ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ఐదు దశాబ్దాల రైతన్నల కల నెరవేర్చాలి…

ముల్కనూర్ వద్ద ప్రతిపాదిత స్థలంలోనే మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు,సాగునీరు అందించాలి…

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది…

మున్నేరు నీటిని పాలేరుకు తరలించడం అన్యాయం…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా, గార్ల మండలం, ముల్కనూర్ గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టు నిర్మించాలని ప్రజలు,రైతులు,అఖిలపక్ష పార్టీల నాయకులు కోరుతున్నారు.

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ద్వారా వ్యవసాయానికి నీరు అందుబాటులో ఉంటుంది.

ఇది స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతుంది.

మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం గార్ల మండల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.

1969లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య రూ.

ఒక లక్ష రూపాయల నిర్మాణ వ్యయంతో చంద్రగిరి ప్రాజెక్టుగా నామకరణం చేసి సర్వే ప్రారంభించారు.

1985 లో తెలుగుదేశం ప్రభుత్వం పాకాల యేరు, బయ్యారం పెద్ద చెరువు అలిగేరును కలిపి రెండేర్లగడ్డ ప్రాజెక్టుగా నామకరణం చేసి రు.10 లక్షల రూపాయలకు పెంచి సర్వే చేపట్టారు.

పది సంవత్సరాల అనంతరం తిరిగి మున్నేరు ప్రాజెక్టుగా పేరు మార్చుతూ నిర్మాణ ఖర్చులను కోటి రూపాయలకు పెంచుతూ సర్వే చేపట్టారు.

మండల ఏజెన్సీ ప్రజల ఉద్యమ ఫలితంగా 2009లో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రూ.136 కోట్ల నిధులతో మధ్య తరహా ప్రాజెక్టుగా ప్రతిపాదించారు.

జీవో నెంబర్ 1076 ప్రకారం రు. 36 కోట్లు ప్రాజెక్టు పనుల నిమిత్తం మంజూరు చేసిన ఆచరణ సాధ్యం కాలేదు.

అప్పటి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, కారేపల్లి,కామేపల్లి,ఖమ్మం రూరల్, వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కురవి, ములకలపల్లి, డోర్నకల్ తదితర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు సర్వేను చేశారు.

ఖమ్మం,వరంగల్ రెండు జిల్లాల్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల్లోని 56 రెవెన్యూ గ్రామాల 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతో సర్వే జరిపారు.

అయినప్పటికీ ప్రాజెక్టు కోసం వేసిన శిలాఫలకాలు శిథిలమైపోయిన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడం శోచనీయం.

50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు మున్నేరు ప్రాజెక్టును పెండింగ్లో ఉంచి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తూనే ఉన్నారు.

మున్నేరు ప్రాజెక్టును జీవోలకు,సర్వేలకు పరిమితం చేసి ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలకు సాగు,తాగునీరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేయడమే కాక మున్నేరు నీళ్లను సైతం ఏజెన్సీ,గిరిజన ప్రాంతాలకు రాకుండా చేసే కుట్రలో భాగంగానే మున్నేరు నీటిని సీతారామ కెనాల్ ద్వారా పాలేరుకు తరలించడానికి జీవో నెంబర్ 98 ని విడుదల చేస్తూ 162 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడానికి సిద్ధపడిందని ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

రు.100 కోట్ల రూపాయలతో మున్నేరు ప్రాజెక్టు నిర్మిస్తే గార్ల,డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్ మండలాలకు సాగు తాగునీరు అందుతుంది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల పట్ల వివక్షపూరితమైన వైఖరి అవలంబిస్తున్నట్లు కనపడుతుంది.

ఇప్పటికైనా జీవో నెంబర్ 98ను రద్దు చేసి, మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు తాగు, సాగు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

1969 నుండి 2009 వరకు గత పాలకులు చేపట్టిన సర్వేలను అనుసరించి అంచనా వేసి తప్పనిసరిగా ముల్కనూర్ వద్దనే మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు, అఖిలపక్షం డిమాండ్ చేస్తుంది.

రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సును సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి నేటిధాత్రి : 

 

భూపాలపల్లి రూరల్ మండలం నేరేడుపల్లి గ్రామంలో తాసిల్దార్ శ్రీనివాస్ భూభారతి రెవెన్యూ అవగాహన న సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 3 నుండి 20వ తేదీ వరకు రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహిస్తా ప్రజలు తమ భూమికి సంబంధించిన దరఖాస్తు ఇవ్వాలని సూచించారు ప్రతి దరఖాస్తుదారుడు లెక్క పక్కగా ఉండేటందుకు రిజిస్ట్రేషన్ లో నమోదు చేస్తాం అని వారు అన్నారు నేరేడుపల్లి గ్రామంలో మొత్తం 363 దరఖాస్తులు వచ్చాయి వాటిని పరీక్షిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ ఐ రామస్వామి ఏఎస్ ఓ విజయ్ కుమార్ టైపిస్ట్ రాజు రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

సాగు చేసుకునే ప్రతీ రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తాం

చెల్పూర్ లో జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండలం
రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో తహశీల్దార్ సత్యనారాయణ స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో భూమికి పట్టాలు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఒక్క రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా పట్టాలిచ్చే కార్యక్రమానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూ భారతి తెస్తామని చెప్పిన ప్రకారం పటిష్టమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఇచ్చిన ప్రతీ దరఖాస్తు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో తమ భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వరదకు అడ్డుగా హైవే నిర్మాణం


వరదకు అడ్డుగా హైవే నిర్మాణం

పంట పొలాలు కుంటలుగా మారుస్తారా అంటూ రైతుల ఆందోళన

గ్రీన్ ఫీల్డ్ హైవే మహమూద్ పట్నం చెరువును మింగేస్తుందా

చెరువులోకి వర్షం నీరు చేరేదెలా…?

కేసముద్రం/ నేటి ధాత్రి :

 

టీ వలే నూతనంగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా కేసముద్రం మండలంలోని మహమూద్ పట్నం గ్రామంలోనే ఉన్నటువంటి త్రాగునీటి సాగునీటి చెరువు సుమారు 250 ఎకరాల పంట పొలాలకు నిరంధించే సామర్థ్యం గల చెరువు నేడు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను చెరువు పక్కనే నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి, చెరువు పక్కన ఉన్నటువంటి సుమారు 70 ఎకరాల పంట పొలాల మీదుగా వర్షపు నీరు చెరువులోకి చేరుతుందని గ్రీన్ ఫీల్ హైవే నిర్మాణ పనులు వరద నీరు చెరువులోకి చేరకుండా అడ్డుగా రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధిత రైతులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పనులు మొదలుపెట్టిన నాటి నుండి పలుమార్లు వరద నీరు చెరువులోకి చేరేలా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్కు తెలిపామని రైతులు అన్నారు. సుమారు 70 ఎకరాల పంట పొలాలు కుంటలుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నామని ఈ సంవత్సరం వర్షాకాలం ముందుగానే వర్షాలు కురుస్తుండడంతో పైనుండి వచ్చే వరద మా పంట పొలాలనే నిలుస్తుందని, మహమూద్ పట్నం చెరువు కింద పంట పొలాలు సుమారు 250 ఎకరాల విస్తీర్ణం గల వ్యవసాయ భూములకు నీరు అందిస్తుందని గ్రీన్ ఫీల్డ్ హైవే వరదకు అడ్డుగా నిర్మాణం జరుగుతుందని అందుచేత చెరువులోకి వరద నీరు చేరేదెలా అంటూ రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థను ప్రశ్నిస్తున్నారు.

Farmers

పై నుండి వచ్చే వర్షపు నీరు సజావుగా చెరువులోకి పోవాలంటే గ్రీన్ ఫీల్డ్ నిర్మాణ పనులలో ముందుగా కల్వర్టు నిర్మాణం చేపట్టాలని గురువారం రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ సంస్థ ప్రతినిధి శ్రీరామ్ ఘటన స్థలానికి చేరుకొని రైతులు కోరినట్టుగా ముందుగా కల్వర్టు నిర్మాణ పనులను రెండు మూడు రోజులలో ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మిట్ట గడపల యాకూబ్, తరిగి నవీన్, బొద్దుల వెంకట మల్లు, రాపోలు శ్రీనివాస్, పోలు నరసయ్య, దేశ బోయిన అనిల్, ఎలిజాల యాకయ్య, కాసోజు విజయ్, పోలు మురళి, చిలువేరు రవీందర్, గణేష్, శివాజీ, సామా అశోక్, పోలె పాక కమలాకర్, బత్తుల సుభాష్, పిట్టల విజేందర్, మూడ వత్ మాంజ, మోతిలాల్, మాదరపు పుల్లయ్య, పెరుమాండ్ల నవీన్, పిట్టల ఉపేందర్, పెరుమాండ్ల జానీ పలువురు రైతులు పాల్గొన్నారు.

వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..

వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో జూన్ 4న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం రైతు వేదికలో జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను పచ్చి రొట్ట ఎరువులను వర్మి కంపోస్టు జీవన ఎరులను భూసార పరీక్ష ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను.

అందించడం బట్టి రసాయన ఆధారిత పురుగు మందులను.మాత్రమే ఉపయోగించడం మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటించడం పంట కోసం చేసిన వివిధ విత్తనాలను రసాయనిక ఎరులను మరియు రసాయనిక మందులు కొనుగోలు చేసిన రసీదులను.

భద్ర పరచాలని. సాగునుటి యజమాన్యం తడి పొడి పద్ధతితో పాటు వరి సాగు.

మల్చింగ్ సుస్థిరమైన వ్యవసాయ కోసం పంట మార్పిడి మరియు పంట వైవిద్దీకరణ పూల మరియు మునగ సాగు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం యూట్యూబ్ ఛానల్ ను మరియు ఏ యు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని..

ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రైతుల వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు తదుపరి కార్యక్రమంలో అంశాలను పాటిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో.

శాస్త్రవేత్తలు. డాక్టర్ . సిహెచ్. రమేష్. డాక్టర్ హిందూజ. ఎన్ ఏ..lcar.llrr. శాస్త్రవేత్త డాక్టర్ శృతి. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు. శ్రీనివాస్ రెడ్డి. వేణుగోపాల్. వ్యవసాయ అధికారి. కే సంజీవ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

ఈ శ్రీనివాస్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహాయ సంగం చైర్మన్ కె భాస్కర్. విజేందర్ రెడ్డి. వ్యవసాయ విస్తరణ అధికారులు. గౌతమ్ లక్ష్మణ్. విద్యార్థులు సిద్ధార్థ్ మరియు సన్నీ ప్రసాద్ రైతులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు

భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం.

‘భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం’

బాలానగర్ నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి, కేతిరెడ్డిపల్లి గ్రామాలలో రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి అవగాహన సదస్సును మంగళవారం తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ప్రజల నుంచి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను భూభారతి అవగాహన సదస్సు ఫారంలో రైతు పేరు గ్రామం పేరు రెవెన్యూ శివారు పేరు.

సర్వేనెంబర్, భూమి విషయంలో ఎదుర్కొంటున్న సమస్య తదితర వివరాలు పొందుపరచాలన్నారు.

రెండు భూభారతి రైతుల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు రెండు రెవెన్యూ గ్రామంలో భూభారతి రైతు అవగాహన సదస్సు ఉంటుందన్నారు.

మండలంలోని ఆయా గ్రామాలలో భూముల సమస్యలు నెలకొన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే.

పచ్చి రొట్ట విత్తనాల ధర పెంచడం రైతులపై భారమే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

కేసముద్రం మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం అల్పుగొండ సావిత్రి అధ్యక్షత జరిగింది.

జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని. పాపారావు మాట్లాడుతూ, పచ్చిరొట్ట ఎరువుల కోసం, జీలుగులు గతంలో 1000 రూపాయలు లోపు ఉండే, వాటి ని రెండు వెల వందచిల్లర రెట్టింపు కంటే ఎక్కువ శాతం పెంచారు.

ఇది రైతులపై భారం పడుతుంది.

వ్యవసాయ అధికారుల దాడుల్లో క్వింటాళ్లకొద్ది నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతున్నాయి, వాటిని కొనుగోలు చేసిన రైతులు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోతారు, అప్పులు తెచ్చి పెట్టుబడిపెట్టి పంటలు పండక, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయని, నకిలీ విత్తనాలను విక్రయించే దళారులను అధినేయంగా శిక్షించాలని, ధాన్యం సేకరించిన రైతులకు కింటాకు 500బోనస్, రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఇందిరమ్మ రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడుల కోసం సాయం అందించాలని అన్నారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు పంట రుణాలు ఇవ్వాలన్నారు.

