రైతు భరోసా విజయోత్సవాలు.

రైతు భరోసా విజయోత్సవాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం రూపొందించిన రైతు భరోసా విజయోత్సవాల 9 రోజులలో 9 వేల కోట్లకు రైతుల ఖాతాలో జమ చేసిన సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారు రైతుల నిర్దేశించి ప్రసంగించడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఝరాసంగం మండలంలో ఝరాసంగం, కప్పుడ్ మరియు బర్దిపూర్ రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించడం జరిగింది.
రైతు భరోసా పథకం కింద మన మండలానికి 22.83 కోట్లకు గాను ఇప్పటి వరకు 21.04 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుధాకర్, మండల వ్యవసాయ అధికారి వెంకటేశం,శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ మరియు పిఎసిఎస్ ఝారసంఘం చైర్మన్ గౌస్ ఉద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, తాజా మాజీ సర్పంచ్లు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు సృజన పాటిల్, మల్లన్న పటేల్ , మారుతి రావు, శ్రీకాంత్ రెడ్డి రాజ్ కుమార్ స్వామి, రైతులు రఘు శ్రీనివాస్ రెడ్డి, సంగ్రం పాటేల్ మరియు వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు..

కురివి మండల కేంద్రంలోని రైతు వేదికలలో.

కురివి మండల కేంద్రంలోని రైతు వేదికలలో రైతు భరోసా సంబురాలు

మరిపెడ/కూరవి నేటిధాత్రి.

 

 

 

రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖా-ముఖీ కార్యక్రమం లో భాగంగా డోర్నకల్ నియోజకవర్గ లో ని కూరవి మండల రైతు వేదిక లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రునాయక్, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల తో కలిసి సమావేశం లో పాల్గొని మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో ప్రజల్లో కి తీసుకెళ్ళి ప్రజా పాలన, ప్రభుత్వo అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు, నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా ప్రతి ఎకరాకు 6000 రు చొప్పున లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో కొరవి మండల పార్టీ అధ్యక్షులు,మాజీ జడ్పీటీసీ అంబటి వీరభద్రం గౌడ్,కొరవి దేవస్థానం చైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి బండి వెంకటరెడ్డి, మరియు ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.

ప్రజా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం

– సకాలంలో రైతులకు చేయూత.

– ప్రజాహిత సంక్షేమాలతో ప్రజలు సంతోషం.

– డిప్యూటీ స్పీకర్ డా. రామచంద్రనాయక్

– మరిపెడ పట్టణ కేంద్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి, ప్రభుత్వ విప్ చిత్రపటాలకు పాలాభిషేకం.

మరిపెడ:నేటిధాత్రి.

 

 

 

 

 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజాహిత సంక్షేమాలు అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందని, కాంగ్రెస్ రైతుల పక్షపాతి అని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్ అన్నారు. సాగుకు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోస సకాలంలో వేసిన సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ ఆర్ అండ్ బి అతిధి గృహం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజాహిత సంక్షేమాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు ఆసరాగా నిలుస్తోందన్నారు. మండలంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రూ. 500 సిలిండర్, 21లక్షల మంది రైతుల రుణ మాఫీ చేసింది, సన్న వడ్లు కు బోనస్, భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం, అర్హులైన రైతులకు ఎకరాకు రూ.6వేల రైతు భరోసా లబ్ధిదారులకు అందించిందన్నారు. తాజాగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు మొదటి విడతగా 4000వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించి ప్రజా ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని విధాల బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పానుగోతు రామ్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి నాయక్, నాయకులు బోర గంగయ్య, కొండం దశరథ, గుండగాని వెంకన్న, సురబోయిన ఉప్పలయ్య, కుడితి నరసింహారెడ్డి, కారంపుడి ఉపేందర్, రవికాంత్, దూగుంట్ల వెంకన్న, బోడ రమేష్, తొట్టిగౌతం, యాకుబ్ పాషా, బోడ రవి, వల్లేపు లింగయ్య, గంధసిరి సోమన్న, గౌస్, సోమ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

ఎన్నికల భరోసాగా రైతు భరోసా.

