బాలాజీ విద్యాసంస్థల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

బాలాజీ విద్యాసంస్థల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో ఒకటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ పాఠశాల,అక్షర పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు.బాలాజీ విద్యాసంస్థల్లో నెలకొని ఉన్న శ్రీ సరస్వతిదేవి ఆలయంలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.ఈ వేడుకలలో బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్
వనజ సరస్వతిదేవి యొక్క విశిష్టతను తెలియజేశారు.సకల విద్యా స్వరూపిణి సరస్వతిదేవి అని ఆమె కృపా కటాక్షములు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేసి ఓంకారాన్ని దిద్దించారు. విద్యార్థులందరూ పుస్తకాలను ,కళములను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించారు.
ఈ కార్యక్రమంలో విద్యాలయాల ప్రధానోపాధ్యాయులు జ్యోతి గౌడ్,భవాని,ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కేసముద్రంలో ఘనంగా నేతాజీ జయంతి

ఘనంగా నేతాజీ జయంతి

కేసముద్రం/ నేటి ధాత్రి

మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో శుక్రవారం స్వామి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన అపూర్వ త్యాగాలను గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు, దేశభక్తి, నాయకత్వ గుణాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. విద్యార్థులు నేతాజీ ఆశయాలను జీవితంలో ఆచరించాలని సూచించారు.
వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రాయికల్ పాఠశాలలో వైభవంగా సరస్వతీదేవి అర్చన

వైభవంగా సరస్వతీదేవి అర్చన

వసంత పంచమి ఉత్సవాలు

రాయికల్ జనవరి 23 నేటి ధాత్రి:

రాయికల్.పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు లో నెలకొల్పిన శ్రీ సరస్వతీ దేవి మండపం వద్ద శుక్రవారం దేవికి పూజలు నిర్వహించారు. వివిధ రకాల పువ్వులచే సరస్వతీ దేవి అర్చన పూజలు చేశారు. అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే సరస్వతీ దేవికి ప్రత్యేక ప్రార్థనలు చేయించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టు రమేష్ నర్సయ్య ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ లక్కాడి రాజరెడ్డి, పి.శ్రీనివాస్, వి.గంగరాజం, రవీందర్, పి. రాజశేఖర్ పి.రమేష్,యండి రాజమహ్మద్, ఎ.పద్మ.జి.తరంగిణి,ఎ.రజిత, యస్.శోభ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఆయుధ పూజ మంత్రం ఇదే…

ఆయుధ పూజ మంత్రం ఇదే!

జహీరాబాద్ నేటి ధాత్రి;

దసరా పండుగకు ముందు వచ్చే ఆయుధ పూజను ఈ ఏడాది అక్టోబర్ 1న నిర్వహించుకుంటున్నారు. నవరాత్రులలో మహర్నవమి రోజున జరిగే ఈ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతులు, వాహనదారులు, టైలర్లు, కార్మికులు తమ పనిముట్లను, వాహనాలను దుర్గామాత ముందుంచి పూజిస్తారు. పురాణాల ప్రకారం, పాండవులు యుద్ధానికి ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరిచి పూజించినట్లు తెలుస్తోంది. ఈ రోజున ‘ఓం దుం దుర్గాయైనమః’ అనే మంత్రాన్ని పఠించడం శుభప్రదమని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అని, కేరళలో పోటీలు, తమిళనాడులో సరస్వతీ దేవి పూజ (గోలు) చేస్తారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version