కౌలు రైతులను గుర్తించి కార్డులు ఇవ్వాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పెట్టుబడులకు కూడా సరిపోవని స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని సీటు ప్లస్ అదనంగా 50% మద్దతు ధర చట్టం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గొడిశాల. వెంకన్న, మోడీ వెంకటేశ్వర్లు, జల్లే జయరాజు, నీరుటి.

జలంధర్, చందా వెంకన్న, సోమవరపు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

 

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నూతన తహసిల్దార్ ను కలిసిన రైతు సంఘం నాయకులు.

నడికూడ నేటిధాత్రి:

మండలంలోని తహసిల్దార్ గా నూతనంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన గుజ్జుల రవీందర్ రెడ్డి ని తెలంగాణ రైతు రక్షణ సమితి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.మండల వ్యాప్తంగా ఉన్న రైతు సమస్యలను తహసిల్దార్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వివిధ విభాగాల అధికారులతో చర్చించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.అనంతరం తహసిల్దార్ కు,శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు.ఈ కార్యక్రమంలో మండలంలోని అధ్యక్షులు వాంకే రాజు,ఆరె సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు లోకేటి నగేష్,యూత్ నాయకులు నారగాని రాకేష్ గౌడ్,లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

రైతులకు నూతన ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చారకొండ, వెల్దండ, కల్వకుర్తి మండలాలకు చెందిన రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో.. లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్న రైతులు నూతన విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లకు దరఖాస్తు చేసుకున్నారని.. లో వోల్టేజీ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి మంజూరు చేయించానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనందకుమార్, బాలాజీ సింగ్, సంజీవ్ యాదవ్,జిల్లెల్ల రాములు, దున్న సురేష్, పడకండి వెంకటేష్, చంద్రకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు.!

గుట్ట పై షెడ్డును కూల్చారు…మరి ఆశ్రమ కబ్జా కట్టడం పై చర్యలేవి..??

పేద రైతుల ప్రభుత్వ భూమి కబ్జా లో నిదురెందుకు??

రెవెన్యూ అధికారుల కబ్జా నివేదిక పైన చర్యలేవి??

అధికారుల అత్యుత్సాహం కేవలం గుట్ట పైనేనా??

ఆశ్రమ భూ కబ్జా లో ముడుపులేమైన ముట్టాయా అని ప్రజల మాట ముచ్చట…

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి:

ఎల్లారెడ్డిపేట మండలం లో రెండు వేరు వేరు ప్రదేశాలలో భూకబ్జా సమస్య. వెంకటాపూర్ గ్రామంలో ఒక ఆశ్రమాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భూములను కబ్జా చేశారని ఆ విషయంలో రెవెన్యూ అధికారులు నివేదిక ఉన్నతాధికారులకు పంపిన , హై కోర్ట్ సంగెం బాలయ్య భూమి కబ్జా గురి అయిందని అక్కడ ఉన్న అక్రమ కట్టడం కూల్చి వేయాలని ఆర్డర్ ఉన్న కూడా అధికారులు మౌనం వహిస్తున్నారు.ఆ మౌనానికి ముడుపులేమైన ముట్టాయా అని మండల ప్రజలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ నెల 14,15 వ తేదీలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లోని సింగారం గ్రామం లో కుల,మతాలకు అతీతంగా దర్శావళి గుట్ట పైన ప్రతి సంవత్సరం లాగే గ్రామస్తుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్న దర్గా లకు ఉర్సు పండుగ అంగరంగ వైభవంగా జరిపారు.ఈ క్రమంలో విశిష్ట అతిధుల ఆహ్వానం ఉండడం వలన అక్కడ ఉన్న గుట్టను చదును చేసి షెడ్ ని నిర్మాణం చేశారు. అది ప్రభుత్వ భూమిలో ఉందని కొద్దిరోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఒక పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