విజయోత్సవాల పేరుతో గత సీజన్ రైతు భరోసా,వడ్లకు బోనస్ ఎగనామం..

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది ఫైర్..

నర్సంపేట నేటిధాత్రి:

గత సీజన్ లో రైతు భరోసా, అలాగే వడ్లకు ప్రకటించిన బోనస్ లను ఎగనామం పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి గత19 నెలల కాలంలో రైతులను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని పెద్ది డిమాండ్ చేశారు.ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి 12 వేలకు పరిమితం చేయడం అలాగే గత వానకాలం,యాసంగిలో రైతు భరోసా ఎగ్గొట్టి ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపుకోవడం రైతులను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తూ,రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నారంటూ ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో ఒక్క చెక్ డ్యాం కట్టలేదని ఆరోపించారు.2022 మే 6 న వరంగల్ లో జరిపిన రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ,సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ,ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రశ్నించారు.కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని అవేదన వ్యక్తం చేశారు.గత పదేండ్ల బిఆర్ఎస్ పాలన రైతు సంక్షేమ ప్రభుత్వమైతే నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతు సంక్షోభ ప్రభుత్వంగా పెరుపొందుతున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో 9000 వేల కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ కావడంతో రైతు సంబరాలకు రాష్ట్ర పార్టీ ఆదేశించగా మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతులు బాణాసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్, నాయకులు ఏడాకుల సంపత్ రెడ్డి, జెట్టి రామ్మూర్తి, జిల్లా మునీందర్, చిట్యాల ఉపేందర్ రెడ్డి బత్తిని మహేష్, తదితరులు పాల్గొన్నారు.

హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి.

ఎన్నికల హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి,

ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి,

యూరియా సరఫరా లో ప్రభుత్వం విఫలం

గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో వడ్లు పండించిన ప్రతి రైతుకు ఎన్నికల హామీ మేరకు బోనస్ ఇవ్వాలని గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీల అమలు విషయంలో కాలయాపన చేస్తున్నారని అన్నారు, ఇప్పటికైనా రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, ప్రతి రైతుకు రైతు బంధు పథకం అమలు చేయాలని, లేని పక్షంలో రైతుల పక్షాన ధర్నా చేపడతామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో అనేక కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారని, కొందరు రైతులకు ఇప్పటికీ ధాన్యం డబ్బులు పడలేదని, జిల్లా యంత్రాంగం రైతులకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వానకాలం పంట సాగు సమీపిస్తున్న ఇప్పటికీ యూరియా అందుబాటులో లేదని, రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ.

రైతుల ఖాతాల్లో రూ. 99.5 కోట్ల రైతు భరోసా నిధులు జమ

1,10,322 మంది జిల్లా రైతులకు లబ్ది

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని అన్నదాతలకు రైతు భరోసా కింద మూడు రోజుల్లో రూ. 99.5 కోట్లకు పైగా డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఖరీఫ్ వర్ష కాలం సీజన్ సాగు కోసం రైతులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ రోజు వరకు జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 1,10,322 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.99,52,19,906= 00 డబ్బులు జమ అయ్యాయని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

చెరుకు రైతులను ఆదుకోవాలిటిఎస్ఎస్ సిసిడిసి.

