోసం గుర్తించిన చట్టాలు హక్కులు అమలు కావాలంటే తిరుగు బాటు తప్పదాని యువత అప్రమత్తం గా ఉండాలి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమం లో ఆదివాసీ సంఘాల నాయకులు పూనేం సందీప్ దొర,ధనసరి రాజేష్,కుంజ నర్సింహా రావు, కల్తీ నరేష్, పెండకట్ల లక్ష్మీ నర్సు, ఈసం రామస్వామి,బీజ్జ సందీప్, ఈసం వెంకన్న, పెనక విజయ్ తదితరులు పాల్గొన్నారు.

సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి.

సొసైటీ ఇసుక ర్యాంపులను పునః ప్రారంభించాలి

ఇర్ప రాజు ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు*

నేటి ధాత్రి ; భద్రాచలం;
ఏజెన్సీ ప్రాంతంలో గల ఆదివాసీ మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ లను తక్షణమే పునః ప్రారంభించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు.ఇందులో బాగంగా మార్చి 11,2025; మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఆదివాసీ ప్రజల ఉపాధిని దెబ్బకొట్టేందుకు ఇసుక ర్యాంప్ లను నిలిపి పాలకులు రైజింగ్ కాంట్రాక్టర్లతో బేరసారాలకు తెరలేపారని ఆరోపించారు.నిజంగా ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలనే ఆలోచన పాలకులకు ఉంటే రైజింగ్ కాంట్రాక్టర్ విధానం లేకుండా ప్రతి మహిళ సొసైటీ ఇసుక ర్యాంప్ కు పెట్టుబడి నిమిత్తం ముందస్తు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అమ్మ పెట్టదు అడుక్కతీననివ్వదు అనే చందంగా రేవంత్ సర్కారు తయారైందని విమర్శించారు.ఇసుక అక్రమాలు కట్టడి అంటూ డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొకోక పోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందన్నారు.ఇందకు స్థానిక సంస్థల ఎన్నికలే సమాధానం చెపుతాయని అన్నారు

ఆదివాసి యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి నియామకం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నాయకుడు పాత శ్రీకాంత్ ని శనివారం రోజున ఆదివాసి యువజన జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నామని ఆదివాసి నాయకత్వం హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గంజి రాజన్న తెలియజేశారు.ఈ సందర్భంగా గంజి రాజన్న చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాత శ్రీకాంత్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియపరిచారు.76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నాయక పోడు జాతి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడి ఉందని,నాయకపోడు నివాసాలు ఉండే గ్రామాలలో తాగునీటి సమస్య,గ్రామాలకు రోడ్డు లేక విద్య వైద్యం ఉపాధి లేక నిరుపేదరికంలో జీవనం సాగిస్తూ బ్రతుకుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.తన జాతిని చైతన్యపరిచి ప్రభుత్వ పథకాలు అందే విధంగా విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలు అందరికీ అందే విధంగా నిరంతరం గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసి వారు అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు.మండలంలోని యువ కాంగ్రెస్ నాయకుడికి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి పదవి రావడంతో తన అభిమానులు కార్యకర్తలు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియపరిచారు.

చెంచు ఆదివాసి గ్రామాలకు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి.

జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి అధ్యక్షులు కారం సీతారామన్న దొర (ఢిల్లీ బాబు )

“నేటిధాత్రి” ప్రకాశం జిల్లా, పెద్ద దోర్నాల.

ప్రకాశం జిల్లా, పెద దోర్నాల మండలం, పెద్ద చామ గ్రామంలో శనివారం నాడు జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి అధ్యక్షులు
కారం సీతారామన్న దొర(ఢిల్లీ బాబు) పర్యటించారు.
ఈ సందర్భంగా సీతారామన్న దొర మాట్లాడుతూ ఆదివాసీ చెంచు గిరిజన గ్రామాలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు,
చీకటి బతుకులు బతుకుతున్న చెంచుల నివాస ప్రాంతాలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు,గిరిజన పాఠశాలలు ఆధునీకరణ చేయాలన్నారు, చెంచు గూడాలలో రోడ్డు సదుపాయం లేక గిరిజనుల పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసామని చెంచు గ్రామాలలో వెంటనే రోడ్డు, రవాణా సదుపాయం కల్పించాలన్నారు, చెంచు గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలలో మెరుగైన సదుపాయాలతో పౌష్టిక ఆహారం అందించాలన్నారు, చెంచు ఆదివాసీల ఉపాధికై (MGNREGS) ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు, చెంచు ఆదివాసీల అభివృద్ధికి ట్రై కార్ రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకోవాలి అన్నారు, చెంచు గిరిజనులు సేకరించుకుంటున్న అటవీ ఫలాలను అమ్ముకోకుండా అడ్డుపడుతున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని,
పక్కా భూములు కలిగి ఉన్న ఆదివాసీలకు వ్యవసాయం చేసుకొనుటకు నీటి సదుపాయం లేకపోవడంతో బీడు పట్టిన భూములలో సాగు చేసుకోవటం కోసం 500 అడుగులు పైన గల లోతు బోర్లు ప్రభుత్వం వెంటనే కేటాయించాలన్నారు , ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తానని కారం సీతారామన్న దొర( ఢిల్లీ బాబు) అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంరక్షణ సమితి నాయకులు కారం గంగాధర్ రావు, కాక శివశంకర్ ప్రసాద్ మరియు గ్రామస్తులు
దాసరి వెంకన్న, మల్లి గురవయ్య, దంసం లక్ష్మన్న, దాసరి పెద గురవయ్య,చిన గురవయ్య , దంసం చిన పెద్దన్న, దంసం గురవమ్మ, , దాసరి వెంకట లక్ష్మి, , దాసరి రామయ్య మొదలగు వారు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version