poor farmers

ప్రభుత్వ భూమిలో షెడ్ నిర్మాణం జరిగింది అని మే 27 న ఉదయం అధికారులు, పోలీసుల సమక్షంలో జెసిబి తో ఆ నిర్మాణాన్ని కూల్చారు.ఈ రెండు సమస్యలో కబ్జా అనేది కనిపిస్తున్న అధికారులకు,ఆ పార్టీ నాయకులకు కేవలం దర్శావళి గుట్ట ను రాజకీయం చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వ భూమి, పేద రైతు భూమి కబ్జాకు గురై అధికారుల నివేదిక,హై కోర్ట్ ఆర్డర్ లు ఉన్న కూడా పట్టించుకొని అధికారులకు దర్శావళి గుట్ట పైన షెడ్ నిర్మాణం కబ్జా భూమి లో జరిగిందని అధికారుల అత్యుత్సాహాన్ని చూస్తే ఓ మౌజయ ఆశ్రమానికి సంబంధించి ముడుపులు ఏమైనా ముట్టాయ అని ప్రజలు నుండి సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. అధికారుల తీరు ప్రజల సందేహాలకు తగ్గట్టుగానే ఉండడం, ఒక పార్టీ నాయకులు కుల,మతాధిపత్యం పరంగా ఫిర్యాదులు చేస్తూ మతాల మధ్య చిచ్చులు రేపే విధంగా గొడవలు సృష్టించాలని రాజకీయం చేస్తున్నారని సింగారం గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్మేతే

కేసులు నమోదు చేయండి కలెక్టర్ అధికారులకు ఆదేశాలు

వనపర్తి నేటిధాత్రి :

వనపర్తి జిల్లాలో వనపర్తి లో రైతులకు ప్రభుత్వ లై సేన్స్ లేకుండా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా స్థాయి సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభవుతున్నందున రైతులు విత్తనాలు నాటేందుకు సమాయత్తం అవుతుంటారని, పొరపాటున నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. వనపర్తి జిల్లాలో షాపుల.వారు ఎక్కడ నకిలీ విత్తనాలు, ప్యాకింగ్ చేయని, లేబుల్ లేని విత్తనాలు అమ్మడానికి వీలు లేదని హెచ్చరించారు. టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలోని అన్ని విత్తనాలు అమ్మే షాపులు, డీలర్ షాపులను తనిఖీ చేసి ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉంటే కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు చాలా ఖరీదైనవి ఉండటం వల్ల నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్ లో గాని రైతులకు బ్రోకర్ల ద్వారా అమ్మే ప్రమాదం ఉందన్నారు.
హ్యాషన్ హౌస్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు డీలర్ గింజల షాపులను తనిఖీ చేసి సీడ్ ప్యాకెట్ లను తనిఖీ చేయాలని, ప్యాకెట్ పై జి.ఈ.ఎ.సి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలని జి. ఈ. ఎ.సి నెంబర్ లేకున్నా, లూజ్ విత్తనాలు అమ్మకానికి పెట్టిన వెంటనే షాపు వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.లైసెన్స్ కలిగిన డీలర్లు మాత్రమే విత్తనాలు అమ్మాలని ఇతరులు విత్తనాలు అమ్మడానికి వీలు లేదన్నారు. లైసెన్స్ లేని వారు విత్తనాలు అమ్మినా, నకిలీ విత్తనాలు అమ్మినా సీడ్ యాక్టు 1966, సీడ్ కంట్రోల్ ఆర్డర్ 1983, ఈ. పి యాక్టు 1986 ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో రైతులు వరి పంట మాత్రమే కాకుండా ఇతర వాణిజ్య పంటల సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వరి సాగు చేసే రైతులు దొడ్డు రకం కాకుండా సన్న రకం మాత్రమే సాగు చెస్ విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నకిలీ విత్తనాల పై అవగాహన కల్పించడమే కాకుండా పంట రైతులకు పంట మార్పిడి పై అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర రావు, ఏ.డి. ఎ చంద్ర శేఖర్, మున్నా, సి. ఐ లు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

రైతులకు సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ.

రైతులకు సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

కేసముద్రం నేటి ధాత్రి:

కేసముద్రం మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం నందు ఏవో బి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వ్యవసాయ శాఖ 50% సబ్సిడీ ద్వారా పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన, రైతులకు అందజేసిన కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ధన్నసరి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వర్ రావు, కేసముద్రం పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంబటి మహేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఏవో వెంకన్న మాట్లాడుతూ మండలం రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సగం ధరకే అందిస్తుందని రైతులు యొక్క పంట పాస్ పుస్తకాల జిరాక్స్ మరియు ఆధార్ కార్డు లను జతపరచి రైతు సేవ కేంద్రంలో సమర్పించి సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాలను సగం ధరకే కొనుగోలు చేసుకోవాలని ఈ అవకాశం రైతులు అందరూ వినియోగించుకోవాలని సూచించారు.పచ్చి రొట్ట విత్తనాలను వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు పల్చగా వెదజల్లాలని అప్పుడే భూమి సాంద్రత పెరిగి మంచి పంట దిగుబడులను ఇచ్చి రైతుకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మండలంలోని రైతు సేవా కేంద్రాలలో పచ్చి రొట్ట విత్తనాలు 800 బస్తాలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా రైతులకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,ఆగ్రోస్ నిర్వాహకులు గోపాల వెంకట్ రెడ్డి, రాజు, అగ్రికల్చర్ విస్తరణ అధికారులు రాజేందర్, రవి వర్మ, సాయి చరణ్,లావణ్య, ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ.

 రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ

నిజాంపేట నేటి ధాత్రి:

రైతులు వర్షాకాలం పంట కు లఘు ఏర్పడడానికి జీలుగు విత్తనాలు ఎంతగానో ఉపయోగపడుతుందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రనీకి 200 క్వింటల్ల జీలుగు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకొని వ్యవసాయ విస్తరణ అధికారులు కూపన్స్ జారీ చేస్తారని ఆ కూపన్స్ ఆగ్రోస్ మరియు డిసిఎంఎస్ సెంటర్లో పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 30 కేజీల జీలుగు ధర రూ,, 2137. 50 ఉందన్నారు. మండల వ్యాప్తంగా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

నడికూడ,నేటిధాత్రి:

 

మండల రైతు వేదిక నందు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.మధు డా. హరి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు అనే కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి 6 అంశాల పైన ముఖ్యంగా మాట్లడటం జరిగింది.వాటిలో
తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చును తగ్గించండి.
అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడండి.

రసీదులను భద్రపరచండి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందండి
సాగు నీటిని ఆదా చేయండి భావితరాలకు అందించండి
పంట మార్పిడి పాటించండి సుస్థిర ఆదాయాన్ని పొందండి.
చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.
యూరియాను అధిక మోతాదులో వాడటం వల్ల నేల యొక్క ఆమ్లత్వం పెరిగి నేలలోని సూక్ష్మ జీవులు నశించడమే కాకుండా ఇతర పోషకాలను పంట తీసు కోకుండా చేసి దిగుబడులను తగ్గిస్తాయి.కాబట్టి యూరియా సిఫారసు చేసిన మేరకు నుండి దఫాలుగా ఇతర పోషకాలతో కలిపి వేసుకోవాలి.

వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట మార్పిడి విధానం ద్వారా నేలసారాన్ని సహజ సిద్ధంగా పెంచే పప్పు ధాన్యపు పంటలు, నూనెగింజ పంటలను మరియు నీటిని తక్కువగా వినియోగించుకునే చిరు ధాన్య పంటలను వరి తర్వాత యాసంగిలో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు.

నీటిని ఆదా చేసే యాజమాన్య పద్ధతులైన సూక్ష్మ బింధు సేద్యం మరియు మల్చింగ్ ద్వారా 50-60% నీటిని సంరక్షించుకోవడమే కాక అధిక దిగుబడులను సాధించుకోవచ్చు.వరి సాగుచేసే నేలల్లో నీరు ఇంకే గుణం కోల్పోయి,భూగర్భ జలాల మట్టం తగ్గిపోతుంది.

ఒక ఎకరం వరి సాగు చేసే నీళ్ళతో 3 ఎకరాల జొన్న, మొక్కజొన్న మరియు వేరుశనగ పంటలను సాగు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు రైతుల కు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్ర మానికి హాజరైన మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ మాట్లడుతూ తొలకరి వర్షాలకు జీలుగ, మరియు పెసర్లు,వరి నాట్లకు ముందు వేసుకొని భూమిలోనే 45 రోజుల తర్వాత కలియ దున్నడo వలన నేలలోని కర్బన పదార్థం పెరుగుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మాదారపు,రామకృష్ణ,జోరు ప్రశాంత్,కిన్నెర చికిత, వ్యవసాయ కళాశాల విద్యార్థినులు మరియు రైతు సోదర సోదరీమణులు పాల్గొనడం జరింగింది.