చెరుకు రైతులను ఆదుకోవాలిటిఎస్ఎస్ సిసిడిసి(ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలో సుమారు 25000 ల ఎకరాల్లో రైతులు చేరుకును పండిస్తారు సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతుంది.నియోజకవర్గ చెరుకు రైతులు గత కొన్ని సంవత్సరాల నుండి సరైన కర్మాగారం లేకుండా,సరైన ధర లేకుండా ఇబ్బందులకు గురి అవుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కొత్తూర్ బి. చెరుకు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడిపిస్తాం అని వాగ్దానాలు ఇచ్చారు కానీ 18 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు దాని ఊసే లేదు. రాయికోడ్ మండలం మాటూర్ దగ్గర కొత్తగా చక్కెర కర్మాగారం ప్రారంభించారు అయినా ఆ కర్మాగారం కూడా గత సంవత్సరం అంతంత మాత్రమే నడిచింది రైతులు ఇబ్బందులకు గురి అయినారు దాని సామర్థ్యం 3 లక్షల 25000 ల మెట్రిక్ టన్నులు దాని పరిధిలో 6 మండలాలను మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిసింది అందులో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలు లేవు అందులో అత్యధిక చెరుకు పండించేది జహీరాబాద్,మొగుడంపల్లి మండలాలే చెరుకు రైతులను ఇబ్బంది పెట్టకుండా కొత్తూర్.బి చెరుకు కర్మాగారాన్ని ప్రారంభించాలి/మాటూర్ చెరుకు కర్మాగారం పరిధిలోకి ఈ రెండు మండలాలను చేర్చాలి,చెరుకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్,ఈ కార్యక్రమంలో నాయకులు శికారి గోపాల్, శ్రీనివాస్ రెడ్డి,లు పాల్గొన్నారు.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

shine junior college

జైపూర్ మండలం ఇందారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ముఖ్య సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్భంగా జైపూర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 75 వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో మన రైతులు సుభిక్షంగా ఉండేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పథకాలను ఇప్పటికి అమలు చేసి వివిధ రాష్ట్రాలకు ఒకదశ,దిశ చూపించారని అన్నారు. అదేవిధంగా రుణమాఫీ,సన్న ధాన్యానికి బోనస్,అన్ని రకాల పంటలకు మద్దతు ధర కొనుగోలు,అన్ని పంటలకు రాయితీపై సూక్ష్మ,సేంద్య పరికరాల సరఫరా వంటివి అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో శ్రీనివాసరావు,ఎంపీఓ శ్రీపతి బాబురావు,ఏఈఓ మాళవిక,పంచాయతీ కార్యదర్శులు,ప్రజా ప్రతినిధులు,రైతులు ప్రజలు పాల్గొన్నారు.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

శాయంపేట మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి గంగాజమునా

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

2025వ సంవత్సరం వానా కాలానికి సంబంధించి రైతు భరోసా కోసం కొత్తగా పట్టా దారు పాసుపుస్తకాలు తీసు కున్నటువంటి రైతులు మీయొక్క పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరి యు మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క జిరాక్స్ వెంటనే తీసుకొని మండల వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించగలరు, దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 18.06.2025 .జూన్ 18 వ తారీకు వరకే చివరి రోజు ఉన్నందున, రైతులు చివరి రోజు వరకు చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవా ల్సిందిగా కోరుతున్నాం ప్రస్తు తానికి ఈ పథకానికి జూన్ 5వ తారీఖు వరకు పట్టాదారు పాసుపుస్తకాలు పొందినటు వంటి రైతులు అర్హులు, ఒకవేళ ఇదివరకే రైతు భరోసా తీసు కుంటూ బ్యాంక్ అకౌంట్ ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే రైతులు కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలతో మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ.

ఖరీఫ్ సాగులో రైతులు బిజీ బిజీ

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

సేద్యం పనుల్లో రైతులు బిజీ బిజీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

గుకోసం రైతులు సేద్యం పనుల్లో బిజీబిజీగా మారారు. మండ లంలో రెండు వేల హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణం ఉందని వ్యవసాయాధి కారులు పేర్కొంటున్నారు జహీరాబాద్ నియోజకవర్గం జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ మండలంలో నాలుగు రోజులుగా వర్షాలు కురు స్తుండటంతో వ్యవసాయ పొలాల్లో ట్రాక్టర్ల సాయంతో దుక్కిళ్లు చేస్తున్నారు. పొలాల్లో, గట్టుపై పెరిగిన పిచ్చిమొక్కలు, రాళ్లు తొలగించడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఈ యేడాది ముందస్తు వర్షాలు కురవడంతో వేరుశనగ పంట సాగుచేసేందుకు మండలంలోని రైతులు ఆసక్తి చూపుతున్నారు.

దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు

దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు…

70 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి…

నేటి ధాత్రి మహబూబాబాద్:

గార్ల మండలం,మద్ది వంచ రెవెన్యూ పరిధిలో 116 మరియు 119 సర్వే నెంబర్లలో 900 ఎకరాల ప్రభుత్వ భూమిని 70 సంవత్సరాల పైగా గిరిజన, గిరిజనేతర పేద రైతులు సేద్యం చేసుకొని జీవిస్తున్నారని,అట్టి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎం -ఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు.మద్దివంచ రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులు తాము దశాబ్దాలుగా సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలివ్వాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం -ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ, మద్దివంచలో సగానికి పైగా ప్రభుత్వ భూములే ఉన్నాయని,అనాదిగా పేద రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు వారికి పట్టాలివ్వలేదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వాధికారుల వైపు నుండి జరిగిన వైఫల్యమేనని అన్నారు.116,119 సర్వే నెంబర్ల లోని భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి రుణ సౌకర్యాలు కానీ, రైతుబంధు రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలు గాని అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో మాన్యువల్ పహణీల ద్వారా రైతులు బ్యాంకుల నుండి పంట రుణాలు తీసుకున్నారని ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత పహణీ నకళ్ళు రాకపోవడంతో వారికి రుణమాఫీ కూడా జరగడం లేదని ఆయన అన్నారు.ప్రస్తుత రెవెన్యూ సదస్సులలో ఈభూముల పట్టాల కోసం రైతులు పెట్టుకొంటున్న దరఖాస్తులను కూడా అధికారులు తీసుకోవటం లేదని అన్నారు.116,119 సర్వే నెంబర్లలో సాగులో వున్న గిరిజన,గిరిజనేతర,పేద రైతులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాధికారులు స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ప్రతినిధి బృందం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు విజ్ఞాపన పత్రం సమర్పించారు.ఈకార్యక్రమంలో న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి గుగులోత్ సక్రు,ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి శివ్వారపు శ్రీధర్,పీడియస్యూ జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, మద్దివంచ మాజీ సర్పంచ్ కుసిని బాబూరావు, పార్టీ డివిజన్ నాయకులు గౌని భద్రయ్య, ఏఐకేఎంఎస్ నాయకులు ముండ్ల రంగారావు,గౌని మల్లేశ్,పెసా కమిటీ చైర్మన్ దారావత్ భావ్ సింగ్,రైతులు నల్లబెల్లి అప్పయ్య,గౌడి మంగయ్య, బాడిశ వెంకటేశ్వర్లు, మహ్మద్ అబ్రార్,పకీర్ మహ్మద్, చిటాకుల రాములు,బాడిశ జయమ్మ,నల్లబెల్లి చంద్రయ్య, దారవత్ రవి తదితరులు పాల్గొన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఎ.చంద్రశేఖర్ ,మాజీమంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

◆ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫె: ఐదాస్ జానయ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలోని బిలాల్ పూర్ గ్రామంలో రైతుల అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం, సాగు చేస్తున్న పంటలను ఎ విధంగా సంరక్షించుకోవాలి, మరియు వ్యవసాయ పంటలకు సరిపడ ఎరువులను ఎలా వాడాలని శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా
ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు బహు చక్కగా ఉపయోగపడే ఇలాంటి అవగాహన కార్యక్రమాలను చేయడం శుభపరిణామం అని, కాలనుసారంగా ఎలాంటి పంటలను వేయాలో ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రైతులు తెలుసుకోవచ్చు అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ గారు,బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్ర్తావేత్త విజయ్ కుమార్, మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ ,సామెల్ గారు,కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ రాందాస్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మాజీ ఎంపీటీసీలు మలన్న పాటిల్, అశోక్, అనిల్ ,కోహిర్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్,ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్, కాంగ్రెస్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి గారు,శంశీర్, మునీర్ పటేల్ ,ముర్జల్,అశోక్,మోసిన్ ,వీరారెడ్డి , దయానంద పాటిల్, నరసింహా రెడ్డి,మరియు INTUC (F) రాజ్ కుమార్ కోహిర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజామిల్ తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి.

