హన్మకొండ మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు అవరణలో మెగా హెల్త్ క్యాంప్…

హన్మకొండ మరియు వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు అవరణలో మెగా హెల్త్ క్యాంప్:-

ప్రారంభించిన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి అపర్ణాదేవి:-

హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

శుక్రవారం అదాలత్ కోర్టు ప్రాంగణంలో ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్, అప్పోలో సౌజన్యంతో హన్మకొండ, వరంగల్ బార్ అసోషియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన మెగా హెల్త్ క్యాంపును జిల్లా జడ్జి శ్రీమతి అపర్ణాదేవి ప్రారంభించారు. ఇట్టి సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా వుంటేనే న్యాయవాదులు ప్రజలకు మంచి సేవలందించ గలరని, వివిధ అనారోగ్య కారణాలతో ఇటీవల కొంతమంది అడ్వకేట్లు అకాల మరణం చెందారని ఆవేదన చెందారు. ముఖ్యంగా గుండె పోటుతో మరణాలు పెరిగిపోయాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో ఉచిత ఈసిజీ, టుడీ ఈకో వంటి పరీక్షలు నిర్వహించడం సంతోషకరమైన విషయమని అన్నారు.

హన్మకొండ బార్ అసోషియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహకరించిన ఎన్ఎస్ఆర్ హాస్పిటల్స్, అప్పోలో సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. అడ్వకేట్స్ సంక్షేమం కోసం బార్ అసోషియేషన్ అంకితభావంతో పని చేస్తున్నదని అన్నారు. ఈ హెల్త్ క్యాంపులో జూనియర్, సీనియర్ అడ్వకేట్లు పాల్గొని వివిధ పరీక్షలు చేయించుకొన్నారని సంతోషం వెలిబుచ్చారు. మహిళా అడ్వకేట్ల కోసం గైనకాలజీ స్పెషలిస్టులు వచ్చి సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ అడ్వకేట్స్ బార్ అసోషియేషన్ అధ్యక్షులతో పాటు రెండు బార్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

బార్ అసోసియేషన్లను సందర్శించిన టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్

బార్ అసోసియేషన్లను సందర్శించిన టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-

 

బుధవారం రోజున టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసిషన్లను సందర్శించారు. వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ గారు ఆయను న్యాయవాదులకు పరిచయం చేశారు.

ఇట్టి సందర్భంగా పొన్నం అశోక్ గౌడ్ మాట్లాడుతూ తనను బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలిపిస్తే న్యాయవాదులకు హెల్త్ ఇన్సూరెన్స్  మరియు రిటైర్మెంట్ మరియు న్యాయవాదుల సంక్షేమం కోసం పోరాడుతానని అన్నారు, అదేవిధంగా న్యాయవాదుల పై జరుగుతున్న దాడులకు అరికట్టడానికి న్యాయవాదుల రక్షణ చట్టం తేవడానికి తనకు ఉన్న అనుభవం తో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి బిల్లు వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. కాబట్టి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తన గెలుపుకు సహకరించగలరని కోరారు.

ఇట్టి కార్యక్రమంలో వరంగల్ లీగల్ సెల్ చైర్మన్ సామంతుల శ్రీనివాస్, మరియు ఎలుకుర్తి ఆనంద్ మోహన్, జి. శ్రీనివాస్, ఇజ్జిగిరి సురేష్ రాష్ట్ర వైస్ చైర్మన్ శేఖర్ రావు, రాష్ట్ర కన్వీనర్లు పోషిని రవీందర్, రంజిత్ గౌడ్, ఆర్.వేణుగోపాల్, కె.రంజిత్, మరియు సురేందర్ రెడ్డి, ఏ. ప్రసాద్, మహేందర్, గణేష్, నీల శ్రీధర్ రావు, శ్రీధర్ గౌడ్,మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొని ఆయన గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.

మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్‌:-

మహాకవి కాళోజీ గారి వర్ధంతి సభను ఘనంగా నిర్వహించిన వరంగల్ బార్ అసోసియేషన్‌:-

వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

 

తెలంగాణ ప్రజాకవి మహాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వరంగల్ బార్ అసోసియేషన్ హాల్ (అంబేద్కర్ హాల్)లో గురువారం స్మారక సభను వరంగల్ బార్ అసోసియేషన్‌ అధ్యక్షులు వలస సుధీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,
ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ
“తెలంగాణ తొలిపొద్దు కాళోజీయని
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు”
అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ గారంటూ,
అదేవిధంగా అన్నపు రాశులు ఒకచోట – ఆకలికేకలు ఒకచోట అంటూ సమాజంలోని అసమానతలను అక్షర యోధుడై దునుమాడి సమసమాజం కోసం పోరాడారని,ప్రజల ఆవేదనను బడిపలుకులతో గాక, పలుకుబడుల భాషలో పలికించిన నిజమైన ప్రజా కవి కాళోజీ గారిని స్మరించుకోవడం మనందరికీ స్పూర్తిదాయకం అంటూ వారి ఆశయాల వెలుగులో ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతతో ముందుకు సాగి అసమానతలు లేని సమాజాన్ని సాధించాలని బార్ అసోసియేషన్ తరఫున పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా న్యాయవాదులు కాళోజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు మైదం జయపాల్, ప్రధాన కార్యదర్శి డి. రమాకాంత్, సంయుక్త కార్యదర్శి ముసిపట్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి సిరుమళ్ల అరుణ, సీనియర్ ఈసి సభ్యుడు ఇజ్జేగిరి సురేష్, మహిళా ఈసి సభ్యురాలు తోట అరుణ, బార్ కౌన్సిల్ సభ్యుడు బైరపాక జయాకర్, అలాగే సీనియర్ న్యాయవాదులు తీగల జీవన్ గౌడ్, ఎలుకుర్తి ఆనంద్ మోహన్, రాచకట్ల కృష్ణ, గంధం శివ, ఓరుగంటి కోటేశ్వర్, సిద్దం యుగేందర్,గురుమిళ్ల రాజు మరియు ఇతర పలువురు న్యాయవాదులు పాల్గొని నివాళులర్పించారు.

న్యాయవాదిపై దాడిని ఖండించిన వరంగల్ బార్.

న్యాయవాది పై దాడిని తీవ్రంగా ఖండించిన వరంగల్ బార్ అసోసియేషన్:-

వరంగల్, నేటిధాత్రి (లీగల్):-

కూకట్‌పల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు అడ్వకేట్ తన్నేరు శ్రీకాంత్ కోర్టు వారంట్ అమలు చేస్తూ ఉండగా జరిగిన క్రూర దాడిని వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఇట్టి సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుదీర్ మాట్లాడుతూ ఒక న్యాయవాదిపై దాడి జరగడం అనేది న్యాయవ్యవస్థ గౌరవాన్ని, కోర్టుల అధికారం పట్ల చేసిన దారుణమైన సవాలుగా మేము భావిస్తున్నాము. నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి. రమాకాంత్, వైస్ ప్రెసిడెంట్ మైదం జయపాల్, జాయింట్ సెక్రటరీ ముసిపట్ల శ్రీధర్ గౌడ్, లేడీ జాయింట్ సెక్రటరీ రేవూరి శశిరేఖ, లైబ్రరీ సెక్రటరీ గుండా కిశోర్ కుమార్,20 ఇయర్స్ సీనియర్ ఈసీ ఇజ్జగిరి సురేష్, 10 ఇయర్స్ సీనియర్ ఈసీ కలకోట్ల నిర్మలా జ్యోతి, ఈసీ మెంబర్లు మర్రి రాజు, జాటోత్ రవి, మడిపెల్లి మహేందర్, తోట అరుణ మరియు న్యాయవాదులు కోటేశ్వర్, దయాన్ శ్రీనివాస్, శివ, సదానందం, శ్రీనివాస్, భిక్షపతి, ప్రదీప్ , అనీల్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొని ఖండించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version