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)

 

 

ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని సి.పి.ఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముషాం రమేష్ మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరిగినది. అని తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. అన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి మొత్తం కొనుగోలు చేయాలని సి.పి.ఎం పార్టీ డిమాండ్ చేస్తుంది
ప్రతి సీజన్లో పంట పండించిన రైతుకు మొత్తం పంట ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా పంటకు ఎప్పుడు ఏమైతదో అని భయం గుప్పిట్లో బతకవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న రైతుల రైతుల బతుకులు ఎలాంటి మార్పు జరగడం లేదు.
బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల. జెండాలు వేరైనా మోసాలు ఒకటే. విధానాలు ఒకటే రైతే రాజు అని
రైతులను మోసం చేసి రైతుల ఓట్లతో అధికారం లోకి వస్తున్నాయి. రైతులు పండించిన పంటకు నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళిక చేయకపోవడంతోనే ప్రతి పంట సీజన్ లో వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.ఇప్పటికైనా రైతులకు నష్టాలు జరగకుండా పండిన పంటను వెంట వెంటనే కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి,కోడం రమణ పాల్గొన్నారు

ముఖ్యమంత్రి జహీరాబాద్ వస్తుంటే నీమ్ఙ్ రైతులను.

ముఖ్యమంత్రి జహీరాబాద్ వస్తుంటే నీమ్ఙ్ రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమిటి..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జహీరాబాద్ కు రావడం మంచిదే కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన పేరుతో రైతులను వారి గ్రామాలకు వెళ్లి రాత్రి వేళలో వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం,మాజీ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి చేసింది చెప్పాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం కాదు ప్లై ఓవర్ బ్రిడ్జ్,బసవేశ్వర విగ్రహం,నీమ్జ్ రోడ్డు ఇవన్నీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమి చేశారో చెప్పాలని నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పకుండా తిరిగి ప్రతి విమర్శలు చేయడం సిగ్గు చేటు,గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేసిన నిధులను రద్దు చేయడం జహీరాబాద్ అభివృద్ధికి నిరోధం కాదా? రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

రైతన్నలను వెంటాడుతున్న అకాల వర్షం.

రైతన్నలను వెంటాడుతున్న అకాల వర్షం….

– మరోవైపు లారీల కొరత…

– జిల్లా అధికార యంత్రాంగం చో రవ తీసుకోవాలి వివిధ గ్రామాల రైతుల ఆవేదన….

కొల్చారం (మెదక్) నేటిధాత్రి:

ఆరుగాలం పండించిన వరి ధాన్యం పంట అమ్ముకుందామంటే గత వారం రోజుల నుంచి అకాల వర్షం రైతన్నలను వెంటాడుతూనే ఉంది. ఏటు చూసినా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు అకాల వర్షం, మరోవైపు లారీల కొరత ఈ కష్టాలు మాకేనా అంటూ అన్నమొ రామచంద్ర అంటూ రైతన్నలు బోరున విలిపిస్తున్నారు.

Rain haunts

ఒకవైపు సొసైటీ పాలకవర్గాల నిర్లక్ష్యం తోటి రైతుల వరి ధాన్యం తూకం వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. లారీలు రాక వెనుకబడ్డ రైతులకు ఒక్క బస్తాకు సుమారు రెండు రూపాయలకు నుంచి నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల రైతులు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండిస్తే పండించిన పంట డబ్బులు చేతికొచ్చే వరకు రైతుల కళ్ళల్లో కన్నీరే కాదు రక్త నీరు వస్తున్నాయి.

Rain haunts

ఎటు చూసినా రైతుల కష్టాలు.. రైతుల వైపు కన్నెత్తి చూడని రాజకీయ నాయకులు.. వారికి అవసరం ఉంటేనే పలకరిస్తారు … రైతుల నుంచి ఏ యొక్క రాజకీయ నాయకుడు రైతుల పక్షాన ధర్నా చేసిన దాఖలాలు లేవు. కొనుగోలు కేంద్రాలలో నిలిచిన వరి ధాన్యాన్ని జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన వరి ధాన్యాన్ని అతి తొందరగా తరలించాలని వివిధ గ్రామాల రైతులు జిల్లా అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.

రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు.