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

రైతు భరోసా పథకం సద్వినియోగం చేసుకోవాలి : మండల వ్యవసాయ అధికారి వెంకటేశం.
ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం రైతు భరోసా పథకం లో భాగంగా
ఝరాసంగం మండలంలోని రైతులందరూ వానకాలం 2025 సీజన్ కి సంబంధించిన తేదీ 05.06.2025. వరకు ఎవరికైతే నూతనంగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు అయిన రైతులు రైతు భరోసా పథకం కొరకు దరఖాస్తు చేసుకోవలని మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు..
కావాల్సిన పత్రాలు:
1. రైతు భరోసా అప్లికేషన్ ఫారం
2. పట్టదార్ పాస్ పుస్తకం
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. బ్యాంకు అకౌంట్ జిరాక్స్
మీ యొక్క సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ నెల 20 వ తేదీ వరకు సమర్పించాలని తెల్పడం జరిగింది..

ఎటూ పోయావు వానమ్మా…

ఎటూ పోయావు వానమ్మా…

రైతన్నలు ఆకాశం వైపు ఎదురుచూపు

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

 

జూన్ మాసం వచ్చి 14 రోజులు గడిచిన తొలకరి పలకరించలేదు ఎన్నో ఆశలతో సాగుకు సిద్ధమైన రైతు వర్షం కోసం రోజు ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు వరుణుడు కరుణించక పోవడంతో వానకాలం పంట సీజన్ ఆరంభంలో నిరాశ చెందుతున్నారు ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంటలు దెబ్బ తినడంతో రైతులు నష్ట పోవలసిన పరిస్థితి వస్తుంది ఒక నెల ముందుగానే ప్రారం భించాలని దిశా నిర్దేశం చేసింది. చినుకులు లేకపోవ డంతో విత్తనాలు విత్తుకుంటే అధిక దిగులు వస్తాయని రైతులు ఆలోచించారు ఎప్పటిలాగే రైతులు వానా కాలంలో వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి కూడా లేక పోయింది వరుణుడు మొఖం చాటేసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ నెలలో విత్తనాలు వేసుకుంటే రైతన్నలకు వాన కాలంలో అనావృష్టి వెంటాడుతుంది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించాకే నల్ల రేగడిలో 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మండలంలో పలు గ్రామాల్లో రైతులు వర్షం వస్తుందని నమ్మకంతో పత్తి విత్తనాలు నాటి ఎదురుచూస్తున్నారు ఈసారి ఎండతీవ్రత విపరీ తంగా ఉండడంతో మండలం లోని చెరువులు, కుంటలలో నీళ్లు లేక వెలవెలబోతు న్నాయి ఆయకట్టు వనరులు ఉన్న ప్రాంతాలలో ఆయకట్టు రైతులు కూడా వరుణుడు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎదురుచూస్తున్నాం..

మండలం రైతు ముసికే అశోక్

వర్షాల కోసం ఎదురుచూపులు చూస్తున్నాం సీజన్ లో వర్షాలు రాకుండా కష్టపడి పండించిన తర్వాత లేదా పంటలు చేతికి కొచ్చే సమయంలో వర్షాలు వచ్చి మమ్మల్ని నష్టం పరు స్తుంది ఈ వర్షాకాలంలో మొదట్లోనే వర్షాలు రాక కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది

వర్షాలు వచ్చిన తర్వాతనే విత్తనాలు వేయాలి

మండల వ్యవసాయ అధికారి గంగాజమున

వర్షాలు వచ్చిన తర్వాత విత్తనాలు వేయాలి ముం దస్తుగా విత్తనాలు వేసి రైతులు నష్టపోవద్దు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని ప్రచారం చేశాo.రైతులు అప్రమత్తంగా ఉండాలి.

