వరద ప్రవాహంతో నీట మునిగిన రోడ్లు.. నాటుపడవలపైనే రాకపోకలు…
అటు అల్లూరి జిల్లా విలీన మండలాల్లో రహదారులపై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల పరిధిలో 40 లోతట్టు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి. మరోవైపు వరద ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వరద ప్రభావంతో వేలాది ఎకరాల్లో మిర్చి, ఉద్యాన, కాయగూరలు పంటలు నీట మునిగారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.