రైతులను మోసం చేస్తున్న సొసైటీ చైర్మన్లు…

* ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల ధర్నా…

*మొలకలు వస్తున్న ధాన్యం…

*పట్టించుకోని సొసైటీ పాలకవర్గం,
అధికార యంత్రాంగం…

*ధర్నా చేయుచున్న పైతర గ్రామ రైతులు…

కొల్చారం( మెదక్ )నేటి ధాత్రి:

రైతన్నలు కష్టపడి ఆరుగాలం పండించిన పంట అమ్ముకుందామంటే అన్నమో రామచంద్రా అంటూ బోరున విలపిస్తున్నారు. ధాన్యం తూకం కొనుగోలు కాకపోవడంతో వర్షానికి తడిసి మొలకలు వస్తున్న కూడా ఇటు సొసైటీ పాలకవర్గం మరియు అధికారులు పట్టించుకోకపోవడంతో పండించిన ధాన్యం.

cheating farmers

మొలకలు రావడంతో చివరికి మాకు పురులమందే దిక్క అంటూ కొల్చారం మండలంలోని పైతర గ్రామ రైతులు మెదక్ – సంగారెడ్డి ప్రధాన రహదారిపై వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మొలకలు వచ్చిన ధాన్యమును చూపిస్తూ రైతులు ధర్నా చేయుచున్నారు ఒకవైపు తూకం వేసిన ధాన్యము లారీలు రాకపోవడంతో సొసైటీ పాలకవర్గం నురైతులు అడుగుచుండగా లారీలు వస్తలేవు మేమేం చేయాలి అని పాలకవర్గం తప్పించుకుంటున్నారు మా రైతుల గోడును అధికార యంత్రాంగం అర్థం.

cheating farmers

చేసుకొని మేము పండించిన ధాన్యమును కొనుగోలు చేసి లారీలు పంపించి తూకం వేసిన ధాన్యమును రైస్ మిల్లర్లకు చేరవేయాలని పైతర గ్రామ రైతులు రోడ్డుపైన మొలకలు వచ్చిన ధాన్యము చూపిస్తూ అధికారులను వేడుకొనుచున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు.

రైతులకు అనుగుణంగా ధాన్య కొనుగోలు కేంద్రాలు పనిచేయాలి.

వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి.

నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.

నల్లబెల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ నిబంధన ప్రకారం వడ్ల కొనుగోలను ప్రభుత్వ నిబంధన ప్రకారం కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల యజమానులు వ్యవహరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు బుధవారం మండలంలోని మేడపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సభ్యులకు తగు సూచనలు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాల మేరకు రైతుల వద్ద నుండి వరి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి సహకరించాలని అదేవిధంగా ఎలాంటి అవినీతి పాల్పడకుండా రైతు పక్షాన నిలబడి రైతులకు సహకరించాలని కొనుగోలు కేంద్రాల యజమాను లను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ కౌసల్య దేవి, తాసిల్దార్ ముప్పు కృష్ణ, అధికారులు, స్థానిక నాయకులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు తదితరు లు పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు.

రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు

మండల వ్యవసాయ అధికారి గంగాజమున

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో రైతులకు జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి తెలియజేశారు2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మండ లానికి ఈ వానాకాలం వేసుకో డానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై శాయం పేట పిఎసిఎస్ కు 266 బస్తాలు మరియు ప్రగతి సింగారం గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 233 బస్తాలు కెటాయించడం జరిగింది. ఒక్కో బస్తా సైజ్ 30 కిలోలు ఉండగా, బస్తా ధర 2137 రూపాయల 50 పైసలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రైతులు తమ యొక్క పట్టాదారు పాసు పుస్తకం మరియు ఆధార్ ల జిరాక్స్ తీసుకొని వెళ్లి సమర్పించి విత్తనాలు కొనుగోలు చేయవలిసిందిగా తెలియ జేయడమైనది. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ పచ్చి రొట్టె ఎరువులైన జీలుగ వాడడం వల్ల పంటలకు మరియు నేల ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయి. ఇవి ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో, మట్టిని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
ఇవి గాలిలోని నత్రజనిని గ్రహించి మట్టిలోకి తీసుకువెళ్తా యి. తద్వారా తదుపరి పంటకు కావాల్సిన నత్రజని మొక్కలకు అందుతుంది.
మట్టిలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి, మట్టి జీవక్రియలను ఉత్తేజితం చేస్తాయి.రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ఖర్చు తగ్గిస్తుంది.సేంద్రియ పదార్థం పెరిగి, మట్టి సూత్రధర్మాలు పెరిగి, నీటి నిలువ సామర్ధ్యం పెరుగుతుంది.కొన్నిరకాల హానికర పురుగులను నియంత్రించేందుకు ఉపయోగ పడుతుంది.కావున మండలం లోని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version