రైతులతో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల అవగాహన సదస్సు.

రైతులతో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం. రేపాక గ్రామంలో. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క బాబు చెక్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల మరియు వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో జూన్ 13న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు 10 అంశాల పైన అవగాహన కల్పించారు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోని యూరియాను ఉపయోగించడం పచ్చి రొట్ట ఎరువుల వర్మి కంపోస్ట్ పశువుల ఎరువుల వాడడం భూసార పరీక్షల ఫలితాలను బట్టి పంటకు. ఎరువులు అందించడం రసాయన ఆధారిత పురుగుమందులను అవసరం మీదకు మాత్రమే ఉపయోగించడం మరియు పంటల్లో పద్ధతులు పాటించడం పంట వైభవ సమయంలో. పంట బీమా పొందడానికి మరియు నష్టపరిహారం కోసం పంట కోసం కొనుగోలు చేసిన వివిధ విత్తనాల రసాయనిక ఎరువుల మరియు రసాయనిక మందుల కొనుగోలు రసీదులను భద్రపరచడం సాగునీటి యజమాన్యం. బిందు మరియు తుంపర్ సేద్యం మల్చింగ్ పద్ధతుల సుస్థిరమైన వ్యవసాయం కోసం పంట మార్పిడి మరియు పంట వైవిధ్యాకరణ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం. పి జె టి ఏ యు. యూట్యూబ్ ఛానల్ మరియు బీజేపీ యూ వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని ఉపయోగించడం ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారం తెలుసుకోవడం వర్మీ కంపోస్టు తయారీ మరియు. పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన. పంట బీమా పథకాలు వెదురు మొక్కలు మరియు. ఆయిల్ పామ్ సాగు. అనంతరం రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటలకు సంబంధించిన పలు విషయాలపై చర్చించి సందేహాలను నివృతం చేసుకున్నారు రైతులు ఈ కార్యక్రమం తెలుసుకున్న అంశాలను తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల అసోసియేట్ డిఎన్ డాక్టర్ సునీత దేవి. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేందర్. డాక్టర్ జె చిరంజీవి. మండల వ్యవసాయ అధికారి కే సంజీవ్. ఉద్యాన శాఖ అధికారి వి గోవర్ధన్. వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్. గౌతమి లక్ష్మణ్. వ్యవసాయ కోర్స్. అభ్యసిస్తున్న. విద్యార్థులు ఏ సాత్విక. ఎస్ బాలకృష్ణ. రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు.

వివిధ మండలాలు సందర్శించిన రైతు సంఘం అధ్యక్షుడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టంపల్లి బాలరాజ్ న్యాల్కల్ మండలం వివిధ మండలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి కార్యవర్గ సభ్యుడు సునీల్ ధత్, న్యాల్కల్ ఎంపీటీసీ శ్రీశైలం, గోపాలరెడ్డి, దేవదాస్, తుల్జారాం, తదితరులు పాల్గొన్నారు.

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.

 

 

 

 

Whether you choose to walk or run, you are a child.
Whether you choose to walk or run, you are a child.

ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున
ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.

ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.

రైతుల పండుగ ఎరువక.

ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…

మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…

నేటిధాత్రి గార్ల :-

 

 

పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది. ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ. ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు. పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు. మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు. జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు. ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు. అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది. ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు. 1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

తహసిల్దార్ సత్యనారాయణ స్వామి

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండల కేంద్రంలో
రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని  తాసిల్దార్ సత్యనారాయణ స్వామి పేర్కొన్నారు సోమవారం  మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గోన్నారు  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ  చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో   ఎం ఆర్ ఐ దేవేందర్ సర్వేయర్ నిరంజన్. సిబ్బంది గుడాల తిరుపతి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version