ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం
నర్సంపేట,నేటిధాత్రి:
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడతామని అందుకోసం నర్సంపేట డివిజన్ లో గడపగడపకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటారని ఎంసిపిఐ (యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ వెల్లడించారు.పార్టీ నర్సంపేట మండల కమిటీ సమావేశం భైరబోయిన నరసయ్య అధ్యక్షతన స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగింది. తొలుత వామపక్ష నేతలు సురవరం సుధాకర్ రెడ్డి , ఎంసిపిఐ యు కేరళ నాయకులు నారాయణన్ మృతిపట్ల శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం హాజరైన రమేష్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ , మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు.గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు బాటకు శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు.భారత రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ బిజెపి ప్రభుత్వం దేశ సంపదనంతా కార్పొరేట్ బడాబాబులకు ధారాదత్తం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.మతం పేరుతో భారత పౌరుల పట్ల చిచ్చు పెడుతున్న బిజెపి సర్కార్,విదేశీ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తుందన్నదని ఆరోపించారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు,వంగల రాగసుధ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి,కేశెట్టి సదానందం,కర్నే సాంబయ్య,గుర్రం రవి గణిపాక బిందు,స్వరూప తదితరులు పాల్గొన్నారు.